సింగరేణి మారుపేర్ల సమస్య పరిష్కారంపై కమిటీ ఏర్పాటుకు కృషి చేసిన ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన సింగరేణి మారుపేర్ల బాధితులు సింగరేణి మారుపేర్ల సమస్య పరిష్కారానికి శాసనమండలిలో సమస్యను ప్రస్తావించి, కమిటీ ఏర్పాటు దిశగా కృషి చేసిన రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ గారికి కృతజ్ఞతగా రామగుండం ప్రాంతానికి చెందిన మారుపేర్ల బాధితులు ఆదివారం గోదావరిఖని గాంధీ చౌరస్తాలో పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా సింగరేణి మారుపేర్ల సంఘం అధ్యక్షుడు లక్కా శ్రావణ్ గౌడ్ మాట్లాడుతూ, గత కొన్ని సంవత్సరాలుగా సింగరేణి మారుపేర్ల సమస్యతో బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సమస్య పరిష్కారం కోసం అనేక పాదయాత్రలు, సింగరేణి కార్యాలయాల ముట్టడులు, నిరసనలు, అమర నిరాహార దీక్షలు వంటి వివిధ ప్రజాస్వామ్య ఉద్యమాలను కొనసాగించామని అన్నారు. ఒకవైపు ఉద్యమాలను కొనసాగిస్తూనే, మరోవైపు శాంతియుతంగా తమ సమస్యలను ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లామని, పలుమార్లు మెమోరాండాలు అందజేసి తమ బాధలను వివరించామని శ్రావణ్ గౌడ్ తెలిపారు. బాధితుల సమస్యను అర్థం చేసుకున్న రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ గారు శాసనమండలిలో ఈ అంశాన్ని ప్రస్తావించి, కమిటీ ఏర్పాటు దిశగా కృషి చేయడం అభినందనీయమని అన్నారు. కమిటీ ఏర్పాటు ప్రక్రియ కొంతవరకు ముందుకు సాగిందని, అయితే ఇంకా పూర్తిస్థాయిలో పూర్తి కాలేదని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న కమిటీ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి, అర్హులైన మారుపేర్ల బాధితుల కుటుంబాలకు త్వరగా ఉద్యోగ నియామక పత్రాలు అందజేయాలని లక్కా శ్రావణ్ గౌడ్ కోరారు. అలాగే ఈ సమస్యను పలుమార్లు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లిన INTUC నాయకుడు జనక్ ప్రసాద్, రామగుండం కార్పొరేషన్ మేయర్ మహంకాళి స్వామి కి,ఎమ్మెల్యే మక్కన్ సింగ్ కు, అలాగే ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గార్లకు మారుపేర్ల బాధితుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మారుపేర్ల బాధితులు ఎమ్మెల్యే మక్కన్ సింగ్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి తమ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగరేణి మారుపేర్ల సంఘం అధ్యక్షుడు లక్కా శ్రావణ్ గౌడ్, దన్నాడ రాజు, డిష్ బాబు, తిరుమల శ్రీనివాస్, ఇంజంపల్లి ఓం ప్రకాశ్, పుట్ట అనిల్ కుమార్, షేక్ బాబర్, శేఖర్, రవి, గుర్రం సుధాకర్, రమేష్, అంజయ్య,హరీష్ యాదవ్ తదితర మారుపేర్ల బాధితులు, కార్మికులు, రిటైర్డ్ కార్మికులు పాల్గొన్నారు.
