Shuru
Apke Nagar Ki App…
మురుగు ప్రవహిస్తుండడంతో విద్యార్థులకు అస్వస్థత. పరిసరాలు పరిశుభ్రం చేయండి మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల కళాశాల వద్ద డ్రైనేజీ కంపు పొంగిపొర్లుతుండడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ రోగాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని శివారెడ్డిపేట్ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల వద్ద డ్రైనేజీ పొంగిపొర్లి నీరు సరఫరా చేసే బోరు బావిలోకి వెళుతుందని తెలియజేస్తున్నారు. డ్రైనేజీ క్లీన్ చేసి పరిసరాలు పరిశుభ్రం చేయాలని కోరుతున్నారు.
Jvnath
మురుగు ప్రవహిస్తుండడంతో విద్యార్థులకు అస్వస్థత. పరిసరాలు పరిశుభ్రం చేయండి మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల కళాశాల వద్ద డ్రైనేజీ కంపు పొంగిపొర్లుతుండడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ రోగాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని శివారెడ్డిపేట్ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల వద్ద డ్రైనేజీ పొంగిపొర్లి నీరు సరఫరా చేసే బోరు బావిలోకి వెళుతుందని తెలియజేస్తున్నారు. డ్రైనేజీ క్లీన్ చేసి పరిసరాలు పరిశుభ్రం చేయాలని కోరుతున్నారు.
More news from Telangana and nearby areas
- మురుగు ప్రవహిస్తుండడంతో విద్యార్థులకు అస్వస్థత. పరిసరాలు పరిశుభ్రం చేయండి మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల కళాశాల వద్ద డ్రైనేజీ కంపు పొంగిపొర్లుతుండడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ రోగాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని శివారెడ్డిపేట్ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల వద్ద డ్రైనేజీ పొంగిపొర్లి నీరు సరఫరా చేసే బోరు బావిలోకి వెళుతుందని తెలియజేస్తున్నారు. డ్రైనేజీ క్లీన్ చేసి పరిసరాలు పరిశుభ్రం చేయాలని కోరుతున్నారు.1
- తెలంగాణ పోలీస్ వారు ఈ వినాయక చవితి సందర్భంగా డీజే ల వల్ల ఎక్కువ సౌండ్ వల్ల ప్రాణాలు ఎలా పోతాయో పాట రూపంలో తెలియజేశారు ఈ పాటను ప్రతి ఒక్కరికి షేర్ చేసి అందరికీ తెలియజేయండి.1
- బంట్వారం మండల కేంద్రంలో పారిశుద్ధ్యం అధ్వానం.. దోమలు, విషపురుగులతో ప్రజలకు ఇబ్బందులు. బంట్వారం మండల కేంద్రంలోని 6వ వార్డులో సరైన మురుగు కాలువలు లేక వాడిన నీరు నిలిచిపోతోంది. దీంతో దోమల బెడదతో పాటు గడ్డి పెరిగి విషపురుగులు సంచరించే ప్రమాదం ఉందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కొత్త మురుగు కాలువ నిర్మాణం కోసం కాలువలు తీసినా పనులు ముందుకు సాగలేదని కాలనీవాసులు తెలిపారు. సంబంధిత అధికారులు చొరవ తీసుకుని కొత్త మురుగు కాలువ నిర్మించి సమస్య పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.1
- రామ రామ ఉయ్యాలో రఘవ రామ ఉయ్యాలో...జనము గల్ల ఉయ్యాలో జెండాలెత్తి ఉయ్యాలో... #bcrajyadhikarayathra #relareganga #newsong1
- శ్రీ ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారదు శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని సోమవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.1
