వినాయకుడి ప్రత్యేక పూజలతో నాలుగో వసంతంలోకి రిలయన్స్ మార్ట్ బాన్సువాడ: పట్టణంలోని రిలయన్స్ మార్ట్ నాలుగో వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ ముఖ్య అతిథిగా హాజరై విఘ్నేశ్వరునికి పూజలు చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మార్ట్ నిర్వాహకులకు వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, నాణ్యమైన ఉత్పత్తులతో వినియోగదారుల విశ్వాసాన్ని గెలుచుకోవడం అభినందనీయమన్నారు. స్థానికంగా ఇలాంటి వాణిజ్య సంస్థలు ఉండడం వల్ల ప్రజలకు నిత్యావసర వస్తువులు ఒకే చోట అందుబాటులోకి రావడంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని పేర్కొన్నారు. రిలయన్స్ మార్ట్ మరింత అభివృద్ధి చెంది ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించిన ఆయన, వినియోగదారుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ సేవా ప్రమాణాలను పెంచాలని నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మార్ట్ నిర్వాహకులు, సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొని వినాయకుడి ఆశీస్సులతో సంస్థ మరింత అభివృద్ధి చెందాలని కోరుకున్నారు
వినాయకుడి ప్రత్యేక పూజలతో నాలుగో వసంతంలోకి రిలయన్స్ మార్ట్ బాన్సువాడ: పట్టణంలోని రిలయన్స్ మార్ట్ నాలుగో వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ ముఖ్య అతిథిగా హాజరై విఘ్నేశ్వరునికి పూజలు చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మార్ట్ నిర్వాహకులకు వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, నాణ్యమైన ఉత్పత్తులతో వినియోగదారుల విశ్వాసాన్ని గెలుచుకోవడం అభినందనీయమన్నారు. స్థానికంగా ఇలాంటి వాణిజ్య సంస్థలు ఉండడం వల్ల ప్రజలకు నిత్యావసర వస్తువులు ఒకే చోట అందుబాటులోకి రావడంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని పేర్కొన్నారు. రిలయన్స్ మార్ట్ మరింత అభివృద్ధి చెంది ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించిన ఆయన, వినియోగదారుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ సేవా ప్రమాణాలను పెంచాలని నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మార్ట్ నిర్వాహకులు, సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొని వినాయకుడి ఆశీస్సులతో సంస్థ మరింత అభివృద్ధి చెందాలని కోరుకున్నారు
- చిన్నారుల నృత్యాలతో అలరిస్తున్న టీచర్స్ కాలనీ గణేష్ మండలి ఎల్లారెడ్డి: పట్టణంలోని కొత్తబాది టీచర్స్ కాలనీలో గణేష్ మండలి ఆధ్వర్యంలో గత నాలుగేళ్లుగా వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. నవరాత్రుల్లో భాగంగా ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేదమంత్రాలతో సంప్రదాయ పద్ధతిలో పూజలు చేస్తున్నారు. చిన్నారులు నిర్వహిస్తున్న నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను, కాలనీ వాసులను అలరిస్తున్నాయి.1
- టేకు చెట్లు తొలగించిన కేసులు సర్పంచ్ భర్తకు జరిమానా.... టేకు చెట్లు తొలగించిన కేసులో సర్పంచ్ భర్తకు జరిమానా అనుమతి లేకుండా చెట్లు తొలగించారన్న ఫిర్యాదుపై అటవీశాఖ చర్యలు డిచ్‌పల్లి మండలం సాంపల్లిలో ఘటన నిజామాబాద్ రూరల్, సెప్టెంబర్ 17 గ్రామంలో అభివృద్ధి పనుల పేరుతో వ్యక్తిగతంగా పెంచుకున్న టేకు చెట్లను అనుమతి లేకుండా తొలగించిన వ్యవహారంలో సాంపల్లి సర్పంచ్ సంధ్య భర్త మాసూరి ప్రశాంత్‌కు అటవీశాఖ అధికారులు రూ.13,325 జరిమానా విధించారు. ఈ ఘటన