logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

జనగణన సర్వేకు ప్రజలు సహకరించాలి: సర్పంచ్ జక్కు సుష్మ భూమేష్ జన గణన సర్వేకు గ్రామస్తులు సహకరించాలని జన్నారం మండలంలోని మేజర్ గ్రామ పంచాయతీ పోన్కల్ సర్పంచ్ జక్కు సుష్మ భూమేష్ కోరారు. సోమవారం ఆమె మాట్లాడుతూ గ్రామంలోని అన్ని వార్డులలో సిబ్బంది ఇంటింటి సర్వేను నిర్వహిస్తున్నారని తెలిపారు. జనగణన సూపర్వైజర్లు, ఎన్యుమరేటర్లు ప్రతి ఇంటికి వచ్చి వివరాలు సేకరిస్తారని ఆమె తెలిపారు. జూన్ 9 వరకు జరిగే జనగణన సర్వేకు ప్రజలు సహకరించి అన్ని వివరాలు ఇవ్వాలని ఆమె సూచించారు.

1 hr ago
user_P.G. Murthy
P.G. Murthy
జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
1 hr ago
b71af259-9d5a-4e57-aef7-afa49b987ee5

జనగణన సర్వేకు ప్రజలు సహకరించాలి: సర్పంచ్ జక్కు సుష్మ భూమేష్ జన గణన సర్వేకు గ్రామస్తులు సహకరించాలని జన్నారం మండలంలోని మేజర్ గ్రామ పంచాయతీ పోన్కల్ సర్పంచ్ జక్కు సుష్మ భూమేష్ కోరారు. సోమవారం ఆమె మాట్లాడుతూ గ్రామంలోని అన్ని వార్డులలో సిబ్బంది ఇంటింటి సర్వేను నిర్వహిస్తున్నారని తెలిపారు. జనగణన సూపర్వైజర్లు, ఎన్యుమరేటర్లు ప్రతి ఇంటికి వచ్చి వివరాలు సేకరిస్తారని ఆమె తెలిపారు. జూన్ 9 వరకు జరిగే జనగణన సర్వేకు ప్రజలు సహకరించి అన్ని వివరాలు ఇవ్వాలని ఆమె సూచించారు.

More news from తెలంగాణ and nearby areas
  • కవ్వాల్ గ్రామంలో ధాన్యం కొనుగోళ్లు జరగక, రైతుల పంట కళ్లాల్లోనే నెల రోజులుగా ఉండిపోయింది. కొనుగోళ్లు ఆలస్యం కావడంతో పశువులు ధాన్యాన్ని మేసేస్తున్నాయి; అకాల వర్షాలు, వడ్డీల భారం రైతులను కలవరపెడుతున్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి ధాన్యం కొనుగోలు చేసి ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.
    2
    కవ్వాల్ గ్రామంలో ధాన్యం కొనుగోళ్లు జరగక, రైతుల పంట కళ్లాల్లోనే నెల రోజులుగా ఉండిపోయింది. కొనుగోళ్లు ఆలస్యం కావడంతో పశువులు ధాన్యాన్ని మేసేస్తున్నాయి; అకాల వర్షాలు, వడ్డీల భారం రైతులను కలవరపెడుతున్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి ధాన్యం కొనుగోలు చేసి ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.
    user_తుడుం జితేందర్
    తుడుం జితేందర్
    Local News Reporter జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    16 hrs ago
  • మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని బాదంపల్లి నుండి 25 మంది హనుమాన్ దీక్షపరులు కొండగట్టు ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి పాదయాత్రగా బయలుదేరారు. పెద్ద హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఈ దీక్ష చేపట్టారు. వారు కొండగట్టులో స్వామివారిని దర్శించుకుని దీక్ష విరమిస్తారు.