సింగరేణి మారుపేర్ల సమస్య పరిష్కారంపై కమిటీ ఏర్పాటుకు కృషి చేసిన ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన సింగరేణి మారుపేర్ల బాధితులు సింగరేణి మారుపేర్ల సమస్య పరిష్కారానికి శాసనమండలిలో సమస్యను ప్రస్తావించి, కమిటీ ఏర్పాటు దిశగా కృషి చేసిన రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ గారికి కృతజ్ఞతగా రామగుండం ప్రాంతానికి చెందిన మారుపేర్ల బాధితులు ఆదివారం గోదావరిఖని గాంధీ చౌరస్తాలో పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా సింగరేణి మారుపేర్ల సంఘం అధ్యక్షుడు లక్కా శ్రావణ్ గౌడ్ మాట్లాడుతూ, గత కొన్ని సంవత్సరాలుగా సింగరేణి మారుపేర్ల సమస్యతో బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సమస్య పరిష్కారం కోసం అనేక పాదయాత్రలు, సింగరేణి కార్యాలయాల ముట్టడులు, నిరసనలు, అమర నిరాహార దీక్షలు వంటి వివిధ ప్రజాస్వామ్య ఉద్యమాలను కొనసాగించామని అన్నారు. ఒకవైపు ఉద్యమాలను కొనసాగిస్తూనే, మరోవైపు శాంతియుతంగా తమ సమస్యలను ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లామని, పలుమార్లు మెమోరాండాలు అందజేసి తమ బాధలను వివరించామని శ్రావణ్ గౌడ్ తెలిపారు. బాధితుల సమస్యను అర్థం చేసుకున్న రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ గారు శాసనమండలిలో ఈ అంశాన్ని ప్రస్తావించి, కమిటీ ఏర్పాటు దిశగా కృషి చేయడం అభినందనీయమని అన్నారు. కమిటీ ఏర్పాటు ప్రక్రియ కొంతవరకు ముందుకు సాగిందని, అయితే ఇంకా పూర్తిస్థాయిలో పూర్తి కాలేదని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న కమిటీ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి, అర్హులైన మారుపేర్ల బాధితుల కుటుంబాలకు త్వరగా ఉద్యోగ నియామక పత్రాలు అందజేయాలని లక్కా శ్రావణ్ గౌడ్ కోరారు. అలాగే ఈ సమస్యను పలుమార్లు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లిన INTUC నాయకుడు జనక్ ప్రసాద్, రామగుండం కార్పొరేషన్ మేయర్ మహంకాళి స్వామి కి,ఎమ్మెల్యే మక్కన్ సింగ్ కు, అలాగే ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గార్లకు మారుపేర్ల బాధితుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మారుపేర్ల బాధితులు ఎమ్మెల్యే మక్కన్ సింగ్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి తమ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగరేణి మారుపేర్ల సంఘం అధ్యక్షుడు లక్కా శ్రావణ్ గౌడ్, దన్నాడ రాజు, డిష్ బాబు, తిరుమల శ్రీనివాస్, ఇంజంపల్లి ఓం ప్రకాశ్, పుట్ట అనిల్ కుమార్, షేక్ బాబర్, శేఖర్, రవి, గుర్రం సుధాకర్, రమేష్, అంజయ్య,హరీష్ యాదవ్ తదితర మారుపేర్ల బాధితులు, కార్మికులు, రిటైర్డ్ కార్మికులు పాల్గొన్నారు.
- చేను వెంకటి జ్ఞాపకార్ధం తిలక్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాస్టర్ అథ్లెటిక్స్ పోటీలు బెల్లంపల్లి పట్టణంలోని తిలక్ గ్రౌండ్ లో క్రి. శే. చేను వెంకటి జ్ఞాపకార్ధం వారి కుమారుడు, న్యాయవాది చేను రవి కుమార్ సహకారంతో ఆదివారం తిలక్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాస్టర్ అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు రూరల్ సీఐ హనుక్ , విశ్రాంత అదనపు ఎస్పీ పుల్లాల