ప్రత్యామ్నాయ పంటలతో రైతులకు అదనపు ప్రయోజనం నీటి లభ్యతకు అనుగుణంగా పంటల ఎంపిక చేసుకోవాలి నాతవరం: వరి సాగు చేయని రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని మండల వ్యవసాయ శాఖాధికారిణి సుగుణ సూచించారు. తక్కువ నీటితో సాగు చేసుకునే రాగి, సజ్జ వంటి చిరుధాన్యాలతో పాటు కంది, మినుములు, ఉలవలు వంటి అపరాల పంటలను వేసుకోవడం ద్వారా రైతులకు మంచి ప్రయోజనం ఉంటుందని తెలిపారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పంటల ఎంపిక చేసుకోవాలని సూచించారు. తాండవ ఆయకట్టు చివరి ప్రాంతాల్లో నీటి కొరత కారణంగా వరినారు ఎండిపోతున్న ప్రాంతాల్లో రైతులు జీవరక్షక తడులు అందించాలని ఆమె కోరారు. పంటను కాపాడుకునేందుకు అవసరమైన నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు. రైతులకు ఏయే ప్రాంతాల్లో ఏ పంటలు అనుకూలంగా ఉంటాయనే అంశంపై రైతు సేవా కేంద్రాల సిబ్బంది ద్వారా అవగాహన కల్పిస్తామని సుగుణ తెలిపారు. రైతులు వ్యవసాయ సిబ్బంది సూచనలు పాటిస్తూ ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసుకోవాలని కోరారు.
ప్రత్యామ్నాయ పంటలతో రైతులకు అదనపు ప్రయోజనం నీటి లభ్యతకు అనుగుణంగా పంటల ఎంపిక చేసుకోవాలి నాతవరం: వరి సాగు చేయని రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని మండల వ్యవసాయ శాఖాధికారిణి సుగుణ సూచించారు. తక్కువ నీటితో సాగు చేసుకునే రాగి, సజ్జ వంటి చిరుధాన్యాలతో పాటు కంది, మినుములు, ఉలవలు వంటి అపరాల పంటలను వేసుకోవడం ద్వారా రైతులకు మంచి ప్రయోజనం ఉంటుందని తెలిపారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పంటల ఎంపిక చేసుకోవాలని సూచించారు. తాండవ ఆయకట్టు చివరి ప్రాంతాల్లో నీటి కొరత కారణంగా వరినారు ఎండిపోతున్న ప్రాంతాల్లో రైతులు జీవరక్షక తడులు అందించాలని ఆమె కోరారు. పంటను కాపాడుకునేందుకు అవసరమైన నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు. రైతులకు ఏయే ప్రాంతాల్లో ఏ పంటలు అనుకూలంగా ఉంటాయనే అంశంపై రైతు సేవా కేంద్రాల సిబ్బంది ద్వారా అవగాహన కల్పిస్తామని సుగుణ తెలిపారు. రైతులు వ్యవసాయ సిబ్బంది సూచనలు పాటిస్తూ ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసుకోవాలని కోరారు.