    1
    మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని బాదంపల్లి నుండి 25 మంది హనుమాన్ దీక్షపరులు కొండగట్టు ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి పాదయాత్రగా బయలుదేరారు. పెద్ద హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఈ దీక్ష చేపట్టారు. వారు కొండగట్టులో స్వామివారిని దర్శించుకుని దీక్ష విరమిస్తారు.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    18 hrs ago
  • ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక సంచలన కలిసే ప్రతిపాదన చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. "నువ్వు నన్ను కలవకుంటే, నువ్వు వెళ్లాలనుకున్న చోటుకు నేను నిన్ను తీసుకెళ్తాను" అని మోడీ చెప్పినట్లు వస్తున్న వార్తలు రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో తీవ్ర కుదుపు సృష్టించాయి. ఈ సమావేశం జరిగితే తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపు రావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
    1
    ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక సంచలన కలిసే ప్రతిపాదన చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. "నువ్వు నన్ను కలవకుంటే, నువ్వు వెళ్లాలనుకున్న చోటుకు నేను నిన్ను తీసుకెళ్తాను" అని మోడీ చెప్పినట్లు వస్తున్న వార్తలు రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో తీవ్ర కుదుపు సృష్టించాయి. ఈ సమావేశం జరిగితే తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపు రావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
    user_Ramesh Solanki
    Ramesh Solanki
    स्वतंत्र पत्रकार Asifabad, Kumuram Bheem Asifabad•
    13 hrs ago
  • కొమురం భీం ఆసిఫాబాద్ నుండి ప్రత్యేక రైలులో వచ్చిన బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో సిర్పూర్ ఎమ్మెల్యే స్వాగతం పలికారు. అనంతరం వారు పరేడ్ గ్రౌండ్‌కు ర్యాలీగా చేరుకున్నారు. తెలంగాణలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఏర్పడే వరకు పార్టీ పోరాటం కొనసాగుతుందని నాయకులు స్పష్టం చేశారు.
    1
    కొమురం భీం ఆసిఫాబాద్ నుండి ప్రత్యేక రైలులో వచ్చిన బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో సిర్పూర్ ఎమ్మెల్యే స్వాగతం పలికారు. అనంతరం వారు పరేడ్ గ్రౌండ్‌కు ర్యాలీగా చేరుకున్నారు. తెలంగాణలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఏర్పడే వరకు పార్టీ పోరాటం కొనసాగుతుందని నాయకులు స్పష్టం చేశారు.
    user_Krishna
    Krishna
    ఆసిఫాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
    15 hrs ago
  • జగిత్యాల జిల్లాలోని కోరుట్ల పట్టణంలో ముస్లిం సోదరులు ప్రయాణికుల దాహం తీర్చడానికి చలివేంద్రాన్ని ప్రారంభించారు. వేసవి తీవ్రత దృష్ట్యా మంచినీటి సౌకర్యం కల్పించడం ద్వారా వారు మానవత్వాన్ని చాటుకున్నారు.
    1
    జగిత్యాల జిల్లాలోని కోరుట్ల పట్టణంలో ముస్లిం సోదరులు ప్రయాణికుల దాహం తీర్చడానికి చలివేంద్రాన్ని ప్రారంభించారు. వేసవి తీవ్రత దృష్ట్యా మంచినీటి సౌకర్యం కల్పించడం ద్వారా వారు మానవత్వాన్ని చాటుకున్నారు.
