Shuru
Apke Nagar Ki App…
సిరిసిల్ల లో పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో కలెక్టర్ తనిఖీ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో కలెక్టర్ గరిమ అగ్రవాల్ సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిరిసిల్ల పట్టణంలోని గీతా నగర్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని ఏ, బీ వింగ్ పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు పరీక్షలు రాస్తుండగా పరిశీలించారు సౌకర్యాలను పరిశీలించి.. అధికారులకు పలు సూచనలు చేశారు.
Satheesh gangu
సిరిసిల్ల లో పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో కలెక్టర్ తనిఖీ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో కలెక్టర్ గరిమ అగ్రవాల్ సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిరిసిల్ల పట్టణంలోని గీతా నగర్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని ఏ, బీ వింగ్ పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు పరీక్షలు రాస్తుండగా పరిశీలించారు సౌకర్యాలను పరిశీలించి.. అధికారులకు పలు సూచనలు చేశారు.
More news from తెలంగాణ and nearby areas
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం లో సోమవారం సందర్భంగా భక్తుల రద్దీ నెలకొంది. ఈ సందర్భంగా ఆలయ ఈవో శ్రీమతి ఎల్. రమాదేవి ఆలయంలో భక్తులకు అందిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. దర్శనానికి వచ్చే వృద్ధ భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ర్యాంపును పరిశీలించి, అది ఎలా ఉపయోగపడుతోంది అని భక్తులను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఆలయంలో ఏర్పాటు చేసిన ఉచిత త్రాగునీటి సౌకర్యం సక్రమంగా వస్తుందో లేదో నల్లాను ఓపెన్ ద్వారా పరిశీలించారు.భక్తులు స్వామివారికి కొబ్బరికాయలు కొట్టిన అనంతరం కూర్చొని కొబ్బరి ముక్కలు తినే ప్రదేశాలను కూడా ఈవో పరిశీలించారు. ఆ సమయంలో కొబ్బరి ముక్కలు చిన్నచిన్నగా విరిగి నేలపై పడిపోవడంతో అవి భక్తుల కాళ్లకు గుచ్చుకుని గాయాలు కావడం, ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉందని భక్తులకు సూచించారు. అనంతరం అక్కడ ఉన్న కొబ్బరి ముక్కలను స్వయంగా ఏరివేసి డస్ట్‌బిన్‌లో వేశారు.తదుపరి శానిటేషన్ సిబ్బందిని పిలిపించి ఆ ప్రాంతాన్ని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు. అలాగే ఆలయంలో ఉన్న రూ.100 శీఘ్ర దర్శనం, రూ.300 ఆతి శీఘ్ర దర్శనం, రూ.200–500 కోడె టికెట్ల కౌంటర్లను పరిశీలించి టికెట్ల జారీ విధానాన్ని తెలుసుకున్నారు. ఆలయంలోని వివిధ ప్రదేశాలను తిరిగి పరిశీలించి భక్తులకు అందుతున్న సౌకర్యాలపై అధికారులతో చర్చించారు.