logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ప్రశాంతంగా కొనసాగుతున్న ఆర్టీసీ ఎన్నికలు ఉత్సాహంగా పాల్గొంటున్న కార్మికులు నిర్మల్ ఆర్టీసీ డిపోలో పండగ వాతావరణం నెలకొంది. పదేళ్ల తర్వాత ఆర్టీసీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నిర్మల్ జిల్లాలోని నిర్మల్, బైంసా రెండు డిపోల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ పోలింగ్ ఉదయం 5 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఇక నిర్మల్ డిపోలో 385మంది, బైంసా డిపోలో 197 మంది ఆర్టీసీ కార్మికులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 10 సంవత్సరాల క్రితం రద్దు అయిన ఆర్టీసీ యూనియన్లను కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ పునరుద్ధరించడంతో ఎన్నికలు జరుగుతున్నాయని, యూనియన్లు ఉంటేనే కార్మికులకు న్యాయం జరుగుతుందని, కార్మికులందరూ సంతోషంగా ఉన్నారని పలువురు ఆర్టీసీ సీనియర్ నాయకులు తెలియజేశారు.

12 hrs ago
user_Venu
Venu
Nirmal U, Telangana•
12 hrs ago

ప్రశాంతంగా కొనసాగుతున్న ఆర్టీసీ ఎన్నికలు ఉత్సాహంగా పాల్గొంటున్న కార్మికులు నిర్మల్ ఆర్టీసీ డిపోలో పండగ వాతావరణం నెలకొంది. పదేళ్ల తర్వాత ఆర్టీసీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నిర్మల్ జిల్లాలోని నిర్మల్, బైంసా రెండు డిపోల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ పోలింగ్ ఉదయం 5 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఇక నిర్మల్ డిపోలో 385మంది, బైంసా డిపోలో 197 మంది ఆర్టీసీ కార్మికులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 10 సంవత్సరాల క్రితం రద్దు అయిన ఆర్టీసీ యూనియన్లను కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ పునరుద్ధరించడంతో ఎన్నికలు జరుగుతున్నాయని, యూనియన్లు ఉంటేనే కార్మికులకు న్యాయం జరుగుతుందని, కార్మికులందరూ సంతోషంగా ఉన్నారని పలువురు ఆర్టీసీ సీనియర్ నాయకులు తెలియజేశారు.

More news from తెలంగాణ and nearby areas
  • నిర్మల్ జిల్లా కేంద్రంలో wisdom పాఠశాలలో అంబరాన్నంటిన బతుకమ్మ వేడుకలు బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. సంబరాల సందడిలో నిర్మల్ నిర్మల్ జిల్లా కేంద్రంలో అంబరాన్నంటిన బతుకమ్మ వేడుకలు నిర్మల్ జిల్లా కేంద్రంలోని wisom పాఠశాలల్లో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. తీరొక్క పూలతో రంగురంగుల బతుకమ్మలను పేర్చి అధ్యాపకులు సంప్రదాయ పండుగకు ప్రత్యేక శోభ తీసుకొచ్చారు. బతుకమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించిన చిన్నారులు, విద్యార్థులు.. బతుకమ్మ పాటల తాళానికి అనుగుణంగా ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ సందడి చేశారు. పూల పండుగ గొప్పతనాన్ని చాటుతూ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా సాగిన ఈ వేడుకలతో పాఠశాల ప్రాంగణాలు పూలవనాలను తలపించాయి.
