Shuru
Apke Nagar Ki App…
ధర్మపురి వినాయక నిమజ్జనం లో నృత్యం చేసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ జగిత్యాల జిల్లా ధర్మపురిలో వైభవంగా వినాయక నిమర్జన శోభాయాత్ర..శోభాయాత్ర లో నృత్యం చేసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్
Ntv నాగరాజు
ధర్మపురి వినాయక నిమజ్జనం లో నృత్యం చేసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ జగిత్యాల జిల్లా ధర్మపురిలో వైభవంగా వినాయక నిమర్జన శోభాయాత్ర..శోభాయాత్ర లో నృత్యం చేసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్
More news from తెలంగాణ and nearby areas
- చేను వెంకటి జ్ఞాపకార్ధం తిలక్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాస్టర్ అథ్లెటిక్స్ పోటీలు బెల్లంపల్లి పట్టణంలోని తిలక్ గ్రౌండ్ లో క్రి. శే. చేను వెంకటి జ్ఞాపకార్ధం వారి కుమారుడు, న్యాయవాది చేను రవి కుమార్ సహకారంతో ఆదివారం తిలక్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాస్టర్ అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు రూరల్ సీఐ హనుక్ , విశ్రాంత అదనపు ఎస్పీ పుల్లాల రవికుమార్, 1టౌన్ ఎస్సై ముఖ్య అతిథులుగా హాజరై పోటీలను ప్రారంభించారు. అనంతరం 50 సంవత్సరాలు దాటిన క్రీడాకారులు యువకుల వలె స్పీడు వాక్, రన్నింగ్, షాట్ పుట్, టాగ్ అఫ్ వార్, తదితర పోటీలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథులు మాట్లాడుతూ 50 ఏళ్ళు పై బడిన అనంతరం కూడా క్రీడా స్ఫూర్తితో అన్ని ఆటల పోటిల్లో పాల్గొనడం అభినందనీయమని అన్నారు. నేటి యువత మొబైల్ ఫోన్లు ట్రక్స్ బారిన పడకుండా వీరిని చూసి పూర్తి పొంది వ్యాయామం క్రీడల వైపు మొగ్గు చూపాలని కోరారు. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని శారీరకద్రత్వాన్ని అందిస్తాయని వారు సూచించారు. క్రీడా పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. సీనియర్ క్రీడాకారులు యాదండ్ల నర్సయ్య, తోట పోచన్న, మాదాసి గోపాల్, గోవర్ధన్ లను ఘనంగా సన్మానించారు. ఆటల పోటీలకు పిడి లు రాజ్ మహమ్మద్, బండి రవి, చంద్ పాషా, లు సహకారం అందించారు. వారికీ ధన్యవాదములు తెలిపారు ఈ కార్యక్రమం లో వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రంగ రామన్న, ప్రధాన కార్యదర్శి కంటే వాడ నగేష్, కోశాధికారి కజ్జం రమేష్, సభ్యులు పాల్గొన్నారు4
- గణనాధులకు 108 ప్రసాదాలతో ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు జన్నారం మండల కేంద్రంలోని వివిధ కాలనీలలో ఏర్పాటుచేసిన గణనాధులకు భక్తులు 108 ప్రసాదాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జన్నారం పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయక విగ్రహానికి సంఘం సభ్యులు కులస్తులు గణనాథుని విగ్రహానికి 108 ప్రసాదాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే రామ్ నగర్ లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద కూడా నిర్వాహకులు 108 ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించారు.1