ఈ కార్యక్రమంలో ఆలయ ఉద్యోగులు, ఎస్పీఎఫ్ సిబ్బంది ఈవో వెంట ఉన్నారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సిరిసిల్ల కోర్టుకు బాంబు బెదిరింపు రావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కోర్టు అధికారిక ఈమెయిల్‌కు గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపు సందేశం పంపడం కలకలం రేపుతోంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రంగంలోకి దిగగా, ప్రత్యేక బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో కలిసి కోర్టు ప్రాంగణంలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. భద్రతా చర్యలను కట్టుదిట్టం చేసి, కోర్టు పరిసరాలను పూర్తిగా సీజ్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, బెదిరింపు మెయిల్ పంపిన వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.1
- పత్రికా ప్రకటన సిద్దిపేట 22 మార్చి 2026. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్టా గ్రామంలో 300 కోట్ల రూపాయలతో నిర్మించిన టిజీ అయిల్ ఫెడ్ వారి అయిల్ ఫామ్ కర్మాగారాన్ని ప్రారంభించి, ప్రజపాలనలో రైతు ఉత్సవాల్లో భాగంగా వ్యవసాయ మరియు వ్యవసాయ అనుబందరంగాలు, వ్యవసాయ యంత్రికికరణ పై ఏర్పాటు చేసిన 150 స్టాళ్లను సందర్చించి, నూతనంగా 50 కోట్ల రూపాయలతో అయిల్ ఫామ్ రిఫైనరి నిర్మానానికి శంకుస్థాపన చేశారు. అనంతరం సభా వేదిక సమీపంలో సిద్దిపేట నియోజకవర్గంలోని సిద్దిపేట మున్సిపాలిటీలో 141.34 కోట్ల రూపాయలతో UIDF అధ్వర్యంలో నీటి సరఫరా ప్రాజెక్టులు & భూగర్భ డ్రైనేజీ ప్రాజెక్టులకు శంకుస్థాపన, సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సన్ పల్లి గ్రామంలో 78 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన జిల్లా జైలు భవనాన్ని, సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్పల్లి గ్రామంలో 15 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన 50 పడకల సమీకృత ఆయుష్ ఆసుపత్రిని, 3.60 కోట్ల రూపాయలతో ఎన్సాన్ పల్లి లో నూతనంగా ఏర్పాటు చేసిన సెంట్రల్ మెడిసిన్ స్టోర్ ను, నంగునూరు మండలం గట్ల మల్యాల లో 1.43 కోట్ల రూపాయల తో నూతనంగా నిర్మించిన పిహెచ్సి భవనాన్ని, సిద్దిపేట పట్టణంలోనీ ఎన్జీవోస్ కాలని లో 1.43 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన యూపీహెచ్సీ భవనాన్ని ప్రారంభించారు. గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపాక మండల కేంద్రంలో 200 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కి శంకుస్థాపన చేశారు. మర్కుక్ మండల కేంద్రంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ లో 16.62 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాలు అదనపు భవనాలకు శంకుస్థాపన చేశారు. జగదేవ్ పూర్ మండల కేంద్రంలో 9.65 కోట్ల తో నిర్మించిన సమీకృత మండల కార్యాలయాల సముదాయం (ఐవోసీ) ని ప్రారంభించారు. అనంతరం సభా వేదికపై రైతుల ఖాతాలో రైతు భరోస నిధులు విడుదల చేసారు.. ఈ సందర్బంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా, సిద్దిపేట లో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరి ప్రాంభించడంతో పాటు రైతు భరోసా దాదాపు 3600 కోట్ల రూపాయలు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందని తెలిపారు. వ్యవసాయ పండుగ దినాన ఉగాది పండుగ సందర్భంగా ఆడబిడ్డలకు ఇచ్చిన చీర సారె లతో వచ్చిన ఆడబిడ్డలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎద్దెడ్చిన