    4
    నిర్మల్ జిల్లా కేంద్రంలో wisdom  పాఠశాలలో అంబరాన్నంటిన బతుకమ్మ వేడుకలు
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. సంబరాల సందడిలో నిర్మల్
నిర్మల్ జిల్లా కేంద్రంలో అంబరాన్నంటిన బతుకమ్మ వేడుకలు
నిర్మల్ జిల్లా కేంద్రంలోని wisom పాఠశాలల్లో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. తీరొక్క పూలతో రంగురంగుల బతుకమ్మలను పేర్చి అధ్యాపకులు సంప్రదాయ పండుగకు ప్రత్యేక శోభ తీసుకొచ్చారు. బతుకమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించిన చిన్నారులు, విద్యార్థులు.. బతుకమ్మ పాటల తాళానికి అనుగుణంగా ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ సందడి చేశారు. పూల పండుగ గొప్పతనాన్ని చాటుతూ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా సాగిన ఈ వేడుకలతో పాఠశాల ప్రాంగణాలు పూలవనాలను తలపించాయి.
    user_Douda karthik
    Douda karthik
    Local News Reporter నిర్మల్ రూరల్, నిర్మల్, తెలంగాణ•
    8 hrs ago
  • ప్రశాంతంగా కొనసాగుతున్న ఆర్టీసీ ఎన్నికలు ఉత్సాహంగా పాల్గొంటున్న కార్మికులు నిర్మల్ ఆర్టీసీ డిపోలో పండగ వాతావరణం నెలకొంది. పదేళ్ల తర్వాత ఆర్టీసీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నిర్మల్ జిల్లాలోని నిర్మల్, బైంసా రెండు డిపోల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ పోలింగ్ ఉదయం 5 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఇక నిర్మల్ డిపోలో 385మంది, బైంసా డిపోలో 197 మంది ఆర్టీసీ కార్మికులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 10 సంవత్సరాల క్రితం రద్దు అయిన ఆర్టీసీ యూనియన్లను కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ పునరుద్ధరించడంతో ఎన్నికలు జరుగుతున్నాయని, యూనియన్లు ఉంటేనే కార్మికులకు న్యాయం జరుగుతుందని, కార్మికులందరూ సంతోషంగా ఉన్నారని పలువురు ఆర్టీసీ సీనియర్ నాయకులు తెలియజేశారు.
    2
    ప్రశాంతంగా కొనసాగుతున్న ఆర్టీసీ ఎన్నికలు 
ఉత్సాహంగా పాల్గొంటున్న కార్మికులు
నిర్మల్ ఆర్టీసీ డిపోలో పండగ వాతావరణం నెలకొంది. పదేళ్ల తర్వాత ఆర్టీసీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నిర్మల్ జిల్లాలోని నిర్మల్, బైంసా రెండు డిపోల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ పోలింగ్ ఉదయం 5 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఇక నిర్మల్ డిపోలో 385మంది, బైంసా డిపోలో 197 మంది ఆర్టీసీ కార్మికులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 10 సంవత్సరాల క్రితం రద్దు అయిన ఆర్టీసీ యూనియన్లను కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ పునరుద్ధరించడంతో ఎన్నికలు జరుగుతున్నాయని, యూనియన్లు ఉంటేనే కార్మికులకు న్యాయం జరుగుతుందని, కార్మికులందరూ సంతోషంగా ఉన్నారని పలువురు ఆర్టీసీ సీనియర్ నాయకులు తెలియజేశారు.