రవికుమార్, 1టౌన్ ఎస్సై ముఖ్య అతిథులుగా హాజరై పోటీలను ప్రారంభించారు. అనంతరం 50 సంవత్సరాలు దాటిన క్రీడాకారులు యువకుల వలె స్పీడు వాక్, రన్నింగ్, షాట్ పుట్, టాగ్ అఫ్ వార్, తదితర పోటీలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథులు మాట్లాడుతూ 50 ఏళ్ళు పై బడిన అనంతరం కూడా క్రీడా స్ఫూర్తితో అన్ని ఆటల పోటిల్లో పాల్గొనడం అభినందనీయమని అన్నారు. నేటి యువత మొబైల్ ఫోన్లు ట్రక్స్ బారిన పడకుండా వీరిని చూసి పూర్తి పొంది వ్యాయామం క్రీడల వైపు మొగ్గు చూపాలని కోరారు. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని శారీరకద్రత్వాన్ని అందిస్తాయని వారు సూచించారు. క్రీడా పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. సీనియర్ క్రీడాకారులు యాదండ్ల నర్సయ్య, తోట పోచన్న, మాదాసి గోపాల్, గోవర్ధన్ లను ఘనంగా సన్మానించారు. ఆటల పోటీలకు పిడి లు రాజ్ మహమ్మద్, బండి రవి, చంద్ పాషా, లు సహకారం అందించారు. వారికీ ధన్యవాదములు తెలిపారు ఈ కార్యక్రమం లో వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రంగ రామన్న, ప్రధాన కార్యదర్శి కంటే వాడ నగేష్, కోశాధికారి కజ్జం రమేష్, సభ్యులు పాల్గొన్నారు4
- ధర్మపురి వినాయక నిమజ్జనం లో నృత్యం చేసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ జగిత్యాల జిల్లా ధర్మపురిలో వైభవంగా వినాయక నిమర్జన శోభాయాత్ర..శోభాయాత్ర లో నృత్యం చేసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్1
- BJP కార్యకర్తలపై పోలీసుల లాఠీఛార్జ్ చింతకుంట కెనాల్ వద్ద ఉద్రిక్తత ధర్నా చేస్తున్న బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్న పోలీసులు పోలీసుల తీరుపై బీజేపీ కార్యకర్తల ఆగ్రహం ఏసీపీ విజయ్ కుమార్, కొత్తపల్లి సీఐ కోటేశ్ తీరుపై మండిపడుతున్న కార్యకర్తలు కరీంనగర్ డిప్యూటీ మేయర్ సునీల్ రావు, బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం, కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ బోయినిపల్లి ప్రవీణ్ రావు లను అరెస్ట్ చేసి బలవంతంగా స్టేషన్ కు తరలిస్తున్న పోలీసులు నీళ్లను వదిలేదాకా ఉద్యమాన్ని కొనసాగిస్తాం... నిమజ్జనానికి నీళ్లివ్వాలని అడిగితే లాఠీలతో కొట్టిస్తారా? పోలీసుల లాఠీఛార్జ్ హేయనీయం3
- కరీంనగర్ మున్సిపల్ సిబ్బందికి ట్రై సైకిల్స్, ఫాగ్ మిషన్స్ అందజేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలో మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, స్థానిక కార్పొరేటర్లతో కలిసి కేంద్ర మంత్రి బండి సంజయ్ మున్సిపల్ శానిటేషన్ సిబ్బందికి నూతనంగా కొనుగోలు చేసిన ట్రైసైకిల్స్, ఫాగ్ మిషన్స్ ను అందజేశారు. అనంతరం వారితో కలిసి మీడియాతో మాట్లాడారు. కరీంనగర్ లో చెత్త సేకరణ కోసం ప్రతి డివిజన్ కు ఒక ట్రై సైకిల్ ను మున్సిపల్ సిబ్బందికి అందజేస్తున్నాం. కొత్తగా కొనుగోలు చేసిన ఫాగ్ మిషన్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నాం. అదనంగా ట్రాక్టర్లను కొనుగోలు చేస్తున్నాం. కరీంనగర్ లో డంపింగ్ యార్డ్ సమస్యను పరిష్కరించబోతున్నాం.1
- జగిత్యాల శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు విశేష పూజలు1
