ఇఫ్తార్ విందులో పాల్గొన్న కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పవిత్ర రంజాన్ మాసం మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని, ముస్లింలు ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందులు ప్రజల మధ్య ఐక్యతా భావం, ఆత్మీయతను పెంపొందిస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,పాల్వంచ పట్టణంలోని జామా మసీద్ లో నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. అనంతరం ముస్లింలతో కలిసి నమాజ్ చేశారు. ఉపవాస దీక్ష విరమించిన ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మతసామరస్యాన్ని చాటుతూ లౌకిక విలువలను కాపాడుకోవడం మనందరి బాధ్యత అన్నారు. దేశంలో ముస్లింలు పేదరికాన్ని అనుభవిస్తున్నారని, ప్రభుత్వాలు స్పందించి వారికి విద్య, వైద్య సదుపాయాలు కల్పించి, పేదరిక నిర్మూలన చర్యలు చేపట్టాలన్నారు. ఇరాన్ పై అమెరికా,ఇజ్రాయిల్ చేస్తున్న యుద్ధాన్ని వెంటనే నిలుపుదల చేయాలని, ఇరాన్ దేశాధ్యక్షుడు ఖమైనీని చంపేయడం జరిగిందని, ప్రపంచంలో ఒక దేశం పై మరో దేశాలు దాడులు చేసుకుంటా పోతే ప్రపంచ యుద్ధం గా మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకొని యుద్ధాన్ని ఆపాలని,జరిగిన నష్టాన్ని ఎక్కువగా జరగకుండా చూడాలని, పవిత్ర రంజాన్ మాసంలో ఇలాంటి దాడులు జరగటం చాలా దురదృష్టకమన్నారు. ప్రపంచమంతా శాంతి వైపు ఉండాలని, అల్లా ఆ శాంతిని ప్రసాదించాలని కోరుతున్నట్లు తెలిపారు..
ఇఫ్తార్ విందులో పాల్గొన్న కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పవిత్ర రంజాన్ మాసం మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని, ముస్లింలు ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందులు ప్రజల మధ్య ఐక్యతా భావం, ఆత్మీయతను పెంపొందిస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,పాల్వంచ
పట్టణంలోని జామా మసీద్ లో నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. అనంతరం ముస్లింలతో కలిసి నమాజ్ చేశారు. ఉపవాస దీక్ష విరమించిన ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మతసామరస్యాన్ని చాటుతూ లౌకిక విలువలను కాపాడుకోవడం మనందరి బాధ్యత అన్నారు. దేశంలో ముస్లింలు పేదరికాన్ని అనుభవిస్తున్నారని,
ప్రభుత్వాలు స్పందించి వారికి విద్య, వైద్య సదుపాయాలు కల్పించి, పేదరిక నిర్మూలన చర్యలు చేపట్టాలన్నారు. ఇరాన్ పై అమెరికా,ఇజ్రాయిల్ చేస్తున్న యుద్ధాన్ని వెంటనే నిలుపుదల చేయాలని, ఇరాన్ దేశాధ్యక్షుడు ఖమైనీని చంపేయడం జరిగిందని, ప్రపంచంలో ఒక దేశం పై మరో దేశాలు దాడులు చేసుకుంటా పోతే ప్రపంచ
యుద్ధం గా మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకొని యుద్ధాన్ని ఆపాలని,జరిగిన నష్టాన్ని ఎక్కువగా జరగకుండా చూడాలని, పవిత్ర రంజాన్ మాసంలో ఇలాంటి దాడులు జరగటం చాలా దురదృష్టకమన్నారు. ప్రపంచమంతా శాంతి వైపు ఉండాలని, అల్లా ఆ శాంతిని ప్రసాదించాలని కోరుతున్నట్లు తెలిపారు..
