logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

70వ SGFI క్రీడా పోటీలలో కార్మెల్ పాఠశాల విద్యార్థుల ఘన విజయం 70వ SGFI (School Games Federation of India ) క్రీడా పోటీలలో భాగంగా జనగామ జిల్లా స్థాయిలో నిర్వహించిన అండర్–14, 17 విభాగాల కోకో, కబడ్డీ, వాలీబాల్ క్రీడా పోటీలలో జనగాం జిల్లా పాలకుర్తి మండలం కార్మెల్ ఆశ్రమ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు ఎంపికయ్యారు. జిల్లా స్థాయిలో నిర్వహించిన కోకో, కబడ్డీ, వాలీబాల్ క్రీడా పోటీలలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని, తమ ప్రతిభను చాటుకున్నారు. అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక కావడం పాఠశాలకు, పాలకుర్తి మండలానికి గర్వకారణంగా నిలిచింది. ఈ సందర్భంగా విద్యార్థులకు శిక్షణ అందించిన వ్యాయామ ఉపాధ్యాయులు సీనియర్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనర్ దొంగరి శ్రీనివాస్ మరియు మహంకాళి రాణాప్రతాప్ లను పాఠశాల యాజమాన్యం అభినందించింది. రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థులను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లిస్బెత్ జోష్ అభినందించి, రాష్ట్ర స్థాయి పోటీలలో కూడా అత్యుత్తమ ప్రతిభ కనబరిచి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. విద్యార్థుల క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు పాఠశాల యాజమాన్యం అందిస్తున్న ప్రోత్సాహం, వ్యాయామ ఉపాధ్యాయుల కృషి, విద్యార్థుల పట్టుదల ఫలితంగానే ఈ విజయాన్ని సాధించారని ఆమె పేర్కొన్నారు.

2 hrs ago
user_Shareef pasha
Shareef pasha
Local News Reporter పాలకుర్తి, జనగాం, తెలంగాణ•
2 hrs ago
9a435802-2b42-4949-9b3f-cba79717fd78

70వ SGFI క్రీడా పోటీలలో కార్మెల్ పాఠశాల విద్యార్థుల ఘన విజయం 70వ SGFI (School Games Federation of India ) క్రీడా పోటీలలో భాగంగా జనగామ జిల్లా స్థాయిలో నిర్వహించిన అండర్–14, 17 విభాగాల కోకో, కబడ్డీ, వాలీబాల్ క్రీడా పోటీలలో జనగాం జిల్లా పాలకుర్తి మండలం కార్మెల్ ఆశ్రమ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు ఎంపికయ్యారు. జిల్లా స్థాయిలో నిర్వహించిన కోకో, కబడ్డీ, వాలీబాల్ క్రీడా పోటీలలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని, తమ ప్రతిభను చాటుకున్నారు. అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక కావడం పాఠశాలకు, పాలకుర్తి మండలానికి గర్వకారణంగా నిలిచింది. ఈ సందర్భంగా విద్యార్థులకు శిక్షణ అందించిన వ్యాయామ ఉపాధ్యాయులు సీనియర్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనర్ దొంగరి శ్రీనివాస్ మరియు మహంకాళి రాణాప్రతాప్ లను పాఠశాల యాజమాన్యం అభినందించింది. రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థులను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లిస్బెత్ జోష్ అభినందించి, రాష్ట్ర స్థాయి పోటీలలో కూడా అత్యుత్తమ ప్రతిభ కనబరిచి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. విద్యార్థుల క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు పాఠశాల యాజమాన్యం అందిస్తున్న ప్రోత్సాహం, వ్యాయామ ఉపాధ్యాయుల కృషి, విద్యార్థుల పట్టుదల ఫలితంగానే ఈ విజయాన్ని సాధించారని ఆమె పేర్కొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • తెలంగాణలో హద్దు మీరుతున్న అరాచకత్వం ఏకంగా రక్షక నిలయం ఐనా పోలీస్ స్టేషన్ లోనే రక్షణగా నిలవాల్సిన పోలీస్ ల ముందే దాడులా??? తెలంగాణలో హద్దు మీరుతున్న అరాచకత్వం ఏకంగా రక్షక నిలయం ఐనా పోలీస్ స్టేషన్ లోనే రక్షణగా నిలవాల్సిన పోలీస్ ల ముందే దాడులా??? సిగ్గు సిగ్గు..🤬 సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేటీఆర్ పీఏ మహేందర్ రెడ్డి, పీఆర్వో మహేష్‌ ఉండగా మాస్కులు ధరించి దాడికి యత్నించిన 15 మంది గుండాలు బీఆర్ఎస్ లీగల్ సెల్ లాయర్లు ఎదురు తిరగడంతో పారిపోయిన వైనం
    1
    తెలంగాణలో హద్దు మీరుతున్న అరాచకత్వం

ఏకంగా రక్షక నిలయం ఐనా పోలీస్ స్టేషన్ లోనే 
రక్షణగా నిలవాల్సిన పోలీస్ ల ముందే దాడులా???