- సంచలనం సృష్టించిన యువతి హత్య కేసును ఛేదించిన గోదావరిఖని 1టౌన్ పోలీసులు గోదావరిఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన యువతి మృతి చెందిన కేసును గోదావరిఖని 1 టౌన్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా గుర్తించిన జెట్టి నవీన్ కుమార్, సింగరేణి కాలరీస్ పాలిటెక్నిక్ కాలేజీలో కాంట్రాక్ట్ లెక్చరర్‌గా పనిచేస్తున్న వ్యక్తిని ఈరోజు ఏసిపి ఆధ్వర్యంలో గోదావరిఖని బ్రిడ్జ్, గంగానగర్ ప్రాంతంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదేవిధంగా sccl లో పనిచేస్తున్న ఓవర్ మెన్ బొమ్మకంటి రవి కుమార్ ను ocp -05 మైన్ వద్ద అదుపులోకి తీసుకోడమైనది. *నిందితుల వివరాలు* A-1. జెట్టి నవీన్ కుమార్, తండ్రి పేరు కొమురయ్య, వయస్సు 38 సంవత్సరాలు, ముదిరాజ్, వృత్తి: సింగరేణి కాలరీస్ పాలిటెక్నిక్ కళాశాల, సీసీసీ నస్పూర్‌లో కాంట్రాక్ట్ లెక్చరర్. నివాసం: ఇంటి నం. 7-57/1, జీపీ రావు కాలనీ, గారెపల్లి గ్రామం, సుల్తానాబాద్ మండలం. A-2. బొమ్మకంటి రవి కుమార్, తండ్రి పేరు సత్తయ్య, వయస్సు 35 సంవత్సరాలు, బీసీ-బి (పద్మశాలి), వృత్తి: ఆర్జీ-1 పరిధిలోని జీడీకే 2 & 2A ఇన్‌క్లైన్ మైన్‌లో ఓవర్‌మన్. నివాసం: ఇంటి నం. 3-2, బుద్ధ ఖుర్ద్, బెల్లంపల్లి, మంచిర్యాల జిల్లా. *పోలీసులు స్వాధీనం చేసుకున్న వస్తువులు* - నేరానికి ఉపయోగించిన ఎకోస్పోర్ట్ కారు - నిందితులకు చెందిన రెండు సెల్ఫోన్లు - ట్యాబ్ *వివరాల్లోకి వెళితే...* గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో యువతీ అనుమానస్పద స్థితి లో ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందిన కేసులో రామగుండం పోలీస్ కమీషనర్ గారి ఆదేశాలు మేరకు పెద్దపల్లి డీసీపీ గారి పర్యవేక్షణ లో గోదావరిఖని ఏసిపి మడత రమేష్ శాస్త్రీయ పద్ధతిలో దర్యాప్తు చేపట్టి, సీసీ కెమెరా ఫుటేజీ, కాల్ డేటా, కాల్ రికార్డింగ్స్ సాంకేతిక ఆధారంగా ఆధారాలను విశ్లేషించి కేసును ఛేదించారు. నిందితుడైన నవీన్ కుమార్‌కు ఇప్పటికే భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2022లో సింగరేణి కాలరీస్ పాలిటెక్నిక్ కాలేజీలో చదువుతున్న యువతితో అతనికి పరిచయం ఏర్పడింది. భార్యాభర్తల మధ్య విభేదాల కారణంగా నవీన్ కుమార్ కొంతకాలంగా కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు. కాలేజీకి వచ్చే క్రమంలో యువతితో నిందితుడికి సాన్నిహిత్యం ఏర్పడి, అనంతరం అది ప్రేమ సంబంధంగా మారింది. దాన్ని పెళ్లి వరకు తీసుకుపోవాలని నిందితుడు అనుకున్నాడు. 📌యువతి డిప్లొమా పూర్తి చేసి హైదరాబాద్‌లోని OU యూనివర్సిటీలో బీటెక్ మైనింగ్ చదువుతున్న సమయంలో శిక్షణ నిమిత్తం గోదావరిఖని వచ్చిన సమయం లో బొమ్మకంటి రవికుమార్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో యువతి నిందితుడు నవీన్ కు దూరంగా ఉంటూ రవికుమార్‌తో సన్నిహితంగా ఉండటాన్ని నవీన్ కుమార్ తట్టుకోలేక యువతిపై అతనికి తీవ్ర ఆగ్రహం పెరిగి, ఆమెను హత్య చేయాలని ముందుగానే నిర్ణయించుకొని సెప్టెంబర్ 12, 2026న యువతిని హత్య చేసేందుకు నవీన్ కుమార్ ముందస్తు ప్రణాళిక ప్రకారం . కాలేజీకి వెళ్లే సమయంలో తన స్నేహితుడి ఇంటి వద్ద పురుగుల మందు తీసుకొని, దానిని వాటర్ బాటిల్‌లో నింపుకుని తన ఈకోస్పోర్ట్ కారులో పెట్టుకొని సెప్టెంబర్ 