    user_Venu
    Venu
    Nirmal U, Telangana•
    12 hrs ago
  • బాల్కొండ ఎలక్ట్రానిక్ (శాటిలైట్) నూతన కార్యవర్గం ఎన్నిక బాల్కొండ నియోజకవర్గం లో నూతన ఎలక్ట్రానిక్ శాటిలైట్ మీడియా నూతన కార్యవర్గం ఎన్నిక మోర్తాడ్ లో జరిగింది. ఈ సందర్బంగా కొత్త కార్యవర్గం కి ఎన్నిక నిర్వహించారు నూతన అధ్యక్షులు గా సంతోష్ TV5న్యూస్, కార్యదర్శి గా డీఎస్ రవి ప్రైమ్ 9, క్యాషయర్ గా మల్లేష్, రాజ్ న్యూస్, సలహాదారు గా, యాదగిరి 6tv గౌరవ అధ్యక్షులు గా మురళి టీన్యూస్ సభ్యులుగా హరీష్, ప్రకాష్,రమేష్,సాయిరాం రాజ్ కుమార్, చిరంజీవి, బ్రహ్మ, వేణు సురేష్ శ్రీనివాస్, శ్రీను అఖిల్, అశోక్ సభ్యులుగా ఉన్నారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు సంతోష్ మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం, సమస్యలపై పోరాడుతాం అని రానున్న రోజుల్లో జర్నలిస్ట్ లకు ఇళ్ళ స్థలాలు, ఇన్సూరెన్స్ లు వచ్చేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానాని అందరం సమిష్టిగా ప్రజా సమస్య లు ప్రభుత్వం దృష్టికి, ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ ఫలాలు ప్రజలకు చేరేలా మధ్య వారధిగా మీడియా పనిచేస్తది అని నూతన అధ్యక్షులు తెలిపారు
    2
    బాల్కొండ ఎలక్ట్రానిక్ (శాటిలైట్) నూతన కార్యవర్గం ఎన్నిక 

బాల్కొండ నియోజకవర్గం లో నూతన ఎలక్ట్రానిక్ శాటిలైట్ మీడియా నూతన కార్యవర్గం ఎన్నిక మోర్తాడ్ లో జరిగింది. ఈ సందర్బంగా కొత్త కార్యవర్గం కి ఎన్నిక నిర్వహించారు నూతన అధ్యక్షులు గా సంతోష్ TV5న్యూస్, కార్యదర్శి గా డీఎస్ రవి ప్రైమ్ 9, క్యాషయర్ గా మల్లేష్, రాజ్ న్యూస్, సలహాదారు గా, యాదగిరి 6tv  గౌరవ అధ్యక్షులు గా మురళి టీన్యూస్ సభ్యులుగా హరీష్, ప్రకాష్,రమేష్,సాయిరాం రాజ్ కుమార్, చిరంజీవి, బ్రహ్మ, వేణు సురేష్ శ్రీనివాస్, శ్రీను అఖిల్, అశోక్ సభ్యులుగా ఉన్నారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు సంతోష్ మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం, సమస్యలపై పోరాడుతాం అని రానున్న రోజుల్లో జర్నలిస్ట్ లకు ఇళ్ళ స్థలాలు, ఇన్సూరెన్స్ లు వచ్చేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానాని అందరం సమిష్టిగా ప్రజా సమస్య లు ప్రభుత్వం దృష్టికి, ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ ఫలాలు  ప్రజలకు చేరేలా  మధ్య వారధిగా మీడియా పనిచేస్తది అని నూతన అధ్యక్షులు తెలిపారు
    user_Boss
    Boss
    Photographer భీమ్‌గల్, నిజామాబాద్, తెలంగాణ•
    6 hrs ago
  • పూల సోయగాలతో అలరించిన బతుకమ్మ సంబరాలు సిరికొండ ఆదర్శ పాఠశాలలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి సిరికొండ: మండల కేంద్రంలోని పీఎం శ్రీ తెలంగాణ ఆదర్శ పాఠశాల, కళాశాలలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. గునుగు, తంగేడు, బంతి, చామంతి తదితర రంగురంగుల పూలతో విద్యార్థినులు పేర్చిన బతుకమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సంప్రదాయ వస్త్రధారణలో ముస్తాబైన విద్యార్థినులు బతుకమ్మల చుట్టూ చేరి పాటలు పాడుతూ, కోలాటాలతో సందడి చేశారు. దీంతో పాఠశాల ప్రాంగణమంతా పూల పరిమళాలతో, తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాల శోభతో కళకళలాడింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ గడ్డం రాజేష్ రెడ్డి మాట్లాడుతూ.. బతుకమ్మ వంటి పండుగలు తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని భావితరాలకు అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. విద్యార్థులు విద్యతోపాటు మన సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ ముందుకు సాగాలని సూచించారు. ఈ వేడుకల్లో ప్రిన్సిపాల్ గడ్డం రాజేష్ రెడ్డి, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
    2
    పూల సోయగాలతో అలరించిన బతుకమ్మ సంబరాలు
సిరికొండ ఆదర్శ పాఠశాలలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
సిరికొండ: మండల కేంద్రంలోని పీఎం శ్రీ తెలంగాణ ఆదర్శ పాఠశాల, కళాశాలలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. గునుగు, తంగేడు, బంతి, చామంతి తదితర రంగురంగుల పూలతో విద్యార్థినులు పేర్చిన బతుకమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సంప్రదాయ వస్త్రధారణలో ముస్తాబైన విద్యార్థినులు బతుకమ్మల చుట్టూ చేరి పాటలు పాడుతూ, కోలాటాలతో సందడి చేశారు. దీంతో పాఠశాల ప్రాంగణమంతా పూల పరిమళాలతో, తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాల శోభతో కళకళలాడింది.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ గడ్డం రాజేష్ రెడ్డి మాట్లాడుతూ.. బతుకమ్మ వంటి పండుగలు తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని భావితరాలకు అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. విద్యార్థులు విద్యతోపాటు మన సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ ముందుకు సాగాలని సూచించారు.
ఈ వేడుకల్లో ప్రిన్సిపాల్ గడ్డం రాజేష్ రెడ్డి, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
    user_Naveen Reddy
    Naveen Reddy
    సిరికొండ, నిజామాబాద్, తెలంగాణ•
    5 hrs ago
  • పూల సోయగాలు.. తెలంగాణ సంస్కృతి వైభవం! పీఎం శ్రీ తెలంగాణ ఆదర్శ పాఠశాల, కళాశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు సిరికొండ: మండల కేంద్రంలోని పీఎం శ్రీ తెలంగాణ ఆదర్శ పాఠశాల, జూనియర్ కళాశాలలో బతుకమ్మ వేడుకలను అత్యంత ఘనంగా, కన్నుల పండువగా నిర్వహించారు. ఈ వేడుకల్లో విద్యార్థినులు, ఉపాధ్యాయులు, కళాశాల సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను చాటిచెప్పారు. ప్రకృతిని ఆరాధించే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని విద్యార్థినులు గునుగు, తంగేడు, బంతి, చామంతి తదితర రంగురంగుల పూలతో అందమైన బతుకమ్మలను కళాత్మకంగా పేర్చారు. పూల సోయగాలతో పాఠశాల ప్రాంగణమంతా తెలంగాణ సాంస్కృతిక శోభను సంతరించుకుంది. విద్యార్థినులు సంప్రదాయ వస్త్రధారణలో ముస్తాబై బతుకమ్మల చుట్టూ చేరి సందడి చేశారు. చప్పట్లు చరుస్తూ, లయబద్ధంగా బతుకమ్మ పాటలు పాడుతూ చేసిన కోలాటాలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గౌరమ్మ పాటలతో పాఠశాల ప్రాంగణం మారుమోగింది. తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతి ప్రేమకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను విద్యార్థినులు ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. ఈ వేడుకలు విద్యార్థుల్లో మన సంస్కృతి, సంప్రదాయాల పట్ల గౌరవాన్ని పెంపొందించేలా సాగాయి. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ గడ్డం రాజేష్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక వైభవాన్ని భావితరాలకు అందించడంలో ఇలాంటి పండుగలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. విద్యార్థులు విద్యాభ్యాసంతో పాటు మన సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ వాటి పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ గడ్డం రాజేష్ రెడ్డితో పాటు పాఠశాల ఉపాధ్యాయులు, కళాశాల సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
    4
    పూల సోయగాలు.. తెలంగాణ సంస్కృతి వైభవం!



పీఎం శ్రీ తెలంగాణ ఆదర్శ పాఠశాల, కళాశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

సిరికొండ: మండల కేంద్రంలోని పీఎం శ్రీ తెలంగాణ ఆదర్శ పాఠశాల, జూనియర్ కళాశాలలో బతుకమ్మ వేడుకలను అత్యంత ఘనంగా, కన్నుల పండువగా నిర్వహించారు. ఈ వేడుకల్లో విద్యార్థినులు, ఉపాధ్యాయులు, కళాశాల సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను చాటిచెప్పారు.
ప్రకృతిని ఆరాధించే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని విద్యార్థినులు గునుగు, తంగేడు, బంతి, చామంతి తదితర రంగురంగుల పూలతో అందమైన బతుకమ్మలను కళాత్మకంగా పేర్చారు. పూల సోయగాలతో పాఠశాల ప్రాంగణమంతా తెలంగాణ సాంస్కృతిక శోభను సంతరించుకుంది.
విద్యార్థినులు సంప్రదాయ వస్త్రధారణలో ముస్తాబై బతుకమ్మల చుట్టూ చేరి సందడి చేశారు. చప్పట్లు చరుస్తూ, లయబద్ధంగా బతుకమ్మ పాటలు పాడుతూ చేసిన కోలాటాలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గౌరమ్మ పాటలతో పాఠశాల ప్రాంగణం మారుమోగింది.
తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతి ప్రేమకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను విద్యార్థినులు ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. ఈ వేడుకలు విద్యార్థుల్లో మన సంస్కృతి, సంప్రదాయాల పట్ల గౌరవాన్ని పెంపొందించేలా సాగాయి.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ గడ్డం రాజేష్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక వైభవాన్ని భావితరాలకు అందించడంలో ఇలాంటి పండుగలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. విద్యార్థులు విద్యాభ్యాసంతో పాటు మన సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ వాటి పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ గడ్డం రాజేష్ రెడ్డితో పాటు పాఠశాల ఉపాధ్యాయులు, కళాశాల సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
    user_Bandela Dharma
    Bandela Dharma
    Farmer సిరికొండ, నిజామాబాద్, తెలంగాణ•
    5 hrs ago
  • బిజెపి పార్టీ పిలుపు మేరకు సైకిల్ యాత్రలో పాల్గొన్న ధర్పల్లి మండల కిషన్ మోర్స అధ్యక్షులు రఘుపతి రెడ్డిని శ్రీనివాస్ రెడ్డిని సన్మానించిన బిజెపి నాయకులు కార్యకర్తలు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి ఆదేశాల మేరకు జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు తిరుపతిరెడ్డి అధ్యక్షతన బోధన్ నుంచి జగిత్యాల వరకు 380 కిలోమీటర్ల సైకిల్ యాత్ర నిర్వహించారు. రైతులకు భరోసాగా, వారి సమస్యలను తెలుసుకుంటూ బీజేపీ నాయకులు ఈ యాత్రలో పాల్గొన్నారు. యాత్రలో విజయవంతంగా పాల్గొన్న కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు మైలారం రఘుపతిరెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి ని ధర్పల్లి మండలం బిజెపి నాయకులు కార్యకర్తలు ఘనంగా శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు జిర్రా మహిపాల్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రైతు భరోసా ఇవ్వడంలేదని, తెలంగాణలో కరెంటు కోతల వల్ల రైతులకు చేతుకొచ్చిన పంట సకాలంలో విద్యుత్ అందించక నీరు దొరకక పంటలు ఎండిపోయాయి. వారిని తక్షణమే ప్రభుత్వము ఆదుకోవాలని రైతు బీమా రైతు భరోసా కల్పించాలని బిజెపి మండల అధ్యక్షుడు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకులు ఓటు చోరీ అని చెప్పి ర్యాలీలు నిర్వహించడం సిగ్గుచేటు అని అన్నారు. దేశ ప్రధాని 140 కోట్ల ప్రజలే తన కుటుంబ సభ్యులుగా భావించి సేవ చేస్తున్నటువంటి ప్రధానిపై కాంగ్రెస్ నాయకులు బురద చల్లడం ఏమాత్రం సరికాదని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు జీర్ర మహిపాల్, జిల్లా ఓబీసీ మోర్చా కార్యదర్శి నరేష్ గౌడ్, పాల్దే గంగాదాస్, నల్ల పెంటయ్య, పాలేపు సుమన్, మరంపల్లి రాజేశ్వర్, తాళ్ల రామచందర్, సంజయ్ గౌడ్, నూకల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
    2
    బిజెపి పార్టీ పిలుపు మేరకు సైకిల్ యాత్రలో పాల్గొన్న ధర్పల్లి మండల కిషన్ మోర్స అధ్యక్షులు రఘుపతి రెడ్డిని శ్రీనివాస్ రెడ్డిని సన్మానించిన బిజెపి నాయకులు కార్యకర్తలు
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి ఆదేశాల మేరకు జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు తిరుపతిరెడ్డి అధ్యక్షతన బోధన్ నుంచి జగిత్యాల వరకు 380 కిలోమీటర్ల సైకిల్ యాత్ర నిర్వహించారు. రైతులకు భరోసాగా, వారి సమస్యలను తెలుసుకుంటూ బీజేపీ నాయకులు ఈ యాత్రలో పాల్గొన్నారు. యాత్రలో విజయవంతంగా పాల్గొన్న 
కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు మైలారం రఘుపతిరెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి ని ధర్పల్లి మండలం బిజెపి నాయకులు కార్యకర్తలు ఘనంగా శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు జిర్రా మహిపాల్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రైతు భరోసా ఇవ్వడంలేదని, తెలంగాణలో కరెంటు కోతల వల్ల రైతులకు చేతుకొచ్చిన పంట సకాలంలో విద్యుత్ అందించక నీరు దొరకక పంటలు ఎండిపోయాయి. వారిని తక్షణమే ప్రభుత్వము ఆదుకోవాలని రైతు బీమా రైతు భరోసా కల్పించాలని బిజెపి మండల అధ్యక్షుడు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకులు ఓటు చోరీ అని చెప్పి ర్యాలీలు నిర్వహించడం సిగ్గుచేటు అని అన్నారు. దేశ ప్రధాని 140 కోట్ల ప్రజలే తన కుటుంబ సభ్యులుగా భావించి సేవ చేస్తున్నటువంటి ప్రధానిపై కాంగ్రెస్ నాయకులు బురద చల్లడం ఏమాత్రం సరికాదని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు జీర్ర మహిపాల్, జిల్లా ఓబీసీ మోర్చా కార్యదర్శి నరేష్ గౌడ్, పాల్దే  గంగాదాస్, నల్ల పెంటయ్య, పాలేపు సుమన్, మరంపల్లి రాజేశ్వర్, తాళ్ల రామచందర్, సంజయ్ గౌడ్, నూకల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
    user_Enjapuram surendhar
    Enjapuram surendhar
    ధర్‌పల్లి, నిజామాబాద్, తెలంగాణ•
    9 hrs ago
  • తల్లి జ్ఞాపకార్థం శిశుమందిర్ కు రూ.50 వేలు విరాళం అందించిన దుర్గం శేఖర్ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని తీర్పేల్లి బ్రాంచ్ శ్రీ సరస్వతి శిశుమందిర్ పాఠశాలకు టీపీసీసీ ఎస్సీ డిపార్ట్ మెంట్ వైస్ చైర్మన్, దుర్గం ట్రస్ట్ చైర్మన్ దుర్గం శేఖర్ రూ.50 వేల విరాళం అందించారు. తన తల్లి దుర్గం చిన్నుబాయి జ్ఞాపకార్థం దుర్గం ట్రస్ట్ తరఫున విద్యార్థుల అవసరాల కోసం ఈ ఆర్థిక సాయం అందజేశారు. పాఠశాల నిర్వాహకుల ఆహ్వానం మేరకు పాఠశాలను సందర్శించి విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా దుర్గం శేఖర్ మాట్లాడుతూ.. నేటి బాలలే రేపటి భావి భారత పౌరులని, విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. తాను కూడా చిన్న స్థాయి నుంచి ప్రస్థానం ప్రారంభించి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎదిగానని, కృషి, పట్టుదలతో ప్రతి ఒక్కరూ ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని సూచించారు. అనంతరం పాఠశాల విభాగ్ అధ్యక్షుడు బజరంగ్ లాల్ అగ్రవాల్, ప్రిన్సిపల్ గోదావరి, యాజమాన్యం, సిబ్బంది దుర్గం శేఖర్ ను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ మీడియా కోఆర్డినేటర్ మేకల జితేందర్, మాదస్తు మహేందర్, అనుదీప్, ఆడే రఘు తదితరులు పాల్గొన్నారు.
    4
    తల్లి జ్ఞాపకార్థం శిశుమందిర్ కు రూ.50 వేలు విరాళం అందించిన దుర్గం శేఖర్
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని తీర్పేల్లి బ్రాంచ్ శ్రీ సరస్వతి శిశుమందిర్ పాఠశాలకు టీపీసీసీ ఎస్సీ డిపార్ట్ మెంట్ వైస్ చైర్మన్, దుర్గం ట్రస్ట్ చైర్మన్ దుర్గం శేఖర్ రూ.50 వేల విరాళం అందించారు. తన తల్లి దుర్గం చిన్నుబాయి జ్ఞాపకార్థం దుర్గం ట్రస్ట్ తరఫున విద్యార్థుల అవసరాల కోసం ఈ ఆర్థిక సాయం అందజేశారు. పాఠశాల నిర్వాహకుల ఆహ్వానం మేరకు పాఠశాలను సందర్శించి విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా దుర్గం శేఖర్ మాట్లాడుతూ.. నేటి బాలలే రేపటి భావి భారత పౌరులని, విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. తాను కూడా చిన్న స్థాయి నుంచి ప్రస్థానం ప్రారంభించి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎదిగానని, కృషి, పట్టుదలతో ప్రతి ఒక్కరూ ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని సూచించారు. అనంతరం పాఠశాల విభాగ్ అధ్యక్షుడు బజరంగ్ లాల్ అగ్రవాల్, ప్రిన్సిపల్ గోదావరి, యాజమాన్యం, సిబ్బంది దుర్గం శేఖర్ ను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ మీడియా కోఆర్డినేటర్ మేకల జితేందర్, మాదస్తు మహేందర్, అనుదీప్, ఆడే రఘు తదితరులు పాల్గొన్నారు.
    user_Jakkula Sujith
    Jakkula Sujith
    Local News Reporter Adilabad Urban, Telangana•
    1 hr ago
  • దసరా పండుగ నేపథ్యంలో ఇంటి ముఖం పట్టిన విద్యార్థులు.... తాంసి మండలంలోని బండాల నాగపూర్ మహాత్మ జ్యోతిబాపూలే బాలికల పాఠశాలలో దసరా పండుగ సెలవుల సందడి నెలకొంది. పండుగ సెలవులు కావడంతో విద్యార్థినిలు తమ తల్లిదండ్రులతో కలిసి ఊళ్లకు వెళ్లేందుకు వాహనాల్లో బయలుదేరడానికి సిద్ధమయ్యారు. దీంతో పాఠశాల పరిసర ప్రాంతాలన్నీ విద్యార్థినుల కోలాహలంతో ఉత్సాహంగా, సందడిగా మారాయి.
    1
    దసరా పండుగ నేపథ్యంలో ఇంటి ముఖం పట్టిన విద్యార్థులు....
తాంసి మండలంలోని బండాల నాగపూర్ మహాత్మ జ్యోతిబాపూలే బాలికల పాఠశాలలో దసరా పండుగ సెలవుల సందడి నెలకొంది. పండుగ సెలవులు కావడంతో విద్యార్థినిలు తమ తల్లిదండ్రులతో కలిసి ఊళ్లకు వెళ్లేందుకు వాహనాల్లో బయలుదేరడానికి సిద్ధమయ్యారు. దీంతో పాఠశాల పరిసర ప్రాంతాలన్నీ విద్యార్థినుల కోలాహలంతో ఉత్సాహంగా, సందడిగా మారాయి.
    user_Mallaiah Potta
    Mallaiah Potta
    Local News Reporter ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్, తెలంగాణ•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.