- కన్నుల పండుగగా శ్రీనివాస కల్యాణ మహోత్సవం ముఖ్యఅతిథిగా మహిళా కమిషన్ సభ్యురాలు గోక శశికళ యాదవ్‌రెడ్డి అనిరుద్‌రెడ్డి ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహణ వేద మంత్రోచ్ఛారణల నడుమ శాస్త్రోక్తంగా కల్యాణం భక్తులతో మమేకమైన మహిళా కమిషన్ సభ్యురాలు అమీన్పూర్, శురు ప్రతినిధి సెప్టెంబర్ 20: అమీన్పూర్ డివిజన్ పరిధిలోని ఓడీఎఫ్ కాలనీలో శ్రీనివాస కల్యాణ మహోత్సవం శనివారం కన్నుల పండుగగా, భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. అమీన్పూర్ మాజీ కౌన్సిలర్, కాంగ్రెస్ యువ నాయకుడు గోక అనిరుద్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు కాలనీవాసులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి కల్యాణోత్సవాన్ని తిలకించారు. చందానగర్ వెంకటేశ్వర స్వామి దేవాలయ పురోహితులు సాయి పంతులు ఆధ్వర్యంలో శ్రీనివాస స్వామివారి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కల్యాణ వేడుకలు వైభవంగా కొనసాగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తుల గోవింద నామస్మరణతో మార్మోగింది. కల్యాణ మహోత్సవంలో గోక అనిరుద్‌రెడ్డి దంపతులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. భక్తులు కుటుంబ సమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. కాలనీ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మహిళా కమిషన్ సభ్యురాలు గోక శశికళ యాదవ్‌రెడ్డి హాజరయ్యారు. ఆమె శ్రీనివాస స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కాలనీవాసులు, భక్తులతో మమేకమై వారి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. కాలనీలోని సమస్యలను అడిగి తెలుసుకుని ప్రజలతో మాట్లాడారు. భక్తులతో కలిసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం పాటలు పాడి అందరిని అలరించారు. శ్రీనివాస కల్యాణ మహోత్సవం సందర్భంగా గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అతిథులను ఘనంగా సన్మానించారు. ఉత్సవాల నిర్వహణలో వారు చేసిన సేవలను అభినందిస్తూ సత్కరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. కాలనీలో ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ప్రజల్లో ఐక్యత, సోదరభావం మరింత బలపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, భక్తులు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు1
- బీఆర్ఎస్ నేతల ఫార్మ్‌హౌస్‌ల కూల్చివేతలపై ప్రచార వ్యూహం! ఫార్మ్‌హౌస్ వివాదంపై కాంగ్రెస్ ప్రభుత్వం దూకుడు పెంచింది. వరుసగా మూడో రోజు కూడా బీఆర్ఎస్ ప్రముఖుల అక్రమ నిర్మాణాలపై ప్రచారం చేపట్టింది. మొదటి రోజు హరీశ్ రావు సిద్దిపేట ఫార్మ్‌హౌస్, రెండో రోజు కేటీఆర్ జన్వాడా ఫార్మ్‌హౌస్, మూడో రోజు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అజీజ్‌నగర్ ఫార్మ్‌హౌస్‌లను టార్గెట్ చేసింది. ఇవన్నీ ప్రభుత్వ భూములు, ఎఫ్‌టీఎల్, నాలాల పరిధిలోనే అక్రమంగా నిర్మించినవేనని ప్రజలకు వివరించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.1
- గోమాతకు పూజలు నిర్వహిస్తే సకల దేవతలకు పూజలు చేసినట్లే. శ్రీదేవి గో పూజ చేస్తే సకల దేవతలకు పూజలు నిర్వహించినట్లేనని గీతా వాహిని అధ్యక్షురాలు తొడిగల శ్రీదేవి పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని శివాజీ నగర్ గణేష్ కట్ట వద్ద ప్రతిష్టించిన గణపతి మండపం వద్ద మహిళలు అత్యంత భక్తి గీతలతో కుంకుమార్చన నిర్వహించి గోపూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గోమాతలో సకల దేవతలు కొలువై ఉంటారని పూజలు నిర్వహిస్తే దేవతలకు పూజ చేసినట్లేనన్నారు.1