    user_అబ్దుల్ ముసవ్విర్
    అబ్దుల్ ముసవ్విర్
    కోరుట్ల, జగిత్యాల, తెలంగాణ•
    23 hrs ago
  • మంచిర్యాల డిపో ఎదుట ఆర్టీసీ డ్రైవర్ల ఆందోళన ఆర్టీసీ డ్రైవర్లకు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయగా 56 పైగా చూపించిన రీడింగ్ మంచిర్యాల డిపో ఎదుట ఆర్టీసీ డ్రైవర్ల ఆందోళన ఆర్టీసీ డ్రైవర్లకు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయగా 56 పైగా చూపించిన రీడింగ్ మద్యం తాగకున్నా బ్రీత్ ఎనలైజర్ మెషిన్ తాగినట్లు చూపిస్తుందని, దీంతో అధికారులు తమను విధుల్లోకి తీసుకోవడం లేదని నిన్న రాత్రి డిపో ఎదుట బైఠాయించిన డ్రైవర్లు తాము మద్యం తాగలేదని మెషిన్ మార్చాలని డిమాండ్ చేస్తూ డ్రైవర్ల నిరసన
    1
    మంచిర్యాల డిపో ఎదుట ఆర్టీసీ డ్రైవర్ల ఆందోళన 

ఆర్టీసీ డ్రైవర్లకు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయగా 56 పైగా చూపించిన రీడింగ్
మంచిర్యాల డిపో ఎదుట ఆర్టీసీ డ్రైవర్ల ఆందోళన 
ఆర్టీసీ డ్రైవర్లకు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయగా 56 పైగా చూపించిన రీడింగ్
మద్యం తాగకున్నా బ్రీత్ ఎనలైజర్ మెషిన్ తాగినట్లు చూపిస్తుందని, దీంతో అధికారులు తమను విధుల్లోకి తీసుకోవడం లేదని నిన్న రాత్రి  డిపో ఎదుట బైఠాయించిన డ్రైవర్లు 
తాము మద్యం తాగలేదని మెషిన్ మార్చాలని డిమాండ్ చేస్తూ డ్రైవర్ల నిరసన
    user_Thalapalli Ramesh
    Thalapalli Ramesh
    బెల్లంపల్లె, మంచిర్యాల, తెలంగాణ•
    3 hrs ago
  • *ఘనంగా జనగణన-2027 'సెన్సస్ వాక్' : ప్రారంభించి పాల్గొన్న జిల్లా కలెక్టర్ రాజర్షిషా* పత్రికా ప్రకటన మే 11, 2026_ఆదిలాబాద్: వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా సాగుతున్న జనగణన-2027 ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా పిలుపునిచ్చారు. సోమవారం ఉదయం స్థానిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియం నుండి కలెక్టరేట్ వరకు నిర్వహించిన సెన్సస్ వాక్/మారథాన్', అవగాహన ప్రచార రథాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించి పాల్గొని ప్రజల్లో చైతన్యం నింపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ముగిసిన సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియ ద్వారా సుమారు 12,000 కుటుంబాలు తమ వివరాలను తామే నమోదు చేసుకున్నాయని వెల్లడించారు. నేటి నుండి జూన్ 9 వరకు జరిగే మొదటి దశ హౌస్ లిస్టింగ్, హౌసింగ్ సెన్సస్ అత్యంత కీలకమని, జిల్లాలోని 1,293 బ్లాకుల్లో ఎన్యుమరేటర్లు వివరాలు సేకరిస్తారని తెలిపారు. క్షేత్రస్థాయిలో వచ్చే సిబ్బందికి ప్రజలు ఎటువంటి భయం లేకుండా సమాచారం అందించాలని సేకరించిన సమాచారం డేటా ప్రైవసీ చట్టాల ప్రకారం అత్యంత గోప్యంగా ఉంటుందని, ఇది కేవలం ప్రభుత్వ అభివృద్ధి పథకాల రూపకల్పనకే ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు. ఎన్యుమరేటర్లు అడిగే 34 ప్రశ్నలకు యదార్థమైన సమాధానాలు చెప్పాలని, సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకున్న వారు తమ SE-ID ని చూపిస్తే ప్రక్రియ వేగవంతం అవుతుందని సూచించారు. జిల్లా అధికారుల పర్యవేక్షణలో సాగుతున్న ఈ జాతీయ యజ్ఞంలో ఆదిలాబాద్ జిల్లాను ఆదర్శంగా నిలపాలని కలెక్టర్ అధికారులను ప్రజలను కోరారు. ఈ ర్యాలీలో అదనపు కలెక్టర్లు ఆర్. ఎస్.చిత్రు, రాజేశ్వర్, డిఆర్ఓ స్రవంతి, డివైఎస్ఓ శ్రీనివాస్, ఈడి మనోహర్, మెప్మా పిడి రాజు, పర్యవేక్షకురాలు నలంద ప్రియ, తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు, ప్రజలు, ఉద్యోగులు, యువత, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
