**హిందూ ధర్మం విశిష్టతను తెలుసుకోవాలి* * *శ్రీ ఆచార్య కృష్ణానంద స్వామి* **హిందూ ధర్మం విశిష్టతను తెలుసుకోవాలి* * *శ్రీ ఆచార్య కృష్ణానంద స్వామి* బిజినేపల్లి ఏప్రిల్ 19. హిందూ ధర్మం విశిష్టతను ప్రతి భారతీయుడు తెలుసుకోవాలని హిందువులంతా సంఘటితమైతే సమీప భవిష్యత్‌లో భారత్ విశ్వగురుస్థానంతో పూర్వవైభవాన్ని సంతరించుకోవడం ఖాయమని శ్రీగిరి అష్టలక్ష్మి క్షేత్ర వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ పూజ్య శ్రీ ఆచార్య కృష్ణానంద స్వామి పిలుపునిచ్చారు. ఆదివారం మంగనూరు గ్రామంలో ఘనంగా హిందూ సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించారు.ముఖ్యఅతిథిగా హాజరై శ్రీ ఆచార్య కృష్ణానంద స్వామి భక్తులను ఉద్దేశించి మాట్లాడారు.హిందువులంతా ఐక్యత ఉండాలని మన ధర్మాన్ని మనం మరిచి పోకూడదని చెప్పారు.సంస్కృతి సాంప్రదాయాలను పట్టించుకోకుండా ఎక్కడ సంతోషం ఉన్నదో అక్కడ సుఖాల కోసం తాపత్రయ పడడం సరికాదు అన్నారు. 84 జీవులలో ఒకటైన మనం జ్ఞానాన్ని కలిగి ఉన్నామని, మన పిల్లలను మనం ఎల్లప్పుడూ గమనిస్తూ మంచి దారిలో నడిచేలా చూడాలన్నారు. హిందూ ఆడబిడ్డలు లవ్ జిహాద్ చేతిలో మోసపోతున్నారని, వారి వలలో ఆడబిడ్డలు పడకుండా వారిని తల్లిదండ్రులు చైతన్యవంతులను చేయాలని సూచించారు. సరైన సమయంలో మన పిల్లలకు వివాహాలను జరిపిద్దాం అని, కుటుంబ నియంత్రణ కేవలం హిందువులకి ఎందుకని ప్రశ్నించారు. ఆశ్రమ పాఠశాలల్లో చదివించి సంస్కృతి సాంప్రదాయాలను నేర్పిద్దామని స్వదేశీ వస్తువులను వాడాలని కోరారు.హిందూ ధర్మం సంస్కృతి సనాతనమైనది. అది కేవలం గతం కాదు, ఈ దేశపు వర్తమానం అలాగే భవిష్యత్తు కూడా. నేటి వేగవంతమైన ప్రపంచంలో మన మూలాలను గౌరవించుకుంటూ, ఐకమత్యంతో ముందడుగు వేయాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. ముఖ్య వక్తగా హాజరైన చామర్తి దేవేందర్ రాజు మాట్లాడుతూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఈ సమ్మేళనాల ద్వారా ఐదు ముఖ్యమైన జీవన సూత్రాలను, అవే పంచపరివర్తన్ అంటే సామాజిక సమరసత, కుటుంబ ప్రభోధన్, పౌరవిధులు, స్వదేశీ, పర్యావరణ పరిరక్షణ అనే ఐదు సూత్రాల ద్వారా సమాజంలో మార్పు జరగాలని వాటన్నింటితో కూడిన బలమైన సమాజం రావాలని కోరారు. కులం,వర్గం, ప్రాంతం, భాష పేరుతో విడిపోవడం మన బలహీనుత కాకూడదని"గడప లోపల కులం - గడప దాటితే హిందువులం" అనే నినాదం మన గుండెల్లో ప్రతిధ్వనించాలి అని పిలుపునిచ్చారు.పర్యావరణాన్ని కాపాడుదామని స్వదేశీ వస్తువులనే వాడదామని లేదంటే స్వాతంత్రానికి ముందు జీవించిన జీవితాన్ని గడపాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రతి ఇంటి నుండి ఒక ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్ తయారైతే ఈ దేశం ఎంతో ఎదుగుతుందన్నారు. కులం పేరుతో కాకుండా హిందుత్వం పేరుతో కార్యక్రమాలను జరుపుకోవాలని కోరారు. హిందూ సంస్కృతిక సాంప్రదాయాలను చిన్నప్పటినుండే చిన్నపిల్లలకు సరైన పద్ధతిలో తెలియజేయాలన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండి కొనసాగుతుందని, వందేళ్లు పూర్తి చేసుకున్న ఏకైక సంస్థగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. హిందూ సమ్మేళనం సభ ద్వారా మరోసారి పౌరుల్లో ప్రేరణాశక్తిని రగిలించినట్లయ్యిందన్నారు. మన మధ్య ఎన్ని అంతరాలు ఉన్నా, సమాజ హితం కోసం వాటన్నింటినీ పక్కన పెట్టాలి. విభజనలను వీడి, విద్వేషాలకు తావు లేకుండా, ఒకరికొకరు తోడుగా నిలిచే సమసమాజాన్ని నిర్మించడమే ఈ సమ్మేళనాల ముఖ్య ఉద్దేశ్యం అన్నారు .