logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

పులివెందుల లో షిరిడి సాయిబాబా ఆలయంలో ఘనంగా సాయిబాబా పల్లకి ఉత్సవం గురు పౌర్ణమి సందర్భంగా పులివెందుల పట్టణంలోని స్థానిక షిరిడి సాయిబాబా ఆలయంలో సాయిబాబా పల్లకి ఉత్సవం వైభవంగా నిర్వహించారు.మహిళలు సాయిబాబా పల్లకిని మోసుకుంటూ ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అలాగే ఆలయంలో తాళాల భజనలు అందర్నీ ఆకట్టుకుంది. సాయిబాబా పల్లకి ఉత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కోలాటం ప్రదర్శన అలరించింది.

7 hrs ago
user_LAKKU SIVA SANKAR reddy
LAKKU SIVA SANKAR reddy
Court reporter పులివెందుల, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
7 hrs ago

పులివెందుల లో షిరిడి సాయిబాబా ఆలయంలో ఘనంగా సాయిబాబా పల్లకి ఉత్సవం గురు పౌర్ణమి సందర్భంగా పులివెందుల పట్టణంలోని స్థానిక షిరిడి సాయిబాబా ఆలయంలో సాయిబాబా పల్లకి ఉత్సవం వైభవంగా నిర్వహించారు.మహిళలు సాయిబాబా పల్లకిని మోసుకుంటూ ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అలాగే ఆలయంలో తాళాల భజనలు అందర్నీ ఆకట్టుకుంది. సాయిబాబా పల్లకి ఉత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కోలాటం ప్రదర్శన అలరించింది.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • సమాజంలో అవినీతి పెరిగిపోయింది:ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరద సమాజంలో అవినీతి పెరిగిపోయిందని.. ప్రజల్లో చైతన్యం రావాలని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజల రెడ్డి పిలుపునిచ్చారు. కొంతమంది అధికారులు లంచాన్ని హక్కుగా భావిస్తున్నారు. డబ్బులు ఇవ్వందే ఏపని చేయడం లేదు. నూటికి 95 మంది లంచాలు తీసుకుంటున్నారు. ఏసీబీ అధికారులు ఎక్కడ.. ఈ లంచాలు కనబడటం లేదా.. ఏసీబీ కూడా లంచాలకు అలవాటు పడింది అంటూ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు.
    1
    సమాజంలో అవినీతి పెరిగిపోయింది:ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరద
సమాజంలో అవినీతి పెరిగిపోయిందని.. ప్రజల్లో చైతన్యం రావాలని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజల రెడ్డి పిలుపునిచ్చారు. కొంతమంది అధికారులు లంచాన్ని హక్కుగా భావిస్తున్నారు. డబ్బులు ఇవ్వందే ఏపని చేయడం లేదు. నూటికి 95 మంది లంచాలు తీసుకుంటున్నారు. ఏసీబీ అధికారులు ఎక్కడ.. ఈ లంచాలు కనబడటం లేదా.. ఏసీబీ కూడా లంచాలకు
అలవాటు పడింది అంటూ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు.
