తుని జాతీయ రహదారిపై అక్రమ పశువుల తరలింపు భగ్నం.. 38 పశువులు స్వాధీనం తుని జాతీయ రహదారిపై అక్రమ పశువుల తరలింపు భగ్నం.. 38 పశువులు స్వాధీనం తుని: కాకినాడ జిల్లా తుని పరిధిలో జాతీయ రహదారిపై అక్రమంగా తరలిస్తున్న పశువులను పోలీసులు పట్టుకున్నారు. విజయనగరం జిల్లా అలమండ నుంచి జగ్గంపేటకు తరలిస్తున్న మూడు వాహనాలను తుని పోలీసులు తనిఖీ చేయగా భారీగా పశువులు ఉన్నట్లు గుర్తించారు. రెండు బొలెరో ట్రక్కులు, ఒక ఐచర్ ట్రక్కులో మొత్తం 38 పశువులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వాటిలో 27 ఎద్దులు, 11 దున్నపోతులు ఉన్నట్లు తెలిపారు. పశువులను తరలిస్తున్న వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి 9 మందిని అరెస్టు చేసినట్లు తుని సీఐ గీతా రామకృష్ణ తెలిపారు. పశువులను ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు, తరలింపునకు సంబంధించిన అనుమతులు ఉన్నాయా, ఈ వ్యవహారం వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. జాతీయ రహదారిపై పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో ఈ అక్రమ తరలింపు వెలుగులోకి రావడంతో పశువుల అక్రమ రవాణాపై పోలీసులు మరింత నిఘా పెంచినట్లు తెలుస్తోంది. స్వాధీనం చేసుకున్న పశువులను నిబంధనల ప్రకారం సంబంధిత అధికారులకు అప్పగించే చర్యలు చేపట్టినట్లు సమాచారం. అక్రమంగా పశువుల తరలింపునకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

- ఈ సమస్యకు శాశ్వత పరిస్కారం చూపండి 🙏 ఇది డ్రైనేజీ కాదు, పూర్తిగా చెత్త కాలువలా అయిపోయింది. నీళ్ళు నల్లగా, నురగతో, ప్లాస్టిక్ చెత్తతో నిండిపోయాయి. ఇలా ఉంటే దోమలు, రోగాలు రావడం పక్కా > ఇది మా నార్కిడిమిల్లి గ్రామం, కొత్తపేట నియోజకవర్గం, కోనసీమ జిల్లా దుస్థితి! > > డ్రైనేజీ కాలువ పూడుకుపోయి, మురుగునీరు నిలిచిపోయి దుర్వాసన వస్తుంది. పక్కనే కొబ్బరి చెట్లు, ఇళ్ళు ఉన్నాయి. పిల్లలు, పెద్దలు రోగాల బారిన పడుతున్నారు. ఇన్ని రోజులుగా పట్టించుకునే నాథుడే లేడు. > > మా MLA బండారు సత్యానందరావు గారు @ncbn గారు @naralokesh గారు దయచేసి స్పందించి ఈ కాలువను శుభ్రం చేయించండి 🙏 > > #Narkidimilli #Kothapeta #Konaseema #DrainageProblem #SwachhAndhra @Collector_Konaseema ---2
- బీసీల అభివృద్ధి ప్రదాత బీపీ మండల్ పాలకొల్లులో బీపీ మండల్ 108వ జయంతి వేడుకలు1
- శివకోటి గ్రామంలో హైవే పై రాకపోకలు నిలుపుదల చేయడం వల్ల వాహనదారులు ప్రజలు ఇబ్బంది అంబేద్కర్ కోనసీమ జిల్లా శివకోటి గ్రామంలో హైవే పై రాకపోకలు నిలుపుదల చేయడం వల్ల వాహనదారులు ప్రజలు ఇబ్బంది అనేక ఇబ్బందులు పడుతున్నారని రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ సభ్యులు రుద్రరాజు గోపాలకృష్ణరాజు ఆవేదన వ్యక్తం చేశారు. హైవే రోడ్డు పై 132 కె వి వైర్లు కిందకి వేలాడుతూ ఉండటం