logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఒకరికి 3 రోజులుజైలు శిక్ష : ట్రాఫిక్ సీఐ రాజేశ్వరరావు రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ B. రాజేశ్వరరావు ఆధ్వర్యంలో డ్రంక్&డ్రైవ్ లో దొరికిన *3* వ్యక్తిని, ప్రిన్సిపల్ జ్యూడిషల్ కోర్టు మేజిస్ట్రేట్ గోదావరిఖని, *వెంకట సచిన్ రెడ్డి గారి ముందు హాజరుపరుచగా *2 వ్యక్తులకు* **20,000* రూపాయల ఫైన్ వేయడం. జరిగింది. ఒక్కొక్కరికి పదివేల రూపాయలు ఫైన్ వేయడం జరుగుతుంది. ఒక వ్యక్తికి *03* రోజుల *జైలు శిక్ష** విధించారు. వీరిని కరీంనగర్ జిల్లా జైలుకు తరలించడం జరిగింది. సీఐ గారు మాట్లాడుతూ వాహనం మద్యం తాగి వాహనం నడప రాదని నడిపినచో వారిపై చట్టరీత్యా చర్య తీసుకోవడం జరుగుతుంది . మరియు వాహనానికి సంబంధించిన పత్రములు మరియు టూ వీలర్ వెహికల్స్ నడిపేవారు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని మరియు రాంగ్ రూట్లో వెళ్లరాదని ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని వాహనాన్ని అతివేగంగా నడపరాదని. ఫోర్ వీలర్ నడిపే వారు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని సిఐ గారు తెలియజేయడం జరిగింది.

1 hr ago
user_Telangana reporter
Telangana reporter
Local News Reporter రామగుండం, పెద్దపల్లి, తెలంగాణ•
1 hr ago

డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఒకరికి 3 రోజులుజైలు శిక్ష : ట్రాఫిక్ సీఐ రాజేశ్వరరావు రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ B. రాజేశ్వరరావు ఆధ్వర్యంలో డ్రంక్&డ్రైవ్ లో దొరికిన *3* వ్యక్తిని, ప్రిన్సిపల్ జ్యూడిషల్ కోర్టు మేజిస్ట్రేట్ గోదావరిఖని, *వెంకట సచిన్ రెడ్డి గారి ముందు హాజరుపరుచగా *2 వ్యక్తులకు* **20,000* రూపాయల ఫైన్ వేయడం. జరిగింది. ఒక్కొక్కరికి పదివేల రూపాయలు ఫైన్ వేయడం జరుగుతుంది. ఒక వ్యక్తికి *03* రోజుల *జైలు శిక్ష** విధించారు. వీరిని కరీంనగర్ జిల్లా జైలుకు తరలించడం జరిగింది. సీఐ గారు మాట్లాడుతూ వాహనం మద్యం తాగి వాహనం నడప రాదని నడిపినచో వారిపై చట్టరీత్యా చర్య తీసుకోవడం జరుగుతుంది . మరియు వాహనానికి సంబంధించిన పత్రములు మరియు టూ వీలర్ వెహికల్స్ నడిపేవారు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని మరియు రాంగ్ రూట్లో వెళ్లరాదని ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని వాహనాన్ని అతివేగంగా నడపరాదని. ఫోర్ వీలర్ నడిపే వారు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని సిఐ గారు తెలియజేయడం జరిగింది.

More news from తెలంగాణ and nearby areas
  • చేను వెంకటి జ్ఞాపకార్ధం తిలక్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాస్టర్ అథ్లెటిక్స్ పోటీలు బెల్లంపల్లి పట్టణంలోని తిలక్ గ్రౌండ్ లో క్రి. శే. చేను వెంకటి జ్ఞాపకార్ధం వారి కుమారుడు, న్యాయవాది చేను రవి కుమార్ సహకారంతో ఆదివారం తిలక్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాస్టర్ అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు రూరల్ సీఐ హనుక్ , విశ్రాంత అదనపు ఎస్పీ పుల్లాల రవికుమార్, 1టౌన్ ఎస్సై ముఖ్య అతిథులుగా హాజరై పోటీలను ప్రారంభించారు. అనంతరం 50 సంవత్సరాలు దాటిన క్రీడాకారులు యువకుల వలె స్పీడు వాక్, రన్నింగ్, షాట్ పుట్, టాగ్ అఫ్ వార్, తదితర పోటీలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథులు మాట్లాడుతూ 50 ఏళ్ళు పై బడిన అనంతరం కూడా క్రీడా స్ఫూర్తితో అన్ని ఆటల పోటిల్లో పాల్గొనడం అభినందనీయమని అన్నారు. నేటి యువత మొబైల్ ఫోన్లు ట్రక్స్ బారిన పడకుండా వీరిని చూసి పూర్తి పొంది వ్యాయామం క్రీడల వైపు మొగ్గు చూపాలని కోరారు. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని శారీరకద్రత్వాన్ని అందిస్తాయని వారు సూచించారు. క్రీడా పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. సీనియర్ క్రీడాకారులు యాదండ్ల నర్సయ్య, తోట పోచన్న, మాదాసి గోపాల్, గోవర్ధన్ లను ఘనంగా సన్మానించారు. ఆటల పోటీలకు పిడి లు రాజ్ మహమ్మద్, బండి రవి, చంద్ పాషా, లు సహకారం అందించారు. వారికీ ధన్యవాదములు తెలిపారు ఈ కార్యక్రమం లో వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రంగ రామన్న, ప్రధాన కార్యదర్శి కంటే వాడ నగేష్, కోశాధికారి కజ్జం రమేష్, సభ్యులు పాల్గొన్నారు
    4
    చేను వెంకటి జ్ఞాపకార్ధం తిలక్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాస్టర్ అథ్లెటిక్స్ పోటీలు 
బెల్లంపల్లి పట్టణంలోని తిలక్ గ్రౌండ్ లో క్రి. శే. చేను వెంకటి జ్ఞాపకార్ధం వారి కుమారుడు, న్యాయవాది చేను రవి కుమార్ సహకారంతో ఆదివారం తిలక్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాస్టర్ అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు రూరల్ సీఐ హనుక్ , విశ్రాంత అదనపు ఎస్పీ పుల్లాల రవికుమార్, 1టౌన్ ఎస్సై  ముఖ్య అతిథులుగా హాజరై పోటీలను ప్రారంభించారు. 
