మనోహరాబాద్ మండలంలోని కూచారం తండా చెందిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త మలావత్ శ్రీనివాస్ ఉరేసుకొని చనిపోవడం జరిగిందన్న వార్త తెలుసుకొని గజ్వేల్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జీ వంటేరు ప్రతాప్ రెడ్డి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలపడం జరిగింది. శ్రీను కూతురు స్వాతి బివిఆర్ఐటీ కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతుందని తెలుసుకొని ఆమె చదువులకు అండగా ఉండి ఆదుకుంటామని తెలిపారు, అలాగే ఫైనాన్సర్ తో మాట్లాడి కుటుంబాన్ని ఆదుకుంటామని తెలియజేశారు మనోహరాబాద్ మండల్ అధ్యక్షుడు శేఖర్ గౌడ్, కూచారం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ విఠల్ యాదవ్,పరికిబండ మాజీ సర్పంచ్ అర్జున్, దండుపల్లి మాజీ సర్పంచ్ బిక్షపతి, పాలాట సర్పంచ్ సాయి గౌడ్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు నరేష్ ముదిరాజ్, నాయిని ఉదయ్ రంజన్ గౌడ్, మలావత్ మాంగ్యా నాయక్, మలావత్ రాజు నాయక్, మలావత్ రమేష్, కూచారం తండా వాసులు మలావత్ కిషన్, మలావత్ సుధాకర్ తదితరులు ఉన్నారు.
మనోహరాబాద్ మండలంలోని కూచారం తండా చెందిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త మలావత్ శ్రీనివాస్ ఉరేసుకొని చనిపోవడం జరిగిందన్న వార్త తెలుసుకొని గజ్వేల్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జీ వంటేరు ప్రతాప్ రెడ్డి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలపడం జరిగింది. శ్రీను కూతురు స్వాతి బివిఆర్ఐటీ కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతుందని తెలుసుకొని ఆమె చదువులకు అండగా ఉండి ఆదుకుంటామని తెలిపారు, అలాగే ఫైనాన్సర్ తో మాట్లాడి కుటుంబాన్ని ఆదుకుంటామని తెలియజేశారు మనోహరాబాద్ మండల్ అధ్యక్షుడు శేఖర్ గౌడ్, కూచారం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ విఠల్ యాదవ్,పరికిబండ మాజీ సర్పంచ్ అర్జున్, దండుపల్లి మాజీ సర్పంచ్ బిక్షపతి, పాలాట సర్పంచ్ సాయి గౌడ్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు నరేష్ ముదిరాజ్, నాయిని ఉదయ్ రంజన్ గౌడ్, మలావత్ మాంగ్యా నాయక్, మలావత్ రాజు నాయక్, మలావత్ రమేష్, కూచారం తండా వాసులు మలావత్ కిషన్, మలావత్ సుధాకర్ తదితరులు ఉన్నారు.
