Shuru
Apke Nagar Ki App…
కర్రెగుట్టలను సందర్శించిన డీజీపీ సి వి ఆనంద్ ములుగు జిల్లాలో మొరుమూరు ప్రాంతంలోని కర్రెగుట్టలను సోమవారం సందర్శించిన తెలంగాణ రాష్ట్ర డిజిపి సివి ఆనంద్.
KOMURAIAH ANAGANDULA
కర్రెగుట్టలను సందర్శించిన డీజీపీ సి వి ఆనంద్ ములుగు జిల్లాలో మొరుమూరు ప్రాంతంలోని కర్రెగుట్టలను సోమవారం సందర్శించిన తెలంగాణ రాష్ట్ర డిజిపి సివి ఆనంద్.
More news from తెలంగాణ and nearby areas
- కర్రెగుట్టలను సందర్శించిన డీజీపీ సి వి ఆనంద్ ములుగు జిల్లాలో మొరుమూరు ప్రాంతంలోని కర్రెగుట్టలను సోమవారం సందర్శించిన తెలంగాణ రాష్ట్ర డిజిపి సివి ఆనంద్.1
- కాజిపేట్ చౌరస్తా లో పెద్ది సుదర్శన్ రెడ్డి భారీ చిత్రపటానికి నివాళులు అర్పించిన దాస్యం వినయ్ భాస్కర్ *పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి కాజిపేట్ బి ఆర్ ఎస్ పార్టీ ఘన నివాళులు* * *దాస్యం వినయభాస్కర్* * *ఈరోజు కాజీపేట చౌరస్తాలో బి ఆర్ యస్ పార్టీ అర్బన్ జిల్లా మాజీ ప్రధానకార్యదర్శి గబ్బేట శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో* జరిగింది ఈ కార్యక్రమం లో ముఖ్యఅతిధిగా దాస్యం వినయ్ భాస్కర్ గారు పాల్గొని ఉద్యమ నాయకులు నర్సంపేట మాజీ శాసనసభ్యులు క్రీ:శే : పెద్ది సుదర్శన్ రెడ్డి గారి భారీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మాజీ ఛీప్ విప్ హనుమకొండ బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ బాస్కర్ గారు అనంతరం రెండు నిమిషాలు మౌనం పాటిస్తూ మాట్లాడుతూ పెద్ది లేని లోటు పూడ్చలేనిది పెద్ది విగ్రహ ఏర్పాటు గద్దె కూల్చివేత దుర్మార్గం *ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, మాజీ శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్ గారు* కాజీపేట చౌరస్తాలో నర్సంపేట మాజీ శాసనసభ్యులు, ఉద్యమ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి యాదిలో కార్యక్రమాన్ని సోమవారం రోజున నిర్వహించారు మొదట పెద్ది చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా దాస్యం వినయ్ భాస్కర్ గారు మాట్లాడుతూ నిస్వార్ధమైన గొప్ప తెలంగాణ ఉద్యమకారుడు, గొప్ప నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అని కొనియాడారు పెద్దితో నాకు ఉన్నది ఉద్యమ అనుబంధం తెలంగాణ కోసం కలిసి పోరాడం ఇదే కాజీపేట కేంద్రంగా ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు, బంద్లు, వంటా వార్పులు చేశాం ఎన్నో రాస్తారోకోలు, రైల్ రోకోలు చేశాము ఎన్నో కేసులు ఎదుర్కొని కోర్టులకు వెళ్ళాం పెద్ది మనల్ని విడిచి వెళ్లడం బాధాకరం కేసీఆర్ గారి నాయకత్వంలో మేము ఇద్దరం కలిసి పోరాడిన సందర్భాలు అనేకం నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసిన గొప్ప నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి పెద్ది విగ్రహ ఏర్పాటు గద్దె కూల్చివేత దుర్మార్గం స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ ఏర్పాటు కోసం నిర్మించిన గద్దె గుల్చివేత కూల్చివేత దుర్మార్గం ఒక ఉద్యమకారుడు, నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేసిన మాజీ ప్రజాప్రతినిధి విగ్రహ ఏర్పాటును ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకోవడం సిగ్గుచేటు ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం, డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వమే పెద్ది విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి.. ఇంకా ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి *నార్లగిరి రమేష్* సుంచు కృష్ణ మాజీ డిప్యూటీ మేయర్ సిరాజుద్దీన్ మాజీ కార్పొరేటర్లు సంకు నర్సింగరావు సోద కిరణ్ వద్దిరాజు గణేష్ ఎండి అఫ్జల్ ఎండి హుస్సేన్ బి ఆర్ ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు పాలడుగుల శివకుమార్ దువ్వ కనకరాజ్ బెదురుకోట రంజిత్ బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు *గబ్బేట కరుణ్ (సిద్దు)* బరిగెల వినయ్ ఎస్.