Shuru
Apke Nagar Ki App…
శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని మంగళవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.
SREEYAN
శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని మంగళవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.
More news from తెలంగాణ and nearby areas
- శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని మంగళవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.1
- కోల్కూర్ ప్రభుత్వ పాఠశాలలో వృధాగా పోతున్న తాగునీరు...! సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం కోల్కూర్ గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు తాగే మంచినీరు వృధాగా పోతుంది పంటలు పండక నీరు లేక భూగర్భ జలాలు అడుగంటుతుంటే ప్రతి ఒక్కరు నీటి బొట్టును ఒడిసి పట్టాలనీ నిపుణులు చెప్తుంటే, భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలిచే ఉపాధ్యాయులు మాత్రం ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వృధాగా పోయే నీటి వద్ద ఇంకుడు గుంత నైనా ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.1
- అండాల సేకరణ ఆరోపణలు.. ఐదు ఫెర్టిలిటీ కేంద్రాలకు నోటీసులు హైదరాబాద్‌లో మహిళల నుంచి నిబంధనలకు విరుద్ధంగా అండాలు సేకరిస్తున్నారనే ఆరోపణలపై తెలంగాణ మహిళా కమిషన్ స్పందించింది. ఇందిరా ఐవీఎఫ్, నర్మదా, ఒయాసిస్, సద్గురు ఏఆర్టీ, పద్మజ ఫెర్టిలిటీ కేంద్రాలకు నోటీసులు జారీ చేసింది. సోమవారం చైర్పర్సన్ నేరెళ్ల శారద సమక్షంలో ఆయా కేంద్రాల ప్రతినిధులను విచారించింది. మహిళల రాతపూర్వక సమ్మతి, వైద్య భద్రత, ఏఆర్టీ చట్టం–2021 నిబంధనల అమలుపై వివరణ కోరింది. విచారణ అనంతరం ఆధారాల ప్రకారం తదుపరి చర్యలు తీసుకోనుంది.1
- అక్రమంగా అండాల సేకరణ: ఐదు ప్రముఖ ఫెర్టిలిటీ సెంటర్లకు తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు! హైదరాబాద్, నవంబర్ 10: నిబంధనలకు విరుద్ధంగా మహిళల నుంచి అక్రమంగా అండాలు (Eggs) సేకరిస్తున్నారన్న తీవ్ర ఆరోపణలపై తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఉక్కుపాదం మోపింది. నగరంలోని ఐదు ప్రముఖ సంతాన సాఫల్య కేంద్రాలకు (Fertility Centres) కమిషన్ అధికారికంగా నోటీసులు జారీ చేసింది. నోటీసులు అందుకున్న కేంద్రాల మేనేజింగ్ డైరెక్టర్లు, మెడికల్ సూపరింటెండెంట్లు, సెంటర్ హెడ్స్ సోమవారం బుద్ధభవన్‌లోని కమిషన్ కార్యాలయంలో స్వయంగా హాజరయ్యారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే... ఇందిరా ఐవీఎఫ్ సెంటర్ (Indira IVF Centre), నర్మదా ఫెర్టిలిటీ సెంటర్ (Narmada Fertility Centre), ఒయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్ (Oasis Fertility Centre), సద్గురు ఏఆర్టీ సెంటర్ (Sadguru ART Centre), పద్మజా ఫెర్టిలిటీ సెంటర్ (Padmaja Fertility Centre) లపై నిబంధనల ఉల్లంఘన ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో మహిళా కమిషన్ చైర్పర్సన్ శారద నెరేళ్ల ఎదుట హాజరైన ఆయా ఆసుపత్రుల యాజమాన్యాలు తమ వివరణలను లిఖితపూర్వకంగా సమర్పించాల్సి ఉంది. అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ (రెగ్యులేషన్) చట్టం, 2021 (ART Act) ప్రకారం అండ దాతల నుంచి తప్పనిసరిగా లిఖితపూర్వక అనుమతి తీసుకోవడం, తగిన వైద్య రక్షణలు కల్పించడం, అండాల సేకరణపై నిర్దేశించిన పరిమితులను పాటించడం తప్పనిసరి. అయితే ఈ ఐదు కేంద్రాలు సదరు నిబంధనలను ఉల్లంఘించాయా లేదా అన్న కోణంలో కమిషన్ సమగ్ర విచారణ జరుపుతోంది. మహిళల