Shuru
Apke Nagar Ki App…
సమాజంలో అవినీతి పెరిగిపోయింది:ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరద సమాజంలో అవినీతి పెరిగిపోయిందని.. ప్రజల్లో చైతన్యం రావాలని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజల రెడ్డి పిలుపునిచ్చారు. కొంతమంది అధికారులు లంచాన్ని హక్కుగా భావిస్తున్నారు. డబ్బులు ఇవ్వందే ఏపని చేయడం లేదు. నూటికి 95 మంది లంచాలు తీసుకుంటున్నారు. ఏసీబీ అధికారులు ఎక్కడ.. ఈ లంచాలు కనబడటం లేదా.. ఏసీబీ కూడా లంచాలకు అలవాటు పడింది అంటూ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు.
LAKKU SIVA SANKAR reddy
సమాజంలో అవినీతి పెరిగిపోయింది:ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరద సమాజంలో అవినీతి పెరిగిపోయిందని.. ప్రజల్లో చైతన్యం రావాలని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజల రెడ్డి పిలుపునిచ్చారు. కొంతమంది అధికారులు లంచాన్ని హక్కుగా భావిస్తున్నారు. డబ్బులు ఇవ్వందే ఏపని చేయడం లేదు. నూటికి 95 మంది లంచాలు తీసుకుంటున్నారు. ఏసీబీ అధికారులు ఎక్కడ.. ఈ లంచాలు కనబడటం లేదా.. ఏసీబీ కూడా లంచాలకు అలవాటు పడింది అంటూ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం అసెంబ్లీ NDA కార్యాలయంలో జరిగిన బీజేపి BLA-2 కార్యశాలకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన బీజేపి SIR జోనల్ ఇంచార్జ్.. జల్లి మధుసూదన్ గారు మరియు శ్రీ సత్యసాయి జిల్లా బీజేపి ఇంచార్జ్.. కునిగిరి నీలకంఠ గారి మీడియా సమావేశం... ఈ సమావేశంలో కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రవేశపెట్టిన పథకాల గురించి మరియు ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం ఇస్తున్న నిధులు గురించి వివరించారు ఈ కార్యక్రమంలో ధర్మవరం అసెంబ్లీ మరియు ఎన్డీఏ కార్యాలయం ఇంచార్జ్ (ఖగోలు హరీష్ బాబు గారు) రాష్ట్ర ఓబిసి మోర్చా ఉపాధ్యక్షులు ( గొడ్డుమర్రి ఆదినారాయణ యాదవ్ గారు) బీజేపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఓబులేసు గారు మరియు రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మరియు BLA -2 లు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యశాలను విజయవంతం చేశారు....1
- వెంకన్నపాళెంలో అభాసుపాలైన 'స్వచ్ఛ పథం'.. చెత్తను తరలించాల్సింది పోయి తగలబెట్టేసారు! బద్వేలు/నెల్లూరు , జులై 29: గ్రామాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు ప్రతి బుధవారం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 'స్వచ్ఛ పథం' కార్యక్రమం కోట మండలం వెంకన్నపాళెం పంచాయతీ పరిధిలో బుధవారం నాడు పూర్తిగా అభాసుపాలైంది. గ్రామ పారిశుద్ధ్యంలో బుధవారాన్ని అత్యంత కీలకమైన రోజుగా నిర్ణయించి ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా రోడ్ల వెంబడి పేరుకుపోయిన చెత్తను సమీపంలోని సంపద తయారీ కేంద్రాలకు లేదా దూర ప్రాంతాలకు తరలించాల్సి ఉంటుంది. చెత్త నుంచి సంపదను సృష్టించే క్రమంలో భాగంగా తడి చెత్త, పొడి చెత్తను వేరు చేయాల్సి ఉంది.అయితే, బుధవారం సాయంత్రం సచివాలయం కార్యాలయ పనివేళల్లోనే మూడు మండలాలకు ప్రధాన రహదారి అయిన గూడూరు-దుగరాజపట్నం మెయిన్ రోడ్డు మార్గం పక్కనే, వెంకన్నపాలెం పంచాయతీ పరిధిలోని ఒక రైస్ మిల్ సమీపంలో సుమారు 50 మీటర్ల మేర పేరుకుపోయిన చెత్తను తరలించకుండా, శుభ్రం చేయకుండా అక్కడికక్కడే తగలబెట్టేశారు. దీంతో రహదారి పొడవునా గంటల తరబడి దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఫలితంగా ఎదురుగా వచ్చే వాహనాలు కనబడక వాహనదారులు, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఈ పొగ మంచులా అలుముకోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.ఈ మంటల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు, ఇతర హానికరమైన పదార్థాలు కాలిపోవడంతో ప్రమాదకరమైన రసాయనాలు గాలిలో కలిసిపోయాయి. దీనివల్ల స్థానికులు, ప్రయాణికులు తీవ్రమైన రోగాల బారిన పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఒకవైపు మండలంలోని వివిధ గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు స్వచ్ఛ పథం కార్యక్రమంలో నిమగ్నమై గ్రామాలను శుభ్రపరుస్తుంటే, వెంకన్నపాళెంలో మాత్రం ఇలా బాధ్యతారాహిత్యంగా చెత్తను తగలబెట్టడంపై ప్రజలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ సంఘటనపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు బలంగా డిమాండ్ చేస్తున్నారు.1