12న సాయంత్రం విధులు ముగించుకుని ఆటోలో వస్తున్న యువతిని ఎఫ్‌సీఐ క్రాస్‌రోడ్స్ వద్ద తన కారులోకి ఎక్కించుకున్నాడు. అనంతరం ఎన్టీపీసీ, ఎఫ్‌సీఎల్, ఐఓసీ ప్రాంతాల్లో కారులో తిప్పుతూ ఆమెతో గొడవపడి, యువతిని మానసికంగా రవికుమార్ చే బలాత్కరించబడినందు వల్లనే ఆత్మహత్య చేసుకుంటున్నానని సూసైడ్ నోట్ రాపించి ఆమె ఫోన్లో ఫోటోలు తీసి, ఈ సమయంలో తీవ్ర ఆగ్రహంతో ముందే సిద్ధం చేసుకున్న పురుగుల మందును బలవంతంగా ఆమె నోట్లో పోశాడు. దీంతో పురుగుల మందు ఆమె గొంతులోకి వెళ్లి కారులోనే స్పృహ కోల్పోయి మృతురాలిని సకాలంలో ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందించే అవకాశం ఉన్నప్పటికీ, తన నేరం వెలుగులోకి వస్తుందనే భయంతో నిందితుడు ఉద్దేశపూర్వకంగా వైద్య సహాయం అందించడంలో జాప్యం చేశాడు. *హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నం* యువతి వెంటనే మృతి చెందకపోవడంతో నిందితుడు కొంతసేపు కారును వివిధ ప్రాంతాల్లో తిప్పుతూ ఆలస్యం చేశాడు. అనంతరం యువతి స్పృహ కోల్పోయిన తర్వాత, ఆమె మొబైల్ ఫోన్ నుంచి తండ్రికి ఫోన్ చేసి, ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు నమ్మించే ప్రయత్నం చేశాడు. రాత్రి సుమారు 7:30 నుంచి 7:45 గంటల మధ్య యువతిని ఆమె ఇంటికి తీసుకెళ్లాడు. అనంతరం ఆమె తల్లిదండ్రులను కూడా కారులో ఎక్కించుకుని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. హాస్పిటల్ నుండి తప్పించుకొని నవీన్ కుమార్ పారిపోయినాడు. యువతి చికిత్స పొందుతూ మరుసటిరోజు చనిపోయినది. *నేరం బయటపడుతుందనే భయంతో ఆధారాల ధ్వంసానికి ప్రయత్నం* యువతి మృతితో తన నేరం బయటపడుతుందనే భయంతో నిందితుడు కారును కడిగి, సూసైడ్ నోట్, పురుగుల మందు బాటిల్, మొబైల్ సిమ్‌లను కావాలనే సాక్షాలను దొరకకుండా మాయం చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అనంతరం హైదరాబాద్‌కు పారిపోయినట్లు దర్యాప్తులో వెల్లడైంది. *సాంకేతిక ఆధారాలతో కేసును ఛేదించిన పోలీసులు* కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీ, కాల్ డేటా, కాల్ రికార్డింగ్స్ తదితర సాంకేతిక ఆధారాలను సమగ్రంగా పరిశీలించారు. వీటి ఆధారంగా నిందితుడి కదలికలను గుర్తించి కేసునుఛేదించారని అని డీసీపీ తెలిపారు . అదేవిధంగా బొమ్మకంటి రవి కుమార్ అదేవిధంగా, మృతురాలు శిక్షణ నిమిత్తం వచ్చిన సమయంలో నిందితుడు ఆమెతో సన్నిహితంగా మెలుగుతూ పరిచయం పెంచుకొని మాటలు కలిపి అనంతరం ఆమె ఇష్టానికి విరుద్ధంగా శారీరక సంబంధానికి పాల్పడినట్లు ఆరోపణలపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది. కేసులో సేకరించిన ఆధారాల ఆధారంగా తదుపరి దర్యాప్తు, మరియు మృతురాలు సింగరేణి అధికారులకు ఇచ్చిన దరఖాస్తు అట్టి దరఖాస్తు పై సింగరేణి అధికారుల నిర్లక్ష్యం మరియు నిందితుడు రవికుమార్ పై ఆరోపించిన ఆరోపణల పైన దర్యాప్తు కొనసాగుతోంది.2
- రూ.9,99,999 విలువైన కరెన్సీ నోట్లతో గణపతి అలంకరణ-అలంకరణను చూసేందుకు భక్తుల తాకిడి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ఆర్యవైశ్య భవనంలో రూ.9,99,999 విలువైన కరెన్సీ నోట్లతో గణపతి అలంకరణ రూ.20, రూ.50, రూ.100, రూ.500 నోట్లు – సరికొత్త కరెన్సీ తో తీర్చిదిద్దిన గణనాథుడు ఈ ప్రత్యేక అలంకరణను చూసేందుకు సుల్తానాబాద్‌తో పాటు పరిసర గ్రామాల నుంచి భక్తుల తాకిడి1