హిందూ ధర్మం అనే సముద్రంలో మనమంతా చిన్న చిన్న బిందువులం ,ఆ బిందువులన్నీ కలిస్తేనే ఒక మహా ప్రవాహం ఏర్పడుతుంది. ఆ ప్రవాహమే మన సంస్కృతిని, సంప్రదాయాలను భావి తరాలకు అందిస్తుంది అని చెప్పారు. కార్యక్రమంలో సభాధ్యక్షులుగా మాంకాల నగేష్, సర్పంచ్ జాలం నాగయ్య యాదవ్, కార్యదర్శి తిమ్మగాళ్ల శ్రీనువాసులు,మహిళా వక్తగా ధనాల పూర్ణిమ, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ కార్యకర్తలు, హిందూ సంఘాల సభ్యులు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
**హిందూ ధర్మం విశిష్టతను తెలుసుకోవాలి* * *శ్రీ ఆచార్య కృష్ణానంద స్వామి* **హిందూ ధర్మం విశిష్టతను తెలుసుకోవాలి* * *శ్రీ ఆచార్య కృష్ణానంద స్వామి* బిజినేపల్లి ఏప్రిల్ 19. హిందూ ధర్మం విశిష్టతను ప్రతి భారతీయుడు తెలుసుకోవాలని హిందువులంతా సంఘటితమైతే సమీప భవిష్యత్‌లో భారత్ విశ్వగురుస్థానంతో పూర్వవైభవాన్ని సంతరించుకోవడం ఖాయమని శ్రీగిరి అష్టలక్ష్మి క్షేత్ర వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ పూజ్య శ్రీ ఆచార్య కృష్ణానంద స్వామి పిలుపునిచ్చారు. ఆదివారం మంగనూరు గ్రామంలో ఘనంగా హిందూ సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించారు.ముఖ్యఅతిథిగా హాజరై శ్రీ ఆచార్య కృష్ణానంద స్వామి భక్తులను ఉద్దేశించి మాట్లాడారు.హిందువులంతా ఐక్యత ఉండాలని మన ధర్మాన్ని మనం మరిచి పోకూడదని చెప్పారు.సంస్కృతి సాంప్రదాయాలను పట్టించుకోకుండా ఎక్కడ సంతోషం ఉన్నదో అక్కడ సుఖాల కోసం తాపత్రయ పడడం సరికాదు అన్నారు. 84 జీవులలో ఒకటైన మనం జ్ఞానాన్ని కలిగి ఉన్నామని, మన పిల్లలను మనం ఎల్లప్పుడూ గమనిస్తూ మంచి దారిలో నడిచేలా చూడాలన్నారు. హిందూ ఆడబిడ్డలు లవ్ జిహాద్ చేతిలో మోసపోతున్నారని, వారి వలలో ఆడబిడ్డలు పడకుండా వారిని తల్లిదండ్రులు చైతన్యవంతులను చేయాలని సూచించారు. సరైన సమయంలో
మన పిల్లలకు వివాహాలను జరిపిద్దాం అని, కుటుంబ నియంత్రణ కేవలం హిందువులకి ఎందుకని ప్రశ్నించారు. ఆశ్రమ పాఠశాలల్లో చదివించి సంస్కృతి సాంప్రదాయాలను నేర్పిద్దామని స్వదేశీ వస్తువులను వాడాలని కోరారు.హిందూ ధర్మం సంస్కృతి సనాతనమైనది. అది కేవలం గతం కాదు, ఈ దేశపు వర్తమానం అలాగే భవిష్యత్తు కూడా. నేటి వేగవంతమైన ప్రపంచంలో మన మూలాలను గౌరవించుకుంటూ, ఐకమత్యంతో ముందడుగు వేయాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. ముఖ్య వక్తగా హాజరైన చామర్తి దేవేందర్ రాజు మాట్లాడుతూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఈ సమ్మేళనాల ద్వారా ఐదు ముఖ్యమైన జీవన సూత్రాలను, అవే పంచపరివర్తన్ అంటే సామాజిక సమరసత, కుటుంబ ప్రభోధన్, పౌరవిధులు, స్వదేశీ, పర్యావరణ పరిరక్షణ అనే ఐదు సూత్రాల ద్వారా సమాజంలో మార్పు జరగాలని వాటన్నింటితో కూడిన బలమైన సమాజం రావాలని కోరారు. కులం,వర్గం, ప్రాంతం, భాష పేరుతో విడిపోవడం మన బలహీనుత కాకూడదని"గడప లోపల కులం - గడప దాటితే హిందువులం" అనే నినాదం మన గుండెల్లో ప్రతిధ్వనించాలి అని పిలుపునిచ్చారు.పర్యావరణాన్ని కాపాడుదామని స్వదేశీ వస్తువులనే వాడదామని లేదంటే స్వాతంత్రానికి ముందు జీవించిన జీవితాన్ని గడపాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రతి ఇంటి నుండి ఒక ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్ తయారైతే ఈ