- నందికొట్కూరు పట్టణంలోని జగనన్న కాలనీ వద్ద బస్సులు నిలపాలి నందికొట్కూరులోని జగనన్న కాలనీ వద్ద ఆర్టీసీ బస్సులు నిలపాలని CPM నాయకుడు నాగేశ్వరరావు కోరారు. కాలనీవాసులు గ్రామాలకు వెళ్లేందుకు బస్ స్టాప్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రస్తుత డిపో మేనేజర్ సానుకూలంగా స్పందించి స్థలాన్ని పరిశీలించి అనుమతించడంతో బుధవారం అక్కడ ఆర్టీసీ రిక్వెస్ట్ బోర్డు ఏర్పాటు చేసినట్లు వివరించారు.1
- టీచింగ్ ఉద్యోగాలు 👌జీతం :2,18,700₹. అర్హత :డిగ్రీ, పీజీ, Phd. #shorts #teachingjobs #facultyjobs 🤝🤝.1
- పులివెందుల లో షిరిడి సాయిబాబా ఆలయంలో ఘనంగా సాయిబాబా పల్లకి ఉత్సవం గురు పౌర్ణమి సందర్భంగా పులివెందుల పట్టణంలోని స్థానిక షిరిడి సాయిబాబా ఆలయంలో సాయిబాబా పల్లకి ఉత్సవం వైభవంగా నిర్వహించారు.మహిళలు సాయిబాబా పల్లకిని మోసుకుంటూ ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అలాగే ఆలయంలో తాళాల భజనలు అందర్నీ ఆకట్టుకుంది. సాయిబాబా పల్లకి ఉత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కోలాటం ప్రదర్శన అలరించింది.1
- గురుపౌర్ణమి సందర్భంగా శ్రీ కామేశ్వరీ అమ్మవారి శాకాంబరీ ఉత్సవం వైభవం నంద్యాల: గురుపౌర్ణమి సందర్భంగా శ్రీ కామేశ్వరీ అమ్మవారి శాకాంబరీ ఉత్సవం ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్. శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో లోకకళ్యాణం కోసం ఘనంగా నిర్వహించారు. అమ్మవారిని వివిధ రకాల కూరగాయలతో అలంకరించి, శ్రీచక్రానికి శాకాలతో సహస్రనామార్చనలు, శాక నివేదనం, శాకహారతులు నిర్వహించారు. హైదరాబాద్ ఎల్‌బి నగర్ మార్కెట్‌కు చెందిన శ్రీకాంత్ రెడ్డి బృందం, కర్నూలు మార్కెట్‌కు చెందిన గిరిధర్ బృందం సుమారు 2 వేల కిలోలకుపైగా కూరగాయలను భక్తిశ్రద్ధలతో సమర్పించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీర్వాదాలు పొందారు.3
- గురు పౌర్ణమి సందర్భంగా స్థానిక షిర్డీ సాయిబాబా దేవస్థానంలో ప్రత్యేక పూజలు అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి పట్టణంలో గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానిక శ్రీ షిర్డీ సాయిబాబా దేవస్థానంలో బుధవారం ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు వైభవంగా నిర్వహించబడ్డాయి. దేవస్థానం నందు శ్రీ బోయకొండ గంగమ్మ దేవాస్థానం మాజీ చైర్మన్, షిర్డీ సాయి బాబా ఆలయ ధర్మకర్త ఎస్ కే వెంకటరమణా రెడ్డి దంపతులు స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. తెల్లవారుజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకుని సాయిబాబా ఆశీస్సులు పొందారు.ఈ సందర్భంగా ఆలయాన్ని పూలతో అందంగా అలంకరించి, ప్రత్యేక హారతులు, భజన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేయడంతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు.గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబా ఆశీస్సులతో ప్రతి కుటుంబం సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆలయ నిర్వాహకులు ఆకాంక్షించారు.4
- అకతాయి యువకులకు శ్రీ సత్యసాయి జిల్లా పోలీసుల హెచ్చరిక... శ్రీ సత్యసాయి జిల్లా, హిందూపురం లో సోషల్ మీడియాలో గుర్తింపు కోసం ప్రమాదకరమైన రీల్స్ చేయడం చట్టపరంగా నేరమే కాకుండా ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తుంది. హిందూపురం పట్టణానికి చెందిన మహేష్ తల్వార్ (కత్తి) పట్టుకుని రాత్రివేళ పట్టణ వీధుల్లో తిరుగుతూ రీల్ చిత్రీకరించిన ఘటనను పోలీసులు గుర్తించారు. అనంతరం అతన్ని పోలీస్ స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇలాంటి చర్యలు పునరావృతమైతే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. సోషల్ మీడియాలో లైక్స్, వ్యూస్ కోసం ప్రమాదకరమైన లేదా చట్టవిరుద్ధమైన కంటెంట్ రూపొందించవద్దు. బాధ్యతాయుతంగా సోషల్ మీడియాను వినియోగించి సమాజానికి మంచి సందేశాన్ని అందిద్దాం.1