Shuru
Apke Nagar Ki App…
మంచిగా పరీక్షలు రాయాలి మానసిక ఒత్తిడికి గురికాకుండా విద్యార్థులు పరీక్షలను మంచిగా రాయాలని జన్నారం ప్రభుత్వాసుపత్రి వైద్యురాలు డాక్టర్ ఉమాశ్రీ సూచించారు. మంగళవారం జన్నారం మండల కేంద్రంలోని పలు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న టెన్త్ విద్యార్థులకు పరీక్షలు రాసే విధానంపై అవగాహన కల్పించారు. పరీక్షలు రాయడానికి భయాందోళనకు గురి కావద్దని కోరారు. పౌష్టికాహారం తీసుకోవడం, మంచి నిద్ర, యోగా వ్యాయామం చేయాలని డాక్టర్ ఉమాశ్రీ సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్య సిబ్బంది, పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Gourinatha p.g
మంచిగా పరీక్షలు రాయాలి మానసిక ఒత్తిడికి గురికాకుండా విద్యార్థులు పరీక్షలను మంచిగా రాయాలని జన్నారం ప్రభుత్వాసుపత్రి వైద్యురాలు డాక్టర్ ఉమాశ్రీ సూచించారు. మంగళవారం జన్నారం మండల కేంద్రంలోని పలు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న టెన్త్ విద్యార్థులకు పరీక్షలు రాసే విధానంపై అవగాహన కల్పించారు. పరీక్షలు రాయడానికి భయాందోళనకు గురి కావద్దని కోరారు. పౌష్టికాహారం తీసుకోవడం, మంచి నిద్ర, యోగా వ్యాయామం చేయాలని డాక్టర్ ఉమాశ్రీ సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్య సిబ్బంది, పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- కామన్పల్లిలో కేసీఆర్ జన్మదిన వేడుకలు జన్నారం మండలంలోని కామాన్పల్లి గ్రామంలో మాజీ సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను ప్రజా ప్రతినిధులు టిఆర్ఎస్ నాయకులు నిర్వహించారు. కెసిఆర్ పుట్టినరోజు సందర్భంగా మంగళవారం గ్రామంలోని పాఠశాలలో విద్యార్థులతో కలిసి కేకును కట్ చేశారు. అనంతరం విద్యార్థులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పేరం శ్రీనివాస్, స్థానిక ఉప సర్పంచ్, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ తేజావత్ భరత్ నాయక్, బీఆర్ఎస్ పార్టీ మండల్ సోషల్ మీడియా అధ్యక్షుడు జునుగురు గణేశ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు బైకం లక్ష్మణ్, పసుల రాజన్న, రాగంశెట్టి ప్రవీణ్, చందనగిరి వెంకటేష్, కార్యకర్తలు, పాఠశాల విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.1
- మహా శివరాత్రి సందర్భంగా రాజేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలలో పాల్గొన్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి సారంగపూర్ మండలం పెంబట్ల కొనపూర్ దుబ్బరాజేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి సందర్భంగా బుధవారం ఉదయం పది గంటలకు ఆలయంలో మహా శివుని దర్శించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి కి తీర్థ ప్రసాదాలను అందజేసి శాలువాతో సత్కరించి ఆశీర్వచనాలు అర్చకులు అందజేశారు మాజీ మంత్రి వెంట మండల పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు1
- Post by Bharath Newz1
- ప్రజాస్వామ్యానికి ఇది చీకటి రోజు మంచిర్యాల జిల్లా లోని క్యాతనపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు పరాకాష్టకు చేరాయి. ప్రజల చేత ఎన్నుకోబడిన బీఆర్ఎస్ కౌన్సిలర్లను మున్సిపల్ కార్యాలయంలోకి రానివ్వకుండా అడ్డుకోవడం దేనికి సంకేతం? మీరు గెలిచింది ప్రజల కోసమా లేక ప్రతిపక్షాలను అణచివేయడానికా? క్యాతనపల్లి ఇంచార్జ్ గా, ఒక బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే కోవ లక్ష్మి గారి పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు అత్యంత హేయం. ఒక మహిళా ప్రజాప్రతినిధి అని కూడా చూడకుండా, కాంగ్రెస్ తొత్తుల్లా మారిన పోలీసులు ఆమెను అడ్డుకోవడం, గొడవకు దిగడం తెలంగాణ సంస్కృతికే విరుద్ధం. బాల్క సుమన్ గారు మరియు కోవ లక్ష్మి గారు ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక పోలీసులను ప్రయోగించడం కాంగ్రెస్ చేతకానితనానికి నిదర్శనం. మంత్రి వర్గానికి లోపల రెడ్ కార్పెట్.. గెలిచిన కౌన్సిలర్లకు బయట లాఠీలా? పోలీసులారా.. మీరు పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో కాదు, ప్రభుత్వంలో! ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ, పోలీసులను అడ్డం పెట్టుకుని పాలిస్తున్న ఈ "కంచె ల" సర్కార్‌ను గద్దె దించే వరకు మా పోరాటం ఆగదు. రోడ్డుపై బైఠాయించిన మా నాయకులకు, కౌన్సిలర్లకు క్యాతనపల్లి ప్రజల మద్దతు ఎప్పుడూ ఉంటుంది అని ఎమ్మెల్యే కోవ లక్ష్మి గారు అన్నారు1
- Post by Ravi Poreddy1
- Post by MUZAKKIR ABDUL1
- అస్తాం విజయ గర్జన ర్యాలీ ఆదిలాబాద్ మున్సిపల్ చెర్మన్ వైస్ చైర్మన్ పదవులను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్న సందర్బంగా డీసీసీ కార్యాలయం నుండి పట్టణం విధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు1
- శ్రీదుబ్బరాజేశ్వర స్వామివారి రథోత్సవ శోభాయాత్ర అంగరంగ వైభవంగా హర హర మహాదేవ అంటూ వేల సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం పెంబట్ల కోనాపూర్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీదుబ్బరాజేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని గత మూడు రోజుల నుండి అంగరంగ వైభవంగా పూజలందుకుంటున్నడు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం ఉదయం పదకోండు గంటలకు శ్రీదుబ్బరాజేశ్వరస్వామి వారి రథోత్సవాన్ని పలు పుష్పాలతో చక్కగా అలంకరించి స్వామి అమ్మవార్లను ఆసీనులు చేసి ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం ఈ రథోత్సవాన్ని పురవీధుల గుండా స్వామివారి రథాన్ని పెద్ద ఎత్తున భక్తులు తడుతో లాగుతూ హర హర మహాదేవ ఓం నమశ్శివాయ అంటూ స్వామివారి శోభాయాత్ర కొనసాగింది. ఈ శోభాయాత్రకు చుట్టుపక్కల గ్రామాలు వివిధ జిల్లాల నుండి కుటుంబ సమేతంగా వేల సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా జిల్లా పోలీసు యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లను చేశారు.1