Shuru
Apke Nagar Ki App…
బిహార్‌లోని సీతామర్హి స్టేషన్‌లో ఆగి ఉన్న రైలు ఇంజిన్ ట్యాంకు నుండి ఓ వ్యక్తి దర్జాగా డీజిల్ చోరీ చేసిన వీడియో వైరల్‌గా మారింది. పెట్రోల్ బంకులో ఆయిల్ పట్టించుకున్నంత సులభంగానే ఆ వ్యక్తి రైలు నుండి డీజిల్‌ను కొట్టేశాడు. చోరీకి పాల్పడిన వ్యక్తి నేరుగా క్యాన్‌లో డీజిల్‌ను తీసుకెళ్తే అనుమానం వస్తుందని భావించి, ఒక సంచిలో పాలిథిన్ కవర్‌ను వేసి అందులో డీజిల్‌ను నింపుకున్నాడు. పక్కన ఉన్న రైలులోని ప్రయాణికులు ఈ దృశ్యాన్ని తమ ఫోన్‌లలో వీడియోలు తీస్తున్నప్పటికీ, ఆ వ్యక్తి ఏమాత్రం భయం లేకుండా తన పని పూర్తి చేసుకొని అక్కడి నుండి వెళ్లిపోయాడు.
Kasani Venkatesh
బిహార్‌లోని సీతామర్హి స్టేషన్‌లో ఆగి ఉన్న రైలు ఇంజిన్ ట్యాంకు నుండి ఓ వ్యక్తి దర్జాగా డీజిల్ చోరీ చేసిన వీడియో వైరల్‌గా మారింది. పెట్రోల్ బంకులో ఆయిల్ పట్టించుకున్నంత సులభంగానే ఆ వ్యక్తి రైలు నుండి డీజిల్‌ను కొట్టేశాడు. చోరీకి పాల్పడిన వ్యక్తి నేరుగా క్యాన్‌లో డీజిల్‌ను తీసుకెళ్తే అనుమానం వస్తుందని భావించి, ఒక సంచిలో పాలిథిన్ కవర్‌ను వేసి అందులో డీజిల్‌ను నింపుకున్నాడు. పక్కన ఉన్న రైలులోని ప్రయాణికులు ఈ దృశ్యాన్ని తమ ఫోన్‌లలో వీడియోలు తీస్తున్నప్పటికీ, ఆ వ్యక్తి ఏమాత్రం భయం లేకుండా తన పని పూర్తి చేసుకొని అక్కడి నుండి వెళ్లిపోయాడు.
More news from తెలంగాణ and nearby areas
- కొద్ది రోజుల క్రితం వరంగల్ జిల్లా హనుమకొండకు చెందిన నిరంజన్ అనే యువకుడు అరుదైన వ్యాధితో పోరాడుతూ, తనను కలవాలని ఆకాంక్షించిన వీడియోను చూసిన పవన్ కళ్యాణ్, అతని కోరికను నెరవేర్చాలని భావించారు. ఈ రోజు హనుమకొండలోని నిరంజన్ నివాసానికి వెళ్లి పరామర్శించారు. అరుదైన వ్యాధితో నిరంజన్ చేస్తున్న పోరాటంలో అతని అసాధారణ ధైర్యం, ఆత్మవిశ్వాసం, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న తీరు స్ఫూర్తిదాయకమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తీవ్రమైన అనారోగ్య సమస్యల మధ్య నిరంజన్ చూపుతున్న మనోధైర్యం ప్రశంసనీయమని తెలిపారు. నిరంజన్ సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షిస్తూ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని ప్రార్థించారు. అలాగే, భద్రకాళి అమ్మవారి ఆశీస్సులు అతనిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నారు. భగవంతుని ఆశీస్సులతో నిరంజన్ త్వరగా కోలుకోవాలని పవన్ కళ్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు.1
- ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లిలో జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల BLAల సమావేశంలో మంత్రులు, ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రజలు అసహ్యించుకునే విధంగా ఉన్నాయని ఆయన అన్నారు. గత పదేళ్ల BRS పాలనలో ఖమ్మం జిల్లాకు చేసిందేమీ లేదని రాయల నాగేశ్వరరావు విమర్శించారు. ప్రస్తుతం ముగ్గురు మంత్రులు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ, ఖమ్మం జిల్లాను 119 నియోజకవర్గాల్లో నంబర్ వన్‌గా తీర్చిదిద్దుతున్నారని ఆయన తెలిపారు. BRS నాయకులు చెవులు ఉన్నా చూడలేకపోతున్నారని ఆయన అన్నారు. జిల్లాలో కేటీఆర్ ఏ గ్రామంలోనైనా పర్యటించి లబ్ధిదారుల ద్వారా వారికి ఏం చేశారో తెలుసుకోవాలని, ఆ విషయంలో చర్చకు సిద్ధమని ఆయన సవాల్ విసిరారు. పాలేరులో శంకుస్థాపన చేసి వదిలేసిన ప్రాజెక్టులను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పూర్తి చేస్తున్నారని రాయల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఏ ఒక్క ప్రాజెక్టునూ పూర్తి చేయని BRS నాయకులు ఇప్పుడు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు.1
