బోధన్‌లో రెగ్యులర్ చెస్ శిక్షణకు విద్యార్థుల విశేష స్పందన "చెస్‌లో రేపటి ఛాంపియన్ల ను తీర్చిద్దుతున్న సాయి సామల చెస్ అకాడమీ" బోధన్,( జులై 31): నిజామాబాద్ జిల్లా: ప్రతినిధి రాహుల్: బోధన్ పట్టణంలో చెస్ పట్ల విద్యార్థుల ఆసక్తి రోజురోజుకు పెరుగుతోంది. సాయి సామల చెస్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెగ్యులర్ చెస్ శిక్షణా తరగతులకు పెద్ద సంఖ్యలో విద్యార్థులు హాజరై నాణ్యమైన శిక్షణ పొందుతున్నారు. చెస్‌ను కేవలం ఒక ఆటగా కాకుండా, ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, నిర్ణయ సామర్థ్యం, వ్యూహాత్మక ఆలోచన మరియు క్రమశిక్షణను పెంపొందించే జీవిత నైపుణ్యంగా విద్యార్థులు స్వీకరిస్తున్నారు. అకాడమీలో శిక్షణ పొందుతున్న బోధన్ విజయసాయి హైస్కూల్ 6వ తరగతి విద్యార్థి కె. గిరివర్ధన్ మాట్లాడుతూ, "అకాడమీలో చేరిన తర్వాత చెస్ పై ఆసక్తి మరింత పెరిగింది. ప్రతి తరగతిలో కొత్త విషయాలు నేర్చుకుంటున్నాను. నా ఆలోచనా విధానం, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం గణనీయంగా పెరిగాయి. భవిష్యత్తులో జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి టోర్నమెంట్లలో పాల్గొని మంచి చెస్ క్రీడాకారుడిగా ఎదగాలని లక్ష్యంగా ఉంది" అని అన్నారు. అదే పాఠశాల 3వ తరగతి విద్యార్థిని కె. రుద్రాక్షి మాట్లాడుతూ, "చెస్ నేర్చుకోవడం వల్ల సమస్యలను విశ్లేషించే సామర్థ్యం, జ్ఞాపకశక్తి, సరైన నిర్ణయాలు తీసుకునే నైపుణ్యం పెరిగాయి. ప్రతి వారం జరిగే ప్రాక్టీస్ మ్యాచ్‌లు, వారాంతపు టోర్నమెంట్లు చాలా ఉపయోగ పడుతున్నాయి. మరిన్ని మంది విద్యార్థులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి" అని పేర్కొన్నారు. అకాడమీ కోచ్ శ్రీ సాయిబాబా సామల మాట్లాడుతూ, "ప్రతి విద్యార్థి గ్రాండ్‌మాస్టర్ కానవసరం లేదు. కానీ చెస్ ద్వారా జీవితానికి అవసరమైన విలువలు, క్రమశిక్షణ, విశ్లేషణాత్మక ఆలోచన, ఆత్మవిశ్వాసం పెంచుకోవచ్చు. ప్రత్యేక ప్రతిభ ఉన్న విద్యార్థులను జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో ప్రణాళికాబద్ధ శిక్షణ ఇస్తున్నాము. భవిష్యత్తులో బోధన్ నుంచి గుకేశ్, ప్రజ్ఞానంద్, హారిక వంటి ఆటగాళ్లు రావాలని మా ఆకాంక్ష" అని తెలిపారు. సాయి సామల చెస్ అకాడమీలో వారానికి 3 రోజులు 60 నిమిషాల రెగ్యులర్ శిక్షణతో పాటు, ప్రతి ఆదివారం వారాంతపు చెస్ టోర్నమెంట్లు నిర్వహిస్తున్నారు. ప్రారంభ స్థాయి నుంచి టోర్నమెంట్ స్థాయి వరకు విద్యార్థుల ప్రతిభకు అనుగుణంగా ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల్లో ఏకాగ్రత, క్రమశిక్షణ, సమస్య పరిష్కార నైపుణ్యాలు పెంపొందించా లనుకుంటే చెస్ ఉత్తమ వేదిక అని అకాడమీ నిర్వాహకులు తెలిపారు.