అనంతరం 50 సంవత్సరాలు దాటిన క్రీడాకారులు యువకుల వలె స్పీడు వాక్, రన్నింగ్, షాట్ పుట్, టాగ్ అఫ్ వార్, తదితర పోటీలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథులు మాట్లాడుతూ 50 ఏళ్ళు పై బడిన అనంతరం కూడా క్రీడా స్ఫూర్తితో అన్ని ఆటల పోటిల్లో పాల్గొనడం అభినందనీయమని అన్నారు. నేటి యువత మొబైల్ ఫోన్లు ట్రక్స్ బారిన పడకుండా వీరిని చూసి పూర్తి పొంది వ్యాయామం క్రీడల వైపు మొగ్గు చూపాలని కోరారు. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని శారీరకద్రత్వాన్ని అందిస్తాయని వారు సూచించారు. క్రీడా పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. సీనియర్ క్రీడాకారులు యాదండ్ల నర్సయ్య, తోట పోచన్న, మాదాసి గోపాల్, గోవర్ధన్ లను ఘనంగా సన్మానించారు. ఆటల పోటీలకు పిడి లు రాజ్ మహమ్మద్, బండి రవి, చంద్ పాషా, లు సహకారం అందించారు. వారికీ ధన్యవాదములు తెలిపారు ఈ కార్యక్రమం లో వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రంగ రామన్న, ప్రధాన కార్యదర్శి కంటే వాడ నగేష్, కోశాధికారి కజ్జం రమేష్, సభ్యులు పాల్గొన్నారు
    user_Bellampalli news
    Bellampalli news
    Local News Reporter బెల్లంపల్లె, మంచిర్యాల, తెలంగాణ•
    20 hrs ago
  • ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కొనసాగుతున్న భక్తుల రద్దీ భాద్రపద మాసం సోమవారం సందర్భంగా జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ముందుగా పవిత్ర గోదావరి నదిలో స్నానాలు ఆచరించిన భక్తులు అనంతరం శ్రీ లక్ష్మీనరసింహస్వామివారిని, అనుబంధ ఆలయాల్లోని స్వామివార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రాకతో ఆలయ పరిసరాల్లో సందడి నెలకొంది.
    1
    ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
భాద్రపద మాసం సోమవారం సందర్భంగా జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ముందుగా పవిత్ర గోదావరి నదిలో స్నానాలు ఆచరించిన భక్తులు అనంతరం శ్రీ లక్ష్మీనరసింహస్వామివారిని, అనుబంధ ఆలయాల్లోని స్వామివార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రాకతో ఆలయ పరిసరాల్లో సందడి నెలకొంది.