తెలంగాణలో హద్దు మీరుతున్న అరాచకత్వం
ఏకంగా రక్షక నిలయం ఐనా పోలీస్ స్టేషన్ లోనే 
రక్షణగా నిలవాల్సిన పోలీస్ ల ముందే దాడులా???
సిగ్గు సిగ్గు..🤬
సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేటీఆర్ పీఏ మహేందర్ రెడ్డి, పీఆర్వో మహేష్‌ ఉండగా మాస్కులు ధరించి దాడికి యత్నించిన 15 మంది  గుండాలు
బీఆర్ఎస్ లీగల్ సెల్ లాయర్లు ఎదురు తిరగడంతో పారిపోయిన వైనం
    user_SIRIPATI ARUNKUMAR
    SIRIPATI ARUNKUMAR
    Local News Reporter బచ్చన్నపేట, జనగాం, తెలంగాణ•
    1 day ago
  • గిర్నిబావి: ఎంజేపీ గురుకుల పాఠశాలలో రెండో రోజు గణపతి పూజ కార్యక్రమం... గిర్నిబావిలోని మహాత్మా జ్యోతిబాపూలే (ఎంజేపీ) గురుకుల పాఠశాలలో వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు గణపతి పూజా కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రత్యేక పూజలు చేసి గణపతి ఆశీస్సులు పొందారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
    1
    గిర్నిబావి: ఎంజేపీ గురుకుల పాఠశాలలో రెండో రోజు గణపతి పూజ కార్యక్రమం...
గిర్నిబావిలోని మహాత్మా జ్యోతిబాపూలే (ఎంజేపీ) గురుకుల పాఠశాలలో వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు గణపతి పూజా కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రత్యేక పూజలు చేసి గణపతి ఆశీస్సులు పొందారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    1 hr ago
  • యాదగిరిగుట్ట గిరిప్రదక్షిణకు భారీగా తరలివచ్చిన భక్తులు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న గిరి ప్రదక్షిణ కార్యక్రమానికి భక్తులు భారీగా తరలివచ్చారు. గిరిప్రదక్షిణ అనంతరం స్వామి వారిని దర్శించుకొని భక్తులు తమ మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
    1
    యాదగిరిగుట్ట గిరిప్రదక్షిణకు భారీగా తరలివచ్చిన భక్తులు
యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న గిరి ప్రదక్షిణ కార్యక్రమానికి భక్తులు భారీగా తరలివచ్చారు. గిరిప్రదక్షిణ అనంతరం స్వామి వారిని దర్శించుకొని భక్తులు తమ
మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
    user_P.srinu
    P.srinu
    యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    3 hrs ago
  • నర్సింహులపేట వైన్ షాప్ ముందు భార్య, భర్తల ఆత్మహత్య యత్నం.. మహబూబాబాద్ జిల్లా నర్సింహుల పేట మండల కేంద్రం లోని మధుర వైన్ షాప్ ముందు బొజ్జన్న పేట గ్రామానికి చెందిన భార్య భర్తలు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్ననికి పాల్పడ్డారు.. బెల్ట్ షాప్ కోసం వైన్ షాప్ నిర్వాహకుల వద్ద నుంచి 40వేల రూపాయల విలువ చేసే మద్యం కొనుగోలు చేశామని పేర్కొన్నారు.. అబ్కారి శాఖ, వైన్ షాప్ వాళ్ళు తమ వద్ద ఉన్న మధ్యాన్ని తీసుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు.. అమ్మిన వల్లే తమ దగ్గర ఉన్న మధ్యాన్ని తీసుకెళ్లడం ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు.. తమ మధ్యాన్ని తమకు ఇప్పించాలని లేనట్టియితే ఆత్మహత్య చేసుకుంటామని వైన్ షాప్ ముందు ఆందోళన చేపట్టారు..
    1
    నర్సింహులపేట వైన్ షాప్ ముందు భార్య, భర్తల ఆత్మహత్య యత్నం..