    user_LAKKU SIVA SANKAR reddy
    LAKKU SIVA SANKAR reddy
    Court reporter పులివెందుల, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి గా కేంద్రం నిధులు రాష్ట్రానికి రావడానికి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో ముఖ్యపాత్ర పోసిస్తున్న.. మన ధర్మవరం అసెంబ్లీ శాసనసభ్యులు ప్రజా నాయకుడు శ్రీ సత్యకుమార్ అన్నగారికి పోరాటపటిమను మీడియా ముఖంగా ప్రజలకు వివరించిన బీజేపి రాష్ట్ర అధికార ప్రతినిధి & బీజేపి SIR రాయలసీమ జోనల్ ఇంచార్జ్ ( జల్లి మధుసూదన్ గారు)
    1
    ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి గా 
కేంద్రం నిధులు రాష్ట్రానికి రావడానికి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో ముఖ్యపాత్ర పోసిస్తున్న.. మన ధర్మవరం అసెంబ్లీ శాసనసభ్యులు  ప్రజా నాయకుడు
  శ్రీ సత్యకుమార్  అన్నగారికి పోరాటపటిమను మీడియా ముఖంగా ప్రజలకు వివరించిన బీజేపి రాష్ట్ర అధికార ప్రతినిధి & బీజేపి SIR రాయలసీమ జోనల్ ఇంచార్జ్ ( జల్లి మధుసూదన్ గారు)
    user_Pv sivakumar
    Pv sivakumar
    Photographer ముదిగుబ్బ, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • అందరికీ నమస్కారం అండీ . ఈ పోస్టర్ని గవర్నమెంట్ చేరేంతవరకు షేర్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్
    1
    అందరికీ నమస్కారం అండీ . ఈ పోస్టర్ని గవర్నమెంట్ చేరేంతవరకు షేర్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్
    user_Kadiri Anjaneyulu
    Kadiri Anjaneyulu
    గండ్లపెంట, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    15 hrs ago
  • ఎల్‌నినో కరవు పరిస్థితులపై అప్రమత్తంగా ఉండాలి -అధికారులకు బిసి సంక్షేమ,చేనేత శాఖ మంత్రి ఆదేశం పుట్టపర్తి :-ఎల్‌నినో ప్రభావంతో తలెత్తే కరవు పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుని పనిచేయాలని రాష్ట్ర బిసి సంక్షేమ, చేనేత శాఖ మంత్రి ఎస్. సవిత అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ హాల్ నందు కరవు నివారణ చర్యలు, తాగునీటి సరఫరా, వ్యవసాయ, పశుసంవర్ధక శాఖల సంసిద్ధతపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్,జాయింట్ కలెక్టర్ ఎం మౌర్య భరద్వాజ్ ,పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లే సింధూర రెడ్డి , కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్,ఎమ్మెల్సీ శివరామిరెడ్డి పాటు పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ... ఎల్‌నినో కరవు పరిస్థితుల ఎదుర్మానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలి.సూపర్ ఎల్‌నినో కరవు ప్రభావంపై అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి జిల్లా వ్యాప్తంగా తాగునీటి సమస్య, పశుగ్రాసం కొరత రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి.మంత్రి సవిత అన్ని శాఖల అధికారులు సమగ్ర ప్రణాళికతో కరవు పరిస్థితులను ఎదుర్కోవాలి.జిల్లా వ్యాప్తంగా ఎక్కడా కూడా ప్రజలకు తాగునీటి ఎద్దడి రాకుండా గ్రామీణ మంచి నీటి సరఫరా (RWS) అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షించాలి. సమస్యాత్మక గ్రామాలను ముందే గుర్తించి, అవసరమైన చోట ట్యాంకర్ల ద్వారా ఉచితంగా నీటిని సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలి. చేతిపంపుల మరమ్మతులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని మంత్రి స్పష్టం చేశారు.కరవు కాలంలో మూగజీవాలకు పశుగ్రాసం, తాగునీటి కొరత లేకుండా చూసేందుకు పశుసంవర్ధక శాఖ అధికారులు సైలేజ్, ఎండుగ్రాసాన్ని అందుబాటులో ఉంచాలి. పశుగ్రాస క్షేత్రాల పెంపకాన్ని ప్రోత్సహించడంతో పాటు ఉచిత టీకాల కార్యక్రమాన్ని నిర్వహించాలి. ఉపాధి హామీ పథకం (MGNREGS) కింద కూలీలకు క్రమం తప్పకుండా పనులు కల్పించాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలను నిరోధించేలా ఉపాధి పనులను వేగవంతం చేయాలని, సమయానికి వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.