logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించిన మారిషస్ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోగుల్. మారిషస్ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోగుల్ మంగళవారం సాయంత్రం తిరుచానూరులోని పద్మావతి అమ్మవారిని దర్శించారు. ఆలయానికి చేరుకున్న అధ్యక్షుడిని టిటిడి జేఈవో వి. వీరబ్రహ్మం స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి దర్శనం అనంతరం జేఈవో చేతుల మీదుగా తీర్థ ప్రసాదాలు అందజేయబడ్డాయి.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, సివిఎస్వో కె.వి. మురళీకృష్ణతో పాటు పలువురు టిటిడి అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.

1 day ago
user_ప్రజాపతి న్యూస్
ప్రజాపతి న్యూస్
Local News Reporter Tirupati (Rural), Andhra Pradesh•
1 day ago

తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించిన మారిషస్ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోగుల్. మారిషస్ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోగుల్ మంగళవారం సాయంత్రం తిరుచానూరులోని పద్మావతి అమ్మవారిని దర్శించారు. ఆలయానికి చేరుకున్న అధ్యక్షుడిని టిటిడి జేఈవో వి. వీరబ్రహ్మం స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి దర్శనం అనంతరం జేఈవో చేతుల మీదుగా తీర్థ ప్రసాదాలు అందజేయబడ్డాయి.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, సివిఎస్వో కె.వి. మురళీకృష్ణతో పాటు పలువురు టిటిడి అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.