డిచ్‌పల్లి మండలంలో చర్చనీయాంశంగా మారింది. అసలేం జరిగింది? సాంపల్లి గ్రామంలో డ్రైనేజీ నిర్మాణ పనుల కోసం జేసీబీతో తవ్వకాలు చేపట్టిన సమయంలో గ్రామానికి చెందిన అంతరెడ్డి నర్సయ్య ఇంటి పక్కన ఏళ్లుగా పెంచుకుంటున్న టేకు చెట్లను తొలగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. తనకు ఎలాంటి ముందస్తు సమాచారం, నోటీసు ఇవ్వకుండా సర్పంచ్ భర్త మాసూరి ప్రశాంత్, పంచాయతీ కార్యదర్శి నాగేంద్ర సమక్షంలో జేసీబీ సహాయంతో 12 టేకు చెట్లను తొలగించారని నర్సయ్య అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. డీఎఫ్‌వోకు ఫిర్యాదు ఏళ్ల తరబడి పెంచుకున్న చెట్లను తొలగించడంతో తీవ్రంగా నష్టపోయిన నర్సయ్య నేరుగా జిల్లా అటవీశాఖ అధికారికి ఫిర్యాదు చేశారు. అనుమతి లేకుండా చెట్లను తొలగించిన వారిపై వాల్టా చట్టం ప్రకారం చర్యలు తీసుకుని న్యాయం చేయాలని ఫిర్యాదులో కోరారు. ఫిర్యాదు నేపథ్యంలో ఇందల్వాయి ఎఫ్‌ఆర్‌వో రవి భట్ ఆదేశాల మేరకు అటవీశాఖ రేంజ్, బీట్ అధికారులు సాంపల్లి గ్రామానికి వెళ్లి క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. చెట్ల తొలగింపు వ్యవహారంపై వివరాలను సేకరించారు. రూ.13,325 జరిమానా అటవీశాఖ విచారణ అనంతరం అనుమతి లేకుండా వ్యక్తిగతంగా పెంచుకున్న టేకు చెట్లను తొలగించిన వ్యవహారంలో మాసూరి ప్రశాంత్‌కు రూ.13,325 జరిమానా విధించినట్లు అధికారులు నిర్ణయించారు. అయితే చెట్ల తొలగింపు సమయంలో పంచాయతీ కార్యదర్శి నాగేంద్ర కూడా అక్కడ ఉన్నారని బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్నప్పటికీ, జరిమానా విషయంలో ఆయన పేరును ప్రస్తావించకపోవడంపై నర్సయ్య సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై అటవీశాఖ అధికారులు మరింత స్పష్టత ఇవ్వాల్సి ఉందని గ్రామస్థులు కోరుతున్నారు. అభివృద్ధి పనులైనా.. నిబంధనలు పాటించాల్సిందే అభివృద్ధి పనులు చేపట్టే సమయంలో చెట్లు అడ్డుగా ఉన్నా సంబంధిత శాఖల నిబంధనలు, అనుమతులు పాటించాల్సిందేనని గ్రామస్థులు పేర్కొంటున్నారు. పచ్చదనం పెంచాలని ప్రజలకు అవగాహన కల్పించాల్సిన ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులే చెట్ల తొలగింపు వ్యవహారంలో జరిమానా ఎదుర్కోవడం చర్చకు దారితీసిందన్నారు. అధికారిక అనుమతులు, నిబంధనలు పాటించకుండా చెట్లను తొలగిస్తే చర్యలు తప్పవనే విషయాన్ని ఈ ఘటన స్పష్టం చేస్తోందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.1
- కామారెడ్డిలో గణేష్ నిమజ్జన రూట్‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ • గణేష్ నిమజ్జనానికి పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు – ముందస్తు చర్యలపై అధికారులతో సమీక్ష కామారెడ్డిలో గణేష్ నిమజ్జన రూట్‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ • గణేష్ నిమజ్జనానికి పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు – ముందస్తు చర్యలపై అధికారులతో సమీక్ష • వివిధ సంబంధిత శాఖల అధికారులతో కలిసి నిమజ్జన రూట్‌ను స్వయంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ • నిమజ్జన మార్గంలో ట్రాఫిక్, విద్యుత్, రహదారులు, పారిశుద్ధ్యం, తాగునీరు తదితర ఏర్పాట్ల పరిశీలన - అధికారులకు సూచనలు • నిమజ్జన ప్రదేశాల్లో గజఈతగాళ్లు, రెస్క్యూ బృందాలు, వైద్య సిబ్బంది సిద్ధంగా ఉండేలా చర్యలు • గణేష్ నవరాత్రులు పూర్తయ్యే వరకు సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిరంతర నిఘా • డీజేలకు