డంపింగ్ యార్డ్‌తో ఇబ్బందులు… తక్షణ తొలగింపునకు కాలనీ వాసుల డిమాండ్ జగిత్యాల, మార్చి 23: జగిత్యాల పట్టణంలోని ఇందిరమ్మ డబుల్ బెడ్‌రూం అర్బన్ కాలనీ (నూకపల్లి) సమీపంలో ఉన్న మున్సిపల్ డంపింగ్ యార్డ్ వల్ల కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతిరోజూ భారీగా చెత్తను పడేయడం, తరచుగా దానిని కాల్చడం వల్ల విషపూరిత పొగ, దుర్వాసన కాలనీ అంతటా వ్యాపిస్తున్నాయి. దీంతో చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు ముఖ్యంగా శ్వాసకోశ సమస్యలు, దగ్గు, అలర్జీలతో బాధపడుతున్నారు. కొందరు ఆసుపత్రుల్లో చేరాల్సిన పరిస్థితి ఏర్పడిందని స్థానికులు తెలిపారు. దీనికి సంబంధించిన వైద్య ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పారు. ఈ సమస్యపై మున్సిపల్ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడుతున్నారు. ఇప్పటికే అనేకసార్లు విజ్ఞప్తులు చేసి విసుగొచ్చిన కాలనీ వాసులు, ఈ పరిస్థితుల్లో అక్కడ నివసించడం సురక్షితం కాదని స్పష్టం చేశారు. డంపింగ్ యార్డ్‌ను వెంటనే తొలగించకపోతే తాము అక్కడ ఉండలేమని, లేకపోతే తమను సురక్షిత ప్రాంతానికి తరలించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా, ప్రస్తుతం కొనసాగుతున్న చెత్త కాల్చే చర్యలను తక్షణమే నిలిపివేసి, ఇప్పటికే ఉన్న మంటలను ఆర్పివేసి పొగ వ్యాప్తిని అరికట్టాలని కోరుతున్నారు. లేకపోతే, ఆందోళనలు, నిరసనలు మరియు చట్టపరమైన చర్యలు చేపట్టడం తప్ప మరో మార్గం ఉండదని కాలనీ వాసులు హెచ్చరించారు.
డంపింగ్ యార్డ్‌తో ఇబ్బందులు… తక్షణ తొలగింపునకు కాలనీ వాసుల డిమాండ్ జగిత్యాల, మార్చి 23: జగిత్యాల పట్టణంలోని ఇందిరమ్మ డబుల్ బెడ్‌రూం అర్బన్ కాలనీ (నూకపల్లి) సమీపంలో ఉన్న మున్సిపల్ డంపింగ్ యార్డ్ వల్ల కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతిరోజూ భారీగా చెత్తను పడేయడం, తరచుగా దానిని కాల్చడం
వల్ల విషపూరిత పొగ, దుర్వాసన కాలనీ అంతటా వ్యాపిస్తున్నాయి. దీంతో చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు ముఖ్యంగా శ్వాసకోశ సమస్యలు, దగ్గు, అలర్జీలతో బాధపడుతున్నారు. కొందరు ఆసుపత్రుల్లో చేరాల్సిన పరిస్థితి ఏర్పడిందని స్థానికులు తెలిపారు. దీనికి సంబంధించిన వైద్య ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పారు. ఈ సమస్యపై మున్సిపల్ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు
చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడుతున్నారు. ఇప్పటికే అనేకసార్లు విజ్ఞప్తులు చేసి విసుగొచ్చిన కాలనీ వాసులు, ఈ పరిస్థితుల్లో అక్కడ నివసించడం సురక్షితం కాదని స్పష్టం చేశారు. డంపింగ్ యార్డ్‌ను వెంటనే తొలగించకపోతే తాము అక్కడ ఉండలేమని,
లేకపోతే తమను సురక్షిత ప్రాంతానికి తరలించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా, ప్రస్తుతం కొనసాగుతున్న చెత్త కాల్చే చర్యలను తక్షణమే నిలిపివేసి, ఇప్పటికే ఉన్న మంటలను ఆర్పివేసి పొగ వ్యాప్తిని అరికట్టాలని కోరుతున్నారు. లేకపోతే, ఆందోళనలు, నిరసనలు మరియు చట్టపరమైన చర్యలు చేపట్టడం తప్ప మరో మార్గం ఉండదని కాలనీ వాసులు హెచ్చరించారు.
