మిరప నారు పెంపకం పెదకూరపాడు రైతులకు అవగాహన సదస్సు . పెదకూరపాడు మండలం, 75 తాళ్లూరు రైతు సేవా కేంద్రంలో సమగ్ర ఉద్యాన అభివృద్ధి మిషన్ పథకంలో లో భాగంగా మిరప నారు పెంపకంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పి.ఎం. డి.యస్. పద్ధతుల గురించి శిక్షణా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా పల్నాడు జిల్లా డాట్ సెంటర్ కోఆర్డినేటర్ సీనియర్ శాస్త్రవేత్త అయిన డాక్టర్ నగేష్ జిల్లా ఉద్యాన అధికారి వెంకట్రావు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా శాస్త్రవేత్త నగేష్ మాట్లాడుతూ నర్సరీ యజమానులకు మిరప రైతులకు మిర్చి నారు పెంపకంలో తీసుకోవాల్సిన మేలైన యాజమాన్య పద్ధతుల గురించి పి.ఎం. డి. యస్. పద్ధతి వల్ల కలిగే ప్రయోజనాల గురించి వివరించారు. మిరపలో విత్తన శుద్ధి కొరకు సెంటు నారుమడికి 1.5 కిలోల భాస్వరం,కిలో వేప పిండి, 80 గ్రాముల పిప్రోనిల్ ఉపయోగించాలని సూచించారు. వైరస్ తెగులు నివారణకు ట్రైసోడియం ఆర్థో పాస్పేట్ ద్రావణంలో విత్తనాలను నానబెట్టి వాడాలన్నారు. రసం పీల్చే పురుగుల నివారణకు పిప్రోనిల్ లేదా స్పైనోసాడ్ పురుగు మందులను 0.3 గ్రాములు ఒక లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారి చేయాలన్నారు. జిల్లా ఉద్యాన అధికారి ఐ. వెంకట్రావు మాట్లాడుతూ నర్సరీ చట్టం 2010 గురించి నర్సరీ యజమానులకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్క నర్సరీ లైసెన్స్ కలిగి ఉండాలని లైసెన్స్ లేని నర్సరీలు వెంటనే లైసెన్స్ కొరకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. నర్సరీ యజమానులు ఏడు రకాల రిజిస్టర్లు కలిగి ఉండాలని తెలియజేశారు. నర్సరీ చట్టాన్ని అతిక్రమించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మిరప పంటకు ఆగస్టు 15వ తారీకు లోపు ఇన్సూరెన్స్ చేసుకోవాల్సిందిగా తెలియజేశారు. మిరప పంటకు ఒక ఎకరాకు 360 రూపాయలు ప్రీమియంగా చెల్లించవలసినదిగా సూచించారు. ఉద్యాన అధికారి ఎన్ సురేష్ మాట్లాడుతూ ఉద్యాన శాఖలో అమలవుతున్న వివిధ రకాలైన పథకాల గురించి అలాగే ఈ పంట నమోదు గురించి వివరించడం జరిగింది. అంతేకాకుండా ప్రధాన పంట నాటే లోపు పి.ఎం.డి. యస్. పద్ధతిలో 30 రకాల విత్తనాలు పొలంలో చల్లుకొని 45 రోజుల తర్వాత దుక్కిలో కలియ దున్నుకోవలసిందిగా తెలియపరిచారు. డ్రిప్ ఎంఐడిసి అరవింద్ మాట్లాడుతూ ప్రస్తుతం డ్రిప్పులో అమలవుతున్నటువంటి సబ్సిడీ వివరాలు రైతులకు తెలియపరిచారు. 75 తాళ్లూరు, పరస కాశిపాడు గ్రామాలలో ఉన్న నర్సరీలను పరిశీలించి నర్సరీ యజమానులకు మరియు రైతులకు నాణ్యమైన నారు పెంచుటకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన అధికారి వెంకట్రావు డాట్ సెంటర్ ప్రధాన శాస్త్రవేత్త కోఆర్డినేటర్ డాక్టర్ ఎం.నగేష్ ఉద్యాన అధికారి యన్. సురేష్ డ్రిప్ ఎంఐడిసి అరవింద్ గ్రామ ఉద్యాన సహాయకులు కె.పవన్ కుమార్ షేక్ బాజీ యన్.సాయి సుచరిత యమ్.రమేష్ బాబు డెలిజెంట్ ఇండస్ట్రీస్ ఆయిల్ ఫార్మ్ ఫీల్డ్ ఆఫీసర్ నర్సరీ యజమానులు మిరప రైతులు పాల్గొన్నారు.