- గోదావరి వంతెనపై గణేష్ నిమజ్జనం, శోభాయాత్ర మార్గాన్ని పరిశీలించిన పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ పరిధిలోని గోదావరిఖని, రామగుండం పారిశ్రామిక ప్రాంతాల్లో గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పోలీసు అధికారులతో కలిసి పరిశీలించారు.గణేష్ నిమజ్జనం గోదావరి వంతెనపై నిర్వహించనున్న నేపథ్యంలో పోలీసు సిబ్బంది,బందోబస్తు ఏర్పాట్లు,మంచినీటి వసతి,గజఈతగాళ్ల ఏర్పాటు,విద్యుత్ దీపాల సౌకర్యం తదితర ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంతో పాటు మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్, రామకృష్ణాపూర్, జైపూర్ ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో గణేష్ విగ్రహాలు నిమజ్జనానికి రానున్నందున ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. నిమజ్జనానికి వచ్చే వాహనాల రాకపోకల మార్గాలు, అవసరమైన చోట్ల చేపట్టాల్సిన ట్రాఫిక్ మళ్లింపు ప్రాంతాలను పరిశీలించి అధికారులకు తగిన సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.నిమజ్జన కార్యక్రమానికి సంబంధించిన అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు పూర్తి చేయాలని, ఈసారి మరింత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టి నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించాలని పోలీసు అధికారులకు పోలీస్ కమిషనర్ సూచించారు.1
- గణేశ్ నిమజ్జనానికి వెంటనే నీటిని విడుదల చేయాలి ‘ఛలో చింతకుంట’లో ధ్వజమెత్తిన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు గణేశ్ నిమజ్జన ఉత్సవాలను పురస్కరించుకుని ఎస్సారెస్పీ/ఎల్ఎండీ కాలువలకు వెంటనే నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ సమీపంలోని చింతకుంట కెనాల్ వద్ద బిజెపి జిల్లా శాఖ సాయిని మల్లేశం ఆధ్వర్యంలో నిర్వహించిన ‘‘ఛలో చింతకుంట’’ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు గారు పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మనం ఏ పని చేపట్టినా విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా కొనసాగాలని మొట్టమొదట వేడుకునేది విఘ్నేశ్వరుడినే. ఇయాళ ఆ విఘ్నేశ్వరుడి నిమజ్జనానికే కాంగ్రెస్ ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు స్రుష్టించడం బాధాకరం. మనందరికీ తెలుసు ....తెలంగాణలో గణేశ్ నిమజ్జనం అంటే కేవలం ఒక పండుగ కాదు... ఇది మన సంస్కృతి, మన సంప్రదాయం, మన భక్తి, మన సామూహిక ఆధ్యాత్మిక ఉత్సవం. హిందువులంతా ఐకమత్యంగా జరుపుకునే గొప్ప పండుగ. ఊరూవాడా గల్లీగల్లీలో ప్రతి ఒక్క హిందువు గణేశ్ ను ప్రతిష్టించుకుని నిర్వహించుకునే ఈ నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం నయా పైసా ఇయ్యలేదు. ఇతర మతాల పండుగల నిర్వహణకు మాత్రం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నరు. అయినా భరించాం. కానీ ఇయాళ గణపతిని నిమజ్జనం చేయడానికి నీళ్లు విడుదల చేయాలని 10 రోజుల నుండి అడుగుతున్నం. ఇరిగేషన్ అధికారులతోపాటు జిల్లా కలెక్టర్, రాష్ట్ర మంత్రికి విజ్ఝప్త చేసినం. కానీ ఇప్పటి వరకు చుక్క నీరు కూడా విడుదల చేయలేదు. నేనడుగుతున్నా.... కాలువల్లో నీళ్లు లేవు. ఎండిపోయినయ్. “నిమజ్జనం ఎక్కడ చేయాలి?”