- ముధోల్ పదవ సెంటర్ అంగన్వాడి లో పాము కలకలం... పట్టుకుని అటవీ ప్రాంతం లో వదిలేసిన స్థానికులు... నిర్మల్ జిల్లా // ముధోల్ BREAKING NEWS ముధోల్ మండల కేంద్రంలోని పదవ సెంటర్ అంగన్వాడీ కేంద్రంలో విషపూరిత పాము కలకలం... ఉదయం అంగన్వాడిని శుభ్రం చేయడానికి వచ్చి బాత్రూంలో ఉన్న పామును చూసి ఉలిక్కిపడ్డ అంగన్వాడి కేంద్రం సహాయకురాలు (ఆయమ్మ)... ఆయమ్మ కేకలు వేయడంతో అప్రమత్తమై పామును పట్టుకొని సురక్షిత ప్రాంతానికి తరలించడంతో ఊపిరి పీల్చుకున్న స్థానికులు... అదే సమయంలో అంగన్వాడి కేంద్రం లో విద్యార్థులు లేకపోవడంతో తప్పిన ప్రాణాపాయం...1
- ఆర్మూర్‌లో SIR అవగాహనా సదస్సు - 100% ఓటర్ల ఎన్రోల్‌మెంట్ పూర్తి ఆర్మూర్‌లో ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) పై అవగాహనా సదస్సు నిర్వహించారు. డిసిసి అధ్యక్షులు నగేష్ రెడ్డి, తెలంగాణ ముఖ్య సలహాదారు సుదర్శన్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ ఇంచార్జ్ వినయ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. బాల్కొండ, ఆర్మూర్ నియోజకవర్గాల్లో ఓటర్ల ఎన్రోల్‌మెంట్ 100% పూర్తి చేశామని, 25,800 డబుల్ ఓట్లను తొలగించామని వినయ్ కుమార్ రెడ్డి తెలిపారు. బీఎల్ఏలు, సూపర్‌వైజర్లకు ధన్యవాదాలు తెలిపారు. సుదర్శన్ రెడ్డి పుట్టినరోజు వేడుక కూడా నిర్వహించారు. ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్, నుడా చైర్మన్ కేశ వేణు, మండల అధ్యక్షులు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.1
- గోపాల్ రావు పటేల్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఘనంగా గోరింటాకు సంబరాలు నిర్మల్ జిల్లా భైంసాలోని గోపాల్ రావు పటేల్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఆషాడమాసం సందర్భంగా ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో గోరింటాకు విశిష్టత,ఆరోగ్యం, సంస్కృతి సంప్రదాయం అనే అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థినులు,అధ్యాపకులు సంప్రదాయబద్ధంగా గోరింటాకును తయారు చేసుకుని ఒకరికొకరు పెట్టుకుంటూ ఉత్సాహంగా గడిపారు.గోరింటాకు కేవలం అలంకరణకే కాదు ఆరోగ్య పరిరక్షణకు దోహదపడుతుందని వివరించారు.1
- నిజామాబాదు జిల్లా శ్రీరాంసాగర్ లోకి కొనసాగుతున్న వరద ప్రవాహం, క్రమేసి పెరుగుతున్న నీటి మట్టం ప్రస్తుతం ఎగువ ప్రాంతం నుండి 74950 క్యూసెక్కుల వరద కొనసాగుతుంది ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091. అడుగులు,80 టీఎంసీలు ప్రస్తుతం 1068.8అడుగులు, 21.369టీఎంసీలు1