కె మహమూద్ దువ్వ నరేష్ (కిట్టు)మాచర్ల ప్రభాకర్ కంజర్ల మనోజ్ కొండ శంకర్ మరియాల కృష్ణ తండముల వేణు రాబర్ట్ సయ్యద్ యాకూబ్ మంద రాజ్ కుమార్ బండి రామచందర్ పడిదల శేఖర్ బరబరి శ్రీకాంత్ గౌరీ శంకర్ తదితరులు పాల్గొని నివాళులు అర్పించినారు.. 🙏🙏🙏🙏🙏 **మీ..* *గబ్బేట శ్రీనివాస్* *బి ఆర్ యస్ పార్టీ అర్బన్ జిల్లా మాజీ ప్రధానకార్యదర్శి వరంగల్**1
- 56 ఏళ్ల రాహుల్ గాంధీ ఫిట్నెస్ సీక్రెట్............. ఇదే 56 ఏళ్ల వయసులోనూ ఫిట్గా ఉండటం వెనుక సీక్రెట్ను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వెల్లడించారు. “ఎంత బిజీగా ఉన్నా రోజూ కనీసం గంటపాటు మార్షల్ ఆర్ట్స్, ఈత, రన్నింగ్, యోగా, ఏరోబిక్ వంటివి చేస్తా. అనారోగ్యకరమైన అలవాట్లను వ్యాయామంతో సరిదిద్దలేం. క్రమశిక్షణతో కూడిన శ్రమ, ఆరోగ్యకర ఆహారంతో ఫిట్నెస్ సాధించవచ్చు. స్నాక్స్ ఎక్కువగా తినడం మానుకోవాలి. లిక్కర్ అలవాటు ఉంటే పరిమితంగా తీసుకోవాలి' అని సూచించారు.1
- పేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యం: మంత్రిలు పొంగులేటి, పొన్నం హన్మకొండ జిల్లా:అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంతింటిని అందించి వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమవారం హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని గూడూరు, మనేపల్లి తదితర గ్రామాల్లో 394 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా ఇళ్లను మంజూరు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే సుమారు 8 లక్షల ఇళ్లకు అనుమతులు ఇచ్చామని, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇల్లు అందే వరకు ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నామని పేర్కొన్నారు. ఇళ్లతో పాటు కాలనీల్లో తాగునీరు, రహదారులు, విద్యుత్ వంటి మౌలిక వసతులు కల్పిస్తామని మంత్రి తెలిపారు. కులం, మతం, పార్టీతో సంబంధం లేకుండా అర్హతే ప్రామాణికంగా ఇళ్ల కేటాయింపులు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ కమలాపూర్ మండలంలో 394 కుటుంబాలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు అందడం సంతోషకరమన్నారు. కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ మాట్లాడుతూ లబ్ధిదారులను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎంపిక చేశామని, అనర్హులు తేలితే కేటాయింపులు రద్దు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.1
- పైలాన్ పనులను పరిశీలించిన మంత్రి ములుగు జిల్లా కేంద్రంలోని గొట్టమ సమీపంలో నిర్మిస్తున్న నూతన సమీకృత కలెక్టరేట్ భవనం, పైలాన్ పనులను మంత్రి సీతక్క సోమవారం పరిశీలించారు. పైలాన్ పనులను నాణ్యతా ప్రమాణాలతో వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్య మంత్రి ప్రారంభోత్సవానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని సూచించారు. కలెక్టరేట్ లో పార్కింగ్, విద్యుత్, తాగునీరు, పరిశుభ్రత సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.3
- నర్సంపేటలో ఉద్రిక్తత పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం కూల్చివేత నర్సంపేట మండలంలోని మెడికల్ కాలేజీ ఎదురుగా పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం కోసం ఏర్పాటు చేసిన గద్దెను కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేయడంతో, ధర్నాకు దిగిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇతర బీఆర్ఎస్ శ్రేణులు ఎర్రబెల్లి దయాకర్ రావును పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా అడ్డుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు1