logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

దొంతి అంగన్వాడి సెంటర్‌లో ALMC సమావేశం గర్భిణీ స్త్రీలకు పోషకాలపై అవగాహన! శివంపేట్ మండలం దొంతి గ్రామంలోని అంగన్వాడి సెంటర్–2 లో ALMC సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి గ్రామ సర్పంచ్ నీరుడి మౌనిక మురళీకృష్ణ, ఉపసర్పంచ్ భవనగారి శ్రీనివాస్ మరియు వార్డు సభ్యులు ఆనంద్, రాములు, స్వామిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గర్భిణీ స్త్రీలు మరియు బాలింతలకు ప్రభుత్వం అందిస్తున్న పోషకాహారంపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం సర్పంచ్ మరియు ఉపసర్పంచ్ చేతుల మీదుగా చిన్నారులకు అన్నప్రాసన మరియు అక్షరాభ్యాసం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు జ్యోతి, హేమలత, ఫాహిమా మరియు గ్రామ మహిళలు పాల్గొన్నారు.

2 hrs ago
user_ASHOK VENGANI
ASHOK VENGANI
Court reporter శివంపేట, మెదక్, తెలంగాణ•
2 hrs ago
ed8d47eb-12f3-4382-b559-da0c936285bb

దొంతి అంగన్వాడి సెంటర్‌లో ALMC సమావేశం గర్భిణీ స్త్రీలకు పోషకాలపై అవగాహన! శివంపేట్ మండలం దొంతి గ్రామంలోని అంగన్వాడి సెంటర్–2 లో ALMC సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి గ్రామ సర్పంచ్ నీరుడి మౌనిక మురళీకృష్ణ, ఉపసర్పంచ్ భవనగారి శ్రీనివాస్ మరియు వార్డు సభ్యులు ఆనంద్, రాములు, స్వామిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గర్భిణీ స్త్రీలు మరియు బాలింతలకు ప్రభుత్వం అందిస్తున్న పోషకాహారంపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం సర్పంచ్ మరియు ఉపసర్పంచ్ చేతుల మీదుగా చిన్నారులకు అన్నప్రాసన మరియు అక్షరాభ్యాసం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు జ్యోతి, హేమలత, ఫాహిమా మరియు గ్రామ మహిళలు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • శివంపేట్ మండలం గుండ్లపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీలో గత 10 సంవత్సరాలుగా ఉన్న మంచినీటి సమస్యను పరిష్కరించేందుకు పైప్‌లైన్ పనులు ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ పెంజర్ల మమత నర్సింహులు ఆధ్వర్యంలో ఈ పనులను కొంతన్‌పల్లి గ్రామ సర్పంచ్ చింతల వెంకట్రాం రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శివంపేట్ మండలం PACS తాజా మాజీ చైర్మన్ కూడా పాల్గొన్నారు. వేసవి కాలంలో నీటి కొరత రాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
    1
    శివంపేట్ మండలం గుండ్లపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీలో గత 10 సంవత్సరాలుగా ఉన్న మంచినీటి సమస్యను పరిష్కరించేందుకు పైప్‌లైన్ పనులు ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ పెంజర్ల మమత నర్సింహులు ఆధ్వర్యంలో ఈ పనులను కొంతన్‌పల్లి గ్రామ సర్పంచ్ చింతల వెంకట్రాం రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శివంపేట్ మండలం PACS తాజా మాజీ చైర్మన్ కూడా పాల్గొన్నారు. వేసవి కాలంలో నీటి కొరత రాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
    user_ASHOK VENGANI
    ASHOK VENGANI
    Court reporter శివంపేట, మెదక్, తెలంగాణ•
    12 hrs ago
  • Post by Narasimulu Narasimulu
    1
    Post by Narasimulu Narasimulu
    user_Narasimulu Narasimulu
    Narasimulu Narasimulu
    మనోహరాబాద్, మెదక్, తెలంగాణ•
    22 hrs ago
  • గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చి 11 ప్రజా తెలంగాణ న్యూస్/ సిద్దిపేట: విద్యతో పాటు శాస్త్ర సాంకేతికతపై అవగాహన పెంపొందించుకొని సమాజం పట్ల గౌరవంతో ప్రతి విద్యార్థి లక్ష్యంతో ముందుకు సాగాలని కావేరి వ్యవసాయ యూనివర్సిటీ వ్యవస్థాపకులు భాస్కర్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా గౌరారం వద్ద గల కావేరి వ్యవసాయ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాలలో గుర్తింపు పొందిన మహిళలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ విద్యార్థులు విద్యార్థి దశ నుంచే స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకొని పట్టుదలతో చదివితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని తెలిపారు. అనంతరం వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన మహిళలకు శాలువాలతో సన్మానం చేశారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు నాటకాలు, నృత్య ప్రదర్శనలు నిర్వహించి ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
    4
    గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చి 11 ప్రజా తెలంగాణ న్యూస్/
సిద్దిపేట: విద్యతో పాటు శాస్త్ర సాంకేతికతపై అవగాహన పెంపొందించుకొని సమాజం పట్ల గౌరవంతో ప్రతి విద్యార్థి లక్ష్యంతో ముందుకు సాగాలని కావేరి వ్యవసాయ యూనివర్సిటీ వ్యవస్థాపకులు భాస్కర్ రావు అన్నారు.