    user_Ntv నాగరాజు
    Ntv నాగరాజు
    వెల్గటూర్, జగిత్యాల, తెలంగాణ•
    8 hrs ago
  • గణేశ్ నిమజ్జనానికి వెంటనే నీటిని విడుదల చేయాలి ‘ఛలో చింతకుంట’లో ధ్వజమెత్తిన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు గణేశ్ నిమజ్జన ఉత్సవాలను పురస్కరించుకుని ఎస్సారెస్పీ/ఎల్ఎండీ కాలువలకు వెంటనే నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ సమీపంలోని చింతకుంట కెనాల్ వద్ద బిజెపి జిల్లా శాఖ సాయిని మల్లేశం ఆధ్వర్యంలో నిర్వహించిన ‘‘ఛలో చింతకుంట’’ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు గారు పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మనం ఏ పని చేపట్టినా విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా కొనసాగాలని మొట్టమొదట వేడుకునేది విఘ్నేశ్వరుడినే. ఇయాళ ఆ విఘ్నేశ్వరుడి నిమజ్జనానికే కాంగ్రెస్ ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు స్రుష్టించడం బాధాకరం. మనందరికీ తెలుసు ....తెలంగాణలో గణేశ్ నిమజ్జనం అంటే కేవలం ఒక పండుగ కాదు... ఇది మన సంస్కృతి, మన సంప్రదాయం, మన భక్తి, మన సామూహిక ఆధ్యాత్మిక ఉత్సవం. హిందువులంతా ఐకమత్యంగా జరుపుకునే గొప్ప పండుగ. ఊరూవాడా గల్లీగల్లీలో ప్రతి ఒక్క హిందువు గణేశ్ ను ప్రతిష్టించుకుని నిర్వహించుకునే ఈ నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం నయా పైసా ఇయ్యలేదు. ఇతర మతాల పండుగల నిర్వహణకు మాత్రం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నరు. అయినా భరించాం. కానీ ఇయాళ గణపతిని నిమజ్జనం చేయడానికి నీళ్లు విడుదల చేయాలని 10 రోజుల నుండి అడుగుతున్నం. ఇరిగేషన్ అధికారులతోపాటు జిల్లా కలెక్టర్, రాష్ట్ర మంత్రికి విజ్ఝప్త చేసినం. కానీ ఇప్పటి వరకు చుక్క నీరు కూడా విడుదల చేయలేదు. నేనడుగుతున్నా.... కాలువల్లో నీళ్లు లేవు. ఎండిపోయినయ్. “నిమజ్జనం ఎక్కడ చేయాలి?”. ఇప్పుడు నీళ్లు వదిలితే తాగడానికి నీళ్లుండవని రాష్ట్ర ప్రభుత్వం కుంటి సాకులు చెప్పడం ఎంత వరకు సమంజసం? ఎస్సారెస్పీ లో 47 టీఎంసీలకు పైగా నీళ్లున్నయ్. నీళ్లు వదలడానికి ఇబ్బంది ఏంది? గణేశ్ నిమజ్జనానికి అర టీఎంసీ నీళ్లు వదిలితే చాలు. గతంలో ఎస్సారెస్పీలో 17 టీఎంసీలు మాత్రమే నీళ్లు నిల్వ ఉన్నప్పుడు కూడా నీళ్లు వదిలారు కదా? మరి ఇప్పుడెందుకు వదలడం లేదు? గత 30 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా భక్తులను ఎందుకు ఆందోళనకు గురి చేస్తున్నరు? ‘‘కేబినెట్ లో సీఎంకు, కొందరు మంత్రులకు పడటం లేదు. ఎవరికి వాళ్లే సీఎం కుర్చీలో కూర్చోవాలనుకుంటున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా తానే సీఎం అని భావిస్తున్నారు. కాలువలకు నీళ్లు వదలకపోతే సీఎంకు చెడ్డ పేరొస్తది, హైకమాండ్ రేవంత్ రెడ్డి దించేస్తే తానే సీఎం సీట్లో కూర్చోవాలని అనుకుంటున్నారేమో... మీ కొట్లాటలు మాకు అనవసరం. మాకు నీళ్లివ్వండి. గణేష్ నిమజ్జనాన్ని భక్తియుత వాతావరణంలో ప్రశాంతంగా జరుపుకునే అవకాశం కల్పించాలని కోరుతున్నా...’’అని చెప్పండి. ఇదిగో....కరీంనగర్‌లో చింతకుంట కాలువ. చుక్క నీరు లేదు. ఇక్కడికి వందలాది గణేశ్ విగ్రహాలు నిమజ్జనం కోసం వస్తాయి. నీళ్లు లేకుండా ఆ గణపతులను ఏం చేయాలి? ఇక్కడే రోడ్లపై వదిలి వెళ్లాలా? ఒక్క చింతకుంటే కాదు, ఎస్సారెస్పీ పరిధిలోని దాదాపు అన్ని కాలువల్లోనూ ఇదే పరిస్థితి. ఏటా ఆయా కాలువల్లో నిమజ్జనం చేసే వాళ్ల పరిస్థితి ఏంది? కావాల్సినన్ని నీళ్లున్నా పంటలకు నీళ్లు వదలడం లేదు. పంటలు ఎండిపోయి రైతులు ఆగమవుతున్నా పట్టించుకోరు. చివరకు భక్తుల మనోభావాలను కూడా పట్టించుకోరు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? గణేశ్ నిమజ్జనం తేదీలు ముందే తెలియవా? ఎక్కడెక్కడ నిమజ్జనాలు జరుగుతాయో అధికారులకు ముందే తెలియదా? ఆ ప్రాంతాల్లో నీటి లభ్యతను ముందుగానే ఎందుకు అంచనా వేయలేదు? అవసరమైన చోట్ల రిజర్వాయర్లు, కాలువలు, చెరువులకు నీటిని ఎందుకు మళ్లించలేదు? రైతుల పంటలను కాపాడటానికి సమగ్ర నీటి విడుదల ప్రణాళిక ఎందుకు లేదు? భక్తులకు చివరి నిమిషంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఎందుకు చెబుతున్నారు? “తెలంగాణలో గణపతిని నిమజ్జనం చేయడానికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి రావాలా?”