    3
    *ఘనంగా జనగణన-2027  'సెన్సస్ వాక్' : ప్రారంభించి పాల్గొన్న జిల్లా కలెక్టర్ రాజర్షిషా*

పత్రికా ప్రకటన
మే 11, 2026_ఆదిలాబాద్:
వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా సాగుతున్న జనగణన-2027  ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా పిలుపునిచ్చారు. సోమవారం ఉదయం స్థానిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియం నుండి కలెక్టరేట్ వరకు నిర్వహించిన సెన్సస్ వాక్/మారథాన్', అవగాహన ప్రచార రథాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించి పాల్గొని ప్రజల్లో చైతన్యం నింపారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ముగిసిన సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియ ద్వారా సుమారు 12,000 కుటుంబాలు తమ వివరాలను తామే నమోదు చేసుకున్నాయని వెల్లడించారు. నేటి నుండి జూన్ 9 వరకు జరిగే మొదటి దశ హౌస్ లిస్టింగ్, హౌసింగ్ సెన్సస్ అత్యంత కీలకమని, జిల్లాలోని 1,293 బ్లాకుల్లో ఎన్యుమరేటర్లు వివరాలు సేకరిస్తారని తెలిపారు. క్షేత్రస్థాయిలో వచ్చే సిబ్బందికి ప్రజలు ఎటువంటి భయం లేకుండా సమాచారం అందించాలని సేకరించిన సమాచారం డేటా ప్రైవసీ చట్టాల ప్రకారం అత్యంత గోప్యంగా ఉంటుందని, ఇది కేవలం ప్రభుత్వ అభివృద్ధి పథకాల రూపకల్పనకే ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు. ఎన్యుమరేటర్లు అడిగే  34 ప్రశ్నలకు యదార్థమైన సమాధానాలు చెప్పాలని, సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకున్న వారు తమ SE-ID ని చూపిస్తే ప్రక్రియ వేగవంతం అవుతుందని సూచించారు. జిల్లా అధికారుల పర్యవేక్షణలో సాగుతున్న ఈ జాతీయ యజ్ఞంలో ఆదిలాబాద్ జిల్లాను ఆదర్శంగా నిలపాలని కలెక్టర్ అధికారులను ప్రజలను కోరారు.
ఈ ర్యాలీలో అదనపు కలెక్టర్లు ఆర్. ఎస్.చిత్రు, రాజేశ్వర్, డిఆర్ఓ స్రవంతి, డివైఎస్ఓ శ్రీనివాస్, ఈడి మనోహర్, మెప్మా పిడి రాజు, పర్యవేక్షకురాలు నలంద ప్రియ, తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు, ప్రజలు, ఉద్యోగులు, యువత, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
    user_M.RAJKIRAN REDDY
    M.RAJKIRAN REDDY
    Adilabad Rural, Telangana•
    2 hrs ago
  • మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కవ్వాల్‌ గ్రామంలో ఇందూర్ పోచమ్మ బోనాల ఉత్సవం అత్యంత వైభవంగా జరిగింది. మహిళలు బోనాలు సమర్పించగా, శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలతో ఊరేగింపు కోలాహలంగా సాగింది. భక్తులు తమ కుటుంబాలు, గ్రామం పాడిపంటలతో వర్ధిల్లాలని అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు.
    1
    మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కవ్వాల్‌ గ్రామంలో ఇందూర్ పోచమ్మ బోనాల ఉత్సవం అత్యంత వైభవంగా జరిగింది. మహిళలు బోనాలు సమర్పించగా, శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలతో ఊరేగింపు కోలాహలంగా సాగింది. భక్తులు తమ కుటుంబాలు, గ్రామం పాడిపంటలతో వర్ధిల్లాలని అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు.
    user_తుడుం జితేందర్
    తుడుం జితేందర్
    Local News Reporter జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    16 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.