- కేసీఆర్ ఫాంహౌజ్‌పై కాంగ్రెస్ నేతల పర్యటన... రాజకీయ దుమారం! “ఫాంహౌజ్ ఏమైనా టూరిస్ట్ కేంద్రమా?” అంటూ కాంగ్రెస్‌పై బండి సంజయ్ ఫైర్! ప్రైవేట్ భూముల్లోకి వెళ్లే అధికారం మీకెక్కడిది? ప్రభుత్వ భూములుంటే... స్వాధీనం చేసుకోండి! భూదోపిడీ జరిగిందంటే... ఆధారాలతో సహా బయటపెట్టండి! క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్! అంతేకాదు... 22ఏ భూముల సమస్యపై కీలక వ్యాఖ్యలు... అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని బండి సంజయ్ హెచ్చరిక! ఇక ఖైరతాబాద్ ఉప ఎన్నికపై కూడా సంచలన వ్యాఖ్యలు... కాంగ్రెస్ ఉప ఎన్నికలకు భయపడుతోందని బండి సంజయ్ ఆరోపణ! ఉప ఎన్నిక వస్తే కాంగ్రెస్‌కు రాజకీయ నిమజ్జనం తప్పదంటూ తీవ్ర వ్యాఖ్యలు! మరోవైపు... కరీంనగర్ గణేశ్ నిమజ్జన ఉత్సవాలపై ప్రజలకు కీలక పిలుపు... “ప్రశాంతతకు మారుపేరు కరీంనగర్ అని నిరూపిద్దాం” అంటూ బండి సంజయ్ విజ్ఞప్తి!1
- కరీంనగర్‌లో దొంగల హల్‌చల్.. గ్యాస్ కట్టర్లతో రెండు ఏటీఎంలు లూటీ కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దుర్శేడ్, ఎల్‌ఎండీ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మాపూర్‌లో ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంలలో ఈ చోరీలు జరిగాయి. దుర్శేడ్ ఏటీఎంలోకి తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో కారులో వచ్చిన ఇద్దరు దుండగులు, వారిలో ఒక మహిళ కూడా ఉన్నట్లు సీసీటీవీ ఫుటేజీ ద్వారా పోలీసులు గుర్తించారు. ఏటీఎంలోకి ప్రవేశించగానే వారు సీసీ కెమెరాలపై ఒక రకమైన ద్రవాన్ని చల్లి, ఆ తర్వాత గ్యాస్ కట్టర్‌తో మిషన్‌ను కట్ చేశారు. ఈ ఏటీఎం నుంచి సుమారు రూ.8 లక్షలు అపహరించినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. తిమ్మాపూర్ ఏటీఎంలో ఎంత నగదు పోయిందనేది ఇంకా తెలియరాలేదు. దొంగతనానికి పాల్పడినప్పుడు నిందితులు టోపీలు, కళ్లద్దాలు, మాస్కులు, గ్లోవ్‌లు ధరించి తమ గుర్తింపు తెలియకుండా జాగ్రత్తపడ్డారు. దుర్శేడ్ ఏటీఎంలో చోరీ జరుగుతున్న సమయంలోనే ఎస్‌బీఐ ఢిల్లీ కార్యాలయానికి అలారం వెళ్లింది. దీంతో వారు స్థానిక అధికారులను అప్రమత్తం చేశారు. ఈ ఘటనలపై పోలీసులు రెండు వేర్వేరు కేసులు నమోదు చేసి, దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఘటనా స్థలంలో లభించిన ఆధారాలతో పాటు సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా విశ్లేషిస్తున్నారు. దొంగలు మహారాష్ట్ర రిజిస్ట్రేషన్‌తో ఉన్న వాహనాన్ని ఉపయోగించినట్లు గుర్తించారు. ఈ వాహనాన్ని ట్రేస్ చేయడానికి టోల్‌ప్లాజాల వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజీలను కూడా పరిశీలిస్తున్నారు. ఇటీవల కాలంలో తెలంగాణలో ఏటీఎం దొంగతనాలు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. గత మే నెలలో మహబూబ్‌నగర్‌లో ఇలాగే ఒక ఎస్‌బీఐ ఏటీఎంను గ్యాస్ కట్టర్‌తో కోసి రూ. 2.30 లక్షలు ఎత్తుకెళ్లారు. వరుసగా జరుగుతున్న ఈ ఘటనల నేపథ్యంలో ఏటీఎంల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసే విషయంపై పోలీసు అధికారులు బ్యాంకు అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు.1