ఎవుసం రైతేడ్చిన రాజ్యం సుభిక్షంగా ఉండదని, ప్రజాపాలన ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రైతులకు అందించాల్సిన ఉచిత విద్యుత్, పంట చివరి గింజ వరకూ గిట్టుబాటు ధరతో కొనుగోలు చేయడమే కాకుండా , బోనస్ కూడా ఇచ్చి రైతుల కళ్ళల్లో ఆనందం నింపాలని ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఇదే వేదిక నుండి దాదాపుగా 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 3600 కోట్ల రైతు బరోసా నిధులు విడుదల చేసానని, రేపటి నుండే అవి రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి అని తెలిపారు. ఆర్ధిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, మిగిలిన 5400 కోట్లు 80 రోజుల్లో, మరో 2700 కోట్లు అ తరువాత 20 రోజుల్లో 2700 దాదాపుగా 45 రోజుల్లో 9000 కోట్ల 70 లక్షల ఖాతాల్లో వేసి రైతుల కళ్ళల్లో ఆనందం నింపుతామని స్పష్టం చేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 28 నెలలలో ప్రతి నెల 5500 కోట్ల రూపాయలు రైతుల సంక్షేమం కోసం ఖర్చు చేస్తున్నామని. 24 గంటల ఉచిత కరెంటు, బోనస్, రైతు బరోసా, రైతుభీమా లాంటి పథకాలకు కేటాయించామని, అకాల వర్షాలతో ఇసుకమేటలతో , వడగండ్ల వానలతో నష్టపోయిన రైతులకు ప్రతి ఎకరాకు రూ 10 వేల రూపాయల చొప్పున ఇప్పటి వరకు లక్షా 30 నుండి లక్ష 40 వేల రూపాయల వరకు ఖర్చు చేశామని వెల్లడించారు. గత సంవత్సరం తెలంగాణలో 2 కోట్ల 58 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం పండించి దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో రాష్ట్రం నిలిచిందన్నారు. చైతన్యం కలిగిన నిజామాబాద్, మెదక్ జిల్లాల రైతులు నిజాం సర్కార్ ఉన్నపుడే నిజాం చక్కెర కర్మాగారాన్ని కట్టారని, కమర్షియల్ పంటలైన చెరుకు, సోయా, మొక్కజొన్న, పసుపు పంటలు పండించారని, ఆనాడు పసుపు అమ్మితే తులం బంగారం వచ్చేదని ఇప్పుడు ఆ పరిస్థితి లేదని అన్నారు. వ్యవసాయంలో మార్పులు రావాలని, పామ్ ఆయిల్ ఫ్యాక్టరీని దాదాపు 300 కోట్లతో ప్రారంభించుకున్నామని, ఈ నాడు ఆయిల్ ఫామ్ పంట 3 లక్షల ఎకరాలకు చేరిందని, భవిష్యత్తులో 10 ఎకరాల్లో పంట సాగు చేసిన ప్రభుత్వం గిట్టుబాటు ధరతో కొంటుందని హామీ ఇచ్చారు. వ్యవసాయం, పాడి పరిశ్రమ గణనీయంగా ఉండేదని, ఇప్పుడు కాలం మారిందని, ఇతర రాష్ట్రం, దేశాల నుండిఆహార ఉత్పత్తులు దిగుమతి చేసుకుంటున్నారని, అది సరి కాదని, కష్టం తక్కువగా ఉన్న వరిని పండిస్తే భారత దేశంతొ పాటు ప్రపంచంలోని ఇతర దేశాలకు ఎగుమతి చేసిన ఇంకా మిగిలిపోయే పరిస్థితి ఉందని, ఇప్పటికే 71 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, ఇంకా ధాన్యం నిలువ ఉందని, రైతులు పంట మార్పిడి చేసుకోవాలని, మిల్లెట్స్ కూరగాయలు, ఆకు కూరలు, ఇతర పంటలు పండించాలని, ఆ దిశగా రైతులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, ఇందుకు అవసరమైన పంట మార్పిడి ద్వారా లాభసాటి ధరలు అందేలా చర్యలు చేపట్టాలని మంత్రులు తుమ్మల నాగేశ్వర రావును కోరారు. సిద్దిపేటలో కట్టినట్లే కొడంగల్ నియోజక వర్గంలో కూడా ఆయిల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని మంత్రులు దామోదర, తుమ్మల కోరారు. రాష్ట్రంలోని 12,728 గ్రామపంచాయతీలు ఒక అంకాపూర్ లా వ్యవసాయంలో అభివృద్ధి చెంది ప్రతి రైతు ఇంటికి ఓ కార్ కొనుకున్నెల మార్చాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందని అన్నారు. దిగుమతి చేసుకునే అవసరం లేకుండా ఇక్కడే లాభసాటి ఆర్గానిక్ పంటలు పండించాలని. తెలంగాణలో సారవంతమైన భూమి ఉందని, వ్యవసాయంలో సాంకేతిక స్థాయిలో పని చేసి కష్ట పడాల్సిన అవసరం ఉందని. ప్రభుత్వాలు రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించి అవగాహన కల్పించాలని, పంట పండించడానికి అవకాశం ఇచ్చి, రైతులు పండించిన పంటలను అమ్మడానికి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం మాత్రమే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో ఎగుమతి చేసే అవకాశం కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుని బంగారు తెలంగాణ దిశగా ముందుకు సాగాలని అన్నారు. మహిళలకే అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని, ప్రతి ఆడబిడ్డ ఉచితంగా ఆర్టీసీలో ప్రయాణం చేస్తున్నారని, ఇందుకు 9 వేల కోట్లు ఖర్చు చేశామని, ప్రతి నెల ఉచిత ప్రయాణం కోసం 350 కోట్ల రూపాయలు చెల్లిస్తున్నామని తెలిపారు, అదేవిధంగా 1000 బస్సులకు కొని ఆ బస్సులకు ఆర్టీసీకి స్వయం సహాయక సంఘా మహిళల ద్వారా అద్దెకు ఇవ్వడం ద్వారా యజమానులను చేశామని, సంఘా మహిళలకు పెట్రోల్ బంకులు ఇవ్వడం జరిగిందని, 67 లక్షల మంది స్వయం సహాయక సంఘాల మహిళలు ఉన్నారని, 2034 నాటికి కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేసేల సంఘం బాధ్యత తీసుకోవాలని తెలిపారు. పట్టణాలలో కూడా మహిళల సంఘాలను పెంచాలని పిలుపునిచ్చారు. 57 వేల బ్యాంకు లింకేజీ ద్వారా 1350 కోట్లు ప్రభుత్వం కట్టిందని తెలిపారు. సోలార్ విద్యుత్ అంటే అదాని, అంబానీ లే ఉండేవారని, నేడు వారికి సమానంగా మా ఆడబిడ్డలు ఎదిగారని అన్నారు. శిల్పారామంలో పక్కన 106 స్టాల్స్ ఏర్పాటు చేసి ప్రపంచానికి ప్రదర్శించి అమ్మేలా ఇందిరా మహిళా శక్తి సెంటర్ ను ఆడబిడ్డలకు అందించాం. ఆడబిడ్డలు ఉత్పత్తి చేసిన వస్తువులకు అమెజాన్ లాంటి ద్వారా అంతర్జాతీయ స్టాయిలో అమ్మకాలు జరుగుతున్నాయని. ఆడ బిడ్డలు ఆర్థికంగా, ఆత్మగౌరవంతో స్వయం శక్తితో నిలబడాలని, దేశ ఆర్ధిక వ్యవస్థ లో ఆడ బిడ్డల ఎదుగుదల అవసరమని తెలిపారు. మహిళలు ఆర్థికంగా ఎదగాలని, రాష్ట్రం 2034 నాటికి వన్ బిలియన్ డాలర్ ఎకనామిగా ఎదుగుతుందని, దేశ ఆర్ధిక వ్యవస్థలో ఆడబిడ్డకు అర్ధ భాగం వచ్చినప్పుడే దేశ ఆర్ధిక వ్యవస్థ బలపడుతుందని అందుకు సంపూర్ణ సహకారం అందిస్తామని అన్నారు. ఈ విద్యా సంవత్సరం నుండి నర్సరీని నుండి అన్ని ప్రభుత్వ స్కూళ్లలో ప్రతి రోజు ఒకరోజు పాలు మరో రోజు రాగి జావా, వారం రోజుల్లో మంచి ఆహారాన్ని అందిస్తామని, ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్దుతామని తెలిపారు. ప్రైవేట్ స్కూళ్లలో కన్నా ప్రైవేట్ స్కూల్లోలలో ఎక్కువగా చదువుకున్న వారు ఉన్నారని, ఈ రోజు మంచి స్థానంలో ఉన్న వారు అందరూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వారేనని గుర్తు