గుంతలమయమైన ప్రధాన రహదారి.. ప్రమాదకరంగా మారిన ఉప్పరి గోతుల ఘాట్‌రోడ్డు మారేడుమిల్లి నుంచి గుర్తేడు, పాతకోట మీదుగా ధారకొండ వెళ్లే ప్రధాన రహదారి గుంతలమయంగా మారి అధ్వానంగా తయారైంది. గుర్తేడు మండలం మండల పరిధిలోని గ్రామాలకు రాకపోకలకు ఈ రహదారే ప్రధాన ఆధారం. అయితే రహదారి దెబ్బతినడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చావడికోట పంచాయతీ పరిధిలోని ఉప్పరిగోతుల గ్రామం వద్ద ఉన్న ఘాట్‌రోడ్డు మరింత ప్రమాదకరంగా మారింది. సుమారు 20 ఏళ్ల క్రితం నిర్మించిన సిమెంట్ రోడ్డు పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవల ఓ ట్రాక్టర్ అదుపుతప్పి లోయలోకి బోల్తాపడిన ఘటన చోటుచేసుకుంది. గతంలోనూ ఇలాంటి ప్రమాదాలు జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ రోడ్ లో అధికారులు ప్రయాణిస్తున్నారు. ఈ రోడ్ కోసం కలెక్టర్ కి గ్రీవెన్స్ లో కూడ ఇవ్వడం జరిగింది. గిరిజన ప్రజలు అంటే అంత సులకన ఐ.టి. డి. ఎ అనేది గిరిజనుల కోసం పెట్టిందే కదా కాని గిరిజనులకు న్యాయం జరగటం లేదు ప్రజలు ఆవేదన వ్యక్త పరుస్తున్నారు.ఇప్పటికైనా సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులు స్పందించి రహదారి పరిస్థితిని పరిశీలించి, ముఖ్యంగా ఉప్పరిగోతుల ఘాట్‌రోడ్డును పునర్నిర్మించేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు.
గుంతలమయమైన ప్రధాన రహదారి.. ప్రమాదకరంగా మారిన ఉప్పరి గోతుల ఘాట్‌రోడ్డు మారేడుమిల్లి నుంచి గుర్తేడు, పాతకోట మీదుగా ధారకొండ వెళ్లే ప్రధాన రహదారి గుంతలమయంగా మారి అధ్వానంగా తయారైంది. గుర్తేడు మండలం మండల పరిధిలోని గ్రామాలకు రాకపోకలకు ఈ రహదారే ప్రధాన ఆధారం. అయితే రహదారి దెబ్బతినడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చావడికోట పంచాయతీ పరిధిలోని ఉప్పరిగోతుల గ్రామం వద్ద ఉన్న ఘాట్‌రోడ్డు మరింత ప్రమాదకరంగా మారింది. సుమారు 20 ఏళ్ల క్రితం నిర్మించిన సిమెంట్ రోడ్డు పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవల ఓ ట్రాక్టర్ అదుపుతప్పి లోయలోకి
బోల్తాపడిన ఘటన చోటుచేసుకుంది. గతంలోనూ ఇలాంటి ప్రమాదాలు జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ రోడ్ లో అధికారులు ప్రయాణిస్తున్నారు. ఈ రోడ్ కోసం కలెక్టర్ కి గ్రీవెన్స్ లో కూడ ఇవ్వడం జరిగింది. గిరిజన ప్రజలు అంటే అంత సులకన ఐ.టి. డి. ఎ అనేది గిరిజనుల కోసం పెట్టిందే కదా కాని గిరిజనులకు న్యాయం జరగటం లేదు ప్రజలు ఆవేదన వ్యక్త పరుస్తున్నారు.ఇప్పటికైనా సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులు స్పందించి రహదారి పరిస్థితిని పరిశీలించి, ముఖ్యంగా ఉప్పరిగోతుల ఘాట్‌రోడ్డును పునర్నిర్మించేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు.
- ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య ఘటనపై కఠిన చర్యలకు డిమాండ్ ద్వారకాతిరుమల మండల బీజేపీ అధ్యక్షుడు చిలకా వీరాస్వామి ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు పోలీసులను కలిసి ఫిర్యాదు చేశారు. సాహిత్ ఖాన్‌పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి, బాధ్యుడిగా తేలిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు రాష్ట్ర హోంమంత్రి, డీజీపీ తక్షణమే స్పందించి, నిష్పక్షపాత దర్యాప్తు జరిగేలా చర్యలు తీసుకోవాలని, నిందితుడిగా సాదిక్ కు చట్టప్రకారం కఠిన శిక్ష పడేలా చూడాలని చిలకా వీరాస్వామి కోరారు.1
- రాజయోగిని దాదీ ప్రకాశమణి 19వ పుణ్యతిథి సందర్భంగా బ్రహ్మాకుమారీస్ సామాజిక సేవా విభాగం ఆధ్వర్యంలో మంగళవారం సాలూరులో మెగా రక్తదాన మహా శిబిరం నిర్వహించారు. బీకే రత్నకుమారి ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో 45 మందికి పైగా స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. రక్తదానం ద్వారా ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడవచ్చని నిర్వాహకులు తెలిపారు. ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సాలూరులో ఘనంగా మెగా రక్తదాన మహా శిబిరం సాలూరు: రాజయోగిని దాదీ ప్రకాశమణి 19వ పుణ్యతిథి సందర్భంగా బ్రహ్మాకుమారీస్ సామాజిక సేవా విభాగం ఆధ్వర్యంలో మంగళవారం సాలూరులో మెగా రక్తదాన మహా శిబిరం నిర్వహించారు. బీకే రత్నకుమారి ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో 45 మందికి పైగా స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. రక్తదానం ద్వారా ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడవచ్చని నిర్వాహకులు తెలిపారు. ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. “రక్తదానం చేద్దాం.. ప్రాణాలను కాపాడుదాం.. జీవనాధారంగా నిలుద్దాం” అనే సందేశంతో కార్యక్రమాన్ని నిర్వహించారు.2
- బొడ్డేపల్లి రామకృష్ణారావుకు ‘మీట్ ది నేషనల్ ఐకాన్స్’ అవార్డు విజయనగరం, ఆగస్టు 25: నిరంతర రక్తదాతగా, భారత మాజీ వాయుసేనికుడిగా, విశ్రాంత ఉపాధ్యాయుడిగా, సామాజిక సేవకుడిగా విశిష్ట సేవలందిస్తున్న బొడ్డేపల్లి రామకృష్ణారావును 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత్ గుడ్ టైమ్స్, రాజస్థాన్‌లోని కోటా సంస్థ ప్రతినిధులు ‘మీట్ ది నేషనల్ ఐకాన్స్ (సక్షియత్)’ అవార్డుతో సత్కరించారు. ఆన్‌లైన్ ద్వారా అందిన ఈ అవార్డును విజయనగరం జిల్లా సైనిక సంక్షేమ అధికారి కె.వి.ఎస్. ప్రసాదరావు చేతుల మీదుగా రామకృష్ణారావు స్వీకరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి కె.వి.ఎస్. ప్రసాదరావు మాట్లాడుతూ రామకృష్ణారావు చేస్తున్న సేవలను అభినందించారు. భవిష్యత్తులో మరెన్నో పురస్కారాలు అందుకోవాలని, త్వరలోనే గిన్నిస్ రికార్డులో స్థానం సంపాదించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది నారాయణరావు, అనిల్, రమేశ్‌రాజు, శివ తదితరులు పాల్గొని రామకృష్ణారావును అభినందించారు.1
- పార్వతీపురం మన్యం జిల్లా.. సాలూరులో రక్తదానంతో ప్రాణాలను కాపాడుదాం: ఎస్ ఐ జి భాస్కరరావు.. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో నవజీవ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈగల్ డిపార్ట్మెంట్, రెడ్‌క్రాస్ సంస్థల సంయుక్త సహకారంతో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం మన్యం జిల్లా ఈగల్ డిపార్ట్మెంట్ సబ్‌ఇన్‌స్పెక్టర్ జి. భాస్కర్‌రావు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో రక్త నిల్వలు ఎంతో అవసరమని, అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందక అనేక మంది ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రతి యువకుడు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని కోరారు. ప్రస్తుత సమాజంలో మాదకద్రవ్యాల ప్రభావం యువతపై పెరుగుతోందని, తమ పరిసర ప్రాంతాల్లో డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాల వినియోగం లేదా విక్రయాలు కనిపిస్తే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. యువతను మాదకద్రవ్యాలకు దూరంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. రక్తదానం చేసిన సబ్‌ఇన్‌స్పెక్టర్ జి. భాస్కర్‌రావును నవజీవ ట్రస్ట్ బ్రాంచ్ మేనేజర్ చిన్నమ్మలు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రెడ్‌క్రాస్ జిల్లా అధ్యక్షులు మమ్ముల తిరుపతిరావు, రెడ్‌క్రాస్ సూపర్‌వైజర్ రాము, స్వాతిశ్రీ, రెడ్‌క్రాస్ సిబ్బంది, నవజీవ ట్రస్ట్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.1
- ఈ సమస్యకు శాశ్వత పరిస్కారం చూపండి 🙏 ఇది డ్రైనేజీ కాదు, పూర్తిగా చెత్త కాలువలా అయిపోయింది. నీళ్ళు నల్లగా, నురగతో, ప్లాస్టిక్ చెత్తతో నిండిపోయాయి. ఇలా ఉంటే దోమలు, రోగాలు రావడం పక్కా > ఇది మా నార్కిడిమిల్లి గ్రామం, కొత్తపేట నియోజకవర్గం, కోనసీమ జిల్లా దుస్థితి! > > డ్రైనేజీ కాలువ పూడుకుపోయి, మురుగునీరు నిలిచిపోయి దుర్వాసన వస్తుంది. పక్కనే కొబ్బరి చెట్లు, ఇళ్ళు ఉన్నాయి. పిల్లలు, పెద్దలు రోగాల బారిన పడుతున్నారు. ఇన్ని రోజులుగా పట్టించుకునే నాథుడే లేడు. > > మా MLA బండారు సత్యానందరావు గారు @ncbn గారు @naralokesh గారు దయచేసి స్పందించి ఈ కాలువను శుభ్రం చేయించండి 🙏 > > #Narkidimilli #Kothapeta #Konaseema #DrainageProblem #SwachhAndhra @Collector_Konaseema ---2
- నిత్యవసర సరుకుల ధరలు పెరుగుదల నియంత్రించాలి. సోషలిస్ట్ పార్టీ నిత్యవసర సరుకులు ధరలు పెరుగుదల నియంత్రించాలని సోషలిస్టు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎం ఎస్ శ్రీనివాసరావు విజయనగరం పట్టణం పార్టీ ఆఫీసులో మంగళవారం మీడియాకి తెలిపారు. నిత్యవసర సరుకులు బియ్యం, పంచదార తదితర సరుకులు విపరీతంగా పెరిగి సామాన్య ప్రజలకు అందుబాటులో లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై ప్రభుత్వం, అధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.1
- 🛕 శ్రీ స్వామి వారి ఆలయ పునః నిర్మాణం 🛕 👤 ప్రభుత్వ విప్, ముమ్మిడివరం శాసన సభ్యులు 🌟 శ్రీ దాట్ల సుబ్బరాజు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నది 🌟 ది 24-08-2026, సోమవారం విరాళం అందించిన దాత: శ్రీ జి వెంకట చలపతి రావు విజయవాడ ₹ 5 వేలు 🌸 "దాతకు దేవస్థానం తరపున శుభాభినందనలు" 🌸 🌐 Website: www.sriveereswaraswamytemple 📞 6301711136 ⛳ నిత్య కల్యాణం - పచ్చతోరణంగా విరాజిల్లుతున్న శ్రీ వీరేశ్వర స్వామి దేవస్థానం, మురమళ్ల 📞 08856 278136 📞 9490111136 📞 7382111136 ఓం నమో వీరేశ్వర1
- శ్రీ స్వామి వారి ఆలయ పునః నిర్మాణం శ్రీ దాట్ల సుబ్బరాజు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నది 🌟 👤 ప్రభుత్వ విప్, ముమ్మిడివరం శాసన సభ్యులు 🌟 ది 24-08-2026, సోమవారం విరాళం అందించిన దాత: శ్రీ క్రిష్ణ చైతన్య రామాయణం అమీనాపూర్ ₹ 5001/- 🌸 "దాతకు దేవస్థానం తరపున శుభాభినందనలు" 🌸 📞 6301711136 ⛳ నిత్య కల్యాణం - పచ్చతోరణంగా విరాజిల్లుతున్న శ్రీ వీరేశ్వర స్వామి దేవస్థానం, మురమళ్ల 📞 08856 278136 📞 9490111136 📞 7382111136 ఓం నమో వీరేశ్వర1