వలన పెద్ద వాహనాలు కు ఇబ్బంది ఉంటుందని ప్రస్తుతం రాకపోకలు నిలుపుదల చేసినారు. చించినాడ బ్రిడ్జి పనులు చేసినప్పుడే 132 K V పనులు చేసి ఉంటే ఇప్పుడు ఇబ్బంది ఉండేది కాదు. రోడ్ క్రాసింగ్ టవర్లలో ఒక టవరు పిల్లర్ల పని ఈరోజుతో పూర్తి అయినది. రెండవ టవర్ పనులు పూర్తి చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏపీ ట్రాన్స్ కో, N H R & B వారు సమన్వయంతో కలిసి పనిచేసి హైవే పై రాకపోకలను వెంటనే పున రుద్దరించాలని కాంగ్రెస్ పార్టీ తరపు న డిమాండ్ చేస్తున్నాము.1
- రక్తం వచ్చేటట్టు లారీ డ్రైవర్‌పై పిడుగుద్దులతో దాడి చేసిన రవాణా శాఖ ఇన్‌స్పెక్టర్ పార్వతి డ్రైవర్ లారీ డ్రైవర్‌పై దాడి చేసిన బ్రేక్ ఇన్‌స్పెక్టర్ డ్రైవర్ గాజువాకలో రవాణా శాఖ అధికారి డ్రైవర్ దురహంకారం షీలానగర్ మారుతి జంక్షన్ వద్ద లారీ డ్రైవర్ వాహనం ఆపలేదని లారీని ఓవర్ ట్రాక్ చేసిన ఇన్‌స్పెక్టర్ పార్వతి ఇన్‌స్పెక్టర్ పార్వతి సమక్షంలో ఆమె డ్రైవర్ వీరంగం, లారీ డ్రైవర్‌పై పిడుగులతో దాడి విచక్షణ రహితంగా దాడి చేయడంపై ఆంధ్రప్రదేశ్ లారీ అసోసియేషన్ సభ్యులు ధర్నాకు సిద్ధం1
- కొత్త బస్సులు ఎప్పుడు వేస్తారు..సీఎం రేవంత్ ను కోరిన బాలుడు. సరిపడా బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని, ఒకే బస్సులో ఎక్కువ మంది ఎక్కడంతో బస్సు కిందికి కుంగిపోయిందని ప్రయాణికులు ఆరోపించారు కొత్త బస్సులు ఇస్తారా? లేదా? అంటూ సీఎం రేవంత్‌రెడ్డిని ఓ బాలుడు ప్రశ్నించారు. ఈ సమస్యలను పట్టించుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కు ప్రయాణికులు కోరారు.1
- దేశంలో బీసీలు 50 శాతం ఉన్నారు. బీసీల జనాభాకు అణుగుణంగా రిజర్వేషన్లు కల్పించండి - కర్నేన గౌరు నాయుడు డిమాండ్1
- సత్తుపల్లి శివారులో రోడ్డు ప్రమాదం.. ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర గాయాలు సత్తుపల్లి పట్టణ శివారులో ఈ ప్రమాదం జరిగింది. సత్తుపల్లి వైపు ద్విచక్ర వాహనంపై వస్తున్న వ్యక్తిని.. అశ్వారావుపేట వైపు వెళ్తున్న డిజైర్ కారు ఢీకొట్టింది. ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడ్డాడు.క్షతగాత్రుడిని సత్తుపల్లికి చెందిన ఆకోజు రామకృష్ణ(48) గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అతడిని సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు మెరుగైన చికిత్స కోసం ఖమ్మం ఆసుపత్రికి రిఫర్ చేశారు.2
- Writing హైదరాబాద్–విజయవాడ హైవేపై జరిగిన ఘోర బస్సు ప్రమాదానికి డ్రైవర్ నిద్రమత్తే కారణమని తెలుస్తోంది. కుడివైపు వెళ్తున్న ఐరన్ రాడ్ల కంటైనర్ DCMను ఓవర్‌టేక్ చేసే క్రమంలో బస్సు దాన్ని ఢీకొట్టినట్లు సమాచారం. దీంతో DCMలోని ఇనుప రాడ్లు బస్సును చీల్చుకుంటూ దూసుకెళ్లాయి. ఆ వైపు గాఢనిద్రలో ఉన్న ప్రయాణికులు ఏం జరిగిందో తెలుసుకునేలోపే ప్రాణాలు కోల్పోయారు.1