. తెలంగాణ ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి హిందువులే కదా? గణేశ్ నిమజ్జన ప్రాముఖ్యత, హిందువుల మనోభావాలు వాళ్లకు తెలియవా? ఇదేం పద్దతి. ఎన్నికల సమయంలో ప్రజల దగ్గరకు వెళ్లి ఎన్నో హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన హామీలను గాలికొదిలేశారు. ఇప్పుడు నిమజ్జనానికి కూడా నీళ్లవ్వకుండా వేధిస్తున్నరు. హిందువులంటే కాంగ్రెస్ కు అంత చులకన ఎందుకు? హిందువులు ఓటర్లు కాదా? వాళ్ల ఓట్లు అవసరం లేదా? గణేశ్ నిమజ్జనానికి కూడా నీళ్లు వదలండి మహాప్రభో వేడుకోవాల్సిన దుస్థితి కలిగిస్తారా? బీజేపీ పక్షాన, హిందువుల పక్షాన మేం కోరేదొక్కటే. తక్షణమే గణేశ్ నిమజ్జనానికి సరిపడ నీళ్లను విడుదల చేయాలి. నిమజ్జనానికి ఏ అటంకం లేకుండా భక్తిపారవశ్యంతో గణేష్ నిమజ్జనమయ్యేలా చూడాలి. అట్లాగే ప్రభుత్వం వెంటనే SRSP, కాకతీయ కాలువలు, స్థానిక చెరువులు, నిమజ్జన ప్రాంతాలకు అవసరమైన నీటి విడుదలపై అత్యవసర ప్రణాళిక ప్రకటించాలి. ఏ ప్రాంతంలో ఎంత నీరు అవసరం? ఎక్కడి నుంచి ఎంత నీరు విడుదల చేస్తారు? ఎప్పుడు చేరుతుంది? నిమజ్జనానికి సురక్షితమైన ప్రాంతాలు ఏవి? .....అనే అంశాలపై ప్రభుత్వం ప్రజలకు స్పష్టంగా చెప్పాలి. చివరగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. సాయంత్రంలోపు నిమజ్జనానికి నీళ్లు విడుదల చేయకపోతే....కాంగ్రెస్ ను రాజకీయ నిమజ్జనం చేస్తాం. హిందువుల దమ్మేందో చూపిస్తాం. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్పొరేటర్లు బోయినపల్లి ప్రవీణ్ రావు, బండారి వేణు, గాజ శివరాం, ఎన్నం ప్రకాష్, ఏపీపీ చంద్ర (టీంకు), చొప్పరి జయశ్రీ, బండ రమణ రెడ్డి, సౌగాని కొమురయ్య, సోమిడి వేణు,బీజేపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..
    3
    గణేశ్ నిమజ్జనానికి వెంటనే నీటిని విడుదల చేయాలి ‘ఛలో చింతకుంట’లో ధ్వజమెత్తిన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు
గణేశ్ నిమజ్జన ఉత్సవాలను పురస్కరించుకుని ఎస్సారెస్పీ/ఎల్ఎండీ కాలువలకు వెంటనే నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ సమీపంలోని చింతకుంట కెనాల్ వద్ద బిజెపి జిల్లా శాఖ సాయిని మల్లేశం ఆధ్వర్యంలో నిర్వహించిన ‘‘ఛలో చింతకుంట’’ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు గారు పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
మనం ఏ పని చేపట్టినా విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా కొనసాగాలని మొట్టమొదట వేడుకునేది విఘ్నేశ్వరుడినే. ఇయాళ ఆ విఘ్నేశ్వరుడి నిమజ్జనానికే కాంగ్రెస్ ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు స్రుష్టించడం బాధాకరం. మనందరికీ తెలుసు ....తెలంగాణలో గణేశ్ నిమజ్జనం అంటే కేవలం ఒక పండుగ కాదు... ఇది మన సంస్కృతి, మన సంప్రదాయం, మన భక్తి, మన సామూహిక ఆధ్యాత్మిక ఉత్సవం. హిందువులంతా ఐకమత్యంగా జరుపుకునే గొప్ప పండుగ.
ఊరూవాడా గల్లీగల్లీలో ప్రతి ఒక్క హిందువు గణేశ్ ను ప్రతిష్టించుకుని నిర్వహించుకునే ఈ నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం నయా పైసా ఇయ్యలేదు. ఇతర మతాల పండుగల నిర్వహణకు మాత్రం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నరు. అయినా భరించాం. కానీ ఇయాళ గణపతిని నిమజ్జనం చేయడానికి నీళ్లు విడుదల చేయాలని 10 రోజుల నుండి అడుగుతున్నం. ఇరిగేషన్ అధికారులతోపాటు జిల్లా కలెక్టర్, రాష్ట్ర మంత్రికి విజ్ఝప్త చేసినం. కానీ ఇప్పటి వరకు చుక్క నీరు కూడా విడుదల చేయలేదు.
నేనడుగుతున్నా.... కాలువల్లో నీళ్లు లేవు. ఎండిపోయినయ్. “నిమజ్జనం ఎక్కడ చేయాలి?”.
ఇప్పుడు నీళ్లు వదిలితే తాగడానికి నీళ్లుండవని రాష్ట్ర ప్రభుత్వం కుంటి సాకులు చెప్పడం ఎంత వరకు సమంజసం? ఎస్సారెస్పీ లో 47 టీఎంసీలకు పైగా నీళ్లున్నయ్. నీళ్లు వదలడానికి ఇబ్బంది ఏంది? గణేశ్ నిమజ్జనానికి అర టీఎంసీ నీళ్లు వదిలితే చాలు. గతంలో ఎస్సారెస్పీలో 17 టీఎంసీలు మాత్రమే నీళ్లు నిల్వ ఉన్నప్పుడు కూడా నీళ్లు వదిలారు కదా? మరి ఇప్పుడెందుకు వదలడం లేదు? గత 30 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా భక్తులను ఎందుకు ఆందోళనకు గురి చేస్తున్నరు?
‘‘కేబినెట్ లో సీఎంకు, కొందరు మంత్రులకు పడటం లేదు. ఎవరికి వాళ్లే సీఎం కుర్చీలో కూర్చోవాలనుకుంటున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా తానే సీఎం అని భావిస్తున్నారు. కాలువలకు నీళ్లు వదలకపోతే సీఎంకు చెడ్డ పేరొస్తది, హైకమాండ్ రేవంత్ రెడ్డి దించేస్తే తానే సీఎం సీట్లో కూర్చోవాలని అనుకుంటున్నారేమో... మీ కొట్లాటలు మాకు అనవసరం. మాకు నీళ్లివ్వండి. గణేష్ నిమజ్జనాన్ని భక్తియుత వాతావరణంలో ప్రశాంతంగా జరుపుకునే అవకాశం కల్పించాలని కోరుతున్నా...’’అని చెప్పండి.
ఇదిగో....కరీంనగర్‌లో చింతకుంట కాలువ. చుక్క నీరు లేదు. ఇక్కడికి వందలాది గణేశ్ విగ్రహాలు నిమజ్జనం కోసం వస్తాయి. నీళ్లు లేకుండా ఆ గణపతులను ఏం చేయాలి? ఇక్కడే రోడ్లపై వదిలి వెళ్లాలా? ఒక్క చింతకుంటే కాదు, ఎస్సారెస్పీ పరిధిలోని దాదాపు అన్ని కాలువల్లోనూ ఇదే పరిస్థితి. ఏటా ఆయా కాలువల్లో నిమజ్జనం చేసే వాళ్ల పరిస్థితి ఏంది?
కావాల్సినన్ని నీళ్లున్నా పంటలకు నీళ్లు వదలడం లేదు. పంటలు ఎండిపోయి రైతులు ఆగమవుతున్నా పట్టించుకోరు. చివరకు భక్తుల మనోభావాలను కూడా పట్టించుకోరు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా?
గణేశ్ నిమజ్జనం తేదీలు ముందే తెలియవా? ఎక్కడెక్కడ నిమజ్జనాలు జరుగుతాయో అధికారులకు ముందే తెలియదా? ఆ ప్రాంతాల్లో నీటి లభ్యతను ముందుగానే ఎందుకు అంచనా వేయలేదు? అవసరమైన చోట్ల రిజర్వాయర్లు, కాలువలు, చెరువులకు నీటిని ఎందుకు మళ్లించలేదు? రైతుల పంటలను కాపాడటానికి సమగ్ర నీటి విడుదల ప్రణాళిక ఎందుకు లేదు? భక్తులకు చివరి నిమిషంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఎందుకు చెబుతున్నారు?
“తెలంగాణలో గణపతిని నిమజ్జనం చేయడానికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి రావాలా?”. తెలంగాణ ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి హిందువులే కదా? గణేశ్ నిమజ్జన ప్రాముఖ్యత, హిందువుల మనోభావాలు వాళ్లకు తెలియవా? ఇదేం పద్దతి.
ఎన్నికల సమయంలో ప్రజల దగ్గరకు వెళ్లి ఎన్నో హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన హామీలను గాలికొదిలేశారు. ఇప్పుడు నిమజ్జనానికి కూడా నీళ్లవ్వకుండా వేధిస్తున్నరు. హిందువులంటే కాంగ్రెస్ కు అంత చులకన ఎందుకు? హిందువులు ఓటర్లు కాదా? వాళ్ల ఓట్లు అవసరం లేదా? గణేశ్ నిమజ్జనానికి కూడా నీళ్లు వదలండి మహాప్రభో వేడుకోవాల్సిన దుస్థితి కలిగిస్తారా?
బీజేపీ పక్షాన, హిందువుల పక్షాన మేం కోరేదొక్కటే. తక్షణమే గణేశ్ నిమజ్జనానికి సరిపడ నీళ్లను విడుదల చేయాలి. నిమజ్జనానికి ఏ అటంకం లేకుండా భక్తిపారవశ్యంతో గణేష్ నిమజ్జనమయ్యేలా చూడాలి.
అట్లాగే ప్రభుత్వం వెంటనే SRSP, కాకతీయ కాలువలు, స్థానిక చెరువులు, నిమజ్జన ప్రాంతాలకు అవసరమైన నీటి విడుదలపై అత్యవసర ప్రణాళిక ప్రకటించాలి. ఏ ప్రాంతంలో ఎంత నీరు అవసరం? ఎక్కడి నుంచి ఎంత నీరు విడుదల చేస్తారు? ఎప్పుడు చేరుతుంది? నిమజ్జనానికి సురక్షితమైన ప్రాంతాలు ఏవి? .....అనే అంశాలపై ప్రభుత్వం ప్రజలకు స్పష్టంగా చెప్పాలి.
చివరగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. సాయంత్రంలోపు నిమజ్జనానికి నీళ్లు విడుదల చేయకపోతే....కాంగ్రెస్ ను రాజకీయ నిమజ్జనం చేస్తాం. హిందువుల దమ్మేందో చూపిస్తాం.
ఈ కార్యక్రమంలో బీజేపీ కార్పొరేటర్లు బోయినపల్లి ప్రవీణ్ రావు, బండారి వేణు, గాజ శివరాం, ఎన్నం ప్రకాష్, ఏపీపీ చంద్ర (టీంకు), చొప్పరి జయశ్రీ, బండ రమణ రెడ్డి, సౌగాని కొమురయ్య, సోమిడి వేణు,బీజేపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    4 hrs ago
  • కరీంనగర్ మున్సిపల్ సిబ్బందికి ట్రై సైకిల్స్, ఫాగ్ మిషన్స్ అందజేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలో మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, స్థానిక కార్పొరేటర్లతో కలిసి కేంద్ర మంత్రి బండి సంజయ్ మున్సిపల్ శానిటేషన్ సిబ్బందికి నూతనంగా కొనుగోలు చేసిన ట్రైసైకిల్స్, ఫాగ్ మిషన్స్ ను అందజేశారు. అనంతరం వారితో కలిసి మీడియాతో మాట్లాడారు. కరీంనగర్ లో చెత్త సేకరణ కోసం ప్రతి డివిజన్ కు ఒక ట్రై సైకిల్ ను మున్సిపల్ సిబ్బందికి అందజేస్తున్నాం. కొత్తగా కొనుగోలు చేసిన ఫాగ్ మిషన్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నాం. అదనంగా ట్రాక్టర్లను కొనుగోలు చేస్తున్నాం. కరీంనగర్ లో డంపింగ్ యార్డ్ సమస్యను పరిష్కరించబోతున్నాం.
    1
    కరీంనగర్ మున్సిపల్ సిబ్బందికి ట్రై సైకిల్స్, ఫాగ్ మిషన్స్ అందజేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్
 
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలో మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, స్థానిక కార్పొరేటర్లతో కలిసి కేంద్ర మంత్రి బండి సంజయ్ మున్సిపల్ శానిటేషన్ సిబ్బందికి నూతనంగా కొనుగోలు చేసిన ట్రైసైకిల్స్, ఫాగ్ మిషన్స్ ను అందజేశారు. అనంతరం వారితో కలిసి మీడియాతో మాట్లాడారు.
కరీంనగర్ లో చెత్త సేకరణ కోసం ప్రతి డివిజన్ కు ఒక ట్రై సైకిల్ ను మున్సిపల్ సిబ్బందికి అందజేస్తున్నాం. కొత్తగా కొనుగోలు చేసిన ఫాగ్ మిషన్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నాం. అదనంగా ట్రాక్టర్లను కొనుగోలు చేస్తున్నాం. కరీంనగర్ లో డంపింగ్ యార్డ్ సమస్యను పరిష్కరించబోతున్నాం.
    user_శాతవాహన కరీంనగర్
    శాతవాహన కరీంనగర్
    కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    22 hrs ago
  • జగిత్యాల శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు విశేష పూజలు
    1
    జగిత్యాల శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు విశేష పూజలు
    user_Venu Gopal
    Venu Gopal
    ధర్మపురి, జగిత్యాల, తెలంగాణ•
    23 hrs ago
  • ధర్మపురి వినాయక నిమజ్జనం లో నృత్యం చేసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ జగిత్యాల జిల్లా ధర్మపురిలో వైభవంగా వినాయక నిమర్జన శోభాయాత్ర..శోభాయాత్ర లో నృత్యం చేసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్
    1
    ధర్మపురి వినాయక నిమజ్జనం లో నృత్యం చేసిన  మంత్రి అడ్లూరి లక్ష్మణ్
జగిత్యాల జిల్లా ధర్మపురిలో వైభవంగా వినాయక నిమర్జన శోభాయాత్ర..శోభాయాత్ర లో నృత్యం చేసిన  మంత్రి అడ్లూరి లక్ష్మణ్
    user_Ntv నాగరాజు
    Ntv నాగరాజు
    వెల్గటూర్, జగిత్యాల, తెలంగాణ•
    21 hrs ago
  • BJP కార్యకర్తలపై పోలీసుల లాఠీఛార్జ్ చింతకుంట కెనాల్ వద్ద ఉద్రిక్తత ధర్నా చేస్తున్న బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్న పోలీసులు పోలీసుల తీరుపై బీజేపీ కార్యకర్తల ఆగ్రహం ఏసీపీ విజయ్ కుమార్, కొత్తపల్లి సీఐ కోటేశ్ తీరుపై మండిపడుతున్న కార్యకర్తలు కరీంనగర్ డిప్యూటీ మేయర్ సునీల్ రావు, బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం, కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ బోయినిపల్లి ప్రవీణ్ రావు లను అరెస్ట్ చేసి బలవంతంగా స్టేషన్ కు తరలిస్తున్న పోలీసులు నీళ్లను వదిలేదాకా ఉద్యమాన్ని కొనసాగిస్తాం... నిమజ్జనానికి నీళ్లివ్వాలని అడిగితే లాఠీలతో కొట్టిస్తారా? పోలీసుల లాఠీఛార్జ్ హేయనీయం
    3
    BJP కార్యకర్తలపై పోలీసుల లాఠీఛార్జ్
చింతకుంట కెనాల్ వద్ద ఉద్రిక్తత
ధర్నా చేస్తున్న బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్న పోలీసులు
పోలీసుల తీరుపై బీజేపీ కార్యకర్తల ఆగ్రహం ఏసీపీ విజయ్ కుమార్, కొత్తపల్లి సీఐ కోటేశ్ తీరుపై మండిపడుతున్న కార్యకర్తలు
కరీంనగర్ డిప్యూటీ మేయర్ సునీల్ రావు, బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం, కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ బోయినిపల్లి ప్రవీణ్ రావు లను  అరెస్ట్ చేసి బలవంతంగా స్టేషన్ కు తరలిస్తున్న పోలీసులు
నీళ్లను వదిలేదాకా ఉద్యమాన్ని కొనసాగిస్తాం... నిమజ్జనానికి నీళ్లివ్వాలని అడిగితే లాఠీలతో కొట్టిస్తారా?
పోలీసుల లాఠీఛార్జ్ హేయనీయం
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    5 hrs ago
  • మంచిర్యాల:పెద్దపల్లి అభివృద్ధికి ఎంపీ వంశీకృష్ణ ప్రత్యేక చొరవ తొమ్మిది RUBల పనులు త్వరితగతిన పూర్తి చేయాలని రైల్వే అధికారులకు విజ్ఞప్తి పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రజల భద్రత, మెరుగైన రవాణా సౌకర్యాలు, మౌలిక వసతుల అభివృద్ధికి ఎంపీ వంశీకృష్ణ ప్రత్యేక దృష్టి సారించారు. నియోజకవర్గ పరిధిలోని తొమ్మిది RUBల (రోడ్ అండర్ బ్రిడ్జిలు) నిర్మాణ పనులపై రైల్వే అధికారులతో ప్రత్యేకంగా చర్చించారు.ముఖ్యంగా LC-30, LC-35, LC-37 ప్రాంతాల్లో సహజ నీటి ప్రవాహానికి డ్రైనేజీ సౌకర్యం లేక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికే మంజూరైన RUBలు, అప్రోచ్ రోడ్ల పనులను వేగవంతం చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.దీనిపై రైల్వే బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్పందిస్తూ తక్షణ చర్యలు చేపట్టి, వచ్చే ఏడాదిలోగా పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఎంపీ వంశీకృష్ణ తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా పెద్దపల్లి నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు.
    1
    మంచిర్యాల:పెద్దపల్లి అభివృద్ధికి ఎంపీ వంశీకృష్ణ ప్రత్యేక చొరవ

తొమ్మిది RUBల పనులు త్వరితగతిన పూర్తి చేయాలని రైల్వే అధికారులకు విజ్ఞప్తి
పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రజల భద్రత, మెరుగైన రవాణా సౌకర్యాలు, మౌలిక వసతుల అభివృద్ధికి ఎంపీ వంశీకృష్ణ ప్రత్యేక దృష్టి సారించారు. నియోజకవర్గ పరిధిలోని తొమ్మిది RUBల (రోడ్ అండర్ బ్రిడ్జిలు) నిర్మాణ పనులపై రైల్వే అధికారులతో ప్రత్యేకంగా చర్చించారు.ముఖ్యంగా LC-30, LC-35, LC-37 ప్రాంతాల్లో సహజ నీటి ప్రవాహానికి డ్రైనేజీ సౌకర్యం లేక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికే మంజూరైన RUBలు, అప్రోచ్ రోడ్ల పనులను వేగవంతం చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.దీనిపై రైల్వే బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్పందిస్తూ తక్షణ చర్యలు చేపట్టి, వచ్చే ఏడాదిలోగా పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఎంపీ వంశీకృష్ణ తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా పెద్దపల్లి నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు.