స్వస్తి – సాంప్రదాయ పద్ధతిలో గణేష్ ఉత్సవాలు నిర్వహించాలని పిలుపు: జిల్లా ఎస్పీ కామారెడ్డి పట్టణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నిర్వహించనున్న గణేష్ విగ్రహాల నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా, సురక్షితంగా మరియు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగాలు చేపడుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, , జిల్లా ఎస్పీ . రాజేష్ చంద్ర, బుధవారం పరిశీలించారు. తొలుత ట్రాఫిక్ గణపతిని దర్శించుకున్న అనంతరం జిల్లా కలెక్టర్, ఎస్పీ గార్లు అధికారులు, మున్సిపల్ చైర్‌పర్సన్, గణేష్ ఉత్సవ సమితుల ప్రతినిధులు, ఆర్గనైజర్లతో కలిసి ప్రత్యేక బస్సులో నిమజ్జన రూట్‌ను స్వయంగా పరిశీలించారు. కామారెడ్డి ఓల్డ్ బస్టాండ్ – ఇందిరాగాంధీ చౌరస్తా నుంచి ప్రారంభమయ్యే ముఖ్య ప్రాంతాల గుండా బాంబే క్లాత్, పాన్ చౌరస్తా, బడా మసీద్, రైల్వే ఫ్లైఓవర్, నిజాంసాగర్ చౌరస్తా, న్యూ బస్టాండ్ మీదిగా నిమజ్జన మార్గాన్ని పరిశీలిస్తూ, నిమజ్జన ముగింపు ప్రదేశమైన టేకిర్యాల్ చెరువు, దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి వరకు రూట్‌లోని అన్నీ ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా నిమజ్జన రూట్‌లో ఎదురయ్యే ట్రాఫిక్ సమస్యలు, రహదారుల పరిస్థితి, విద్యుత్ లైన్లు, వీధి దీపాలు, పారిశుద్ధ్యం, తాగునీటి సదుపాయం, బారికేడ్లు, అత్యవసర మార్గాలు, విగ్రహాల తరలింపు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రూట్‌లో గుర్తించిన సమస్యలను నిమజ్జన కార్యక్రమానికి ముందే పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు జిల్లా కలెక్టర్, ఎస్పీ సూచించారు. జిల్లా కలెక్టర్ శ్రీ ఆశిష్ సంగ్వాన్, మాట్లాడుతూ, గణేష్ నిమజ్జన కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించేందుకు పోలీస్, మున్సిపల్, ఇరిగేషన్, విద్యుత్, ఆర్ అండ్ బి తదితర అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. నిమజ్జన మార్గంలో భక్తులు, ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా అవసరమైన మౌలిక సదుపాయాలను ముందుగానే ఏర్పాటు చేయాలని, పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్ మరియు రహదారి సంబంధిత పనుల ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా ఎస్పీ శ్రీ యం. రాజేష్ చంద్ర, IPS గారు మాట్లాడుతూ, గణేష్ నిమజ్జన కార్యక్రమంలో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. గణేష్ ఉత్సవ కమిటీలు, నిర్వాహకులు, భక్తులు మరియు ప్రజల సమన్వయంతో నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. నిమజ్జన ప్రదేశాల్లో ఎలాంటి ప్రమాదాలకు తావులేకుండా గజఈతగాళ్లు, రెస్క్యూ బృందాలు మరియు వైద్య సహాయ బృందాలను సిద్ధంగా ఉంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేలా రెస్క్యూ వ్యవస్థను అందుబాటులో ఉంచాలని సూచించారు. నిమజ్జన రూట్‌లో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు ప్రత్యేక ట్రాఫిక్ ప్రణాళికను అమలు చేయడంతో పాటు, సీసీ కెమెరాలు మరియు డ్రోన్ల ద్వారా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ డీజేలకు స్వస్తి పలికి సాంప్రదాయ పద్ధతిలో గణేష్ ఉత్సవాలను నిర్వహించుకుందామని జిల్లా ఎస్పీ ప్రజలకు పిలుపునిచ్చారు. అధిక శబ్దంతో కూడిన డీజేల కారణంగా చిన్నపిల్లలు, విద్యార్థులు, వృద్ధులు మరియు అనారోగ్యంతో