మహబూబాబాద్ జిల్లా నర్సింహుల పేట మండల కేంద్రం లోని మధుర వైన్ షాప్ ముందు బొజ్జన్న పేట గ్రామానికి చెందిన భార్య భర్తలు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్ననికి పాల్పడ్డారు..
బెల్ట్ షాప్ కోసం వైన్ షాప్ నిర్వాహకుల వద్ద నుంచి 40వేల రూపాయల విలువ చేసే మద్యం కొనుగోలు చేశామని పేర్కొన్నారు..
అబ్కారి శాఖ, వైన్ షాప్ వాళ్ళు తమ వద్ద ఉన్న మధ్యాన్ని తీసుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు..
అమ్మిన వల్లే తమ దగ్గర ఉన్న మధ్యాన్ని తీసుకెళ్లడం ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు..
తమ మధ్యాన్ని తమకు ఇప్పించాలని లేనట్టియితే ఆత్మహత్య చేసుకుంటామని వైన్ షాప్ ముందు ఆందోళన చేపట్టారు..
    user_కిరణ్ చెల్లమల్ల
    కిరణ్ చెల్లమల్ల
    మరిపెడ, మహబూబాబాద్, తెలంగాణ•
    5 hrs ago
  • జిన్నెల వాగు ఉధృతంగా మారే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండాలి చిన్నగూడూర్ ఎమ్మార్వో కిరణ్ కుమార్.. జీన్నెల వాగు వద్ద అప్రమత్తంగా ఉండాలి మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండల కేంద్రం నుంచి గుండంరాజుపల్లి, పగిడిపల్లి, బాబోజీ తండా గ్రామాలకు వెళ్లే మార్గంలోని జీన్నెల వాగు ఉధృతంగా ప్రవహించే అవకాశం ఉన్నందున ప్రజలు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ కిరణ్ కుమార్ సూచించారు. వాగు ప్రవాహం పెరిగిన సమయంలో రాకపోకలు చేయకుండా జాగ్రత్తలు పాటించాలని కోరారు.
    1
    జిన్నెల వాగు ఉధృతంగా మారే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండాలి చిన్నగూడూర్ ఎమ్మార్వో కిరణ్ కుమార్..
జీన్నెల వాగు వద్ద అప్రమత్తంగా ఉండాలి
మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండల కేంద్రం నుంచి గుండంరాజుపల్లి, పగిడిపల్లి, బాబోజీ తండా గ్రామాలకు వెళ్లే మార్గంలోని జీన్నెల వాగు ఉధృతంగా ప్రవహించే అవకాశం ఉన్నందున ప్రజలు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ కిరణ్ కుమార్ సూచించారు. వాగు ప్రవాహం పెరిగిన సమయంలో రాకపోకలు చేయకుండా జాగ్రత్తలు పాటించాలని కోరారు.
    user_Sanjay kumar
    Sanjay kumar
    Local News Reporter చిన్నగూడూర్, మహబూబాబాద్, తెలంగాణ•
    23 hrs ago
  • ఖాళీ, బిందెలు, బకెట్లు, డ్రమ్ములతో సిపిఎం ఆధ్వర్యంలో పట్టణ ప్రజలు, మహిళలు భారీ ఆందోళన *మంచినీటి సమస్యను తీర్చాలని ఖాళీ, బిందెలు, బకెట్లు, డ్రమ్ములతో సిపిఎం ఆధ్వర్యంలో పట్టణ ప్రజలు, మహిళలు భారీ ఆందోళన* *గార్ల: గార్ల పట్టణం లో గత రెండు వారాలకు పైగా మంచినీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నామని అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడంలేదని స్థానిక తాసిల్దార్ కార్యాలయం వెళ్లే రోడ్డు జంక్షన్ లో సిపిఎం ఆధ్వర్యంలో పట్టణ ప్రజలు, మహిళలు, భారీ ఎత్తున ఖాళీ బాకీట్లు,డ్రమ్ములు, బిందెలను ప్రదర్శిస్తూ భారీ ఆందోళన చేపట్టారు*ఈ ఆందోళనకు ఐద్వా,డివైఎఫ్ఐ, సిఐటియు తదితర ప్రజాసంఘాల నాయకులు మద్దతు తెలిపి ఆందోళనలో పాల్గొన్నారు* *త్రాగునీరు లేక పట్టణ ప్రజలు అల్లాడుతుంటే అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు* *వెంటనే త్రాగునీటి సమస్యలు పరిష్కరించాలని లేనిపక్షంలో దశలవారీగా ఆందోళన చేపడుతామని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందునూరి శ్రీనివాస్ హెచ్చరించారు*. *ఈ ఆందోళనకు ప్రజలు, మహిళలు భారీగా తరలి రావడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది*✊✊
