Shuru
Apke Nagar Ki App…
వరంగల్ జిల్లా లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి వరంగల్ జిల్లా: ఖిలావరంగల్ మండలం మామునూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం స్కూటీ పై వెళ్తున్న ఇద్దరు యువకులను ఎదురుగా వచ్చిన టాటా ఏసీ వాహనం ఢీ కొడటంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు.మృతులను శ్రీపతి వంశీ మరియు శ్రీపతి రాజుగా గుర్తించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మద్యం మత్తులో ఉన్న టాటా ఏసీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
M D Azizuddin
వరంగల్ జిల్లా లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి వరంగల్ జిల్లా: ఖిలావరంగల్ మండలం మామునూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం స్కూటీ పై వెళ్తున్న ఇద్దరు యువకులను ఎదురుగా వచ్చిన టాటా ఏసీ వాహనం ఢీ కొడటంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు.మృతులను శ్రీపతి వంశీ మరియు శ్రీపతి రాజుగా గుర్తించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మద్యం మత్తులో ఉన్న టాటా ఏసీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
- ఎం నరసింహులుAlampur, Jogulamba Gadwal😤on 15 March
More news from తెలంగాణ and nearby areas
- జీతం పెంచాలని కోరినందుకు ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ రాంప్రసాద్పై యజమానులు అనిల్రెడ్డి, బాలరాజు దాడికి పాల్పడ్డారు. దీనిని నిరసిస్తూ తోటి డ్రైవర్లు బస్సులు నిలిపివేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. డ్రైవర్పై దాడిని సీపీఐ నేత గడిపే మల్లేశం ఖండించారు. కార్మికులపై ఇలాంటి దాడులు సరికాదని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనతో హుస్నాబాద్ డిపో వద్ద కాసేపు ఉద్రిక్తత నెలకొంది.1
- తెలంగాణ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కేడీసీసీ బ్యాంకు ఉద్యోగుల ఆందోళనకు దిగారు. లంచ్ అవర్స్ లో రెడ్ బ్యాడ్జిలు ధరించి బ్యాంకు ముందు ధర్నా చేశారు. డి.సి.సి.బ్యాంకు ఉద్యోగులకు ఇచ్చిన ఇన్సెంటివ్/ఎక్స్రేషియా రికవరీ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. రికవరీ నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేనిచో మే రెండు నుంచి సమ్మె చేపడతామని సమ్మె నోటిస్ తెచ్చారు. ఈనెల 24న వరకు మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన నిర్వహిస్తామని తెలిపారు. అప్పటికి స్పందించకుంటే 23, 24న అధికారులకు మెమోరండం సమర్పిస్తామని, 27న డి.సి.సి. బ్యాంకుల ప్రధానకార్యాలయము ముందు ధర్నా చేస్తామన్నారు. 29న ధర్నా, సామూహిక శెలవు, 30న రాష్ట్ర సహకార బ్యాంకు ప్రధానకార్యాలయము హైదరాబాద్ ముందు 9 జిల్లాల సహకార బ్యాంకు ఉద్యోగులచే ధర్నా నిరసన కార్యక్రమాలు. ఉంటాయని తెలిపారు. అప్పటికి స్పందించకుంటే మే 2న సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.2
- గన్నేరువరం : ఉపాధి కూలీల లో ఉత్సాహం నింపడానికి మండల ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి ఉపాధి కూలీలతో కలిసి కొంత సమయం పని చేశారు. గుణపంతో మట్టిని తవ్వి కూలీలతో పనులు చేపట్టారు. మండలంలోని గునుకుల కొండాపూర్ లో పటేల్ చెరువులోకి నీరు వచ్చే ఫీడర్ కాలువ పనులు సర్పంచ్ అజయ్ వర్మ తో కలిసి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాబు కార్డు కలిగిన ప్రతి ఒక్క వ్యక్తి ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఉపాధిని పొందాలని సూచించారు. ఈ ఫీడర్ కాలువ పనికి 7 లక్షల రూపాయల నిధులు మంజూరు ఇప్పించడం జరిగిందని, గ్రామాన్ని జిల్లాస్థాయిలో ముందు వరుసులో నిలపాలని ఫీల్డ్ అసిస్టెంట్ హనుమాన్ల యాదగిరికి సూచించారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్ అసిస్టెంట్ సంపత్, ఫీల్డ్ అసిస్టెంట్ హనుమన్ల యాదగిరి ఉపాధి కూలీలు పాల్గొన్నారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పోతిరెడ్డి పల్లె గ్రామ శివారులో లేగ దూడపై చిరుత దాడి చేసిన ఘటన కలకలం రేపింది.ఈ సంఘటనపై స్పందించిన అటవీ శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని రెండు నెలల దూడపై చిరుత దాడి చేసి చంపినట్లుగా చిరుత అడుగుల ఆధారంగా వేటాడిన తీరుతో నిర్ధారించారు.మండలంలోని శివారు ప్రాంత రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శివారు ప్రాంతాల్లో పశువులను కట్టేయరాదని అటవీ ప్రాంతంలోకి వెళ్లినప్పుడు గుంపులుగా వెళ్లాలని అటవీశాఖ అధికారి మోహన్ లాల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.1
