సత్యసాయి కార్మికుల సమ్మె ఉధృతం... • ఆరో రోజుకు చేరిన నిరసన • నల్ల బ్యాడ్జీలతో నిరసన.. • చర్చలు విఫలం • బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని డిమాండ్ బత్తలపల్లి, మే 10 :- తమ న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం సత్యసాయి వాటర్ సప్లై ప్రాజెక్ట్ పనిచేస్తున్న కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మెను ఆరవ రోజు ఉదృతం చేశారు. ఆదివారం మండల కేంద్రంలోని సత్యసాయి వాటర్ ట్యాంక్ వద్ద కార్మికులు నల్ల బ్యాడ్జీలను ధరించి, ప్రభుత్వ మొండి వైఖరికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేసి నిరసన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా ప్రజల దాహార్తిని తీరుస్తున్న ఈ బృహత్తర పథకంలో పని చేయుచున్న కార్మికులకు గత ఐదు నెలలుగా జీతాలు అందక కుటుంబాలు గడవక నానా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పథకం నిర్వహణకు ప్రత్యేక బడ్జెట్ను కేటాయించి, తక్షణమే వేతన బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమ్మె చేస్తున్న శిబిరం దగ్గరికి సత్యసాయి బోర్డు యస్ ఈ ప్రభాకర్ రావు కార్మికులతో చర్చలు జరిపారు. చర్చలు విఫలం అవడంతో ఆయన వెనుతిరిగాడు. ఈ కార్యక్రమంలో బత్తలపల్లి, తాడిమర్రి, అపరా చెరువులో పనిచేయుచున్న కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే విజయ్ సెక్రటేరియట్‌కు వెళ్లారు. అక్కడ సీఎం కుర్చీలో కూర్చుని అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. దీంతో ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు.1
- ఆలూరు టీడీపీ ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. ఆమె రోగులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు, అనంతరం వైద్యులకు మెరుగైన సేవలందించాలని సూచించారు.1
- కాకినాడరెడ్ క్రాస్ సమీపంలో ఓ వ్యక్తినీ గొంతు కోసిన దుండగులు కాకినాడ సిటీ గాంధీనగర్ ప్రాంతంలో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకున్న దారుణ ఘటనకు స్థానికులు భయాందోళనలకు గురయ్యారు..రెడ్ క్రాస్ సమీపంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిపై గుర్తుతెలియని దుండగులు కత్తితో దాడి చేసి గొంతు కోసి పరారైన ఘటన తీవ్ర కలకలం రేపింది.బాధితుడు రోడ్డుపై నడుస్తు వెళ్తున్న సమయంలో అకస్మాత్తుగా దాడితో అక్కడున్న స్థానికులు భయాందోళనకు గురయ్యారు.సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఏఎస్పీ మనీష్ పాటిల్ దేవరాజ్, టూ టౌన్ సీఐ అప్పలనాయుడు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు..ఘటన ప్రాంతం,పరిసర ప్రాంతాల పరిస్థితులను క్లూస్ టీం పోలీసులు పరిశీలిస్తున్నారు. సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలిస్తూ నిందితులు కదలికలపై ఆరా తీస్తున్నారు.ఈ ఘటన పాత కక్షలా లేక వ్యక్తిగత కక్షల అనేదానిపై పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు..మృతుడు జి నాగేశ్వరరావు, 46 ఏళ్ల ఏపీఎస్పీ కానిస్టేబుల్ గా గుర్తించారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు...3
- నంద్యాల జిల్లా వీపనగండ్లలో కురిసిన మోస్తరు వర్షం ఎండ తీవ్రత నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించింది. అయితే, గ్రామంలోని రహదారులు బురదమయంగా మారడంతోపాటు పొగాకు రైతులు పంట నష్టంపై ఆందోళన చెందుతున్నారు.1
- నందికొట్కూరు మండలం అల్లూరు గ్రామంలో రూ.4.89 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే గిత్త జయసూర్య, పార్లమెంట్ ఇన్‌ఛార్జి మాండ్ర శివానందరెడ్డి ప్రారంభించారు. కొత్త సబ్‌స్టేషన్, రోడ్లు, తాగునీటి ప్రాజెక్టులతో గ్రామం రూపురేఖలు మారాయి. ఐకేపీ రుణాలతో భూమి కొనుగోలు చేసిన 81 మందికి సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భూమి పట్టాలు అందజేశారు.1
- ఆదోనిలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు అమాంతం పెరగడంతో హోటల్ యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ధరల పెరుగుదల వల్ల చాలా మంది తిరిగి కట్టెల పొయ్యిలను వాడటం మొదలుపెట్టారు. పెరుగుతున్న ఇంధన ధరలు చిన్న హోటళ్ల మనుగడకు సవాలుగా మారాయని వారు వాపోతున్నారు.1
- పోలీసులు పై ఎపి బిజెపి చీఫ్ పివిఎన్ మాధవ్ సీరియస్.. డిఎస్పీని వెంటనే సస్పెండ్ చేయాలని మాధవ్ డిమాండ్ కడపలో ఒక సెంటర్ పేరు మార్పు వ్యవహారం లో బిజెపి నేతలపై పోలీసులు అమానుషంగా వ్యవహరించారని ఎపి బిజెపి చీఫ్ పివిఎన్ మాధవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప బిజెపి జిల్లా అధ్యక్షుడు పై చేయి చేసుకున్న డిఎస్పీని వెంటనే సస్పెండ్ చేయాలని మాధవ్ డిమాండ్ చేశారు. పోలీసులు ఈ విధంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. అరాచక శక్తులు జోలికి పోకుండా కేవలం ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపితే పోలీసులు ఈ విధంగా దాడులకు దిగుతారా అంటూ మాధవ్ పోలీసులు తీరుపై మండి పడ్డారు. డిఎస్పీని సస్పెండ్ చేయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకు వస్తున్నామని హెచ్చరించారు. ఈమేరకు పోలీసులు చేయిచేసుకున్న వీడియోను మీడియాకు విడుదల చేశారు.1
- తమిళనాడులో హైడ్రామా తర్వాత విజయ్ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ శుభవార్తతో అభిమానులు భావోద్వేగానికి లోనై, ఓ మహిళా అభిమాని ఆనందంతో బోరున ఏడ్చారు. చెన్నైలో ప్రమాణస్వీకారాన్ని లైవ్ టెలికాస్ట్ చేయడంతో సంబరాలు మిన్నంటాయి.1