చేశారు. రాష్ట్రంలోని దాదాపు 18 వేల పాఠశాలను ప్రక్షాళన చేస్తున్నామని, అందుకునే విద్యా శాఖ నా దగ్గరే ఉందని అన్నారు. సాంకేతిక నైపుణ్యం పెంచుకోవాలని, గతకాలానికి భిన్నంగా కులాలకు అతీతంగా వృత్తి పనులు చేస్తున్నారని, అందుకు శిక్షణ అవసరమని, ఏ టీ సి లో చదువుకునే ప్రతి విద్యార్థికి 2000 స్కాలర్షిప్ ఇస్తామని, ట్యాలెంట్ ఉంటే ఏదైనా సాధించగలమని, సాంకేతిక నైపుణ్యం ఉన్న విద్యపై దృష్టి పెట్టాలని, ఇవే మన భవిష్యత్తు మారుస్తాయని అన్నారు. ఇజ్రాయల్ ఇరాన్ యుద్ధం జరుగుతుంది, యుద్ధం కొనసాగితే యూరియా కొరత ఏర్పడే అవకాశం ఉందని ఇబ్బంది లేకుండా రామగుండం ఫ్యాక్టరి ద్వారా, కేంద్ర ప్రభుత్వం ద్వారా అధికంగా యూరియా తెపించుకోవాలని, అభివృద్ధి కోసం అంకితమై ప్రజలు, రైతుల 3500 చొప్పున ఇందిరమ్మ ఇండ్లు సిద్దిపేట , గజ్వేల్, సిరిసిల్ల నియోజక వర్గంలో మొత్తం 10500 మంజూరు చేశామని తెలిపారు. కొడంగల్ నియోజకవర్గంలో ఇంత పెద్ద మొత్తంలో అభివృద్ధి పనులు చేపట్టలేదని అన్నారు. 119 శాసన సభ నియోజక వర్గాలకు సమాన ప్రాతినిధ్యం ఇస్తామని తెలిపారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ, వ్యవసాయంలో రైతన్న, నేతన్నలకు ఎన్ని కష్టాలు వచ్చినా సమర్థవంతంగా ఎదురుకుని, రైతాంగానికి మొదటి సంవత్సరంలోనే ఒకే సారి 21 వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేసిన ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని అన్నారు. రైతుభరోసా 9 వేల కోట్లు 9 రోజుల్లో జమ చేశారని, సన్నబియ్యం పండించిన రైతులకు బోనస్ ఇచ్చారని, రైతు ఏ పంటను పండించుకోవాలన్న దానికి బోనస్ ఇచ్చే ఆలోచన ఉందని అన్నారు., 50 వేల కోట్లతో రిఫైండరీ కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 9రోజునే 9 వేల కోట్ల రైతు బరోసా కూడా మంజూరు చేశారని తెలిపారు. ఎన్ని పంటలు పండించిన ఏం ఎస్ పి ఇప్పించిన ప్రభుత్వం, ప్రపంచంలో యుద్ధ వాతావరణం ఉన్నప్పటికీ రాష్ట్రంలో ఎలాంటి సమస్యలు లేకుండా చూస్తున్న ప్రభుత్వం. ఒక పంట కాలానికి అవసరమైన దాదాపు 50 వేల కోట్ల మెట్రిక్ టన్నుల యూరియా తెప్పించారని అన్నారు. తెలంగాణను పామ్ ఆయిల్ పంట ను అధికంగా పండించిన రాష్ట్రంగా దేశంలో తెలంగాణ నిలిచిందని అన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, నర్మెట్ట ఆయిల్ పామ్ ఆయిల్ ప్రారంభించుకోవడంతో పాటు రిఫైండరీ శంకుస్థాపన కూడా చేశారని తెలిపారు. ఎలాంటి నష్టానైన సమర్ధవంతంగా తట్టుకోగల ఆయిల్ పామ్ పంటను సాగు చేయాలని సూచించారు. ఆయిల్ ఫామ్ పంటలో అంతర్ పంటలు కూడా సాగు చేసుకోవచ్చని తెలిపారు. రైతు రాజ్యం, రైతులకోసం పాటుపడే ప్రభుత్వం అని అన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, తెలంగాణలో ప్రతి ఒక్కరికి అండదండగా ఉంటూ ప్రభుత్వం ముందుకు వెళ్తోందని అన్నారు. రైతును రాజును చేసేలా కృషి చేస్తున్న ప్రభుత్వం, భూబారతి ద్వారా అనేక సమస్యలకు పరిష్కారం చూపాం, సాదా బైనామలకు కూడా పరీక్షారం చూపిస్తాం అని, అర్హుడైన ప్రతి పేద వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. జిల్లా ఇంచార్జ్ మంత్రి వివేక్ మాట్లాడుతూ, రైతుల