ఉన్నవారు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని తెలిపారు. ప్రజల ఆరోగ్యం, శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా అమలులో ఉన్న నిబంధనలు, ఆదేశాల మేరకు డీజేల వినియోగంపై నిషేధం అమల్లో ఉందని స్పష్టం చేశారు. గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, సాంప్రదాయ పద్ధతుల్లో, శాంతియుతంగా మరియు ఆనందోత్సాహాలతో నిర్వహించాలని, నిమజ్జన సమయంలో పోలీస్ మరియు ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు సూచించే భద్రతా నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని ఎస్పీ కోరారు. నిమజ్జన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు గణేష్ ఉత్సవ కమిటీలు, నిర్వాహకులు మరియు ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ అడ్మిన్ కె. నరసింహారెడ్డి, కామారెడ్డి డీఎస్పీ ఎస్. మధుసూదన్, కామారెడ్డి టౌన్ ఎస్‌హెచ్‌ఓ బి. నరహరి, కామారెడ్డి ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్‌పర్సన్, పోలీస్, ఇరిగేషన్, విద్యుత్, ఆర్ అండ్ బి, మున్సిపల్ తదితర శాఖల అధికారులు, గణేష్ ఉత్సవ సమితుల ప్రతినిధులు, ఆర్గనైజర్లు పాల్గొన్నారు.1
- బాసర మండల కేంద్రంలో ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు.. జాతీయ జెండాను ఎగురవేసిన నాయకులు..అధికారులు... నిర్మల్ జిల్లా // బాసర 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్ లో విలీనం అయి, నిజాం నిరంకుశ పాలన నుండి ప్రజలకు విముక్తి లభించిన రోజు : *తహసీల్దార్ పవన్ చంద్ర ఝకాటే...* 13 నెలల సాయుధ పోరాటం తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆపరేషన్ పోలో ద్వారా విముక్తి చేసిన రోజు : *ఎంపిడిఓ దేవేందర్* *ఈ రోజును ప్రజా పాలన దినోత్సవంగా జరుపుకోవడం మనందరికీ గర్వకారణం. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, సమానత్వం అమల్లోకి వచ్చిన రోజు.. ప్రజా పాలన స్ఫూర్తితో అందరం కలిసి పని చేద్దాం. రాజ్యాంగ విలువలను కాపాడుదాం. తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుదాం. : *సర్పంచ్ తీగల వెంకటేష్ గౌడ్* బాసర లో ఘనంగా ప్రజా పాలన దినోత్సవం వేడుకలు.. ఆయా ప్రభుత్వ ప్రయివేట్ కార్యాలయాలు పాఠశాల ల్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన అధికారులు.. నాయకులు...1
- తెలంగాణ రాష్ట్రంలో రేపు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి మెదక్ ఎంపీ రఘునందన్ రావు సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి ఎంపీ రఘునందన్ రావు రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు ఇస్తున్నా ఇందిరమ్మ ఇళ్లలో కేంద్ర ప్రభుత్వం వాటా వుందనీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఇందిరామ పిల్ల పేరుతో పాటు పీఎం ఏవై లోగో పెట్టాలని ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు పేదలకు ఇస్తున్న ఇండ్లలో రెండు లక్షల ఇండ్లు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తూకేంద్ర మంత్రి ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు.రైస్ మిల్లర్లుపై విజలెన్స్ దాడులు హైయామైన చర్యనీ అన్నారు. బుధువారం రోజున మెదక్ పట్టణములోని బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర రైస్ మిల్లర్లు అసోసియేషన్ సభ్యులుతో చర్చలు జరపాలి. రైస్ మిల్లర్లు పై విజలెన్స్ దాడులు చెయ్యడం సబబు కాదని అన్నారు. రైస్ మిల్లు పై దాడులు ఆపకపోతే బిజెపి ఎంపీలు ఎమ్మెల్యేలు సివిల్ సప్లై ఎం డి తో చర్చిస్తారు అందర్నీ దొంగలుగా చూడడం సబబు కాదన్నారు. రైస్ మిల్ యజమాన్యాలతో చర్చలు జరిపి రైస్ మిల్లు మిల్లు యధావిధిగా నడిచే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు గత మూడు సంవత్సరాలుగా మిల్లులకు ఇచ్చిన దాన్యం బియ్యం కొనుగోలు చేయకపోవడంతో రైస్ మిల్లు ధాన్యం పేరుకు పోయిందన్నారు గోదాము లేవన్నారు వచ్చే నెలలో వచ్చే దాన్యం కు ఎక్కడ పెడతారని ఎంపీ రఘునందన్ రావు సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు ప్రజా సమస్యలపై ప్రశ్నించకుండా అసెంబ్లీ సమావేశాలు పక్కదారి పట్టించారన్నారు. 22b నిషేధిత భూములను చర్చ లేదన్నారు ఎలాంటి చర్య లేదన్నారు ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా బీజేపీ .తెలంగాణా విమోచన దినోత్సవాన్ని అధికారింగానిర్వహించాలన్నారు. నిజాం నవాబుకు వ్యతిరేకంగా హిందువులతో పాటు ముస్లింలు కూడా పోరాడిన విషయాన్ని ఆయన గుర్తు చేశారుఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా బీజేపీ జిల్లా అధ్యక్షులు వాల్దాస్ రాదామల్లేష్ గౌడ్ గడ్డం శ్రీనివాస్ రాగి రాములు నాయాని ప్రసాద్ విజయ్ కుమార్ రజింత్ రెడ్డి పంజా విజయ్ కుమార్ సురేష్ శ్రీనివాస్ బేడ్ల సత్యనారాయణ, ప్రభాకర్ బైండ్ల వీణ ,.లక్ష్మి శైలజ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు1
- జంగరాయి సబ్‌స్టేషన్ ఎదుట రైతులు విద్యుత్ సమస్యపై ధర్నా చిన్నశంకరంపేట మండలం జంగరాయి సబ్‌స్టేషన్ ఎదుట రైతులు విద్యుత్ సమస్యపై ధర్నాకు దిగారు. వ్యవసాయానికి నిరంతర విద్యుత్ అందకపోవడంతో పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా చేస్తామని అధికారులు హామీ ఇచ్చినప్పటికీ, తరచూ అంతరాయాలు ఏర్పడుతున్నాయని రైతులు తెలిపారు. విద్యుత్ కోతల కారణంగా పంటలకు నష్టం జరుగుతోందని పేర్కొంటూ, వ్యవసాయానికి సరిపడా విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.1
- జేఏసీ బలం ఇదే.. న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు........ . జేఏసీ ఐక్యత, పోరాటం వల్లే మన సమస్యలు రాజకీయ పార్టీల దృష్టికి వెళ్తున్నాయని జేఏసీ నాయకులు తెలిపారు. ప్రతి రాజకీయ పార్టీ నాయకులు ఉద్యోగుల సమస్యలపై స్పందించి, వాటిపై మరింత విస్తృతంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు తమ వంతు బాధ్యతగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. సమస్యలకు న్యాయమైన పరిష్కారం లభించే వరకు జేఏసీ ఆధ్వర్యంలో పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. - జేఏసీ ఐక్యతే మన బలం. - ప్రతి రాజకీయ పార్టీ మన సమస్యలపై మాట్లాడాలి. - ఉద్యోగుల సమస్యలపై విస్తృత చర్చ జరగాలి. - ప్రజాప్రతినిధులు ప్రభుత్వ దృష్టికి సమస్యలను తీసుకెళ్లాలి. - న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు. - ఉద్యోగుల హక్కుల సాధన కోసం ఐక్యంగా ముందుకు సాగుతాం.1
- నిజాంసాగర్‌లో 11.383 టీఎంసీల నీటి నిల్వ... ప్రధాన కాల్వ నీటి విడుదల నిలిపివేత నిజాంసాగర్ : నిజాంసాగర్ ప్రాజెక్టులో బుధవారం మధ్యాహ్నం 12 గంటల నమోదుల ప్రకారం నీటిమట్టం 1400.02 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం (FRL) 1405 అడుగులు కాగా, ప్రస్తుతం 11.383 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో రెండూ శూన్యంగా నమోదయ్యాయి. స్పిల్‌వే గేట్లు, ప్రధాన కాలువ నుండి విడుదల నిలిపివేయగా, జెన్కొ విద్యుత్ ఉత్పత్తి నిలిచి పోయింది.1