- మోకాళ్ల లోతు వాగు దాటి.. గిరిజన గూడెంలోకి శ్రీహరి రావు. * ఇల్లు కోల్పోయిన బాధితురాలిని పరామర్శించి.. 11 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి హామీ. మామడ మండలం తోటిగూడ గ్రామపంచాయతీ పరిధిలోని మల్కాపూర్ ఆదివాసీ గిరిజన గూడెం.. అక్కడికి చేరుకోవాలంటే వాహనాలు వెళ్లవు. వాగులు, ఒర్రెలు దాటి దాదాపు ఐదు కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించాల్సిందే. అనారోగ్యం వచ్చినా.. అత్యవసరం వచ్చినా ఆ గూడెం ప్రజలు ప్రపంచానికి దూరంగా ఒంటరిగానే జీవనం సాగిస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గిరిజన మహిళ సీడం గంగుబాయి ఇల్లు కూలిపోయింది. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇంచార్జి కూచాడి శ్రీహరి రావు శుక్రవారం ఎలాంటి హడావుడి లేకుండా కాలినడకన బయలుదేరి, మోకాళ్ల లోతు వాగులు, ఒర్రెలను దాటి మల్కాపూర్ గూడెంకు చేరుకున్నారు. ఇల్లు కోల్పోయిన గంగుబాయిని పరామర్శించి ధైర్యం చెప్పారు. గూడెంలోని 11 ఆదివాసీ గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం తరఫున ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యేలా కృషి చేస్తానని, గూడెంలో త్రీఫేస్ విద్యుత్తు కోసం జిల్లా కలెక్టర్, విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడుతానని హామీ ఇచ్చారు. శ్రీహరి రావును చూసిన గూడెం ప్రజలు భావోద్వేగానికి గురయ్యారు. "ఇప్పటివరకు మా గూడెం వైపు ఏ నాయకుడు కూడా రాలేదని ఇంత కష్టపడి మమ్మల్ని చూసేందుకు వచ్చిన మొదటి నాయకుడు మీరు" అంటూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తోటి గూడ సర్పంచ్ మోతీబాయి భీమ్రావు, గాయిద్ పల్లి సర్పంచ్ రాథోడ్ సోనియా, వాస్తాపూర్ సర్పంచ్ భూమ్ రెడ్డి, మొండిగుట్ట సర్పంచ్ భీమేష్, మాజీ ఎంపీపీ జై సింగ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాథోడ్ సంతోష్ తో పాటు పార్టీ నాయకులు పాల్గొన్నారు.1
- దళితులు బీసీలు గిరిజనుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఫారెస్ట్ అధికారులపై కలెక్టర్ ఎమ్మెల్యేలు చర్యలు తీసుకోవాలి* ప్రశ్నించిన వారిపై ఎదురుదాడికి దిగడం ఏంటనీ, గిరిజన రైతులను పురుగుల మందు తాగి ఆత్మహత్యలు చేసుకుంటే భూములు వస్తాయని ప్రోత్సహించింది ఫారెస్ట్ అధికారులేనని దాన్ని ప్రశ్నించిన సిపిఎం నాయకులపై విధులకు ఆటంకం కలిగించారనడం హాస్యాస్పదంగా ఉందన్నారు జిల్లాలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ బీదర్ రైతులకు సంబంధించి భూముల విషయంలో ఫారెస్ట్ అధికారులు వారి శత్రువులుగా చూడడం మానుకోవాలని అన్నారు ఈ పోటు భూముల సమస్య జిల్లా మొత్తం ప్రధానంగా ఫారెస్ట్ ఆనుకొని ఉన్న మండలాల్లో ఎక్కువగా ఉందని తెలిపారు జిల్లా రెవిన్యూ అధికారులు వెంటనే స్పందించి ఫారెస్ట్ అధికారులకు భవనాలకు ఇచ్చిన స్థలాలను స్వాధిపరుచుకోవాలని డిమాండ్ చేశారు రాజంపేట , మాచారెడ్డి ,గాంధారి, లింగంపేట్, మండలాలలోని తండాలు గ్రామాలలో ప్రభుత్వం మంజూరు చేసిన రోడ్లను సైతం ఫారెస్ట్ అధికారులు