- *స్కూల్ బస్ లో పిల్లలకు తృటిలో తప్పిన పెను ప్రమాదం* ఒక్కసారిగా బస్సు ఇంజన్లో నుంచి పొగలు రావడంతో స్కూల్ పిల్లలందరినీ కూడా సడన్గా బస్సులో నుంచి దింపేసిన పరిస్థితి నెలకొంది పిల్లలకు ఎటువంటి ప్రమాదం జరగకుండా బస్సులో నుంచి దింపిన ఆయా *ఎన్టీఆర్ జిల్లా.* *ఇబ్రహీంపట్నం ఫెర్రీ రోడ్డు* కాలం చెల్లిన బస్సులను మెయింటినెన్స్ చేస్తున్న స్కూల్ పై చర్యలు తీసుకోవాలని కోరుతున్న స్థానికులు1
- ఎంబిబిఎస్ అడ్మిన్షన్స్ లో జీవో నంబర్ 102 నష్టాదాయకం - డా || ఆలా వెంకటేశ్వర్లు అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ మెడికో పేరెంట్స్ అసోసియేషన్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జులై 30వ తేదీన విడుదల చేసిన జీవో నెం 102, 2026 నీట్ పరీక్షలో ర్యాంకులు సాధించిన ఎంబిబిఎస్ విద్యార్థులు ఆల్ ఆప్షన్స్ పెట్టుకోవడం కంపల్సరీ చేయకపోవడం వలన విద్యార్థులు నష్టపోతారని గతంలో ఉన్న 151 జీవో ను అమలుపరిచాలని కోరారు. ఈ నెల 1వ తేదీన గుంటూరు లోని జన చైతన్య వేదిక హాలులో జరిగిన మీడియా సమావేశంలో డా || ఆలా వెంకటేశ్వర్లు ప్రసంగిస్తూ 102 జివో ను అమలు చేస్తే విద్యార్థులు ఆల్ ఆప్షన్స్ కంపల్సరిగా పెట్టుకునే అవకాశాన్ని కోల్పోతున్నారని తత్ఫలితంగా రిజర్వేషన్లు పొందిన విద్యార్థులు ఓపెన్ క్యాటగిరిలో సీటు వచ్చే అవకాశాన్ని వినియోగించుకోవడాన్ని కోల్పోయి రిజర్వేషన్ కేటగిరీలో సీటు పొందితే తత్ఫలితంగా రిజర్వేషన్ కేటగిరి విద్యార్థులు వారి వారి సీట్లను కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. కనుక 102 జీవోను రద్దు చేసి గతంలో మెడికల్ విద్యార్థులందరికీ ఆమోదయోగ్యంగా ఉన్న 151 జీవోను కొనసాగించాలని కోరారు. ఈ మేరకు విజ్ఞప్తి చేస్తూ రాష్ట్రమెడికల్ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్ లర్ కు విజ్ఞప్తిని అందించినామని తెలిపారు. గతంలో మెడికల్ అడ్మిషన్స్ లో ఉన్న లోపాలను సవరించడానికి హైకోర్టు 2019లో ఇచ్చిన ఉత్తర్వులు ఆధారంగా ఆరుగురు నిపుణులతో కమిటీ వేశారని, వారి నివేదిక ఆధారంగా 151 జీవో అమల్లోకి వచ్చి ఎలాంటి సమస్యలు లేకుండా కొనసాగుతుండగా నేడు 102 జీవోను అమలు చేస్తే అనేక సమస్యలు ఉత్పన్నమౌతాయని, రిజర్వేషన్ కేటగిరి విద్యార్థులు నష్టపోతారన్నారు. విద్యార్థులు అందరూ అన్ని ఆప్షన్లను పెట్టుకోవడం కంపల్సరీ చేయాలని కోరారు. 2వ, 3వ కౌన్సిల్ ఆప్షన్స్ మార్చుకునే అవకాశం కల్పించాలన్నారు.1
- భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం వేడుకలలో భాగంగా చరిత్ర సృష్టించిన మన గిరిజన ఆడబిడ్డలు గర్వపడేలా చేసిన మన సంస్కృతి !! భోగాపురంలో 13 వేల మంది గిరిజన బాలికలు ఒకే వేదికపై అద్భుతంగా ప్రదర్శించిన థింసా నృత్యం గిన్నిస్ ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది. ఇది కేవలం ఒక రికార్డు కాదు మన గిరిజన సంప్రదాయాలకు ప్రపంచం ఇచ్చిన గౌరవం. గిన్నిస్ సంస్థ ప్రతినిధుల నుంచి ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి @GSandhyarani_ గారు అందుకోవడం, అనంతరం బాలికలతో కలిసి థింసా నృత్యంలో పాల్గొనడం ప్రతి గిరిజన కుటుంబానికి గర్వకారణం. మన మూలాలను, మన సంస్కృతిని ప్రపంచ వేదికపై నిలబెట్టిన ప్రతి గిరిజన బాలికకు హృదయపూర్వక అభినందనలు. మీ అడుగుల తాళానికి ప్రపంచం చప్పట్లు కొట్టింది .1
- బాలకృష్ణకు ఫోన్ చేసిన అభిమాని.నల్లమల రంజిత్ .VIDEO.... ఖమ్మం :ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణతో ఖమ్మం పట్టణానికి చెందిన అభిమాని నల్లమల రంజిత్ ఫోన్లో మాట్లాడారు. ఇటీవల జరిగిన ప్రమాద సంఘటన తనతో పాటు అభిమానులను కలచివేసిందని రంజిత్ బాలయ్యకు వివరించారు. దీనికి స్పందించిన బాలకృష్ణ ప్రస్తుతం ఆరోగ్యం మెరుగ్గా ఉందని, వైద్యుల సూచన మేరకు మరో 3 వారాలు విశ్రాంతి తీసుకుంటున్నానని చెప్పారు. త్వరగా కోలుకోవాలని దేవుడికి పూజ చేయించినట్లు రంజిత్ చెప్పగానే బాలయ్య ధన్యవాదాలు తెలిపారు.2