- సత్తుపల్లి ఎమ్మెల్యే డా. మట్టా రాగమయి దయానంద్ ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గురువారం సత్తుపల్లి పట్టణంలోని తన క్యాంపు కార్యాలయం నుండి Way2News ఆధ్వర్యంలో నిర్వహించిన "డయల్ యువర్ ఎమ్మెల్యే" కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలతో నేరుగా మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకుని వేగవంతంగా పరిష్కరించాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో నియోజకవర్గంలోని వివిధ మండలాలు, గ్రామాలు, పట్టణ ప్రాంతాలకు చెందిన ప్రజలు ఫోన్ ద్వారా ఎమ్మెల్యేతో నేరుగా మాట్లాడి తమ సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా ప్రజలు ముఖ్యంగా తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్, ఇండ్ల పట్టాలు, రెవెన్యూ సమస్యలు, భూ వివాదాలు, పింఛన్లు, సంక్షేమ పథకాల అమలు, గృహ నిర్మాణాలు, విద్యా మరియు వైద్య రంగానికి సంబంధించిన పలు సమస్యలను ఆమె దృష్టికి తీసుకువచ్చారు. ఎమ్మెల్యే దయానంద్ ప్రజల నుండి వచ్చిన ప్రతి సమస్యను ఓర్పుగా విన్నారు. సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు వెంటనే ఫోన్ ద్వారా సమాచారం అందించి, సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కొన్ని సమస్యలకు అక్కడికక్కడే పరిష్కార మార్గాలను సూచించగా, మరికొన్ని అంశాలపై పూర్తి వివరాలు సేకరించి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రజాప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉండటం వారి బాధ్యత అని, ప్రజల సమస్యల పరిష్కారమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ పేర్కొన్నారు. ప్రతి సమస్యను బాధ్యతగా తీసుకుని పరిష్కారం చూపేందుకు కృషి చేస్తామని, ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా నిర్భయంగా తన దృష్టికి తీసుకురావాలని ప్రజలకు సూచించారు. ఈ "డయల్ యువర్ ఎమ్మెల్యే" కార్యక్రమానికి నియోజకవర్గ ప్రజల నుండి విశేష స్పందన లభించింది. ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకునే అవకాశం కల్పించిన ఎమ్మెల్యేను పలువురు అభినందించారు. ప్రజలకు అందుబాటులో ఉండే ప్రజా పాలనకు ఇది నిదర్శనమని, ఇలాంటి కార్యక్రమాలు ప్రజలకు మరింత చేరువయ్యే వేదికలుగా నిలుస్తాయని ఎమ్మెల్యే తెలిపారు.4
- ఖమ్మం జిల్లాలోని పెనుబల్లి మండలం మండల పాడు సమీపంలో లంక సాగర్ క్రాస్ రోడ్డు వద్ద 2006వ సంవత్సరంలో అప్పటి పర్యాటక శాఖ మంత్రి రేణుక చౌదరి చేతుల మీదుగా నిర్మించిన ఎస్సీ కమ్యూనిటీ హాల్ ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది. సుమారు రెండు లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ భవనం, 20 ఏళ్లుగా ప్రజలకు కనిపించకుండా నిరుపయోగంగా మారడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ కమ్యూనిటీ హాల్‌ను చాలా మందికి తెలియకుండా ఒక కుటుంబం నివాసంగా వాడుకుంటోందని, అలాగే భవనం చెత్తాచెదారంతో నిండిపోయి స్థానికులకు ఒక స్టోర్ రూమ్‌గా మారిందని సమాచారం. ఈ పరిస్థితి చూస్తుంటే, అసలు ఈ భవనం ఉందని గ్రామస్తులకు తెలుసా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఎందుకు పనికిరాని ఈ భవనం ఎందుకు నిర్మించినట్టు అని, స్థానికులు, అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నలు సంధించారు. ప్రభుత్వం రైతుల నుంచి భూమిని సేకరించి ప్రజలకు ఉపయోగకరంగా మలుస్తోందా, లేక నిర్లక్ష్య ధోరణితో ప్రజల భూమిని, డబ్బును వృథా చేస్తోందా అని తీవ్ర అరోపణలు చేశారు.1