- 🛕 శ్రీ స్వామి వారి ఆలయ పునః నిర్మాణం 🛕 👤 ప్రభుత్వ విప్, ముమ్మిడివరం శాసన సభ్యులు 🌟 శ్రీ దాట్ల సుబ్బరాజు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నది 🌟 ది 24-08-2026, సోమవారం విరాళం అందించిన దాత: శ్రీ జి వెంకట చలపతి రావు విజయవాడ ₹ 5 వేలు 🌸 "దాతకు దేవస్థానం తరపున శుభాభినందనలు" 🌸 🌐 Website: www.sriveereswaraswamytemple 📞 6301711136 ⛳ నిత్య కల్యాణం - పచ్చతోరణంగా విరాజిల్లుతున్న శ్రీ వీరేశ్వర స్వామి దేవస్థానం, మురమళ్ల 📞 08856 278136 📞 9490111136 📞 7382111136 ఓం నమో వీరేశ్వర1
- విజయనగరం జిల్లా రాజ్యాంలో హాస్టల్ వార్డెన్ తీరు విమర్శలకు తావిస్తోంది.. రాజం శారది రోడ్లో ఉన్న జిల్లా పరిషత్తు బాలికలు ఉన్నత పాఠశాల, బాలికలు జూనియర్ కాలేజీకి అనుబంధ వసతి గృహంలో వార్డెన్ గా విధులు నిర్వహిస్తున్న కడప రమా తమ బంధువులు పెళ్లి వేడుకల్లో కొంతమంది బాలికలను రోడ్డుపై స్టెప్పులు వేయించడం స్థానికంగా విమర్శలు విలువతున్నాయి.. విజయనగరం జిల్లా రాజాం లో ఓ హాస్టల్ వార్డెన్ తీరు విమర్శలకు తావిస్తుంది.. రాజాం సారధి రోడ్డులో ఉన్న జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల మరియు బాలికల జూనియర్ కాలేజ్ కు అనుబంధ వసతి గృహంలో వార్డెన్గా విధులు నిర్వహిస్తున్న అడపా రమా తమ బంధువులు పెళ్లి వేడుకలలో వసతి గృహములో ఉన్న కొంతమంది బాలికలను వంజరం పేట గ్రామానికి తీసుకెళ్లి రోడ్లపై స్టెప్పులు వేయించడం స్థానికంగా పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి... కాలేజ్ ప్రిన్సిపాల్ కు గాని లేదా తమ తల్లిదండ్రులు గాని తెలియకుండా ఇలా బయటకు తీసుకువెళ్లి డాన్స్ లు వేయించును ఎంతవరకు కరెక్ట్ అంటూ చర్చ జరుగుతుంది.4
- బొడ్డేపల్లి రామకృష్ణారావుకు ‘మీట్ ది నేషనల్ ఐకాన్స్’ అవార్డు విజయనగరం, ఆగస్టు 25: నిరంతర రక్తదాతగా, భారత మాజీ వాయుసేనికుడిగా, విశ్రాంత ఉపాధ్యాయుడిగా, సామాజిక సేవకుడిగా విశిష్ట సేవలందిస్తున్న బొడ్డేపల్లి రామకృష్ణారావును 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత్ గుడ్ టైమ్స్, రాజస్థాన్‌లోని కోటా సంస్థ ప్రతినిధులు ‘మీట్ ది నేషనల్ ఐకాన్స్ (సక్షియత్)’ అవార్డుతో సత్కరించారు. ఆన్‌లైన్ ద్వారా అందిన ఈ అవార్డును విజయనగరం జిల్లా సైనిక సంక్షేమ అధికారి కె.వి.ఎస్. ప్రసాదరావు చేతుల మీదుగా రామకృష్ణారావు స్వీకరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి కె.వి.ఎస్. ప్రసాదరావు మాట్లాడుతూ రామకృష్ణారావు చేస్తున్న సేవలను అభినందించారు. భవిష్యత్తులో మరెన్నో పురస్కారాలు అందుకోవాలని, త్వరలోనే గిన్నిస్ రికార్డులో స్థానం సంపాదించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది నారాయణరావు, అనిల్, రమేశ్‌రాజు, శివ తదితరులు పాల్గొని రామకృష్ణారావును అభినందించారు.1
- ఈ సమస్యకు శాశ్వత పరిస్కారం చూపండి 🙏 ఇది డ్రైనేజీ కాదు, పూర్తిగా చెత్త కాలువలా అయిపోయింది. నీళ్ళు నల్లగా, నురగతో, ప్లాస్టిక్ చెత్తతో నిండిపోయాయి. ఇలా ఉంటే దోమలు, రోగాలు రావడం పక్కా > ఇది మా నార్కిడిమిల్లి గ్రామం, కొత్తపేట నియోజకవర్గం, కోనసీమ జిల్లా దుస్థితి! > > డ్రైనేజీ కాలువ పూడుకుపోయి, మురుగునీరు నిలిచిపోయి దుర్వాసన వస్తుంది. పక్కనే కొబ్బరి చెట్లు, ఇళ్ళు ఉన్నాయి. పిల్లలు, పెద్దలు రోగాల బారిన పడుతున్నారు. ఇన్ని రోజులుగా పట్టించుకునే నాథుడే లేడు. > > మా MLA బండారు సత్యానందరావు గారు @ncbn గారు @naralokesh గారు దయచేసి స్పందించి ఈ కాలువను శుభ్రం చేయించండి 🙏 > > #Narkidimilli #Kothapeta #Konaseema #DrainageProblem #SwachhAndhra @Collector_Konaseema ---2