- ముదిగొండ లో రోడ్డు విస్తరణ పనులను గ్రామస్థులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లా ముదిగొండ లో రోడ్డు విస్తరణ పనులను గ్రామస్థులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ముదిగొండ నుంచి జాతీయ రహదారి వరకు రోడ్డు విస్తరణ పనులను అధికారులు ప్రారంభించడంతో గ్రామస్థులు అడ్డుకున్నారు.ఎన్నో ఏళ్లుగా తాము నివాసం ఉంటున్న ఇళ్ళ ను కోల్పోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.అనంతరం పనులు జరుగుతున్న రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు, రెవిన్యూ అధికారులు అక్కడికి చేరుకుని ఆందోళన కారులతో మాట్లాడి వారికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.1
- 13.500 మంది గిరిజన విద్యార్థులచే ధీంసా నృత్యం తో ప్రధాని మోడీకు స్వాగతం పలికిన గిరిజనులు సెంటర్ : విశాఖ శీర్షిక: థింసా నృత్యంతో ప్రధాని మోదీకి అపూర్వ స్వాగతం • 13,500 మంది గిరిజనుల నృత్య ప్రదర్శనతో భోగాపురం మార్మోగింది యాంకర్ : భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారం భోత్సవానికి విచ్చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి గిరిజన విద్యార్థినులు, మహిళలు సంప్రదాయ థింసా నృత్యంతో ఘన స్వాగతం పలికా రు. వేలాది మంది ఒకేసారి లయబద్ధంగా చేసిన థింసా నృత్యం వేడుకకు ప్రత్యేక ఆకర్షణ గా నిలిచి అందరినీ మంత్ర ముగ్ధులను చేసింది. దాదాపు 13,500 మంది గిరిజన విద్యార్థినులు , మహిళలు సంప్రదాయ గులాబీ రంగు చీరలు, ఆకుపచ్చ అంచులతో కూడిన వస్త్ర ధారణలో ఒకే తీరుగా అడుగులు వేస్తూ థింసా నృత్యాన్ని ప్రదర్శించారు. విమానాశ్రయ టెర్మిన ల్ నుంచి బహిరంగ సభా వేదిక వరకు ఉన్న మార్గమంతా గిరిజన సంస్కృతి, సంప్రదాయ కళా వైభవాన్ని ప్రతిబింబించేలా నృత్య ప్రదర్శన సాగింది. ప్రధానమంత్రి మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ తో కలిసి ఓపెన్ టాప్ వాహనంలో సభా వేదికకు వెళ్తుండగా, మార్గమంతా గిరిజన మహిళలు, విద్యార్థినులు థింసా నృత్యంతో స్వాగతం పలికారు. ఆహ్లాద కరమైన ఆ దృశ్యాలను ప్రధాని మోదీ ఆసక్తిగా వీక్షిస్తూ పలుమార్లు అభివాదం చేశారు. గిరిజనుల సంప్రదాయ కళ, క్రమశిక్షణ, లయ బద్ధమైన నృత్య ప్రదర్శన వేడుకకు విశేష శోభ ను తీసుకువచ్చింది. భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవంలో థింసా నృత్యం ప్రత్యేక ఆకర్ష ణగా నిలిచి, అక్కడికి వచ్చిన అతిథులు, ప్రజల నుంచి ఘన ప్రశంసలు అందుకుంది •థింసా నృత్యంతో ప్రధాని మోదీకి అపూర్వ స్వాగతం •13,500 మంది గిరిజన విద్యార్థినులు, మహిళల లయబద్ధ నృత్య ప్రదర్శన • టెర్మినల్ నుంచి సభా వేదిక వరకు గిరిజన సంస్కృతి వైభవం •థింసా నృత్యాన్ని ఆసక్తిగా తిలకించిన ప్రధాని మోదీ •భోగాపురం ప్రారంభోత్సవానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన థింసా నృత్యం3
- జాతీయ రహదారి విస్తరణ పనుల అడ్డుకట్ట: అధికారుల హామీతో విరమణ ఖమ్మం జిల్లా ముదిగొండ మండల కేంద్రం నుండి జాతీయ రహదారి వరకు అధికారులు చేపట్టిన రోడ్డు విస్తరణ పనులను గ్రామస్థులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఈ విస్తరణ వల్ల తాము ఏళ్ల తరబడి నివాసముంటున్న ఇళ్లను కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ, పనులు జరుగుతున్న రహదారిపైనే బైఠాయించి ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చలు జరిపారు. బాధితులకు తగిన న్యాయం జరిగేలా చూస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో గ్రామస్థులు నిరసనను విరమించారు.1
- చరిత్రలో నిలిచి పోయే గట్టం భోగాపురం ఇంటర్నేషనల్ విమానాశ్రయం.1