- అధికారుల మౌనానికి అమాయకులైన ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవ్వాల్సిందేనా... ఎన్టీఆర్ జిల్లా. ఇబ్రహీంపట్నం, నామం మాత్రం ఫైన్ లు వేస్తున్న క్రమంలో ఇంతేగా అని లైట్ తీసుకుని ఓవర్ లోడ్లతో పట్టా కూడా కట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వారిపై చర్యలు తీసుకుని ఏవి ప్రాణాలకు రక్షణ ఎక్కడ....?జాతీయ రహదారిపై కంకరు పడవేసుకుంటపోతున్న లారీలపై లారీ యాజమాన్యాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ద్విచక్ర వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.1
- ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నం, ఖాజీమాన్యం 15వ డివిజన్‌లోని పాఠశాలల్లో విద్యార్థులు త్రాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రాథమిక పాఠశాలల పరిసరాలు మరుగుదొడ్ల వలె మారాయని, ఇది ఆందోళన కలిగిస్తోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంచి నీటి పైప్‌లైన్ చుట్టూ గుబురు చెట్లు, పిచ్చి మొక్కలు పెరిగి ప్రమాదకరంగా మారాయి. ఈ ప్రాంతంలో పాములు, తేళ్లు, ఇతర విషపురుగులు తిరుగుతుండటంతో విద్యార్థులు తమ బ్యాగులతో వంగి నీళ్లు తాగాల్సిన దుస్థితి నెలకొంది. పాఠశాలలకు వచ్చే నీరు త్రాగడానికి పనికిరాకుండా మురికిగా, తుప్పు వాసనతో వస్తోందని, గత రెండు సంవత్సరాలుగా ఆర్‌వో ప్లాంట్ మూతపడి ఉందని సమాచారం. అధికారులు రిపేర్ చేయించాలని పలుమార్లు వేడుకున్నా పట్టించుకోవడం లేదని నివేదించారు. దీనితో పాటు, పాఠశాల గేటు తుప్పుపట్టి, భవనం కూడా శిథిలావస్థకు చేరుకుంది. "పురుగు కుట్టినా, పాము కాటేసినా ఎవరు బాధ్యత వహిస్తారు?" అని ప్రశ్నిస్తూ తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.1
- బిహార్‌లోని సీతామర్హి స్టేషన్‌లో ఆగి ఉన్న రైలు ఇంజిన్ ట్యాంకు నుండి ఓ వ్యక్తి దర్జాగా డీజిల్ చోరీ చేసిన వీడియో వైరల్‌గా మారింది. పెట్రోల్ బంకులో ఆయిల్ పట్టించుకున్నంత సులభంగానే ఆ వ్యక్తి రైలు నుండి డీజిల్‌ను కొట్టేశాడు. చోరీకి పాల్పడిన వ్యక్తి నేరుగా క్యాన్‌లో డీజిల్‌ను తీసుకెళ్తే అనుమానం వస్తుందని భావించి, ఒక సంచిలో పాలిథిన్ కవర్‌ను వేసి అందులో డీజిల్‌ను నింపుకున్నాడు. పక్కన ఉన్న రైలులోని ప్రయాణికులు ఈ దృశ్యాన్ని తమ ఫోన్‌లలో వీడియోలు తీస్తున్నప్పటికీ, ఆ వ్యక్తి ఏమాత్రం భయం లేకుండా తన పని పూర్తి చేసుకొని అక్కడి నుండి వెళ్లిపోయాడు.1
- ఖమ్మం జిల్లా మధిర చెరువు కట్ట (ట్యాంక్‌బండ్) రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో అంబారుపేట గ్రామానికి చెందిన జక్కంపూడి ఉపేందర్ (35) మరణించారు. ఈ ఘటనలో గోపి అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. రోడ్డుపై చెల్లాచెదురుగా పడి ఉన్న కంకర కారణంగా బైక్ స్కిడ్ అయి ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. గాయపడిన గోపిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుడు ఉపేందర్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రమాదానికి కారణమైన కంకర మున్సిపాలిటీ పనుల వల్ల వచ్చిందా లేదా ప్రైవేట్ పనుల వల్ల వచ్చిందా అనే దానిపై అధికారులు విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.1