*దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత:జిల్లా కలెక్టర్ రాజర్షిషా* దివ్యాంగుల సంక్షేమాభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. పత్రికా ప్రకటన మే 11, 2026_ఆదిలాబాదు: ప్రజాపాలన -ప్రగతిప్రణాళిక విద్యా వారోత్సవాల్లో భాగంగా సోమవారం స్థానిక డైట్ కళాశాల ఆవరణలో విద్యాశాఖ, సమగ్ర శిక్షా, ఎలింకో సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన దివ్యాంగ చిన్నారులకు ఉచిత సహాయ ఉపకరణాల పంపిణీ శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సుమారు 250 మంది దివ్యాంగ చిన్నారులకు వారి అవసరాలకు తగినట్లుగా వివిధ రకాల సహాయక పరికరాలను పంపిణీ చేస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. వారి కోసం గతంలో నిర్వహించిన రిజిస్ట్రేషన్ల ద్వారా ఇప్పటికే సదరం సర్టిఫికేట్లు, పెన్షన్ల సమస్యలను పరిష్కరించామని, ఇంకా పెన్షన్లు రాని అర్హులైన చిన్నారులందరికీ త్వరలోనే మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లా కేంద్రంలో దివ్యాంగ చిన్నారుల కోసం సుమారు ₹2 కోట్లతో ప్రత్యేక రెసిడెన్షియల్ పాఠశాల వసతి కల్పించేందుకు సి.ఎస్.ఆర్ నిధుల ద్వారా ప్రతిపాదనలు సిద్ధం చేశామని వెల్లడించారు. చిన్నారుల భవిష్యత్తు కోసం వారిని క్రమం తప్పకుండా భవితా కేంద్రాలకు, పాఠశాలలకు పంపాలని తల్లిదండ్రులకు సూచించారు. పాఠశాలలకు రాలేని స్థితిలో ఉన్న పిల్లలకు 'హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్' అందిస్తామని, ప్రతి గురువారం వైద్యుల ద్వారా స్పీచ్ థెరపీ వంటి సేవలు అందుబాటులో ఉంటాయని వివరించారు. చిన్నారులు ఈ ఉపకరణాలను వాడుతూ నిరంతరం అభ్యాసం చేయడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చని ఆకాంక్షించారు. ఆర్థిక స్వావలంబన దిశగా 18 ఏళ్లు నిండిన దివ్యాంగులకు లేదా వారి తల్లిదండ్రులకు కిరాణా దుకాణాలు, జిరాక్స్ సెంటర్లు వంటి చిన్న తరహా యూనిట్ల ఏర్పాటుకు ఆర్థిక పునరావాస పథకాల కింద మద్దతు ఇస్తామని, అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. అనంతరం కలెక్టర్ అధికారులతో కలిసి దివ్యాంగ చిన్నారులకు ఉపకరణాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, ఇంచార్జి జిల్లా విద్యాశాఖ అధికారి రాజేశ్వర్, డిఆర్డీఓ రవీందర్ రాథోడ్, జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, కోఆర్డినేటర్ తిరుపతి, ఏంఈఓ సోమయ్య, ఎలింకో ప్రతినిధులు రోహిణి, దివ్యాంగులు, వారి కుటుంబ సభ్యులు, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
*దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత:జిల్లా కలెక్టర్ రాజర్షిషా* దివ్యాంగుల సంక్షేమాభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. పత్రికా ప్రకటన మే 11, 2026_ఆదిలాబాదు: ప్రజాపాలన -ప్రగతిప్రణాళిక విద్యా వారోత్సవాల్లో భాగంగా సోమవారం స్థానిక డైట్ కళాశాల ఆవరణలో విద్యాశాఖ, సమగ్ర శిక్షా, ఎలింకో సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన దివ్యాంగ చిన్నారులకు ఉచిత సహాయ ఉపకరణాల పంపిణీ శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సుమారు 250 మంది దివ్యాంగ చిన్నారులకు వారి అవసరాలకు తగినట్లుగా వివిధ రకాల సహాయక పరికరాలను పంపిణీ చేస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. వారి కోసం గతంలో నిర్వహించిన రిజిస్ట్రేషన్ల ద్వారా ఇప్పటికే సదరం
సర్టిఫికేట్లు, పెన్షన్ల సమస్యలను పరిష్కరించామని, ఇంకా పెన్షన్లు రాని అర్హులైన చిన్నారులందరికీ త్వరలోనే మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లా కేంద్రంలో దివ్యాంగ చిన్నారుల కోసం సుమారు ₹2 కోట్లతో ప్రత్యేక రెసిడెన్షియల్ పాఠశాల వసతి కల్పించేందుకు సి.ఎస్.ఆర్ నిధుల ద్వారా ప్రతిపాదనలు సిద్ధం చేశామని వెల్లడించారు. చిన్నారుల భవిష్యత్తు కోసం వారిని క్రమం తప్పకుండా భవితా కేంద్రాలకు, పాఠశాలలకు పంపాలని తల్లిదండ్రులకు సూచించారు. పాఠశాలలకు రాలేని స్థితిలో ఉన్న పిల్లలకు 'హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్' అందిస్తామని, ప్రతి గురువారం వైద్యుల ద్వారా స్పీచ్ థెరపీ వంటి సేవలు అందుబాటులో ఉంటాయని వివరించారు. చిన్నారులు ఈ ఉపకరణాలను వాడుతూ నిరంతరం అభ్యాసం చేయడం
ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చని ఆకాంక్షించారు. ఆర్థిక స్వావలంబన దిశగా 18 ఏళ్లు నిండిన దివ్యాంగులకు లేదా వారి తల్లిదండ్రులకు కిరాణా దుకాణాలు, జిరాక్స్ సెంటర్లు వంటి చిన్న తరహా యూనిట్ల ఏర్పాటుకు ఆర్థిక పునరావాస పథకాల కింద మద్దతు ఇస్తామని, అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. అనంతరం కలెక్టర్ అధికారులతో కలిసి దివ్యాంగ చిన్నారులకు ఉపకరణాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, ఇంచార్జి జిల్లా విద్యాశాఖ అధికారి రాజేశ్వర్, డిఆర్డీఓ రవీందర్ రాథోడ్, జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, కోఆర్డినేటర్ తిరుపతి, ఏంఈఓ సోమయ్య, ఎలింకో ప్రతినిధులు రోహిణి, దివ్యాంగులు, వారి కుటుంబ సభ్యులు, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
- మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కవ్వాల్ గ్రామంలో ఇందూర్ పోచమ్మ బోనాల ఉత్సవం అత్యంత వైభవంగా జరిగింది. మహిళలు బోనాలు సమర్పించగా, శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలతో ఊరేగింపు కోలాహలంగా సాగింది. భక్తులు తమ కుటుంబాలు, గ్రామం పాడిపంటలతో వర్ధిల్లాలని అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు.1
- ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్‌లో ₹9,500 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. రోడ్లు, పరిశ్రమలు, రైల్వేలు, టెక్స్‌టైల్ పార్కులు వంటి కీలక రంగాల్లో ఈ పనులు రాష్ట్ర అభివృద్ధికి ఊతం ఇవ్వనున్నాయి. దేశాభివృద్ధిలో రాష్ట్రాల పాత్ర ముఖ్యమని ప్రధాని ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.1
- తెలంగాణలోని కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టౌన్)లో సీఐటీయూ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ లేబర్ కోడ్స్ గెజిట్ ప్రతులను దహనం చేశారు. ఈ చట్టాలు కార్మికుల దశాబ్దాల పోరాటాలతో సాధించుకున్న హక్కులను బలహీనపరుస్తున్నాయని సీఐటీయూ నాయకులు ఆరోపించారు. కార్మిక హక్కుల పరిరక్షణకు దేశవ్యాప్తంగా పోరాటాలు కొనసాగుతాయని హెచ్చరించారు.1
- తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లలో జాప్యం, మిల్లర్ల దోపిడీ కారణంగా రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. క్వింటాల్‌కు ₹500 నష్టపోవడంతో పాటు, 12.5 కిలోల తరుగు పేరుతో దోపిడీకి గురవుతున్నారని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. రైతుల సమస్యలపై పోరాడేందుకు మోర్తాడ్‌లో భారీ నిరసనకు ఆయన పిలుపునిచ్చారు.1
- బాసర రైల్వేస్టేషన్ వద్ద కారు బైక్ ఢీ.. ముగ్గురికి తీవ్ర గాయాలు.. బాసర శివాజీ చౌక్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి పై కారు - బైక్ సోమవారం మధ్యాహ్నం ఢీకొన్నాయి. ఈ ప్రమాదం లో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు క్షతగాత్రులను అంబులెన్సు లో భైన్సా ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. బాసర మండలం కిర్గుల్ (బి) గ్రామానికి చెందిన ట్రైనింగ్ డీఎస్పీ మహేందర్ కు చెందిన కారుగా పోలీసులు గుర్తించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.1
- కొండగట్టు అంజన్న సేవలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా, భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి అంజన్న సేవలో పాల్గొన్నారు.మంత్రి ఆలయానికి చేరుకోగానే ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ అర్చకులు వేదోక్త మంత్రోచ్ఛారణల మధ్య ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలు ఇచ్చారు.ఈ సందర్భంగా ఆలయ ఈఓ ఎస్ అంజనారెడ్డి మంత్రిని శాలువాతో సత్కరించి స్వామివారి లడ్డు ప్రసాదం అందజేశారు. ఆలయ అభివృద్ధి, భక్తులకు అందిస్తున్న సౌకర్యాలు, పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రి అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఉత్సవాలు ప్రశాంతంగా, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వహించేందుకు తీసుకుంటున్న చర్యలను ఆయన అభినందించారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎస్ దినేష్, జగిత్యాల డీఎస్పీ పురుషోత్తం రెడ్డి, స్థానిక సీఐ నీలం రవి, సర్పంచ్ ఆదిరెడ్డి, ఏఈఓ గుండి హరిహర్నాథ్, సూపరింటెండెంట్ సునీల్, చంద్రశేఖర్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు. పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుండగా, దేవస్థానం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు.1
- ఆదివారం సాయంత్రం ఆసిఫాబాద్‌లోని రాజీవ్ చౌరస్తా, అంబేడ్కర్ చౌరస్తా వద్ద తీవ్ర ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది. గంటల తరబడి వాహనాలు నిలిచిపోవడంతో అత్యవసర సేవలకు కూడా అంతరాయం కలిగింది, ప్రజల్లో ఆందోళన పెరిగింది. పోలీసులు అదనపు సిబ్బందిని మోహరించి ట్రాఫిక్‌ను నియంత్రించగా, ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని అధికారులు కోరారు.1
- తెలంగాణలోని పుణ్యక్షేత్రం బాసరలోని జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. సోమవారం శుభదినం కావడంతో పాటు, వేసవి సెలవులు ఉండటంతో ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.1
- మంచిర్యాల ఆర్టీసీ డిపో వద్ద డ్రైవర్లు నిరసనకు దిగారు. బ్రీత్ ఎనలైజర్ పరీక్షల్లో మద్యం తాగకున్నా అధిక రీడింగ్ రావడంతో విధుల్లోకి తీసుకోలేదని ఆరోపించారు. ఈ యంత్రాలను మార్చాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు.1