. ఇప్పుడు నీళ్లు వదిలితే తాగడానికి నీళ్లుండవని రాష్ట్ర ప్రభుత్వం కుంటి సాకులు చెప్పడం ఎంత వరకు సమంజసం? ఎస్సారెస్పీ లో 47 టీఎంసీలకు పైగా నీళ్లున్నయ్. నీళ్లు వదలడానికి ఇబ్బంది ఏంది? గణేశ్ నిమజ్జనానికి అర టీఎంసీ నీళ్లు వదిలితే చాలు. గతంలో ఎస్సారెస్పీలో 17 టీఎంసీలు మాత్రమే నీళ్లు నిల్వ ఉన్నప్పుడు కూడా నీళ్లు వదిలారు కదా? మరి ఇప్పుడెందుకు వదలడం లేదు? గత 30 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా భక్తులను ఎందుకు ఆందోళనకు గురి చేస్తున్నరు? ‘‘కేబినెట్ లో సీఎంకు, కొందరు మంత్రులకు పడటం లేదు. ఎవరికి వాళ్లే సీఎం కుర్చీలో కూర్చోవాలనుకుంటున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా తానే సీఎం అని భావిస్తున్నారు. కాలువలకు నీళ్లు వదలకపోతే సీఎంకు చెడ్డ పేరొస్తది, హైకమాండ్ రేవంత్ రెడ్డి దించేస్తే తానే సీఎం సీట్లో కూర్చోవాలని అనుకుంటున్నారేమో... మీ కొట్లాటలు మాకు అనవసరం. మాకు నీళ్లివ్వండి. గణేష్ నిమజ్జనాన్ని భక్తియుత వాతావరణంలో ప్రశాంతంగా జరుపుకునే అవకాశం కల్పించాలని కోరుతున్నా...’’అని చెప్పండి. ఇదిగో....కరీంనగర్‌లో చింతకుంట కాలువ. చుక్క నీరు లేదు. ఇక్కడికి వందలాది గణేశ్ విగ్రహాలు నిమజ్జనం కోసం వస్తాయి. నీళ్లు లేకుండా ఆ గణపతులను ఏం చేయాలి? ఇక్కడే రోడ్లపై వదిలి వెళ్లాలా? ఒక్క చింతకుంటే కాదు, ఎస్సారెస్పీ పరిధిలోని దాదాపు అన్ని కాలువల్లోనూ ఇదే పరిస్థితి. ఏటా ఆయా కాలువల్లో నిమజ్జనం చేసే వాళ్ల పరిస్థితి ఏంది? కావాల్సినన్ని నీళ్లున్నా పంటలకు నీళ్లు వదలడం లేదు. పంటలు ఎండిపోయి రైతులు ఆగమవుతున్నా పట్టించుకోరు. చివరకు భక్తుల మనోభావాలను కూడా పట్టించుకోరు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? గణేశ్ నిమజ్జనం తేదీలు ముందే తెలియవా? ఎక్కడెక్కడ నిమజ్జనాలు జరుగుతాయో అధికారులకు ముందే తెలియదా? ఆ ప్రాంతాల్లో నీటి లభ్యతను ముందుగానే ఎందుకు అంచనా వేయలేదు? అవసరమైన చోట్ల రిజర్వాయర్లు, కాలువలు, చెరువులకు నీటిని ఎందుకు మళ్లించలేదు? రైతుల పంటలను కాపాడటానికి సమగ్ర నీటి విడుదల ప్రణాళిక ఎందుకు లేదు? భక్తులకు చివరి నిమిషంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఎందుకు చెబుతున్నారు? “తెలంగాణలో గణపతిని నిమజ్జనం చేయడానికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి రావాలా?”. తెలంగాణ ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి హిందువులే కదా? గణేశ్ నిమజ్జన ప్రాముఖ్యత, హిందువుల మనోభావాలు వాళ్లకు తెలియవా? ఇదేం పద్దతి. ఎన్నికల సమయంలో ప్రజల దగ్గరకు వెళ్లి ఎన్నో హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన హామీలను గాలికొదిలేశారు. ఇప్పుడు నిమజ్జనానికి కూడా నీళ్లవ్వకుండా వేధిస్తున్నరు. హిందువులంటే కాంగ్రెస్ కు అంత చులకన ఎందుకు? హిందువులు ఓటర్లు కాదా? వాళ్ల ఓట్లు అవసరం లేదా? గణేశ్ నిమజ్జనానికి కూడా నీళ్లు వదలండి మహాప్రభో వేడుకోవాల్సిన దుస్థితి కలిగిస్తారా? బీజేపీ పక్షాన, హిందువుల పక్షాన మేం కోరేదొక్కటే. తక్షణమే గణేశ్ నిమజ్జనానికి సరిపడ నీళ్లను విడుదల చేయాలి. నిమజ్జనానికి ఏ అటంకం లేకుండా భక్తిపారవశ్యంతో గణేష్ నిమజ్జనమయ్యేలా చూడాలి. అట్లాగే ప్రభుత్వం వెంటనే SRSP, కాకతీయ కాలువలు, స్థానిక చెరువులు, నిమజ్జన ప్రాంతాలకు అవసరమైన నీటి విడుదలపై అత్యవసర ప్రణాళిక ప్రకటించాలి. ఏ ప్రాంతంలో ఎంత నీరు అవసరం? ఎక్కడి నుంచి ఎంత నీరు విడుదల చేస్తారు? ఎప్పుడు చేరుతుంది? నిమజ్జనానికి సురక్షితమైన ప్రాంతాలు ఏవి? .....