More news from Palnadu and nearby areas
  • *తప్పులుంటే ఆందోళన అవసరం లేదు: ఎమ్మెల్యే చదలవాడ* *నరసరావుపేట మండలం ఇక్కురు గ్రామంలో రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాసు పుస్తకాలను ఎమ్మెల్యే డా. చదలవాడ అరవిందబాబు రైతులకు పంపిణీ చేశారు. పాసు పుస్తకాలలో ఏవైనా తప్పులు ఉంటే సరిచేసుకునేందుకు మరో అవకాశం కల్పిస్తామని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. భూమిపై రైతులకు సంపూర్ణ హక్కులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ వేణుగోపాలరావు తదితరులు పాల్గొన్నారు.*
    1
    *తప్పులుంటే ఆందోళన అవసరం లేదు: ఎమ్మెల్యే చదలవాడ*
*నరసరావుపేట మండలం ఇక్కురు గ్రామంలో రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాసు పుస్తకాలను ఎమ్మెల్యే డా. చదలవాడ అరవిందబాబు రైతులకు పంపిణీ చేశారు. పాసు పుస్తకాలలో ఏవైనా తప్పులు ఉంటే సరిచేసుకునేందుకు మరో అవకాశం కల్పిస్తామని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. భూమిపై రైతులకు సంపూర్ణ హక్కులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ వేణుగోపాలరావు తదితరులు పాల్గొన్నారు.*
    user_ఉంగరాల కార్తీక్
    ఉంగరాల కార్తీక్
    Journalist Rajupalem, Palnadu•
    16 hrs ago
  • గుంటూరు జిల్లా/గుంటూరు నగరం గుంటూరు కలెక్టర్ కార్యాలయం మెయిన్ రోడ్డు వద్ద మొక్కలు నాటే కార్యక్రమాన్ని అధికారులు గురువారం చేపట్టారు. పర్యావరణ పరిరక్షణగా, స్వచ్ఛమైన గాలి కోసం భవిష్యత్ తరాలకు మంచి భవిష్యత్తును అందించడానికి చెట్లను నాటడాన్ని అవసరమని తెలిపారు. ప్రతి పౌరుడు విధిగా మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకుందామని అన్నారు.
    1
    గుంటూరు జిల్లా/గుంటూరు నగరం 
గుంటూరు కలెక్టర్ కార్యాలయం మెయిన్ రోడ్డు వద్ద మొక్కలు నాటే కార్యక్రమాన్ని అధికారులు గురువారం చేపట్టారు. పర్యావరణ పరిరక్షణగా, స్వచ్ఛమైన గాలి కోసం భవిష్యత్ తరాలకు మంచి భవిష్యత్తును అందించడానికి చెట్లను నాటడాన్ని అవసరమని తెలిపారు. ప్రతి పౌరుడు విధిగా మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకుందామని అన్నారు.
    user_SIVA
    SIVA
    Journalist గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • లేచింది నిద్ర లేచింది మహిళా లోకం... భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని భార్య కత్తితో దాడికి యత్నం భర్త దుకాణం వద్దకు అకస్మాత్తుగా కత్తితో వచ్చి తనకు రావాల్సిన ఆస్తితో పాటు పిల్లలను తనకు ఇవ్వాలని హల్చల్ భార్య నుండి తప్పించుకునేందుకు తన జ్యువెలరీ షాపులో దాక్కొని.. డయల్ 100కి ఫోన్ చేసిన భర్త... వరంగల్ చౌరస్తాలో చోటు చేసుకున్న ఘటన...
    1
    లేచింది నిద్ర లేచింది మహిళా లోకం...
భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని భార్య కత్తితో దాడికి యత్నం
భర్త దుకాణం వద్దకు అకస్మాత్తుగా కత్తితో వచ్చి తనకు రావాల్సిన ఆస్తితో పాటు పిల్లలను తనకు ఇవ్వాలని హల్చల్
భార్య నుండి తప్పించుకునేందుకు తన జ్యువెలరీ షాపులో దాక్కొని.. డయల్ 100కి ఫోన్ చేసిన భర్త...
వరంగల్ చౌరస్తాలో చోటు చేసుకున్న ఘటన...
    user_Journalist Prem
    Journalist Prem
    Journalist Nalgonda, Telangana•
    1 hr ago
  • గోపాలపురం జాతీయ రహదారిపై గురువారం ఉదయం లారీ తిరగబడిన ఘటనలో డ్రైవర్ కి తీవ్రగాయాలయ్యాయి. మధ్యప్రదేశ్ నుంచి కొవ్వూరు వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా కొట్టింది. స్థానికులు వెంటనే అతన్ని 108 వాహనంలో గోపాలపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు, అక్కడ చికిత్స పొందుతున్నారు. హైవే పోలీసులు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టారు.
    1
    గోపాలపురం జాతీయ రహదారిపై గురువారం ఉదయం లారీ తిరగబడిన ఘటనలో డ్రైవర్ కి తీవ్రగాయాలయ్యాయి.   మధ్యప్రదేశ్ నుంచి కొవ్వూరు వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా కొట్టింది.  స్థానికులు వెంటనే అతన్ని 108 వాహనంలో గోపాలపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు, అక్కడ చికిత్స పొందుతున్నారు. హైవే పోలీసులు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టారు.
    user_Alluri DurgaPrasad
    Alluri DurgaPrasad
    Journalist నల్లజర్ల, తూర్పు గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • యాదాద్రి జిల్లాలో బిజెపి రాష్ట్ర నాయకుల పర్యటన.. మున్సిపల్ ఎన్నికల్లో పొత్తులు ఉండవు..
    1
    యాదాద్రి జిల్లాలో బిజెపి రాష్ట్ర నాయకుల పర్యటన.. మున్సిపల్ ఎన్నికల్లో పొత్తులు ఉండవు..
    user_కిరణ్ కుమార్ గౌడ్
    కిరణ్ కుమార్ గౌడ్
    Yoga instructor భువనగిరి, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    5 hrs ago
  • భారత్ మాత కి జై 🇮🇳 జై హొ సనాతన ధర్మం 🚩🏹
    2
    భారత్ మాత కి జై 🇮🇳 
జై హొ సనాతన ధర్మం 🚩🏹
    user_Shyam sunder Yadav Pulapally
    Shyam sunder Yadav Pulapally
    Malkajgiri, Medchal Malkajgiri•
    16 hrs ago
  • *ఏపీలోని గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్..ఇద్దరు విద్యార్థినులకు అస్వస్థత.* *పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని సాంఘిక సంక్షేమ వసతి గృహంలో ఉంటూ, కాలేజీకి వెళ్లి సొమ్మసిల్లి పడిపోయిన ఇద్దరు విద్యార్థినులు.* *అస్వస్థతకు గురైన విద్యార్థినులను ఏరియా ఆసుపత్రికి తరలించిన పాఠశాల సిబ్బంది.*
    1
    *ఏపీలోని గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్..ఇద్దరు విద్యార్థినులకు అస్వస్థత.*
*పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని సాంఘిక సంక్షేమ వసతి గృహంలో ఉంటూ, కాలేజీకి వెళ్లి సొమ్మసిల్లి పడిపోయిన ఇద్దరు విద్యార్థినులు.*
*అస్వస్థతకు గురైన విద్యార్థినులను ఏరియా ఆసుపత్రికి తరలించిన పాఠశాల సిబ్బంది.*
    user_ఉంగరాల కార్తీక్
    ఉంగరాల కార్తీక్
    Journalist Rajupalem, Palnadu•
    16 hrs ago
  • మన ఊరి బడిని రక్షించుకుందాం" అనే నినాదంతో ఈ నెల 10, 11 తేదీల్లో గుంటూరు ఏసీ కళాశాలలో యూటీఎఫ్ (UTF) 51వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు జరగనున్నాయి. సుమారు 3 వేల మంది ఉపాధ్యాయులు హాజరయ్యే ఈ సదస్సు వివరాలను సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణే లక్ష్యంగా ఈ చర్చలు సాగనున్నాయి.
    1
    మన ఊరి బడిని రక్షించుకుందాం" అనే నినాదంతో ఈ నెల 10, 11 తేదీల్లో గుంటూరు ఏసీ కళాశాలలో యూటీఎఫ్ (UTF) 51వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు జరగనున్నాయి. సుమారు 3 వేల మంది ఉపాధ్యాయులు హాజరయ్యే ఈ సదస్సు వివరాలను సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణే లక్ష్యంగా ఈ చర్చలు సాగనున్నాయి.
    user_SIVA
    SIVA
    Journalist గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖమ్మం పర్యటనకు వెళ్తున్న నేపథ్యంలో నకిరేకల్ మీదుగా వెళుతుండగా మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సారథంలో టిఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున కేటీఆర్ కు ఘన స్వాగతం పలికారు.
    1
    టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖమ్మం పర్యటనకు వెళ్తున్న నేపథ్యంలో నకిరేకల్ మీదుగా వెళుతుండగా మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సారథంలో టిఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున కేటీఆర్ కు ఘన స్వాగతం పలికారు.
    user_Journalist Prem
    Journalist Prem
    Journalist Nalgonda, Telangana•
    16 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.