పక్షాన 21 వేల కోట్లు ఖర్చు చేసి రుణమాఫీ చేశామాని, 120 నియోజక వర్గాల్లో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేశామని తెలిపారు. సిద్దిపేట జిల్లాలో సమస్యల పరిష్కారానికి ప్రతేక చర్యలు తీసుకుంటామని ప్రజలకు విశ్వాసం కల్పించారని తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజా నరసింహ మాట్లాడుతూ, నాణ్యత తొ కూడిన విద్యను అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, పంట మార్పిడి తెలంగాణలో చాల అవసరమని, సుమారు 75 వేల పోస్టులు భర్తీ చేశామని, అందులో ఆరోగ్య శాఖ 10 వేల పోస్టులు, రానున్న రోజుల్లో మరో 10 వేల పోస్టులు మంజూరు చేస్తామని, సమస్యలు ఎన్ని ఉన్నా వాటిని సానుకూలంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ స్పీకర్, బాన్స్ వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, మెదక్ ఎంపీ రఘునందన్ రావు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ఎంఎల్సిలు అంజిరెడ్డి, మల్క కొమురయ్య, అయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, జిల్లా కలెక్టర్ కే. హైమావతి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా 16 వందల రైతు వేదికల ద్వారా 4 లక్షల మంది రైతులు వీక్షించారు.1
- కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రామంచ గ్రామపంచాయతీ పరిధిలోని నర్సింహులపల్లేలో పోచమ్మ బోనాలను ఘనంగా నిర్వహించారు. ప్రకృతి వైపరీత్యాలతో ప్రజలంతా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో రామంచ గ్రామ పంచాయతీ పరిధిలోని నరసింహులపల్లే వాసులు పోచమ్మ బోనాలు నిర్వహించారు. చిన్నాపెద్దా తేడా లేకుండా పెద్దసంఖ్యలో ర్యాలీగా అమ్మవారి ఆలయానికి చేరుకుని బోనాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ధూప దీప నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించారు. పాడిపంటలతో ప్రజలందరిని చల్లంగా చూడాలని అమ్మవారిని వేడుకున్నారు. బోనాల వేడుకల్లో సర్పంచ్ ఒంటెల కిషన్ రెడ్డి, రెడ్డి సంఘం ప్రతినిధులు సుధాకర్ రెడ్డి, సాగర్ రెడ్డి, సమ్మిరెడ్డి, విజేందర్ రెడ్డి, రాజిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, తిరుపతి రెడ్డి, మల్లారెడ్డి పాల్గొన్నారు.2
- జగిత్యాల, మార్చి 23: జగిత్యాల పట్టణంలోని ఇందిరమ్మ డబుల్ బెడ్‌రూం అర్బన్ కాలనీ (నూకపల్లి) సమీపంలో ఉన్న మున్సిపల్ డంపింగ్ యార్డ్ వల్ల కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతిరోజూ భారీగా చెత్తను పడేయడం, తరచుగా దానిని కాల్చడం వల్ల విషపూరిత పొగ, దుర్వాసన కాలనీ అంతటా వ్యాపిస్తున్నాయి. దీంతో చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు ముఖ్యంగా శ్వాసకోశ సమస్యలు, దగ్గు, అలర్జీలతో బాధపడుతున్నారు. కొందరు ఆసుపత్రుల్లో చేరాల్సిన పరిస్థితి ఏర్పడిందని స్థానికులు తెలిపారు. దీనికి సంబంధించిన వైద్య ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పారు. ఈ సమస్యపై మున్సిపల్ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడుతున్నారు. ఇప్పటికే అనేకసార్లు విజ్ఞప్తులు చేసి