- స్వీయ క్రమశిక్షణతో రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చు సిరిసిల్ల డిఎస్పీ నాగేంద్రచారి. జిల్లా కేంద్రంలో నేతన్న చౌరస్తాలో పోలీస్, రవాణా శాఖ ఆధ్వర్యంలో రహదారి భద్రతపై ప్రతిజ్ఞ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక Arrive Alive కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు పోలీస్,రవాణా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని నేతన్న చౌరస్తా వద్ద వాహనదారులతో రహదారి భద్రతా ప్రతిజ్ఞ చేయడం జరిగింది.ఈసందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ....ప్రతి ఒక్కరు స్వీయక్రమశిక్షణతో రోడ్డు ప్రమాదాలను అరికట్టవచన్నారు. రోడ్డు పై ప్రయాణం చేసే సమయాల్లో మనం చేసే చిన్న చిన్న తప్పిదాలు మనతో పాటు ఎదుటివారిని కుటుంబాలని రోడ్డుపై పడేయచ్చని,ట్రాఫిక్ నింబంధనలు ఉన్నది మీ రక్షణ కోసమే అని ట్రాఫిక్ రోడ్డు భద్రత నిబంధనలు పాటిస్తూ క్షేమంగా గమ్యం చేరాలని తెలిపారు.వాహనాలు నడిపే సమయంలో సీట్ బెల్ట్ తప్పని సరిగా ధరించాలని,మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, స్వీయారక్షణార్ధం హెల్మెట్ తప్పక ధరించాలని,వాహనాలు నడిపే సమయాల్లో మొబైల్ ఫోన్ వడాద్దని,తల్లిదండ్రులు మైనర్ పిల్లలు వాహనాలు ఇవ్వవద్దని మైనర్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు.ప్రమాదం జరిగిన తొలి గంటను “గోల్డెన్ అవర్”గా పరిగణిస్తారని ఈ సమయంలో బాధితులకు సమయానికి వైద్య సహాయం అందితే అనేక ప్రాణాలు రక్షించవచ్చని పేర్కొన్నారు.జిల్లాలో అరైవ్ అలైవ్ కార్యక్రమంలో విస్తృతంగా అవగాహన సదస్సులు నిర్వస్తున్నామని ప్రజలు వాహనదారులు ట్రాఫిక్, రోడ్డు భద్రత నియమాలు పాటిస్తూ పోలీస్ వారికి సహకరించాలని విజ్ఞప్తి చేసారు.జిల్లా రవాణా అధికారి లక్ష్మణ్ మాట్లాడుతూ...రక్షిత ప్రయాణమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత సూచనలు పాటించాలన్నారు. ప్రాణాలు అమూల్యమైనవని, ప్రమాదాల నివారణను సామాజిక బాధ్యతగా స్వీకరించాలన్నారు. ఎవరికివారు జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలు జరగవని, మద్యం తాగి వాహనాలను నడపవద్దని ఆయన సూచించారు. ఈకార్యక్రమంలో సిరిసిల్ల పట్టణ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ట్రాఫిక్ ఆర్.ఐ సురేష్, ఎస్.ఐ శ్రీకాంత్, ఆర్.ఎస్.ఐ శ్రీనివాస్,amvi పృథ్విధర్ పోలీస్ సిబ్బంది వాహనదారులు పాల్గొన్నారు.3
- జావేద్ మృతి పార్టీకి, ఖమ్మం నగర ప్రజలకు తీరని లోటు. ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. మల్లు భట్టి విక్రమార్క ఉపముఖ్యమంత్రి1
- వరంగల్: దేశంలో పార్లమెంట్ నియోజకవర్గాల పెంపుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దుష్ప్రచారం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు అన్నారు. వరంగల్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, 2011 జనాభా లెక్కల ఆధారంగా రాజ్యాంగ ప్రకారమే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ జరుగుతుందని తెలిపారు. ప్రాంతీయ విభేదాలను కాంగ్రెస్ రెచ్చగొట్టి రాజకీయ లాభం పొందాలని చూస్తోందని ఆయన విమర్శించారు.1
- కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మున్సిపల్ ఏఈ 50 వేలు లంచం తీసుకుంటూ ఏసిబి కి చిక్కారు. హుజురాబాద్ ఆర్టీసీ డిపో చౌరస్తా వద్ద సివిల్ వర్క్ సంబంధించి ఎంబి రికార్డు చేసేందుకు కాంట్రాక్టర్ కు నుంచి 50 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. లంచం డబ్బులను సీజ్ చేసి కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. ఏఈ సుధాకర్ రెడ్డిని అరెస్టు చేసి కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తున్నట్లు ఏసీబీ అధికారులు ప్రకటించారు. లంచం ఇవ్వడం తీసుకోవడం నేరమని, ఎవరైన లంచం అడిగితే ఏసీబీ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు2
- రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని స్థానిక విద్యానగర్ గీతా నగర్ చౌరస్తాలో నిర్వహించిన విరాట్ హిందూ సమ్మేళనం కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ చక్రపాణి హాజరయ్యారు.1