    1
    ఖాళీ, బిందెలు, బకెట్లు, డ్రమ్ములతో సిపిఎం ఆధ్వర్యంలో పట్టణ ప్రజలు, మహిళలు భారీ ఆందోళన
*మంచినీటి సమస్యను తీర్చాలని ఖాళీ, బిందెలు, బకెట్లు, డ్రమ్ములతో సిపిఎం ఆధ్వర్యంలో పట్టణ ప్రజలు, మహిళలు భారీ ఆందోళన*
*గార్ల: గార్ల పట్టణం లో గత రెండు వారాలకు పైగా మంచినీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నామని అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడంలేదని స్థానిక తాసిల్దార్ కార్యాలయం వెళ్లే రోడ్డు జంక్షన్ లో సిపిఎం ఆధ్వర్యంలో పట్టణ ప్రజలు, మహిళలు, భారీ ఎత్తున ఖాళీ బాకీట్లు,డ్రమ్ములు, బిందెలను ప్రదర్శిస్తూ భారీ ఆందోళన చేపట్టారు*ఈ ఆందోళనకు ఐద్వా,డివైఎఫ్ఐ, సిఐటియు తదితర ప్రజాసంఘాల నాయకులు మద్దతు తెలిపి ఆందోళనలో పాల్గొన్నారు* *త్రాగునీరు లేక పట్టణ ప్రజలు అల్లాడుతుంటే అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు* *వెంటనే త్రాగునీటి సమస్యలు పరిష్కరించాలని లేనిపక్షంలో దశలవారీగా ఆందోళన చేపడుతామని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందునూరి శ్రీనివాస్ హెచ్చరించారు*. *ఈ ఆందోళనకు ప్రజలు, మహిళలు భారీగా తరలి రావడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది*✊✊
    user_గొల్లపల్లి సురేష్
    గొల్లపల్లి సురేష్
    మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    25 min ago
  • భూ వివాదం లో ఎస్ ఐ తలదూర్చారంటు దంతాల పల్లి పోలీస్ స్టేషన్ ముందు ఓ కుటుంబం ధర్నా.. మహబూబాబాద్ జిల్లా దంతాల పల్లి పోలీస్ స్టేషన్ ముందు తూర్పు తండా కు చెందిన రూప్ సింగ్ అనే వ్యక్తి కి చెందిన కుటుంబం ధర్నా దిగింది.. దంతాల పల్లి ఎస్ ఐ రవి కుమార్ మా భూమి విషయం లో కలుగ చేసుకొని ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఆరోపించారు.. మాకు న్యాయం చేయాలనీ లేనట్టాయితే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటానని ఆవేదన వ్యక్తం చేశారు.. ఉన్నత అధికారులు స్పందించి న్యాయం చేయాలనీ బాధిత కుటుంబం వేడుకుంటుంది..
    1
    భూ వివాదం లో ఎస్ ఐ తలదూర్చారంటు దంతాల పల్లి పోలీస్ స్టేషన్ ముందు ఓ కుటుంబం ధర్నా..
మహబూబాబాద్ జిల్లా దంతాల పల్లి పోలీస్ స్టేషన్ ముందు తూర్పు తండా కు చెందిన రూప్ సింగ్ అనే వ్యక్తి కి చెందిన కుటుంబం ధర్నా దిగింది..
దంతాల పల్లి ఎస్ ఐ రవి కుమార్ మా భూమి విషయం లో కలుగ చేసుకొని ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఆరోపించారు..
మాకు న్యాయం చేయాలనీ లేనట్టాయితే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటానని ఆవేదన వ్యక్తం చేశారు.. ఉన్నత అధికారులు స్పందించి న్యాయం చేయాలనీ బాధిత కుటుంబం వేడుకుంటుంది..
    user_కిరణ్ చెల్లమల్ల
    కిరణ్ చెల్లమల్ల
    మరిపెడ, మహబూబాబాద్, తెలంగాణ•
    6 hrs ago
  • యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి సోమవారం ఆదాయ వివరాలు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన నిత్య ఖజానాకు సమకూరిన ఆదాయ వివరాలు ఆలయ ఈవో భవాని శంకర్ వెల్లడించారు. సోమవారం సుమారు 25 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. 1140 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. అలాగే VIP దర్శనాలు రూ.2.68 లక్షలు, ప్రసాదలతో రూ.9.11 లక్షలు, కార్ పార్కింగ్ రూ.3.50 లక్షలు, బ్రేక్ దర్శనాలతో రూ.1.13 లక్షలు, తదితరులు భాగాల నుంచి మొత్తం కలిపి రూ.21,30,621 ఆదాయం వచ్చింది.
    1
    యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి సోమవారం ఆదాయ వివరాలు 
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన నిత్య ఖజానాకు సమకూరిన ఆదాయ వివరాలు ఆలయ ఈవో భవాని శంకర్ వెల్లడించారు. సోమవారం సుమారు 25 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. 1140 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. అలాగే VIP దర్శనాలు రూ.2.68 లక్షలు, ప్రసాదలతో రూ.9.11 లక్షలు, కార్ పార్కింగ్ రూ.3.50 లక్షలు, బ్రేక్ దర్శనాలతో రూ.1.13 లక్షలు, తదితరులు భాగాల నుంచి మొత్తం కలిపి రూ.21,30,621 ఆదాయం వచ్చింది.
    user_P.srinu
    P.srinu
    యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    23 hrs ago
  • మతోన్మాదవాదులు సాయుధ పోరాటాన్ని వక్రీకరిస్తున్నారు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం నిజాం నిరంకుశ పాలనకు, భూస్వామ్య దోపిడీకి, వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా భూమి, భుక్తి, విముక్తి కోసం కుల, మతాలకు అతీతంగా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం సాగిందని కానీ కొంత మంది మతోన్మాదులు చరిత్రను వక్రీకరిస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం విమర్శించారు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని హిందూ–ముస్లిం పోరాటంగా చిత్రీకరిస్తూ చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలను ఆయన తీవ్రంగా ఖండించారు. మంగళ వారం నాడు సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలలో భాగంగా గుండ్ల గూడెం, పటేల్ గూడెం, శ్రీనివాస పురం గ్రామంలో నాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం లో పాల్గొన్న ఎసి రెడ్డి నరసింహ రెడ్డి, బొమ్మ కంటి లక్ష్మి నర్సయ్య, గ్యార బాలయ్య, ఏంటిక రాములు , గ్యార సిద్దయ్య తదితరుల స్థూ పాలకు. పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడమైనది. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో నిర్వహించిన సభలకు ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం మాట్లాడుతూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో గానీ, దేశ స్వాతంత్ర్య పోరాటంలో గానీ పాల్గొనని వారు నేడు దేశభక్తి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. బ్రిటిష్ పాలకులకు లొంగిపోయి వారి అనుకూలంగా వ్యవహరించిన శక్తులు నేడు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని హిందూ–ముస్లిం పోరాటంగా వక్రీకరించడం ద్వారా ప్రజల మధ్య మత విభజనలను సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నాయని విమర్శించారు. నిజాం ముస్లిం పాలకుడైనప్పటికీ తెలంగాణలోని అనేక మంది భూస్వాములు, జమీందార్లు, జాగీర్దార్లు హిందువులే ఉన్నారని, దోపిడీకి మతం లేదని అన్నారు. పేద రైతులు, కూలీలు, మహిళలు, అణగారిన వర్గాలు కుల, మత భేదాలను అధిగమించి సాగించిన ఈ పోరాటంలో వేలాది మంది అమరులయ్యారని గుర్తు చేశారు. అమరవీరుల త్యాగాలను ఓట్ల కోసం వక్రీకరించడం, ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడం మానుకోవాలని, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం వాస్తవ చరిత్రను ప్రజలకు తెలియజేస్తూ వారి ఆశయాల సాధన కోసం కమ్యూనిస్టు పార్టీ నిరంతరం పోరాడుతుందని మల్లేశం స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు.M.A ఇక్బాల్, మండల కార్యదర్శి దూపటి వెంకటేష్, మండల కార్యదర్శి వర్గ సభ్యులు సూదగాని సత్య రాజయ్య, జూకంటి పౌల్, మిట్ట శంకరయ్య, నల్ల మాస తుల శయ్య, పిక్క గణేష్ మోరీ గాడి రమేశ్, సంగీ రాజు, బొమ్మకంటి లక్ష్మి నారాయణ,గణ గాని మల్లేష్, చౌడ బోయిన యాదగిరి, వడ్డే మాను బాలరాజు, పారుపల్లి సత్తయ్య, గ్యార భాస్కర్ మడిపల్లి ఆంజనేయులు, చెక్కిళ్ళ ఉపేంద్ర, మిట్ట పార్వతమ్మ, దూసరి మల్లమ్మ, ఈదు నూరి కిష్టయ్య, సోమక్క, గ్యార అండాలు ,మిట్ట బిక్షపతి, చెక్కిళ్ళ గౌరమ్మ, ఎల్లమ్మ, అంజమ్మ, నీలమ్మ తదితరులు పాల్గొన్నారు
    1
    మతోన్మాదవాదులు సాయుధ పోరాటాన్ని వక్రీకరిస్తున్నారు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం
నిజాం నిరంకుశ పాలనకు, భూస్వామ్య దోపిడీకి, వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా భూమి, భుక్తి, విముక్తి కోసం కుల, మతాలకు అతీతంగా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం సాగిందని కానీ కొంత మంది మతోన్మాదులు చరిత్రను వక్రీకరిస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం విమర్శించారు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని హిందూ–ముస్లిం పోరాటంగా చిత్రీకరిస్తూ చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలను ఆయన తీవ్రంగా ఖండించారు.