- జగిత్యాల, మార్చి 23: జగిత్యాల పట్టణంలోని ఇందిరమ్మ డబుల్ బెడ్‌రూం అర్బన్ కాలనీ (నూకపల్లి) సమీపంలో ఉన్న మున్సిపల్ డంపింగ్ యార్డ్ వల్ల కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతిరోజూ భారీగా చెత్తను పడేయడం, తరచుగా దానిని కాల్చడం వల్ల విషపూరిత పొగ, దుర్వాసన కాలనీ అంతటా వ్యాపిస్తున్నాయి. దీంతో చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు ముఖ్యంగా శ్వాసకోశ సమస్యలు, దగ్గు, అలర్జీలతో బాధపడుతున్నారు. కొందరు ఆసుపత్రుల్లో చేరాల్సిన పరిస్థితి ఏర్పడిందని స్థానికులు తెలిపారు. దీనికి సంబంధించిన వైద్య ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పారు. ఈ సమస్యపై మున్సిపల్ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడుతున్నారు. ఇప్పటికే అనేకసార్లు విజ్ఞప్తులు చేసి విసుగొచ్చిన కాలనీ వాసులు, ఈ పరిస్థితుల్లో అక్కడ నివసించడం సురక్షితం కాదని స్పష్టం చేశారు. డంపింగ్ యార్డ్‌ను వెంటనే తొలగించకపోతే తాము అక్కడ ఉండలేమని, లేకపోతే తమను సురక్షిత ప్రాంతానికి తరలించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా, ప్రస్తుతం కొనసాగుతున్న చెత్త కాల్చే చర్యలను తక్షణమే నిలిపివేసి, ఇప్పటికే ఉన్న మంటలను ఆర్పివేసి పొగ వ్యాప్తిని అరికట్టాలని కోరుతున్నారు. లేకపోతే, ఆందోళనలు, నిరసనలు మరియు చట్టపరమైన చర్యలు చేపట్టడం తప్ప మరో మార్గం ఉండదని కాలనీ వాసులు హెచ్చరించారు.4
- జన్నారం ప్రభుత్వాసుపత్రిని 30 పడకలకు పెంచి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్ ను టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ స్టేట్ జాయింట్ కన్వీనర్ కత్తెరపాక రాజేష్ కోరారు. సోమవారం జన్నారం ఆసుపత్రిలో చైర్మన్ ను ఆయన కలిసి పలు సమస్యలు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో నీటి సమస్యను పరిష్కరించాలని, వీల్ చైర్ సౌకర్యం కల్పించాలని ఆయన కోరారు.1
- వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాల్లో భాగంగా 5వ రోజు సోమవారం పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా శ్రీ సీతారాముల స్వామి వారికి పంచోపనిషత్తు విధానంలో అభిషేకం నిర్వహించారు. అనంతరం శ్రీ రామచంద్ర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పరివార దేవతార్చనలు ఘనంగా నిర్వహించారు.శ్రీరామ నవరాత్రి సందర్భంగా ఆలయ అర్చకులు రామాయణ పారాయణం, శ్రీరామ గీత, ఆధ్యాత్మిక రామాయణ పారాయణాలను ఏకాంతంగా నిర్వహించారు. సోమవారం సాయంత్రం 4:30 గంటలకు శంకరమఠంలో రామాయణ ప్రవచనం నిర్వహించినట్లు దేవస్థాన అధికారులు తెలిపారు.అలాగే రాజన్న ఆలయ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఆలయ అర్చకులు, వేద పండితులు ఏకాంత పూజలు నిర్వహించి దేవస్థానం మరింత అభివృద్ధి చెందాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సిరిసిల్ల కోర్టుకు బాంబు బెదిరింపు రావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కోర్టు అధికారిక ఈమెయిల్‌కు గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపు సందేశం పంపడం కలకలం రేపుతోంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రంగంలోకి దిగగా, ప్రత్యేక బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో కలిసి కోర్టు ప్రాంగణంలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. భద్రతా చర్యలను కట్టుదిట్టం చేసి, కోర్టు పరిసరాలను పూర్తిగా సీజ్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, బెదిరింపు మెయిల్ పంపిన వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.1
- అపర భద్రాద్రిగా పేరుగాంచిన కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలోని ఈనెల 27 న శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు జాతర ఘనంగా నిర్వహించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా సీతారామచంద్రస్వామి ఆలయ ప్రాంగణంలో అడిషనల్ కలెక్టర్ లు ఆలయ సిబ్బందితో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. 13 రోజులపాటు జరిగే శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు ఇబ్బంది పడకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ట్రాఫిక్ నిబంధనలను రూట్ మ్యాప్ ను పరిశీలించారు. మంచినీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని అలాగే ఆలయ ప్రాంగణంలో పరిశుభ్రంగా ఉండుటకు శానిటేషన్ ఎప్పటికప్పుడు చేయించాలని, మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని, భారీ గేట్లను ఏర్పాటుతో భక్తులు క్యూ లైన్ పద్ధతిలో వచ్చేలా చూసుకోవాలన్నారు. రాత్రి పగలు ఎంపీడీవో సిబ్బంది ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు. నాలుగు అంబులెన్స్ ను ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేయాలని ఆలయం మండపం వద్ద డోనర్ పాసులను, వివిఐపి పాసుల వద్ద వేరు వేరుగా గ్యాలరీలు ఏర్పాటు చేయాలని సూచించారు. శ్రీరామనవమికి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు కలెక్టర్ సూచించారు.1
- సిర్పూర్‌లో నవచండీ యాగం కొనసాగింపు కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టౌన్‌లోని శ్రీ సంతోషిమాత ఆలయంలో మార్చి 16 నుంచి 26 వరకు అతి రుద్రం సహిత నవచండీ యాగం వేద పండితుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. యాగంలో భాగంగా కోనేరు రమాదేవి, కోనప్ప దంపతులు భవానీ శంకర స్వామివారిని దర్శించి పట్టు వస్త్రాలు సమర్పించారు. నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థనలు చేశారు. అనంతరం వేద పండితులు దంపతులకు ఆశీర్వచనాలు అందజేశారు.1
- కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో సోమవారం అటవీ శాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్, ఎస్పీ రాజేష్ చంద్ర, మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి తదితరులు పాల్గొని మొక్కలు నాటారు. 'వృక్షో రక్షతి రక్షితః' అని ఉమారాణి పేర్కొంటూ పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ చైతన్య రెడ్డి, డీఎస్ఓ నిఖిత, ఆర్డీవో వీణ పాల్గొన్నారు.1
- జీవన్ రెడ్డి మాట్లాడుతూ నాలుగు దశాబ్దాల అనుబంధం తెంచుకోవడం నాకు బాధాకరమే. శాసన మండలి లో ఒంటరి పోరాటం చేసిన.. అధికారం లో ఉన్న ప్రజల పక్షం నిలబడి పోరాటం చేసిన.. తుమ్మడి హేట్టి బ్యారేజ్ నిర్మాణం జాప్యం తో తెలంగాణ రాష్ట్రం పై తీవ్ర ప్రభావం.. మాజీ మంత్రి జీవన్ రెడ్డి.. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో మాజీ మంత్రివర్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 20 మాసాల నుండి జగిత్యాల లో జరుగుతున్న పరిణామాలు కాంగ్రెస్ లో కొనసాగటం ఆలోచించుకునే పరిస్థితి కల్పించాయి. నా సమస్యకు పరిష్కారం లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ లో కొనసాగటం సాధ్యం కాదు అని అభిప్రాయానికి వచాను.. నాలుగు దశాబ్దాల అనుబంధం తెంచుకోవ బాధాకరం.. అది నుండి ప్రజల పక్షం నిలబడి అధికార పార్టీ లో ఉండి కూడా పోరాటం చేసిన. ఉమ్మడి రాష్ట్రంలో వై ఎస్ రాజశేకర్ రెడ్డి సకాలంలో రుణాలు చెల్లించిన వారికి ప్రోత్సాహకంగా రూ.5000 చెల్లిస్తామని హమీ ఇచి, జగిత్యాలలో అమలు చేయకపోవడంతో రైతులకు ప్రోత్సాహకం అందించాలని మంత్రి గా ఉండి కూడా ధర్నా చేసిన అని గుర్తు చేసిన. ఎలెక్ట్రిసిటీ అదనపు బిల్లు ఉపసంహరించాలని ఎమ్మెల్సీగా ఉండి కూడా ఉద్యమించిన. నా సమస్యకు పరిష్కారం లేకపోవడంతో శ్రీధర్ బాబుతో అనుబంధం తో మాట్లాడారు. నా సమస్యకు ఎవరి వద్ద పరిష్కారం లేదు.. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా చూడాలని సూచించాను. ప్రతిపక్ష పార్టీ గా దశాబ్ద కాలంగా పని చేసి, అధికారం వచ్చిన తర్వాత మా హక్కులు కాలారాస్తుంటే ఎంతకాలం భరించాలి. కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపు దారులు పార్టీ నీ నడిపిస్తున్నారు. రాజకీయమే గౌరవం కోసం.. ఆ గౌరవం లేకపోవడంతో పార్టీ లో కొనసాగటం వల్ల ప్రయోజనం ఏమిటి.. నా పరిస్థితి వివరించిన తర్వాత శ్రీధర్ బాబు కూడా సమాధానం చెప్పలేకపోయారు. జగిత్యాలలో కాంగ్రెసు ను ఐక్యంగా నిలపడానికి ఎంతో మంది కార్యకర్తలు, నాయకులు అండగా నిలవడంతో ఈ స్థాయిలో ఎదిగిన. టీడీపీ పాలనలో సైతం లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. 2014 లో కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించాం. ఓడిన ఎన్నడూ నాకు ఓటమి అనే భావన రాకుండా..కార్యకర్తలు.. అభిమానులు.. మున్సిపల్ ఎన్నికల్లో కార్యకర్తల హక్కుల కోసం పోరాటం చేసిన. నాలో అసహనం పెరుగుతుంది.. ప్రత్యర్థి పై పోరాటం చేయటం...సహజం కానీ సొంత పార్టీ పై పోరాటం చేయటం ఎంత బాధాకరం.. మున్సిపల్ ఎన్నికల్లో నేను ప్రతిపాదించిన వారికి టిక్కెట్లు వచ్చిన వారికి ఎన్నికల్లో ప్రచారం చేయలేకపోయిన.. కాంగ్రెస్ లో కొనసాగటం సరి కాదని, వైదొలగాలని అభిప్రాయానికి వచ్చిన. 25 న స్థానిక బండారి గార్డెన్ లో రాజకీయ సహచరులు, అభిమానులు, శ్రేయోభిలాశులతో భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకుంటాం.. రాష్ట్ర నాయకత్వం అధిష్టానం పై నెట్టివేస్తున్నారు. నాకు అన్యాయం జరగడంలో ఎమ్మెల్యే పాత్ర సైతం ఉంది.. తెలంగాణకు ఆధారం ప్రాణహిత నది. ప్రాణహిత నీరు వృధాగా పోతున్న నీటిని ఉపయోగించుకోవాలని తుమ్మడి హేట్టి వద్ద నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. ఆదిలాబాద్ నుండి రంగారెడ్డి వరకు త్రాగు నీరు, సాగు నీరు పారిశ్రామిక అవసరాలకు ఆధారం ప్రాణహిత.. తుమ్మడి హేట్టి జాప్యం తో ఉత్తర తెలంగాణ కరువు తలెత్గే ప్రమాదం ఉంది. ఇంత వరకు మేడిగడ్డ పునరుద్ధరణ చేపట్టడం లేదు.. కాంట్రాక్టర్ మరమాతు పనులు చేపట్టకపోతే ప్రభుత్వమే చేపట్టి, కాంట్రాక్టర్ పై క్రిమినల్ చర్యలు తీసుకోవచ్చు.. తుమ్మడి హేట్టి బ్యారేజ్ నిర్మాణం ఎన్నికల్లో మేనిఫెస్టో లో పేర్కొన్నారు. ప్రజాహిత అంశాలు విస్మరించడం ఎంత వరకు సమంజసం. రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపుల ప్రభావం జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పై ప్రభావం చూపుతుంది. మంత్రిగా నాకు అర్హత ఉంది . .. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా..మండలి లో ఒంటరి పోరు చేసిన.. రేవంత్ రెడ్డి.. భట్టి విక్రమార్క లా నేను నా స్థాయిలో పోరాటం చేసిన. నా సంయమనానికి పరిమితి ఉండదా.. ప్రజాస్వామ్యంలో నా స్వేచకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటున్న.. 25 నా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాం.. జగిత్యాల తో నా అనుబంధం ఎవరు తెంచలేరు.. నా చివరి శ్వాస వరకు జగిత్యాల తో అనుబంధం కొనసాగుతుంది.4