దేశం ఎంతో ఎదుగుతుందన్నారు. కులం పేరుతో కాకుండా హిందుత్వం పేరుతో కార్యక్రమాలను జరుపుకోవాలని కోరారు. హిందూ సంస్కృతిక సాంప్రదాయాలను చిన్నప్పటినుండే చిన్నపిల్లలకు సరైన పద్ధతిలో తెలియజేయాలన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండి కొనసాగుతుందని, వందేళ్లు పూర్తి చేసుకున్న ఏకైక సంస్థగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. హిందూ సమ్మేళనం సభ ద్వారా మరోసారి పౌరుల్లో ప్రేరణాశక్తిని రగిలించినట్లయ్యిందన్నారు. మన మధ్య ఎన్ని అంతరాలు ఉన్నా, సమాజ హితం కోసం వాటన్నింటినీ పక్కన పెట్టాలి. విభజనలను వీడి, విద్వేషాలకు తావు లేకుండా, ఒకరికొకరు తోడుగా నిలిచే సమసమాజాన్ని నిర్మించడమే ఈ సమ్మేళనాల ముఖ్య ఉద్దేశ్యం అన్నారు .హిందూ ధర్మం అనే సముద్రంలో మనమంతా చిన్న చిన్న బిందువులం ,ఆ బిందువులన్నీ కలిస్తేనే ఒక మహా ప్రవాహం ఏర్పడుతుంది. ఆ ప్రవాహమే మన సంస్కృతిని, సంప్రదాయాలను భావి తరాలకు అందిస్తుంది అని చెప్పారు. కార్యక్రమంలో సభాధ్యక్షులుగా మాంకాల నగేష్, సర్పంచ్ జాలం నాగయ్య యాదవ్, కార్యదర్శి తిమ్మగాళ్ల శ్రీనువాసులు,మహిళా వక్తగా ధనాల పూర్ణిమ, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ కార్యకర్తలు, హిందూ సంఘాల సభ్యులు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
- తిరుపతి భాకరపేట ఘాట్ రోడ్డులో ప్రమాదం ఘాట్ రోడ్డులో లోయలోకి దూసుకెళ్లిన లారీ లోయలోకి దూసుకెళ్లడంతో బయటకు దూకేసిన డ్రైవర్ లారీలోని క్లీనర్ కు స్వల్ప గాయాలు....1
- నువ్వు మంత్రివి.. నన్ను గేట్ దాటనివ్వను అంటావా? అంత దమ్ము నీకుందా?' టైము డేటు చెప్పు అంటూ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిపై బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. కాటసాని రామిరెడ్డి గురించి తెలిసే మాట్లాడుతున్నావా? తానంటే ఏమనుకుంటున్నావ్? అంటూ కాటసాని మండిపడ్డారు. మంత్రి పదవిపై గౌరవంతో పద్ధతిగా మాట్లాడుతున్నానని, లేకుంటే తీరు మరోలా ఉండేదని హెచ్చరించారు.1
- హైదరాబాద్ యూసుఫ్‌గూడలోని సెయింట్ మేరీస్ కాలేజీ గణిత శాస్త్ర ఉపాధ్యాయురాలు రాగ సుధ జొన్నాడ (MSc, BEd, MBA) ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని “ఉద్యోగాలు/ప్లేస్‌మెంట్‌లకు అవసరమైన నైపుణ్యాలు” అనే అంశంపై సమగ్రంగా వివరించారు. ఆమె మాట్లాడుతూ, ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగాన్ని సాధించడానికి అభ్యాస నైపుణ్యాలు (Aptitude), రీజనింగ్, లాజికల్ థింకింగ్‌తో పాటు బలమైన సాంకేతిక పరిజ్ఞానం (Technical Knowledge) చాలా అవసరమని తెలిపారు. సానుకూల ఆలోచనలు (Positive Thinking) వ్యక్తిగత అభివృద్ధికి మాత్రమే కాకుండా కెరీర్ పురోగతికి కూడా ఎంతో సహాయపడతాయని వివరించారు. ఇంటర్వ్యూలలో విజయాన్ని అందుకోవాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్, సరైన ఇమెయిల్ ఎటికెట్, డ్రెస్ ఎటికెట్ వంటి అంశాలు కీలక పాత్ర పోషిస్తాయని ఆమె సూచించారు. పరీక్షలకు క్రమబద్ధంగా సిద్ధమవడం ద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుందని తెలిపారు. అలాగే ఉద్యోగ ఇంటర్వ్యూలలో ఉండే వివిధ రౌండ్లపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. డిజిటల్ యుగంలో AI టూల్స్ ప్రాముఖ్యతను కూడా వివరించి, వాటిని సరైన విధంగా ఉపయోగించుకోవాలని సూచించారు. చివరగా, లక్ష్య సాధనలో భాగంగా ప్రాధాన్యతల జాబితా (Priority List) రూపొందించుకోవడం మరియు సమయ నిర్వహణ (Time Management) పాటించడం ఎంతో ముఖ్యమని విద్యార్థులకు తెలియజేశారు.4