వేయకుండా అడ్డుకున్నారని, ఇందిరమ్మ ఇండ్లను సైతం ఇవ్వకుండా అడ్డుకుంటూ అభివృద్ధి నిరోధకులుగా మారిన ఫారెస్ట్ అధికారులపై కేసులు నమోదు చేసి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు అక్రమార్కులతో చేతులు కలిపి అడవి సంపదను కలపను అమ్ముకుంటూ ఈ వ్యాపారానికి అడ్డుగా గిరిజనులు రైతులు పొట్టకూటికోసం అడవి లో ఉండే మర్రి పండ్లు వీటికోసం తరచూ వెళుతున్న గిరిజనులు అడ్డుగా ఉన్నారని వారిపై అక్రమ కేసులు పెడుతూ వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని అన్నారు ఇప్పటికైనా తమ తీరును మార్చు కోవాలని అన్నారు లేదా బహిరంగ చర్చకు సిద్ధం కావాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కొత్త నర్సింలు ముదాం అరుణ్ పాల్గొన్నారు1
- సౌదీ జైలులో చిక్కుకున్న తెలంగాణ యువకుడు... భర్తను స్వదేశానికి తీసుకురావాలని వికలాంగురాలైన భార్య కన్నీటి విజ్ఞప్తి... రూ.84 లక్షల బ్లడ్‌మనీ కోసం సహాయం కోరుతున్న కుటుంబం." "జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలానికి చెందిన శ్రావణ్‌కుమార్... సౌదీలో రోడ్డు ప్రమాద కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్నాడు. అతని విడుదలకు భారీ మొత్తం అవసరమైంది." **"జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం చింతలపేట గ్రామానికి చెందిన మమత, నిజామాబాద్ జిల్లా కుమ్మనపల్లి గ్రామానికి చెందిన శ్రావణ్‌కుమార్‌ను నాలుగేళ్ల క్రితం వివాహం చేసుకుంది. కుటుంబ పోషణ కోసం మూడేళ్ల క్రితం శ్రావణ్‌కుమార్ సౌదీ అరేబియాలోని రియాద్‌కు వెళ్లి అంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేస్తుండగా రోడ్డు ప్రమాదానికి సంబంధించిన కేసులో చిక్కుకున్నాడు. కేసు విచారణ అనంతరం బాధిత కుటుంబానికి సుమారు 3.30 లక్షల సౌదీ రియాల్స్, అంటే భారత కరెన్సీలో దాదాపు 84 లక్షల రూపాయలు బ్లడ్‌మనీగా చెల్లించాలని అక్కడి కోర్టు తీర్పు ఇచ్చింది. వికలాంగురాలైన మమత తన చిన్న కుమారుడితో కలిసి భర్తను కాపాడుకునేందుకు అధికారులను, ప్రజాప్రతినిధులను, ప్రవాస సంఘాలను ఆశ్రయిస్తూ ఆర్థిక సహాయం కోసం వేడుకుంటోంది."1
- నందిపేట్ : డెంగ్యూ, మలేరియా నివారణపై అవగాహన-ఉచిత వైద్య శిభిరం డెంగ్యూ మాసోత్సవం సందర్భంగా నందిపేట్ రాజానగర్ దుర్గాదేవీ ఆలయం వద్ద మండల వైద్యాధికారి డా. స్వాతి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. BP, షుగర్, మలేరియా, డెంగ్యూ పరీక్షలతో పాటు మందులు ఉచితంగా అందించారు. వర్షాకాల వ్యాధుల నివారణపై అవగాహన కల్పించారు. సర్పంచ్ ఎర్రం లింగం, కార్యదర్శి మహేంద్రతో కలిసి మురికి కాల్వలు పరిశీలించి, టెమోఫోస్ స్ప్రే, ఫాగింగ్, క్లోరినేషన్ చేపట్టాలని సూచించారు. HEO భాస్కర్, PHN పద్మావతి, ANMలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.1