- ఆలేరు రెవెన్యూ డివిజన్‌పై విప్ బీర్ల అయిలయ్య కీలక వ్యాఖ్యలు | ప్రతిపక్షాలకు సవాల్ | ఆలేరు అభివృద్ధే లక్ష్యం 👉 ఆలేరు రెవెన్యూ డివిజన్‌పై విప్ బీర్ల అయిలయ్య కీలక వ్యాఖ్యలు | ప్రతిపక్షాలకు సవాల్ | ఆలేరు అభివృద్ధే లక్ష్యం 👉 ఆలేరు రెవెన్యూ డివిజన్ ఖాయం... ప్రభుత్వం కట్టుబడి ఉంది!" – బీర్ల అయిలయ్య 👉 ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టించొద్దు. 📡 T20HD Telugu news channel subscribe like share1
- హుస్నాబాద్ లో పూర్తిస్థాయి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని నిరుద్యోగ యువత ఆందోళన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో పూర్తి స్థాయి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని నిరుద్యోగ యువత డిమాండ్ చేశారు. ఈ మేరకు హుస్నాబాద్ పట్టణంలోని నూతన గ్రంథాలయం ఎదుట నిరసన తెలిపారు. హుస్నాబాద్ పట్టణంలో శాశ్వత గ్రంథాలయం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని నిరుద్యోగ యువత వాపోయారు. విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగుల భవనంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన గ్రంథాలయం నుండి వెళ్లిపోవాలని అక్కడ ఉన్నవారు ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. హుస్నాబాద్ లో కట్టించిన నూతన గ్రంథాలయ భవనాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు కేటాయించడం తగదన్నారు. హుస్నాబాద్ చుట్టుపక్కల 24 గ్రామాల నిరుద్యోగ యువతకు హుస్నాబాద్ లో శాశ్వత గ్రంథాలయం అత్య అవసరం ఉందన్నారు. స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించి అన్ని వసతులతో కూడిన శాశ్వత గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.2
- ప్రధానమంత్రిని జెన్ జీ యువత తిడుతుంటే నా కళ్ళలో నీళ్లు వచ్చాయి: పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రిని జెన్ జీ యువత తిడుతుంటే నా కళ్లలో నీళ్లు వచ్చాయి కొత్త తరానికి ఏం తెలుసు ఆయన పడ్డ కష్టం ఒక్కరోజు కూడా ప్రధాని సెలవు తీసుకోలేదు - పవన్ కళ్యాణ్1
- జపాన్‌కు డ్రైవర్ల శిక్షణపై భాగస్వామ్యం దిశగా అడుగులు బద్దెనపల్లి ఐటీడీఆర్ డ్రైవింగ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌ను సందర్శించిన జపాన్ ప్రతినిధులు జపాన్‌కు నైపుణ్యమైన భారతీయ ప్రొఫెషనల్ డ్రైవర్లను తీర్చిదిద్దే లక్ష్యంతో హనా విస్టా కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణలోని ఐటీడీఆర్ డ్రైవింగ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌తో దీర్ఘకాలిక భాగస్వామ్య అవకాశాలను పరిశీలించేందుకు సంస్థ ప్రతినిధులు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లి లో ఐటిడీఆర్ సైట్ విజిట్ నిర్వహించారు.ఇట్టి పర్యవేక్షణ సంస్థ సీఈఓ సయూరి మత్సునో తెలంగాణ ఐఏఎస్ అధికారి హరి ప్రసాద్‌కు ఆదేశానుసారం , పర్య వేక్షించారు. డ్రైవింగ్ శిక్షణ విధానం, మౌలిక సదుపాయాలు, శిక్షణ పరికరాలు, నిర్వహణ ప్రమాణాలు, మొత్తం శిక్షణ వాతావరణాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. అలాగే, భారతీయ ప్రొఫెషనల్ డ్రైవర్లకు జపాన్‌లో ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా పరస్పర సహకారంపై చర్చించి, దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని ఏర్పరచు కోవాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఈ భాగస్వామ్యం అమల్లోకి వస్తే తెలంగాణ యువతకు జపాన్‌లో ఉపాధి అవకాశాలు మరింత విస్తరించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇట్టి పర్యవేక్షణ లో జిల్లా రవాణాశాఖ అధికారి దేవునూరి శ్రీనివాస్ మోటారు వాహనాల తనిఖీ అధికారి వంశీధర్ ఐటీడీఆర్ ప్రిన్సిపాల్ దొరయ్ మురుగన్ పాల్గొన్నారు.1