ఆరోగ్యం, వారి ఆత్మగౌరవం, పునరుత్పత్తి హక్కులకు భంగం వాటిల్లిందా అనే అంశాన్ని నిర్ధారించేందుకు ఆసుపత్రులు ఇచ్చే వివరణలు, సాక్ష్యాలను పరిశీలించి బాధ్యులపై కఠిన చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయనున్నట్లు కమిషన్ వెల్లడించింది. కీలక ముఖ్యాంశాలు: - మహిళల నుంచి అక్రమంగా అండాల సేకరణ ఆరోపణలపై ఐదు ఫెర్టిలిటీ కేంద్రాలకు మహిళా కమిషన్ నోటీసులు - ఇందిరా ఐవీఎఫ్, నర్మదా, ఒయాసిస్, సద్గురు, పద్మజా ఫెర్టిలిటీ కేంద్రాలకు చెందిన ప్రతినిధులు హాజరు - బుద్ధభవన్‌లో మహిళా కమిషన్ చైర్పర్సన్ శారద నెరేళ్ల ఎదుట హాజరై లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశం - ఏఆర్టీ (రెగ్యులేషన్) చట్టం-2021 నిబంధనల ఉల్లంఘనలపై సమగ్ర విచారణ - వివరణలు, ఆధారాలను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు కమిషన్ స్పష్టీకరణ1
- అట్లాస్ జానయ్య వేధింపులు అరికట్టాలని అతనిపై చర్యలు తీసుకోవాలని నిరసన ర్యాలీ వైస్ ఛాన్సలర్ అల్డాస్ జానయ్య వేధింపులు తట్టుకోలేక కంటతడి పెట్టుకున్న మరో మహిళా ప్రొఫెసర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో కొనసాగుతున్న వైస్ ఛాన్సలర్ అల్డాస్ జానయ్య మహిళా ప్రొఫెసర్, మరో ప్రొఫెసర్‌ను పట్టుకొని మీరిద్దరూ మొగుడు పెళ్లాం లాగా యూనివర్సిటీలో తిరుగుతున్నారని వేధించిన అల్డాస్ జానయ్య డీజీపీ స్థాయిలో ఫిర్యాదు చేసినా మాకు న్యాయం దక్కడం లేదు - బాధిత మహిళా ప్రొఫెసర్1
- వెంకటేశ్వర నగర్లో అగ్నిప్రమాదం.. రూ.25 లక్షల ఆస్తి నష్టం హెచ్‌బీ కాలనీ డివిజన్ పరిధిలోని వెంకటేశ్వర నగర్లో మదర్ థెరిస్సా స్కూల్ సమీపంలోని రామ్‌దేవ్ మినీ సూపర్ మార్కెట్లో సోమవారం ఉదయం షార్ట్ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం సంభవించింది. ఉదయం 5.30 నుంచి 6 గంటల మధ్య జరిగిన ఈ ఘటనలో సుమారు రూ.25 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే చేరుకుని మంటలను అదుపు చేశారు. బీజేపీ నాయకుడు రామ్ ప్రదీప్ మునుగంటి ఘటనా స్థలాన్ని పరిశీలించి, పోలీసులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. షాపునకు ఇన్సూరెన్స్ లేకపోవడంతో యజమానికి జరిగిన నష్టంపై ఆందోళన వ్యక్తం చేశారు.1
- కోల్కూర్‌లో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి బర్త్ డే సెలబ్రేషన్స్..! సంగారెడ్డి జిల్లా సదాశివపేటమండలం కోల్కూర్ గ్రామంలో ఆదివారం సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆయన బర్త్ డే సెలబ్రేషన్ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ జే మాణిక్ రెడ్డి,మాజీ సర్పంచ్ సిల్వరాజ్, కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడు ధనరాజ్ పార్టీ కార్యకర్తలు సీఎం రేవంత్ రెడ్డి గారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ నిర్వహణతో గ్రామమంతా పండుగ వాతావరణం నెలకొంది. గ్రామంలోని రాజకీయ నాయకులు లబ్ధిదారులకు అన్ని పథకాలు అందేలా చూస్తామన్నారు.1
- మనోహరాబాద్ మండలం జీడిపల్లి వద్ద బైక్ ఢీకొని కార్మికుడికి గాయాలు మనోహరాబాద్ మండలం జీడిపల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జార్ఖండ్‌కు చెందిన లీలేశ్వర్ (33) ద్విచక్ర వాహనం ఢీకొనడంతో గాయపడ్డాడు. ఓ కంపెనీలో కార్మికుడిగా పనిచేస్తున్న ఆయన జీడిపల్లి నుంచి రైల్వే స్టేషన్‌కు కాలినడకన వెళ్తుండగా బైక్ ఢీకొట్టింది. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఈఎంటీ శివ, పైలెట్ రమేష్ ఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని గాంధీ ఆసుపత్రికి తరలించారు.1