- రాజయోగిని దాదీ ప్రకాశమణి 19వ పుణ్యతిథి సందర్భంగా బ్రహ్మాకుమారీస్ సామాజిక సేవా విభాగం ఆధ్వర్యంలో మంగళవారం సాలూరులో మెగా రక్తదాన మహా శిబిరం నిర్వహించారు. బీకే రత్నకుమారి ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో 45 మందికి పైగా స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. రక్తదానం ద్వారా ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడవచ్చని నిర్వాహకులు తెలిపారు. ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సాలూరులో ఘనంగా మెగా రక్తదాన మహా శిబిరం సాలూరు: రాజయోగిని దాదీ ప్రకాశమణి 19వ పుణ్యతిథి సందర్భంగా బ్రహ్మాకుమారీస్ సామాజిక సేవా విభాగం ఆధ్వర్యంలో మంగళవారం సాలూరులో మెగా రక్తదాన మహా శిబిరం నిర్వహించారు. బీకే రత్నకుమారి ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో 45 మందికి పైగా స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. రక్తదానం ద్వారా ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడవచ్చని నిర్వాహకులు తెలిపారు. ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. “రక్తదానం చేద్దాం.. ప్రాణాలను కాపాడుదాం.. జీవనాధారంగా నిలుద్దాం” అనే సందేశంతో కార్యక్రమాన్ని నిర్వహించారు.2
- నిత్యవసర సరుకుల ధరలు పెరుగుదల నియంత్రించాలి. సోషలిస్ట్ పార్టీ నిత్యవసర సరుకులు ధరలు పెరుగుదల నియంత్రించాలని సోషలిస్టు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎం ఎస్ శ్రీనివాసరావు విజయనగరం పట్టణం పార్టీ ఆఫీసులో మంగళవారం మీడియాకి తెలిపారు. నిత్యవసర సరుకులు బియ్యం, పంచదార తదితర సరుకులు విపరీతంగా పెరిగి సామాన్య ప్రజలకు అందుబాటులో లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై ప్రభుత్వం, అధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.1
- బీసీల అభివృద్ధి ప్రదాత బీపీ మండల్ పాలకొల్లులో బీపీ మండల్ 108వ జయంతి వేడుకలు1
- సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగి ఉన్న కంటైనర్ను ఢీ కొట్టిన ట్రావెల్స్ బస్సు.. ఐదుగురు మృతి 20 మందికి తీవ్ర గాయాలు.. మరో ఇద్దరు పరిస్థితి విషమం.. *సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం* ..! ఆగి ఉన్న కంటైనర్‌ను ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు..! ఐదుగురు మృతి.. ఇరవై మందికి తీవ్ర గాయాలు..! మరో ఇద్దరి పరిస్థితి విషమం..! కోదాడ మండలం ద్వారకుంట సమీపంలో ఘటన.. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తుండగా ప్రమాదం..! ఆగి ఉన్న కంటైనర్‌ను వేగంగా ఢీకొట్టిన బస్సు..! ప్రమాద ధాటికి బస్సు ముందు భాగం నుజ్జునుజ్జు..! బస్సులో ఇరుక్కున్న ప్రయాణికుల ఆర్తనాదాలు..! ఘటనా స్థలంలో భయానక పరిస్థితి..! బస్సులో ఇరుక్కున్న క్షతగాత్రులను బయటకు తీసేందుకు సహాయక చర్యలు..! తీవ్రంగా గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలింపు..! ప్రమాదంతో హైదరాబాద్–ఏలూరు మార్గంలో తీవ్ర ఉద్రిక్తత..! ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు..! ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభం..! మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన..! ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..!2