విసుగొచ్చిన కాలనీ వాసులు, ఈ పరిస్థితుల్లో అక్కడ నివసించడం సురక్షితం కాదని స్పష్టం చేశారు. డంపింగ్ యార్డ్‌ను వెంటనే తొలగించకపోతే తాము అక్కడ ఉండలేమని, లేకపోతే తమను సురక్షిత ప్రాంతానికి తరలించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా, ప్రస్తుతం కొనసాగుతున్న చెత్త కాల్చే చర్యలను తక్షణమే నిలిపివేసి, ఇప్పటికే ఉన్న మంటలను ఆర్పివేసి పొగ వ్యాప్తిని అరికట్టాలని కోరుతున్నారు. లేకపోతే, ఆందోళనలు, నిరసనలు మరియు చట్టపరమైన చర్యలు చేపట్టడం తప్ప మరో మార్గం ఉండదని కాలనీ వాసులు హెచ్చరించారు.4
- Post by Venu Gopal1
- యాసంగి సీజన్ ధాన్యం కొనుగోలుకు సన్నహాలు చేయాలి* *---జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్* జిల్లాలో రబీ సీజన్ ధాన్యం కొనుగోలుకు సన్నాహాలు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా వ్యవసాయ, పౌర సరఫరా, అటవీ, శ్రీ శిశ సంక్షేమ శాఖలు అధికారులందరితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ.. జిల్లాలో రబీ సీజన్ కు సంబంధించి ధాన్యం కొనుగోలు ప్రక్రియకు సన్నాహాలు చేయాలని అధికారులు ఆదేశించారు. ఏప్రిల్ 15 నుండి ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలని సూచించారు. యాసంగి (రబీ) లో 4,45,466 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని స్వీకరించడానికి లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. మెదక్ జిల్లాలో వన మహోత్సవంలో కార్యక్రమంలో లక్ష్యంగా మొక్కలు నాటి వాటి సంరక్షించాల్సిన బాధ్యత అధికారుల ది అన్నారు. ఈ సంవత్సరం వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మెదక్ జిల్లాకు 31.7 లక్షల మొక్కలు నాటాలని నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా పటిష్ట కార్యచరణ తో సిద్ధంగా ఉండాలన్నారు. జూలై మొదటి వారంలో ప్రారంభించే ఈ కార్యక్రమానికి జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నర్సరీలలో ఎక్కడెక్కడ మొక్కలు లభ్యమవుతాయి ఏ ఏ మొక్కలు నాటాల్సి ఉంటుంది అలాగే 2027 టార్గెట్, 2028 లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిక అనుగుణంగా చర్యలు చేపట్టాలన్నారు. బాల్యవివాహాలు నిషేధించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. తక్కువ బరువు, ఎత్తు కలిగిన చిన్న పిల్లలకు పౌష్టికాహారం అందించాలన్నారు. తక్కువ బరువు, ఎత్తు ఉన్న పిల్లల్ని గుర్తించి పరిత వెతిన సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజావాణి , ఇతర దరఖాస్తులను పరిశీలించి శాశ్వతంగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, అధికారులు పాల్గొన్నారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో కలెక్టర్ గరిమ అగ్రవాల్ సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిరిసిల్ల పట్టణంలోని గీతా నగర్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని ఏ, బీ వింగ్ పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు పరీక్షలు రాస్తుండగా పరిశీలించారు సౌకర్యాలను పరిశీలించి.. అధికారులకు పలు సూచనలు చేశారు.1