రెవెన్యూ, వ్యవసాయ, పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్, విద్యుత్ శాఖల అధికారులు సమన్వయంతో ప్రతివారం గ్రామస్థాయి పరిస్థితులను సమీక్షించుకోవాలి. కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసి ప్రజాఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని స్పష్టం చేశారు. *జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ...* జిల్లాలో ఎల్‌నినో ప్రభావం వల్ల నీటి కొరత లేదా కరవు పరిస్థితులు తలెత్తకుండా ప్రభుత్వం మరియు గౌరవ మంత్రివర్యుల ఆదేశాల మేరకు సమగ్ర ప్రణాళికను రూపొందించాం. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాపై నిరంతరం సమీక్షిస్తున్నాం. ఎండ తీవ్రత, భూగర్భ జలాల మట్టాలను దృష్టిలో ఉంచుకుని తాగునీటి ఎద్దడి తలెత్తే అవకాశం ఉన్న గ్రామాలను ముందుగానే గుర్తించాం. బోర్ల రీబోరింగ్, పైప్‌లైన్ మరమ్మతులను వేగవంతంగా పూర్తి చేస్తున్నాం. అవసరమైన చోట ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు ఏర్పాట్లు సిద్ధం చేశాం.కరవు ఉపశమన చర్యల్లో భాగంగా రైతులకు ఉపాధి హామీ పనులు, మూగజీవాలకు పశుగ్రాసం కొరత రాకుండా అన్ని శాఖలను సమన్వయం చేస్తున్నాం. ఈ సమావేశంలో జిల్లా వివిధ శాఖల అధికారులు, డివిజనల్ అధికారులు, తహశీల్దార్లు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.
    1
    ఎల్‌నినో కరవు పరిస్థితులపై అప్రమత్తంగా ఉండాలి
-అధికారులకు బిసి సంక్షేమ,చేనేత శాఖ మంత్రి ఆదేశం
పుట్టపర్తి :-ఎల్‌నినో ప్రభావంతో తలెత్తే కరవు పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుని పనిచేయాలని రాష్ట్ర బిసి సంక్షేమ, చేనేత శాఖ మంత్రి  ఎస్. సవిత అధికారులను ఆదేశించారు. 
జిల్లా కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ హాల్ నందు కరవు నివారణ చర్యలు, తాగునీటి సరఫరా, వ్యవసాయ, పశుసంవర్ధక శాఖల సంసిద్ధతపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్,జాయింట్ కలెక్టర్ ఎం మౌర్య భరద్వాజ్ ,పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లే సింధూర రెడ్డి , కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్,ఎమ్మెల్సీ శివరామిరెడ్డి పాటు పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.
మంత్రి మాట్లాడుతూ...
ఎల్‌నినో కరవు పరిస్థితుల ఎదుర్మానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలి.సూపర్ ఎల్‌నినో కరవు ప్రభావంపై అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి జిల్లా వ్యాప్తంగా తాగునీటి సమస్య, పశుగ్రాసం కొరత రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి.మంత్రి సవిత
అన్ని శాఖల అధికారులు సమగ్ర ప్రణాళికతో కరవు పరిస్థితులను ఎదుర్కోవాలి.జిల్లా వ్యాప్తంగా ఎక్కడా కూడా ప్రజలకు తాగునీటి ఎద్దడి రాకుండా గ్రామీణ మంచి నీటి సరఫరా (RWS) అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షించాలి. సమస్యాత్మక గ్రామాలను ముందే గుర్తించి, అవసరమైన చోట ట్యాంకర్ల ద్వారా ఉచితంగా నీటిని సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలి. చేతిపంపుల మరమ్మతులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని మంత్రి స్పష్టం చేశారు.కరవు కాలంలో మూగజీవాలకు పశుగ్రాసం, తాగునీటి కొరత లేకుండా చూసేందుకు పశుసంవర్ధక శాఖ అధికారులు సైలేజ్, ఎండుగ్రాసాన్ని అందుబాటులో ఉంచాలి. పశుగ్రాస క్షేత్రాల పెంపకాన్ని ప్రోత్సహించడంతో పాటు ఉచిత టీకాల కార్యక్రమాన్ని నిర్వహించాలి.