    user_Naveen journalist
    Naveen journalist
    Local News Reporter Jannaram, Mancherial•
    2 hrs ago
  • కరీంనగర్‌లో దొంగల హల్‌చల్.. గ్యాస్ కట్టర్లతో రెండు ఏటీఎంలు లూటీ కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దుర్శేడ్, ఎల్‌ఎండీ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మాపూర్‌లో ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంలలో ఈ చోరీలు జరిగాయి. దుర్శేడ్ ఏటీఎంలోకి తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో కారులో వచ్చిన ఇద్దరు దుండగులు, వారిలో ఒక మహిళ కూడా ఉన్నట్లు సీసీటీవీ ఫుటేజీ ద్వారా పోలీసులు గుర్తించారు. ఏటీఎంలోకి ప్రవేశించగానే వారు సీసీ కెమెరాలపై ఒక రకమైన ద్రవాన్ని చల్లి, ఆ తర్వాత గ్యాస్ కట్టర్‌తో మిషన్‌ను కట్ చేశారు. ఈ ఏటీఎం నుంచి సుమారు రూ.8 లక్షలు అపహరించినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. తిమ్మాపూర్ ఏటీఎంలో ఎంత నగదు పోయిందనేది ఇంకా తెలియరాలేదు. దొంగతనానికి పాల్పడినప్పుడు నిందితులు టోపీలు, కళ్లద్దాలు, మాస్కులు, గ్లోవ్‌లు ధరించి తమ గుర్తింపు తెలియకుండా జాగ్రత్తపడ్డారు. దుర్శేడ్ ఏటీఎంలో చోరీ జరుగుతున్న సమయంలోనే ఎస్‌బీఐ ఢిల్లీ కార్యాలయానికి అలారం వెళ్లింది. దీంతో వారు స్థానిక అధికారులను అప్రమత్తం చేశారు. ఈ ఘటనలపై పోలీసులు రెండు వేర్వేరు కేసులు నమోదు చేసి, దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఘటనా స్థలంలో లభించిన ఆధారాలతో పాటు సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా విశ్లేషిస్తున్నారు. దొంగలు మహారాష్ట్ర రిజిస్ట్రేషన్‌తో ఉన్న వాహనాన్ని ఉపయోగించినట్లు గుర్తించారు. ఈ వాహనాన్ని ట్రేస్ చేయడానికి టోల్‌ప్లాజాల వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజీలను కూడా పరిశీలిస్తున్నారు. ఇటీవల కాలంలో తెలంగాణలో ఏటీఎం దొంగతనాలు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. గత మే నెలలో మహబూబ్‌నగర్‌లో ఇలాగే ఒక ఎస్‌బీఐ ఏటీఎంను గ్యాస్ కట్టర్‌తో కోసి రూ. 2.30 లక్షలు ఎత్తుకెళ్లారు. వరుసగా జరుగుతున్న ఈ ఘటనల నేపథ్యంలో ఏటీఎంల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసే విషయంపై పోలీసు అధికారులు బ్యాంకు అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు.
    1
    కరీంనగర్‌లో దొంగల హల్‌చల్.. గ్యాస్ కట్టర్లతో రెండు ఏటీఎంలు లూటీ
కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దుర్శేడ్, ఎల్‌ఎండీ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మాపూర్‌లో ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంలలో ఈ చోరీలు జరిగాయి. దుర్శేడ్ ఏటీఎంలోకి తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో కారులో వచ్చిన ఇద్దరు దుండగులు, వారిలో ఒక మహిళ కూడా ఉన్నట్లు సీసీటీవీ ఫుటేజీ ద్వారా పోలీసులు గుర్తించారు. 
ఏటీఎంలోకి ప్రవేశించగానే వారు సీసీ కెమెరాలపై ఒక రకమైన ద్రవాన్ని చల్లి, ఆ తర్వాత గ్యాస్ కట్టర్‌తో మిషన్‌ను కట్ చేశారు. ఈ ఏటీఎం నుంచి సుమారు రూ.8 లక్షలు అపహరించినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. తిమ్మాపూర్ ఏటీఎంలో ఎంత నగదు పోయిందనేది ఇంకా తెలియరాలేదు.
దొంగతనానికి పాల్పడినప్పుడు నిందితులు టోపీలు, కళ్లద్దాలు, మాస్కులు, గ్లోవ్‌లు ధరించి తమ గుర్తింపు తెలియకుండా జాగ్రత్తపడ్డారు. దుర్శేడ్ ఏటీఎంలో చోరీ జరుగుతున్న సమయంలోనే ఎస్‌బీఐ ఢిల్లీ కార్యాలయానికి అలారం వెళ్లింది. దీంతో వారు స్థానిక అధికారులను అప్రమత్తం చేశారు.
ఈ ఘటనలపై పోలీసులు రెండు వేర్వేరు కేసులు నమోదు చేసి, దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఘటనా స్థలంలో లభించిన ఆధారాలతో పాటు సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా విశ్లేషిస్తున్నారు. దొంగలు మహారాష్ట్ర రిజిస్ట్రేషన్‌తో ఉన్న వాహనాన్ని ఉపయోగించినట్లు గుర్తించారు. ఈ వాహనాన్ని ట్రేస్ చేయడానికి టోల్‌ప్లాజాల వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజీలను కూడా పరిశీలిస్తున్నారు.
ఇటీవల కాలంలో తెలంగాణలో ఏటీఎం దొంగతనాలు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. గత మే నెలలో మహబూబ్‌నగర్‌లో ఇలాగే ఒక ఎస్‌బీఐ ఏటీఎంను గ్యాస్ కట్టర్‌తో కోసి రూ. 2.30 లక్షలు ఎత్తుకెళ్లారు. వరుసగా జరుగుతున్న ఈ ఘటనల నేపథ్యంలో ఏటీఎంల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసే విషయంపై పోలీసు అధికారులు బ్యాంకు అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు.
    user_Bellamplly Ashok kumar
    Bellamplly Ashok kumar
    Local News Reporter Kotapally, Mancherial•
    23 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.