- రుద్రారం గీతం యూనివర్సిటీలో పాల్గొన్న దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి హైదరాబాద్‌లోని గీతం డీమ్డ్ యూనివర్సిటీలో 17వ స్నాతకోత్సవం వైభవంగా జరిగింది. ముఖ్య అతిథిగా ప్రముఖ దర్శకుడు హాజరై స్నాతకోపన్యాసం చేశారు. మొత్తం 1990 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేయగా, 17 బంగారు పతకాలు అందజేశారు. చేనేత కళాకారుడు కు గౌరవ డాక్టరేట్ (డీ.లిట్) ప్రదానం చేశారు. రాజమౌళి రాకతో విద్యార్థులు ఫోటోలు సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం కనబరిచారు.1
- భారత దేశంలో 5 శక్తి పీఠాలలో ఒకటిగా మన ఆలేరు నియోజకవర్గం లోని కొలనుపాక కోటిలింగాల శివుడు భారతదేశంలోనే ఐదు శివశక్తి పీఠాలు అందులో ఒకటిగా మన భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం కొలనుపాక లో ఉన్న కోటిలింగాల శివుడు ని దర్శించుకున్న వారికి అనుకున్న కోరికలు నెరవేరుతాయి1
- గ్రామాభివృద్ధిపై చిన్న శంకరంపేటలో గ్రామసభ, దోమల నివారణకు ప్రత్యేక చర్యలు చిన్న శంకరంపేట మేజర్ గ్రామపంచాయతీలో శనివారం నిర్వహించిన గ్రామసభలో గ్రామాభివృద్ధి అంశాలపై విస్తృతంగా చర్చించారు. సర్పంచ్ చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు సభ్యుల అభిప్రాయాలను సేకరించారు. వర్షాకాలంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా దోమల నివారణ చర్యలను ముమ్మరం చేయాలని నిర్ణయించారు. అలాగే గ్రామంలోని అంతర్గత మురుగు కాలువల నిర్మాణ పనులను త్వరలో ప్రారంభించి పారిశుద్ధ్యాన్ని మరింత మెరుగుపరుస్తామని సర్పంచ్ చంద్రశేఖర్ తెలిపారు.1
- మండల కేంద్రంలో బెజ్జంకి లో ప్రపంచ ఆటో డ్రైవర్ల దినోత్సవ వేడుకలు బెజ్జంకి, ఆగస్టు 1: సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో శనివారం ప్రపంచ ఆటో డ్రైవర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్ల సేవలను కొనియాడుతూ, ప్రజల దైనందిన జీవితంలో వారి పాత్ర ఎంతో కీలకమని వక్తలు పేర్కొన్నారు. ఎండ, వాన, చలి తేడా లేకుండా నిత్యం ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతూ సమాజానికి విశేష సేవలందిస్తున్న ఆటో కార్మికులను అభినందించారు. "మూడు చక్రాలపై ప్రయాణం... వెనుక వేలాది కుటుంబాల జీవనం" అనే సందేశంతో ఆటో డ్రైవర్ల శ్రమను ప్రతి ఒక్కరూ గౌరవించాలని పిలుపునిచ్చారు. ఆటో కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం మరింత ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు ప్రజలు కూడా వారికి సహకారం అందించాలని కోరారు. అనంతరం మండలంలోని ఆటో డ్రైవర్లందరికీ ప్రపంచ ఆటో డ్రైవర్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.2
- పుష్పాల వాగు వద్ద బురదలో స్కూల్ బస్సు.. తృటిలో తప్పిన ప్రమాదం మెదక్ పట్టణ సమీపంలోని పుష్పాల వాగు వద్ద శనివారం ప్రైవేట్ పాఠశాలకు చెందిన బస్సు బురదలో చిక్కుకోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గతేడాది వరదల్లో వంతెన కొట్టుకుపోవడంతో అధికారులు మట్టి పోసి తాత్కాలికంగా రాకపోకలు కొనసాగిస్తున్నారు. అయితే ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా ఆ మార్గం పూర్తిగా బురదమయంగా మారింది. ఈ క్రమంలో పాఠశాల బస్సు ముందుకు కదలక నిలిచిపోయింది. దీంతో విద్యార్థులు బస్సు నుంచి దిగి రోడ్డుపైనే నిరీక్షించాల్సి వచ్చింది. సమాచారం అందుకున్న స్థానికులు, వాహనదారులు సహకరించడంతో బస్సును బయటకు తీశారు. శాశ్వత వంతెన నిర్మాణాన్ని వేగవంతం చేసి, విద్యార్థులు మరియు ప్రజలకు సురక్షిత రాకపోకలు కల్పించాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.1