ఉపాధి హామీ పథకం (MGNREGS) కింద కూలీలకు క్రమం తప్పకుండా పనులు కల్పించాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలను నిరోధించేలా ఉపాధి పనులను వేగవంతం చేయాలని, సమయానికి వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.రెవెన్యూ, వ్యవసాయ, పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్, విద్యుత్ శాఖల అధికారులు
సమన్వయంతో ప్రతివారం గ్రామస్థాయి పరిస్థితులను సమీక్షించుకోవాలి. కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసి ప్రజాఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని స్పష్టం చేశారు.
*జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ...* 
జిల్లాలో ఎల్‌నినో ప్రభావం వల్ల నీటి కొరత లేదా కరవు పరిస్థితులు తలెత్తకుండా ప్రభుత్వం మరియు గౌరవ మంత్రివర్యుల ఆదేశాల మేరకు సమగ్ర ప్రణాళికను రూపొందించాం. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాపై నిరంతరం సమీక్షిస్తున్నాం. ఎండ తీవ్రత, భూగర్భ జలాల మట్టాలను దృష్టిలో ఉంచుకుని తాగునీటి ఎద్దడి తలెత్తే అవకాశం ఉన్న గ్రామాలను ముందుగానే గుర్తించాం. బోర్ల రీబోరింగ్, పైప్‌లైన్ మరమ్మతులను వేగవంతంగా పూర్తి చేస్తున్నాం. అవసరమైన చోట ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు ఏర్పాట్లు సిద్ధం చేశాం.కరవు ఉపశమన చర్యల్లో భాగంగా రైతులకు ఉపాధి హామీ పనులు, మూగజీవాలకు పశుగ్రాసం కొరత రాకుండా అన్ని శాఖలను సమన్వయం చేస్తున్నాం. 
ఈ సమావేశంలో జిల్లా వివిధ శాఖల అధికారులు, డివిజనల్ అధికారులు, తహశీల్దార్లు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.
    user_Saddala Adi
    Saddala Adi
    ధర్మవరం, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • AP లో DSC స్కాం పై‌ కడప లో యువత & విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ర్యాలీ విజయవంతం కావడంతో కడపలో AP లో DSC స్కాం పై‌ కడప లో యువత & విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ర్యాలీ విజయవంతం కావడంతో కడపలో కొందరు టిడిపి నాయకులు ఓర్వలేక పోతున్నారు... -పసుపులేటి సాయి దత్త విద్యార్థి విభాగం అధ్యక్షులు, కడప జిల్లా #ysrcp #ysrcpsocialmedia #jaganmohanreddy #jaganannaconnects #jaganannakithoduga
    1
    AP లో DSC స్కాం పై‌ కడప లో యువత & విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ర్యాలీ విజయవంతం కావడంతో కడపలో
AP లో DSC స్కాం పై‌ కడప లో యువత & విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ర్యాలీ విజయవంతం కావడంతో కడపలో కొందరు టిడిపి నాయకులు ఓర్వలేక పోతున్నారు...