అనే అంశాలపై ప్రభుత్వం ప్రజలకు స్పష్టంగా చెప్పాలి. చివరగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. సాయంత్రంలోపు నిమజ్జనానికి నీళ్లు విడుదల చేయకపోతే....కాంగ్రెస్ ను రాజకీయ నిమజ్జనం చేస్తాం. హిందువుల దమ్మేందో చూపిస్తాం. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్పొరేటర్లు బోయినపల్లి ప్రవీణ్ రావు, బండారి వేణు, గాజ శివరాం, ఎన్నం ప్రకాష్, ఏపీపీ చంద్ర (టీంకు), చొప్పరి జయశ్రీ, బండ రమణ రెడ్డి, సౌగాని కొమురయ్య, సోమిడి వేణు,బీజేపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..3
- శాంతిఖని బస్తీలో గణపతి నవరాత్రుల సందర్భంగా అన్నదాన కార్యక్రమం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని శాంతికని బస్సులో గణపతి నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా ఏర్పాటుచేసిన గణనాధుని వద్ద బస్తీ ప్రజలు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి బస్తి లోని యువత ప్రజలు ప్రతి ఒక్కరు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ముందుగా గణనాథుని వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు తీసుకున్నారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి భక్తులకు అన్నదానం చేశారు కార్యక్రమంలో బస్తీ ప్రజలు భక్తులు తదితరులు పాల్గొన్నారు2
- కరీంనగర్ మున్సిపల్ సిబ్బందికి ట్రై సైకిల్స్, ఫాగ్ మిషన్స్ అందజేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలో మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, స్థానిక కార్పొరేటర్లతో కలిసి కేంద్ర మంత్రి బండి సంజయ్ మున్సిపల్ శానిటేషన్ సిబ్బందికి నూతనంగా కొనుగోలు చేసిన ట్రైసైకిల్స్, ఫాగ్ మిషన్స్ ను అందజేశారు. అనంతరం వారితో కలిసి మీడియాతో మాట్లాడారు. కరీంనగర్ లో చెత్త సేకరణ కోసం ప్రతి డివిజన్ కు ఒక ట్రై సైకిల్ ను మున్సిపల్ సిబ్బందికి అందజేస్తున్నాం. కొత్తగా కొనుగోలు చేసిన ఫాగ్ మిషన్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నాం. అదనంగా ట్రాక్టర్లను కొనుగోలు చేస్తున్నాం. కరీంనగర్ లో డంపింగ్ యార్డ్ సమస్యను పరిష్కరించబోతున్నాం.1
- రూ.9,99,999 విలువైన కరెన్సీ నోట్లతో గణపతి అలంకరణ-అలంకరణను చూసేందుకు భక్తుల తాకిడి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ఆర్యవైశ్య భవనంలో రూ.9,99,999 విలువైన కరెన్సీ నోట్లతో గణపతి అలంకరణ రూ.20, రూ.50, రూ.100, రూ.500 నోట్లు – సరికొత్త కరెన్సీ తో తీర్చిదిద్దిన గణనాథుడు ఈ ప్రత్యేక అలంకరణను చూసేందుకు సుల్తానాబాద్‌తో పాటు పరిసర గ్రామాల నుంచి భక్తుల తాకిడి1
- సింగరేణి మారుపేర్ల సమస్య పరిష్కారంపై కమిటీ ఏర్పాటుకు కృషి చేసిన ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన సింగరేణి మారుపేర్ల బాధితులు సింగరేణి మారుపేర్ల సమస్య పరిష్కారానికి శాసనమండలిలో సమస్యను ప్రస్తావించి, కమిటీ ఏర్పాటు దిశగా కృషి చేసిన రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ గారికి కృతజ్ఞతగా రామగుండం ప్రాంతానికి చెందిన మారుపేర్ల బాధితులు ఆదివారం గోదావరిఖని గాంధీ చౌరస్తాలో పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా సింగరేణి మారుపేర్ల సంఘం అధ్యక్షుడు లక్కా శ్రావణ్ గౌడ్ మాట్లాడుతూ, గత కొన్ని సంవత్సరాలుగా సింగరేణి మారుపేర్ల సమస్యతో బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సమస్య పరిష్కారం కోసం అనేక పాదయాత్రలు, సింగరేణి కార్యాలయాల ముట్టడులు, నిరసనలు, అమర నిరాహార దీక్షలు వంటి వివిధ ప్రజాస్వామ్య ఉద్యమాలను కొనసాగించామని అన్నారు. ఒకవైపు ఉద్యమాలను కొనసాగిస్తూనే, మరోవైపు శాంతియుతంగా తమ సమస్యలను ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లామని, పలుమార్లు మెమోరాండాలు అందజేసి తమ బాధలను వివరించామని శ్రావణ్ గౌడ్ తెలిపారు. బాధితుల సమస్యను అర్థం చేసుకున్న రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ గారు శాసనమండలిలో ఈ అంశాన్ని ప్రస్తావించి, కమిటీ ఏర్పాటు దిశగా కృషి చేయడం అభినందనీయమని అన్నారు. కమిటీ ఏర్పాటు ప్రక్రియ కొంతవరకు ముందుకు సాగిందని, అయితే ఇంకా పూర్తిస్థాయిలో పూర్తి కాలేదని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న కమిటీ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి, అర్హులైన మారుపేర్ల బాధితుల కుటుంబాలకు త్వరగా ఉద్యోగ నియామక పత్రాలు అందజేయాలని లక్కా శ్రావణ్ గౌడ్ కోరారు. అలాగే ఈ సమస్యను పలుమార్లు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లిన INTUC నాయకుడు జనక్ ప్రసాద్, రామగుండం కార్పొరేషన్ మేయర్ మహంకాళి స్వామి కి,ఎమ్మెల్యే మక్కన్ సింగ్ కు, అలాగే ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గార్లకు మారుపేర్ల బాధితుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మారుపేర్ల బాధితులు ఎమ్మెల్యే మక్కన్ సింగ్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి తమ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగరేణి మారుపేర్ల సంఘం అధ్యక్షుడు లక్కా శ్రావణ్ గౌడ్, దన్నాడ రాజు, డిష్ బాబు, తిరుమల శ్రీనివాస్, ఇంజంపల్లి ఓం ప్రకాశ్, పుట్ట అనిల్ కుమార్, షేక్ బాబర్, శేఖర్, రవి, గుర్రం సుధాకర్, రమేష్, అంజయ్య,హరీష్ యాదవ్ తదితర మారుపేర్ల బాధితులు, కార్మికులు, రిటైర్డ్ కార్మికులు పాల్గొన్నారు.1
- సీఎం మనసు మారేలా చూడాలని గణనాధునికి గల్ఫ్ కార్మికుల వేడుకోలు గల్ఫ్ కార్మికుల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి మనసు మారేలా చూడాలని కోరుకుంటూ దుబాయ్ దేశంలో గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం సీఎం గతంలో ఇచ్చిన 'గల్ఫ్ అండ్ ఓవర్సీస్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డును' ఏర్పాటు చేయాలని కోరుతూ వినాయక విగ్రహానికి ఐదు రోజులుగా పూజలు నిర్వహించి నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి అధ్యక్షులు కల్లెడ భూమయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహ్మద్ అలీమ్, కడం మండల ఇంచార్జ్ ధర్మాజీ సత్తన్న, జుంబర్తి గంగాధర్, కోఆర్డినేటర్ కునారపు రమేష్, కరుణాకరణ్, మనోజ్, తిరుపతి, నరసయ్య, రాజన్న సాయి నారాయణ, నవీన్ కుమార్, విజయ్ నరేష్ మణికంఠ శ్రీనివాస్ సత్తన్న నంబయ్య,రామన్న, శశి రణధీర్, భినేష్, రాజేందర్ శ్రీధర్, కార్మికులు పాల్గొన్నారు.1