- జిల్లాలో బుధవారం నిర్వహించిన ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. గణితశాస్త్రం పేపర్–IIA, వృక్షశాస్త్రం పేపర్–II, రాజకీయ శాస్త్రం పేపర్–II పరీక్షలు జిల్లాలోని 37 కేంద్రాల్లో నిర్వహించబడ్డాయి. మొత్తం 8,805 మంది విద్యార్థులకు గాను 8,584 మంది హాజరై, 221 మంది గైర్హాజరయ్యారు. ఎటువంటి మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని తెలిపారు.1
- shining glitter lamination photo frame acrylic photo frames LED photo frames Digital Art photo frames mug print, pillow print, tshirts print, Readymade gifts, LED lighting boards, Steel letters birthday gifts, marriage gifts, Anniversary gifts...1
- మహబూబాబాద్ జిల్లా::: కొత్తగూడ మండలం గుంజేడు ముసలమ్మ అమ్మవారి జాతర అత్యంత వైభవంగా ప్రారంభమైంది. రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ వనదేవత ఉత్సవాలకు ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా ఉన్న భక్తులు భారీ సంఖ్యలో వస్తున్నారు. జాతరలో భాగంగా మొదటి రోజు అమ్మవారికి భక్తులు భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకుంటున్నారు. ముఖ్యంగా మహిళా భక్తులు తెల్లవారుజాము నుంచే పవిత్ర స్నానాలు ఆచరించి, కొత్త కుండలలో నైవేద్యాన్ని వండి, వేపాకులతో అలంకరించిన బోనాలను నెత్తిన పెట్టుకుని ఊరేగింపుగా అమ్మవారి సన్నిధికి చేరుకుంటున్నారు. డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాలు, మంగళహారతుల మధ్య అడవి మార్గమంతా ఆధ్యాత్మిక శోభతో నిండిపోయింది.1
- వరంగల్ జిల్లా.దుగ్గొండి మండలం గిర్నిబావి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభ బండ్లను నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు. జాతర సందర్భాన్ని పురస్కరించుకుని గులాబీ శ్రేణులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేపట్టాయి. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, నియోజకవర్గంలో పార్టీ శక్తిని మరింత బలోపేతం చేయాలని, ప్రతి గ్రామంలో కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. జాతర వేళ ప్రభ బండ్ల ద్వారా ప్రజల్లో ఉత్సాహం నింపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ వైస్ చైర్మన్, మండల పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ, నియోజకవర్గ యూత్ కన్వీనర్, జిల్లా నాయకులు, నియోజకవర్గ నాయకులు, క్లస్టర్ బాధ్యులు, మండల నాయకులు, సర్పంచులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.7
- .వరంగల్ జిల్లా గీసిగొండ మండలంలోని శ్రీ కొమ్మల లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం జాతర సందర్భంగా ప్రభ బండ్లు ఘనంగా వెళ్లాయి. పరిసర గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ప్రభ బండ్ల ఊరేగింపు భక్తిశ్రద్ధలతో సాగగా, జాతర ప్రాంతం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది.1
- తూ.గో జిల్లా రంగంపేట మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్త నాగేంద్రను భార్య వీరలక్ష్మి, ఆమె ప్రియుడు శివ కిరాతకంగా హత్య చేశారు. ఫిబ్రవరి 27న జరిగిన ఈ ఘటనలో నిందితులను అరెస్టు చేశారు. వారిని రిమాండ్కు తరలించినట్లు రాజమహేంద్రవరం ఈస్ట్ జోన్ DSP బి. విద్య వెల్లడించారు.1
- మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం మహామూద్‌పట్నం గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ను జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థులకు అందించాల్సిన మెనూను పాటించకపోవడం, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన విషయంపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. KGBV స్పెషల్ ఆఫీసర్‌పై తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. విద్యార్థుల సంక్షేమంపై రాజీ ఉండదని స్పష్టం చేసిన కలెక్టర్, పాఠశాలల నిర్వహణలో ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలని సూచించారు.1
- దమ్మపేట మండల కేంద్రంలో మల్లారం రైతు వేదిక నందు నూతనంగా గ్రామపంచాయతీ ఎన్నికలలో వార్డు సభ్యులుగా గెలుపొందిన అభ్యర్థులకు మండల స్థాయిలో మూడు విడతలుగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి ఈ శిక్షణ కార్యక్రమాల మొదటి విడత తరగతులకు ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామపంచాయతీ వ్యవస్థ గ్రామాల అభివృద్ధికి మొదటి మెట్టు అని పేర్కొన్నారు అభివృద్ధి పరిశుభ్రత తాగునీరు విద్య ఆరోగ్యం వంటి అంశాలలో వార్డు సభ్యుల పాత్ర ఎంతో ముఖ్యమని వివరించారు ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడం ప్రతి ప్రజాప్రతినిధి కర్తవ్యమని గ్రామాల్లో పారదర్శకంగా నిబద్ధతతో పని చేయాలని సూచించారు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి కుటుంబానికి చేరవేయాలని గ్రామాల్లో ఏ సమస్య ఉన్నా సమన్వయంతో పరిష్కరించాలని పిలుపునిచ్చారు మూడువిడతలుగా నిర్వహించనున్న ఈ శిక్షణలో గ్రామపాలన విధానం నిధుల వినియోగం అభివృద్ధి పనుల పర్యవేక్షణ గ్రామసభల నిర్వహణ వంటి అంశాలపై పూర్తి అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు3