logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

అనిల్ అన్న యువ సైన్యం శ్రమదానం మంగి–ముల్కలమంద పరిధిలో రహదారి తాత్కాలిక మరమ్మతులు తిర్యాణి మండలంలోని మంగి–ముల్కలమంద గ్రామ పంచాయతీ పరిధిలో తోయగూడ నుంచి భీమ్రాల వరకు ఉన్న దెబ్బతిన్న రహదారిని ‘అనిల్ అన్న యువ సైన్యం’ సభ్యులు శ్రమదానంతో మరమ్మతులు చేశారు. గుంతలమయమైన రోడ్డుపై ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకున్న యువత స్వచ్ఛందంగా ముందుకొచ్చి, సొంత ఖర్చులతో మొరం పోసి తాత్కాలికంగా గుంతలు పూడ్చారు. ఈ సామాజిక సేవా కార్యక్రమంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ముల్కలమంద సర్పంచ్ కుడిమేత హనుమంత్ రావు, ఉపసర్పంచ్ అర్క మల్లేష్, కుడుమేత రమేష్, ఉయిక గోవింద్‌తో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు

23 hrs ago
user_Krishna
Krishna
ఆసిఫాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
23 hrs ago
7cabc4c8-97f5-4291-b43c-630730454deb

అనిల్ అన్న యువ సైన్యం శ్రమదానం మంగి–ముల్కలమంద పరిధిలో రహదారి తాత్కాలిక మరమ్మతులు తిర్యాణి మండలంలోని మంగి–ముల్కలమంద గ్రామ పంచాయతీ పరిధిలో తోయగూడ నుంచి భీమ్రాల వరకు ఉన్న దెబ్బతిన్న రహదారిని ‘అనిల్ అన్న యువ సైన్యం’ సభ్యులు శ్రమదానంతో మరమ్మతులు చేశారు. గుంతలమయమైన రోడ్డుపై ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకున్న యువత స్వచ్ఛందంగా ముందుకొచ్చి, సొంత ఖర్చులతో మొరం పోసి తాత్కాలికంగా గుంతలు పూడ్చారు. ఈ సామాజిక సేవా కార్యక్రమంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ముల్కలమంద సర్పంచ్ కుడిమేత హనుమంత్ రావు, ఉపసర్పంచ్ అర్క మల్లేష్, కుడుమేత రమేష్, ఉయిక గోవింద్‌తో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు

More news from తెలంగాణ and nearby areas
  • రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం. ఆసిఫాబాద్ : కాగజ్ నగర్ మున్సిపల్ కార్మికులు గత 17 రోజులుగా తమ సమస్యలు పరిష్కరించాలంటూ కార్యాలయం ఎదుట సమ్మె చేస్తున్నారని బీఆర్ఎస్ ప్రధాన కార్య దర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. గత ఆరు నెలల నుంచి వేతనాలు రావడం లేదని, కుటుంబ సభ్యులతో కలిసి ధర్నా చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కార్మికుల వేతనాలు వెంటనే విడుదల చేయాలని, బకాయి ఈఎస్ఐ, పీఎఫ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
    1
    రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం.
ఆసిఫాబాద్ : కాగజ్ నగర్ మున్సిపల్ కార్మికులు గత 17 రోజులుగా తమ సమస్యలు పరిష్కరించాలంటూ కార్యాలయం ఎదుట సమ్మె చేస్తున్నారని బీఆర్ఎస్ ప్రధాన కార్య దర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. గత ఆరు నెలల నుంచి వేతనాలు రావడం లేదని, కుటుంబ సభ్యులతో కలిసి ధర్నా చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కార్మికుల వేతనాలు వెంటనే విడుదల చేయాలని, బకాయి ఈఎస్ఐ, పీఎఫ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
    user_Banka Srinivas
    Banka Srinivas
    Journalist కాగజ్‌నగర్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
    20 hrs ago
  • పులి సంచరిస్తోంది..జర పైలం జన్నారం మండలంలోని చింతగూడ, మొహమ్మదాబాద్ అడవిలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. మూడు రోజుల క్రితం చింతగూడ అటవీలో పెద్దపులి అరుపులను అధికారులు గుర్తించారు. అలాగే మహమ్మదాబాద్ అడవిలో పులి సంచరిస్తుందని ఎఫ్డిఓ రామ్మోహన్ తెలిపారు. పులి సంచరిస్తున్న నేపథ్యంలో చింతగూడ, మొహమదాబాద్, తపాలాపూర్ గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. అడవి వైపు ఎవరూ వెళ్లొద్దన్నారు. విద్యుత్ వైర్లు పెడితే వన్యప్రాణులకు నష్టం జరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు. పులి సంచారం దృష్ట్యా అందరూ అప్రమత్తంగా ఉండాలని ఎఫ్డిఓ రామ్మోహన్ కోరారు.
    1
    పులి సంచరిస్తోంది..జర పైలం
జన్నారం మండలంలోని చింతగూడ, మొహమ్మదాబాద్ అడవిలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. మూడు రోజుల క్రితం చింతగూడ అటవీలో పెద్దపులి అరుపులను అధికారులు గుర్తించారు. అలాగే మహమ్మదాబాద్ అడవిలో పులి సంచరిస్తుందని ఎఫ్డిఓ రామ్మోహన్ తెలిపారు. పులి సంచరిస్తున్న నేపథ్యంలో చింతగూడ, మొహమదాబాద్, తపాలాపూర్ గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. అడవి వైపు ఎవరూ వెళ్లొద్దన్నారు. విద్యుత్ వైర్లు పెడితే వన్యప్రాణులకు నష్టం జరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు. పులి సంచారం దృష్ట్యా అందరూ అప్రమత్తంగా ఉండాలని ఎఫ్డిఓ రామ్మోహన్ కోరారు.
    user_Gourinatha p.g
    Gourinatha p.g
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    30 min ago
  • Post by Ravi Poreddy
    1
    Post by Ravi Poreddy
    user_Ravi Poreddy
    Ravi Poreddy
    మంచిర్యాల, మంచిర్యాల, తెలంగాణ•
    13 hrs ago
  • వర్కర్ టు ఓనర్ పథకాన్ని అమలు చేయడంతో పాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని సిఐటియు తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్లలో చేనేత జౌళి శాఖ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు
    1
    వర్కర్ టు ఓనర్ పథకాన్ని అమలు చేయడంతో పాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని సిఐటియు తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్లలో చేనేత జౌళి శాఖ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు
    user_ఉమ్మడి కరీంనగర్ జిల్లా అప్డేట్స్
    ఉమ్మడి కరీంనగర్ జిల్లా అప్డేట్స్
    Reporter Karimnagar, Telangana•
    2 hrs ago
  • నాను మహారాజ్
    1
    నాను మహారాజ్
    user_Nirmal KR NEWS 369
    Nirmal KR NEWS 369
    Reporter Nirmal U, Telangana•
    20 hrs ago
  • మడికొండ టెక్స్టైల్ పార్క్‌లో రూ.11 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన వరంగల్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 46వ డివిజన్ పరిధిలోని మడికొండ కాకతీయ టెక్స్టైల్ పార్క్‌లో టిజీఐఐసి కార్పొరేషన్ ద్వారా రూ.11 కోట్ల నిధులతో అంతర్గత రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు శుక్రవారం శంకుస్థాపన చేశారు. అనంతరం కాజీపేట మండలంలోని కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద 7 మందికి చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    1
    మడికొండ టెక్స్టైల్ పార్క్‌లో రూ.11 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
వరంగల్:
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 46వ డివిజన్ పరిధిలోని మడికొండ కాకతీయ టెక్స్టైల్ పార్క్‌లో టిజీఐఐసి కార్పొరేషన్ ద్వారా రూ.11 కోట్ల నిధులతో అంతర్గత రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు శుక్రవారం శంకుస్థాపన చేశారు. అనంతరం కాజీపేట మండలంలోని కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద 7 మందికి చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    Narsampet, Warangal•
    3 hrs ago
  • జనగామ జిల్లా చిల్పూర్‌లో జరిగిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల పేరుతో భారీగా దోపిడీ జరిగిందని, ప్రభుత్వ పథకాలు, పదవులు, పనులను అమ్ముకున్న చరిత్ర గత పాలకులదని విమర్శించారు. బీ ఫారాలు, దళిత బంధు వంటి పథకాల్లోనూ అక్రమాలు జరిగాయని ఆరోపించారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ప్రభుత్వ పథకాలను నేరుగా లబ్ధిదారులకు అందిస్తున్నానని కడియం శ్రీహరి స్పష్టం చేశారు.
    1
    జనగామ జిల్లా చిల్పూర్‌లో జరిగిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల పేరుతో భారీగా దోపిడీ జరిగిందని, ప్రభుత్వ పథకాలు, పదవులు, పనులను అమ్ముకున్న చరిత్ర గత పాలకులదని విమర్శించారు. బీ ఫారాలు, దళిత బంధు వంటి పథకాల్లోనూ అక్రమాలు జరిగాయని ఆరోపించారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ప్రభుత్వ పథకాలను నేరుగా లబ్ధిదారులకు అందిస్తున్నానని కడియం శ్రీహరి స్పష్టం చేశారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    Journalist వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    4 hrs ago
  • జగిత్యాల జిల్లా కొండగట్టులో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన రూ.83,12,000 చెక్కులను రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పంపిణీ చేశారు. బాధితుల పునరావాసానికి ప్రభుత్వం పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు. టెంపుల్ సిటీ కారిడార్ అభివృద్ధి చేస్తామని తెలిపారు. కలెక్టర్ సత్య ప్రసాద్, ఎమ్మెల్యే మేడిపెల్లి సత్యం, అధికారులు పాల్గొన్నారు.
    2
    జగిత్యాల జిల్లా కొండగట్టులో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన రూ.83,12,000 చెక్కులను రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పంపిణీ చేశారు. బాధితుల పునరావాసానికి ప్రభుత్వం పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు. టెంపుల్ సిటీ కారిడార్ అభివృద్ధి చేస్తామని తెలిపారు. కలెక్టర్ సత్య ప్రసాద్, ఎమ్మెల్యే మేడిపెల్లి సత్యం, అధికారులు పాల్గొన్నారు.
    user_ఉమ్మడి కరీంనగర్ జిల్లా అప్డేట్స్
    ఉమ్మడి కరీంనగర్ జిల్లా అప్డేట్స్
    Reporter Karimnagar, Telangana•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.