సిద్దిపేట జిల్లా గౌరారం వద్ద గల కావేరి వ్యవసాయ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాలలో గుర్తింపు పొందిన మహిళలను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ విద్యార్థులు విద్యార్థి దశ నుంచే స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకొని పట్టుదలతో చదివితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని తెలిపారు. అనంతరం వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన మహిళలకు శాలువాలతో సన్మానం చేశారు.
కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు నాటకాలు, నృత్య ప్రదర్శనలు నిర్వహించి ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
    user_GOUSE BEURO REPORTER
    GOUSE BEURO REPORTER
    రిపోర్టర్ వర్గల్, సిద్దిపేట, తెలంగాణ•
    16 min ago
  • మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపల్ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యేరామాయంపేట మున్సిపల్ పాలకవర్గం సమావేశం బుధవారం నిర్వహించారు. నూతనంగా ఎన్నికైన మున్సిపల్ ఛైర్ పర్సన్ గజవాడ లావణ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి హాజరయ్యారు. మున్సిపాలిటీ పరిధిలోని పలురు అధికారులు, కౌన్సిలర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రావు పార్టీలకతీతంగా రామాయంపేట మున్సిపాలిటీ అభివృద్ధి చేసుకుందామని అన్నారు. రామాయంపేట మున్సిపాలిటీ మొదటి సాధారణ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మున్సిపల్ పాలకవర్గానికి దిశా నిర్దేశం చేశారు. వేసవికాలంలో మున్సిపాలిటీలో నీటి ఎద్దడి లేకుండా చూడాలన్నారు. రామాయంపేట మున్సిపాలిటీ అధిక మొత్తంలో నిధులు కేటాయిస్తూ సీసీ రోడ్ల నిర్మాణం డ్రైనేజీల నిర్మాణం సీసీ కెమెరాలు మల్లె చెరువు సుందరి కరణకు పాటుపడతామన్నారు. గత పది సంవత్సరాల కాలంలో బిఆర్ఎస్ పాలకులు మున్సిపాలిటీ అభివృద్ధిని పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రామాయంపేట మున్సిపాలిటీ అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు
    1
    మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపల్ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యేరామాయంపేట మున్సిపల్ పాలకవర్గం సమావేశం బుధవారం నిర్వహించారు. నూతనంగా ఎన్నికైన మున్సిపల్ ఛైర్ పర్సన్ గజవాడ లావణ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి హాజరయ్యారు. మున్సిపాలిటీ పరిధిలోని పలురు అధికారులు, కౌన్సిలర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రావు పార్టీలకతీతంగా రామాయంపేట మున్సిపాలిటీ అభివృద్ధి చేసుకుందామని అన్నారు. రామాయంపేట మున్సిపాలిటీ మొదటి సాధారణ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మున్సిపల్ పాలకవర్గానికి దిశా నిర్దేశం చేశారు. వేసవికాలంలో మున్సిపాలిటీలో నీటి ఎద్దడి లేకుండా చూడాలన్నారు. రామాయంపేట మున్సిపాలిటీ అధిక మొత్తంలో నిధులు కేటాయిస్తూ సీసీ రోడ్ల నిర్మాణం డ్రైనేజీల నిర్మాణం సీసీ కెమెరాలు మల్లె చెరువు సుందరి కరణకు పాటుపడతామన్నారు. గత పది సంవత్సరాల కాలంలో బిఆర్ఎస్  పాలకులు మున్సిపాలిటీ అభివృద్ధిని పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రామాయంపేట మున్సిపాలిటీ అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    హవేలీఘనాపూర్, మెదక్, తెలంగాణ•
    1 hr ago
  • పదవ తరగతి విద్యార్థులకు సంగారెడ్డి జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు సూచనలు
    1
    పదవ తరగతి విద్యార్థులకు సంగారెడ్డి జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు సూచనలు
    user_Sangareddy News
    Sangareddy News
    జర్నలిస్ట్ రామచంద్రాపురం, సంగారెడ్డి, తెలంగాణ•
    1 hr ago
  • సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని పోతిరెడ్డిపల్లి గల శ్రీ కేతకి సంగమేశ్వర ఆలయంలో ప్రతి మంగళవారం సాయంత్రం వేళ నిర్వహించే హనుమాన్ చాలీసా పారాయణంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని హనుమంతుడి సేవలో లీనమై పోయారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
    1
    సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని పోతిరెడ్డిపల్లి గల శ్రీ కేతకి సంగమేశ్వర ఆలయంలో ప్రతి మంగళవారం సాయంత్రం వేళ నిర్వహించే హనుమాన్ చాలీసా పారాయణంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని హనుమంతుడి సేవలో లీనమై పోయారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
    user_Mahesh Kumar
    Mahesh Kumar
    Sangareddy, Telangana•
    23 hrs ago
  • ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా మాల స్టూడెంట్ జేఏసీ మరియు హంస ఆధ్వర్యంలో మార్చి 15 న నిర్వహించనున్న "మాల విద్యార్థుల, ఉద్యోగుల, అధ్యాపకుల ఆత్మీయ సమ్మేళనం" పోస్టర్‌ను ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలోని మాల సామాజిక వర్గ అభివృద్ధి కోసం, అన్ని రంగాల్లో మన ఉనికిని చాటుకోవడానికి ఈ వేదికను సిద్ధం చేసినట్లు తెలిపారు. రాజకీయ సిద్ధాంతాలు ఏవైనా (నీలి జెండా నుండి ఎర్ర జెండా వరకు, ఆర్‌ఎస్‌యూ నుండి ఆర్‌ఎస్‌ఎస్ వరకు), మాల జాతి బిడ్డలందరూ ఒకే తాటిపైకి రావాలి అని కోరారు. విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాలలో మాల యువతను ఉన్నత శిఖరాలకు చేర్చేలా విధివిధానాల రూపకల్పన. రాజకీయ రంగంలో మాలల వాటాను, ప్రాతినిధ్యాన్ని బలోపేతం చేసే దిశగా పోరాడాలి అని అన్నారు. జాతి అభివృద్ధి కోసం జరుగుతున్న ఈ పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. మన ఆలోచనా విధానం మాల జాతి పురోగతికి తోడ్పడేలా ఉండాలి. ప్రస్తుత పరిస్థితుల్లో కమ్యూనిటీ ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చించి, పరిష్కార మార్గాలను అన్వేషించేందుకు ఏర్పాటు చేసిన ఈ సమ్మేళనానికి ఉద్యోగులు, మేధావులు, విద్యార్థులు, ప్రొఫెసర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలనీ వారు కోరారు.
    1
    ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా మాల స్టూడెంట్ జేఏసీ మరియు హంస ఆధ్వర్యంలో మార్చి 15 న నిర్వహించనున్న "మాల విద్యార్థుల, ఉద్యోగుల, అధ్యాపకుల ఆత్మీయ సమ్మేళనం" పోస్టర్‌ను ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలోని మాల సామాజిక వర్గ అభివృద్ధి కోసం, అన్ని రంగాల్లో మన ఉనికిని చాటుకోవడానికి ఈ వేదికను సిద్ధం చేసినట్లు తెలిపారు.
రాజకీయ సిద్ధాంతాలు ఏవైనా (నీలి జెండా నుండి ఎర్ర జెండా వరకు, ఆర్‌ఎస్‌యూ నుండి ఆర్‌ఎస్‌ఎస్ వరకు), మాల జాతి బిడ్డలందరూ ఒకే తాటిపైకి రావాలి అని కోరారు. విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాలలో మాల యువతను ఉన్నత శిఖరాలకు చేర్చేలా విధివిధానాల రూపకల్పన. రాజకీయ రంగంలో మాలల వాటాను, ప్రాతినిధ్యాన్ని బలోపేతం చేసే దిశగా పోరాడాలి అని అన్నారు. జాతి అభివృద్ధి కోసం జరుగుతున్న ఈ పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. మన ఆలోచనా విధానం మాల జాతి పురోగతికి తోడ్పడేలా ఉండాలి. ప్రస్తుత పరిస్థితుల్లో కమ్యూనిటీ ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చించి, పరిష్కార మార్గాలను అన్వేషించేందుకు ఏర్పాటు చేసిన ఈ సమ్మేళనానికి ఉద్యోగులు, మేధావులు, విద్యార్థులు, ప్రొఫెసర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలనీ వారు కోరారు.
    user_దినేష్ కుమార్
    దినేష్ కుమార్
    సికింద్రాబాద్, హైదరాబాద్, తెలంగాణ•
    45 min ago
  • శివంపేట మండలం పరిధిలోని మక్దుంపూర్ గ్రామం 4వ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. రోడ్డు నిర్మాణానికి అడ్డంగా ఉన్న పాత గోడలను కూలగొట్టే పనులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కృష్ణవేణి, వార్డు సభ్యులు పాల్గొని పనులను పరిశీలించారు. గ్రామ అభివృద్ధి కోసం ఈ పనులు చేపట్టినట్లు తెలిపారు
    1
    శివంపేట మండలం పరిధిలోని మక్దుంపూర్ గ్రామం 4వ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. రోడ్డు నిర్మాణానికి అడ్డంగా ఉన్న పాత గోడలను కూలగొట్టే పనులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కృష్ణవేణి, వార్డు సభ్యులు పాల్గొని పనులను పరిశీలించారు. గ్రామ అభివృద్ధి కోసం ఈ పనులు చేపట్టినట్లు తెలిపారు
    user_ASHOK VENGANI
    ASHOK VENGANI
    Court reporter శివంపేట, మెదక్, తెలంగాణ•
    12 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.