మంగళ వారం నాడు సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలలో భాగంగా గుండ్ల గూడెం, పటేల్ గూడెం, శ్రీనివాస పురం గ్రామంలో నాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం లో పాల్గొన్న ఎసి రెడ్డి  నరసింహ రెడ్డి, బొమ్మ కంటి లక్ష్మి నర్సయ్య, గ్యార బాలయ్య, ఏంటిక రాములు , గ్యార సిద్దయ్య తదితరుల స్థూ పాలకు. పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడమైనది. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో నిర్వహించిన సభలకు ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం మాట్లాడుతూ 
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో గానీ, దేశ స్వాతంత్ర్య పోరాటంలో గానీ పాల్గొనని వారు నేడు దేశభక్తి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. బ్రిటిష్ పాలకులకు లొంగిపోయి వారి అనుకూలంగా వ్యవహరించిన శక్తులు నేడు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని హిందూ–ముస్లిం పోరాటంగా వక్రీకరించడం ద్వారా ప్రజల మధ్య మత విభజనలను సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నాయని విమర్శించారు. నిజాం ముస్లిం పాలకుడైనప్పటికీ తెలంగాణలోని అనేక మంది భూస్వాములు, జమీందార్లు, జాగీర్దార్లు హిందువులే ఉన్నారని, దోపిడీకి మతం లేదని అన్నారు. పేద రైతులు, కూలీలు, మహిళలు, అణగారిన వర్గాలు కుల, మత భేదాలను అధిగమించి సాగించిన ఈ పోరాటంలో వేలాది మంది అమరులయ్యారని గుర్తు చేశారు. అమరవీరుల త్యాగాలను ఓట్ల కోసం వక్రీకరించడం, ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడం మానుకోవాలని, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం వాస్తవ చరిత్రను ప్రజలకు తెలియజేస్తూ వారి ఆశయాల సాధన కోసం కమ్యూనిస్టు పార్టీ నిరంతరం పోరాడుతుందని మల్లేశం స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు.M.A ఇక్బాల్, మండల కార్యదర్శి దూపటి వెంకటేష్, మండల కార్యదర్శి వర్గ సభ్యులు సూదగాని సత్య రాజయ్య, జూకంటి పౌల్, మిట్ట శంకరయ్య, నల్ల మాస తుల శయ్య, పిక్క గణేష్ మోరీ గాడి రమేశ్, సంగీ రాజు, బొమ్మకంటి లక్ష్మి నారాయణ,గణ గాని మల్లేష్, చౌడ బోయిన యాదగిరి, వడ్డే మాను  బాలరాజు, పారుపల్లి సత్తయ్య, గ్యార భాస్కర్ మడిపల్లి ఆంజనేయులు, చెక్కిళ్ళ ఉపేంద్ర, మిట్ట పార్వతమ్మ, దూసరి మల్లమ్మ, ఈదు నూరి కిష్టయ్య, సోమక్క, గ్యార  అండాలు ,మిట్ట బిక్షపతి, చెక్కిళ్ళ గౌరమ్మ, ఎల్లమ్మ, అంజమ్మ, నీలమ్మ తదితరులు పాల్గొన్నారు
    user_గడ్డమీది చంద్రయ్య
    గడ్డమీది చంద్రయ్య
    Bhongir, Yadadri Bhuvanagiri•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.