Shuru
Apke Nagar Ki App…
అవిలాల మండలం అవిలాల గ్రామపంచాయతీలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా “మన ఊరు–మన జెండా” కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ చేతుల మీదుగా బీజేపీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ లక్ష్యం “వికసిత్ భారత్” సాధన అని, ప్రతి కార్యకర్త దేశం ముందు అనే భావనతో పని చేస్తాడని తెలిపారు. బలహీన వర్గాలకు ప్రభుత్వ ప్రయోజనాలు చేరేలా బీజేపీ కృషి చేస్తుందని చెప్పారు. సీనియర్ నాయకులు అవిలాల శ్రీధర్ మాట్లాడుతూ రాష్ట్ర, జిల్లా నాయకత్వం సూచించిన కార్యక్రమాలను గ్రామస్థాయిలో అమలు చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
RAVI KUMAR
అవిలాల మండలం అవిలాల గ్రామపంచాయతీలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా “మన ఊరు–మన జెండా” కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ చేతుల మీదుగా బీజేపీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ లక్ష్యం “వికసిత్ భారత్” సాధన అని, ప్రతి కార్యకర్త దేశం ముందు అనే భావనతో పని చేస్తాడని తెలిపారు. బలహీన వర్గాలకు ప్రభుత్వ ప్రయోజనాలు చేరేలా బీజేపీ కృషి చేస్తుందని చెప్పారు. సీనియర్ నాయకులు అవిలాల శ్రీధర్ మాట్లాడుతూ రాష్ట్ర, జిల్లా నాయకత్వం సూచించిన కార్యక్రమాలను గ్రామస్థాయిలో అమలు చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
More news from Andhra Pradesh and nearby areas
- Post by RAVI KUMAR1
- తిరుపతిలోని డి పి ఆర్ కళ్యాణమండపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో “రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ – తాగునీరు, సాగునీటి సాధన, భవిష్యత్తు కార్యచరణ”పై నిర్వహించిన కార్యక్రమంలో వెంకటేగౌడ పాల్గొన్నారు.ఈ కార్యక్రమం ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి మరియు మాజీ మంత్రి సాకె శైలజానాథ్ గారి నాయకత్వంలో జరిగింది. రాయలసీమలో ఎత్తిపోతల పథకాల ద్వారా తాగునీటి సమస్యను పరిష్కారం చేయడం మరియు భవిష్యత్తు కార్యాచరణను రూపొందించడంపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సీపీ నియోజకవర్గం సమన్వయకర్తలు, మాజీ మంత్రులు, కార్యనిర్వాహక కమిటీ సభ్యులు మరియు ఇతర ప్రముఖ నాయకులు పాల్గొన్నారు.1
- Post by Bondhu Suresh1
- బద్వేలు :మున్సిపాలిటీ అధికారులకు మరివు రాజకీయ నాయకులకు తెలియజేయడం ఏమనగా మాలాంటి లేబర్ వార్డ్ ల పై గౌరవం ఉంటే ఈల వదిలేయరు పన్నులు వసూలు చేయడం లో ఉన్న శ్రద్ధ మా వార్డ్ శుభ్రపరచడం లో కూడా చూపించండి సర్ మా వార్డ్ డెవలప్మెంట్ దేవుడు యరుగు ముందు మా వార్డ్ డ్రైనేజ్ క్లీన్ కూడా చేయడం లేదు దానివల్ల మురికి నీరు ఇండ్లలోకి వెళుతున్నవి అందువల చిన్న పిల్లలు అనారోగ్యం బారిన పడుతున్నారు. దీనిని గమనించి కూటమి నాయకులు ముఖ్యంగా మా వార్డ్ 15Th వార్డ్ పుసలవాడ రాములగుడి దగ్గర ఈ పరిస్థితి ఉంది దీనిపైన చర్యలు తీసుకోవాలని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. పేద నాయకులు డబ్బున వారి వార్డు లను డెవల్పమెంట్ చేసి బద్వేలు మున్సిపాలిటీ ని మొత్తం డెవలప్మెంట్ చేసినాము అని చెప్పుకునే వారు మా వార్డు పరిస్థితిని కూడా చూడండి అంటున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్ స్పందించాలని కోరారు.2
- గాండ్లపెంట మండలం రెక్కమాను గ్రామంలో కదిరి,రాయచోటి ప్రధాన రహదారి ప్రాంతంలో నూతంగా సిమెంట్ రోడ్డు వేస్తున్నారు. రహదారి మద్యలో విద్యుత్ స్తంభాన్ని వదిలేసి సీసీ రోడ్డు వేస్తున్నారు. భవిష్యత్తులో ప్రమాదాలకు నోచుకునే అవకాశం ఎక్కువగా ఉందని ఆ ప్రాంత వాసులు ఆందోళన చెందుతున్నారు. ప్రమాదాలు జరగకనే ముందస్తు జాగ్రత్తలు తీసుకొని సమస్య పరిష్కారం చేయాలని స్థానికులు కోరుతున్నారు.1
- *తాడేపల్లి* *రౌడీ షీటర్ బన్నీ నుంచి ప్రాణహాని ఉంది* *తనపై జరిగిన దాడి గురించి బాధితుడు నాని మీడియా ముందు తన గోడును వెళ్లబోసుకున్నారు. బన్నీ అనే వ్యక్తి విచక్షణ కోల్పోయి తనపై తీవ్రంగా దాడి చేశాడని అతను ఆవేదన వ్యక్తం చేశారు.* *"పోలీసులను కొంటాను, నిన్ను చంపేస్తాను" అని బన్నీ తనను భయభ్రాంతులకు గురిచేసినట్లు నాని తెలిపారు.* *ప్రాణ భయంతో ఎవరికీ కనిపించకుండా, తన ఉద్యోగాన్ని కూడా వదులుకుని ఇంట్లోనే గడుపుతున్నట్లు నాని పేర్కొన్నారు.* *"పోలీసులు నా జేబులో ఉంటారు, నేను ఏమైనా చేయగలను" అని బన్నీ బెదిరించడంతో ఇంతకాలం ఫిర్యాదు చేయడానికి వెనుకాడినట్లు నాని చెప్పారు.* *అదృష్టవశాత్తూ ఆ దాడికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో ధైర్యం వచ్చిందని, ఇప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నానని ఆయన వెల్లడించారు.* *నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరుతున్నారు.*1
- రాయదుర్గం పట్టణంలో విచ్చలవిడిగా అర్హత లేని మైనర్లు వాహనాలు నడుపుతుండడంతో నేడు అర్బన్ సీఐ జయ నాయక్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. వాహనాలు నడుపుతున్న మైనర్లను మరియు వారి తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. మైనర్లకు వాహనాలు నడపడానికి ఇచ్చిన తల్లిదండ్రులు, వాహన యజమానులపై మరోసారి పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.1
- పలమనేరు పూలమండి వ్యాపారస్తులకు స్థానిక రైతు బజారులో దుకాణాల ఏర్పాటుకు వ్యవసాయ మార్కెటింగ్ శాఖా ఆధ్వర్యంలో స్థలాలను కేటాయిస్తూ మంజురు చేసిన పత్రాలను వ్యాపారులకు అందజేసిన పలమనేరు శాసన సభ్యులు అమరనాథ రెడ్డి. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రాజన్న తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు.1