- వికారాబాద్ : వికారాబాద్ జిల్లా పరిధిలోని మర్పల్లిమోమిన్ పేట్ మండలాలలో ఆదివారం సాయంత్రం ఒకసారిగా భారీ వడగండ్ల వర్షం కురిసింది. భారీ వర్షానికి మురుగపల్లి గ్రామంలో పిడుగు పడడంతో గ్రామానికి చెందిన మంగలి రాముకు చెందిన ఓ ఎద్దు పొలం వద్ద కులంలో కట్టివేసిన వద్దే మృతి చెందింది. దీనికి సుమారు 75,000 విలువ చేస్తుందని ప్రభుత్వం తనను ఆదుకోవాలని యజమాని రాములు విజ్ఞప్తి చేశాడు.1
- కర్నూల్ జిల్లాలోని సి బెళగల్ మండలం సి.బెళగల్ గ్రామంలో రైతులు వరి పంట వేసుకుంటే శ్రీ బెలగల్లోని ఉన్నటువంటి పందులు పొలాలను నాశనం లేపుతున్న సి బెళగల్ గ్రామపంచాయతీ సెక్రటరీలు సి బెళగల్ ఎమ్మార్వో కనీసం ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చిన కూడా పట్టించుకోవడంలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు కనీసం సి బెళగల్ పోలీస్ వారికి చెపితే సి.బెళగల్ గ్రామపంచాయతీ సెక్రటరీ చెపితే మేము చర్య తీసుకుంటామని అంటున్నారు దయచేసి మా పంటలను పందుల నుండి రక్షణ కల్పించాలని సి.బెళగల్ రైతులు ఆవేదన చెందుతున్నారు ఇప్పటికైనా సి.బెళగల్ గ్రామపంచాయతీ సెక్రటరీ సర్ రైతులను కాపాడాలని వేడుకుంటున్నారు3
- మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వ్యాఖ్యలపై ఆదివారం బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. నన్ను గేట్ దాటనివ్వను, బయట తిరగనివ్వను అంటావా.. నీకు ఆ దమ్ముందా అని సవాల్ విసిరారు. కాటసాని రామిరెడ్డి గురించి తెలిసే మాట్లాడుతున్నావా? నేనంటే ఏమనుకుంటున్నావ్ అంటూ కాటసాని మండిపడ్డారు. మంత్రి పదవిపై గౌరవంతో పద్ధతిగా మాట్లాడుతున్నా అని హెచ్చరించారు.1
- మహాత్మా బసవేశ్వర జయంతి కార్యక్రమాన్ని విద్యుత్ కార్యాలయం ఆవరణలో సోమవారం నిర్వహించారు. విద్యుత్ బిసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బసవేశ్వర విగ్రహానికి ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. అర్చకులు వేదమంత్రాలతో పూజా కార్యక్రమాలు చేశారు. అనంతరం పూలమాలలు వేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో నాయకులు రాజేశ్వర్ స్వామి, ప్రభు గౌడ్, మల్లికార్జున్ పాటిల్, పాల్గొన్నారు.1
- సంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి పట్టణంలో గల సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో భారీగా వర్షం కురిసింది. ఉరుములో మెరుపులతో కూడిన వడగండ్ల వాన ఒక్కసారిగా కురవడంతో ప్రజల్లో శ్రీ సాయి తాపం నుండి తట్టుకునే విధంగా ఉందని పేర్కొన్నారు. అదేవిధంగా ఈ భారీ వడగండ్ల వర్షానికి, ఉరుములు మెరుపులతో కూడిన వర్షానికి ఒక్కసారిగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. మోరీలు నాళాలు నిండి పొంగిపొర్లాయి.4
- భక్తుల రద్దీకి ముందస్తు ఏర్పాట్లు పూర్తి1