-పసుపులేటి సాయి దత్త 
విద్యార్థి విభాగం అధ్యక్షులు, కడప జిల్లా 
#ysrcp #ysrcpsocialmedia #jaganmohanreddy #jaganannaconnects #jaganannakithoduga
    user_P.ViswanathReddy
    P.ViswanathReddy
    Farmer ఎస్.మైదుకూరు, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • ముళ్ల పొదలతో మూసుకుపోయిన పొలాల బాట.. 100 ఎకరాల రైతుల ఆవేదన – వెంటనే రహదారి పునరుద్ధరణకు విజ్ఞప్తి వైఎస్సార్ కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలంలోని నాగిశెట్టిపల్లె పంచాయతీ పరిధిలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నందిపల్లె చెక్‌పోస్ట్ నుంచి పుట్టా సుధాకర్ యాదవ్ కాలనీ మీదుగా సుమారు 100 ఎకరాల మాగాణి పొలాలకు వెళ్లే ప్రధాన వ్యవసాయ రహదారి దట్టమైన ముళ్ల పొదలతో పూర్తిగా మూసుకుపోవడంతో పొలాలకు వెళ్లడం రైతులకు భారంగా మారింది.నందిపల్లె చెక్‌పోస్ట్ నుంచి పుట్టా సుధాకర్ యాదవ్ కాలనీ వరకు రహదారి సక్రమంగా ఉన్నప్పటికీ, అక్కడి నుంచి పొలాలకు వెళ్లే మార్గం పూర్తిగా ముళ్ల కంపలతో ఆక్రమించబడింది. దీంతో రైతులు ప్రత్యామ్నాయంగా పక్క పొలాల గట్ల మీదుగా నడుచుకుంటూ పొలాలకు చేరుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.ప్రస్తుతం సాగు పనులు ఊపందుకున్న నేపథ్యంలో విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల బస్తాలను భుజాలపై మోసుకుంటూ మైళ్ల దూరం నడవాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్రాక్టర్లు, ఇతర వ్యవసాయ వాహనాలు పొలాల్లోకి వెళ్లలేకపోవడంతో సాగు పనులు ఆలస్యం అవుతున్నాయని తెలిపారు. పంట కోత అనంతరం ధాన్యాన్ని తరలించడమూ కష్టసాధ్యంగా మారిందన్నారు.ఈ రహదారిలోని ముళ్ల పొదలను తొలగించి దారిని పునరుద్ధరిస్తే నాగిశెట్టిపల్లె పంచాయతీ పరిధిలోని దాదాపు 100 ఎకరాల ఆయకట్టు రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని రైతులు పేర్కొంటున్నారు. వ్యవసాయ సామగ్రి రవాణా సులభతరం కావడంతో పాటు పంటను నేరుగా పొలాల నుంచి ఇళ్లకు, మార్కెట్ యార్డులకు తరలించే అవకాశం ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.రైతుల సమస్యను గుర్తించి సంబంధిత అధికారులు తక్షణమే క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టి, ఉపాధి హామీ పథకం లేదా పంచాయతీ నిధుల ద్వారా ముళ్ల పొదలను తొలగించి వ్యవసాయ రహదారిని పునరుద్ధరించాలని స్థానిక రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రజాప్రతినిధులు, అధికారులు వెంటనే స్పందించాలని కోరుతున్నారు.
    1
    ముళ్ల పొదలతో మూసుకుపోయిన పొలాల బాట.. 100 ఎకరాల రైతుల ఆవేదన – వెంటనే రహదారి పునరుద్ధరణకు విజ్ఞప్తి
వైఎస్సార్ కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలంలోని నాగిశెట్టిపల్లె పంచాయతీ పరిధిలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నందిపల్లె చెక్‌పోస్ట్ నుంచి పుట్టా సుధాకర్ యాదవ్ కాలనీ మీదుగా సుమారు 100 ఎకరాల మాగాణి పొలాలకు వెళ్లే ప్రధాన వ్యవసాయ రహదారి దట్టమైన ముళ్ల పొదలతో పూర్తిగా మూసుకుపోవడంతో పొలాలకు వెళ్లడం రైతులకు భారంగా మారింది.నందిపల్లె చెక్‌పోస్ట్ నుంచి పుట్టా సుధాకర్ యాదవ్ కాలనీ వరకు రహదారి సక్రమంగా ఉన్నప్పటికీ, అక్కడి నుంచి పొలాలకు వెళ్లే మార్గం పూర్తిగా ముళ్ల కంపలతో ఆక్రమించబడింది. దీంతో రైతులు ప్రత్యామ్నాయంగా పక్క పొలాల గట్ల మీదుగా నడుచుకుంటూ పొలాలకు చేరుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.ప్రస్తుతం సాగు పనులు ఊపందుకున్న నేపథ్యంలో విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల బస్తాలను భుజాలపై మోసుకుంటూ మైళ్ల దూరం నడవాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్రాక్టర్లు, ఇతర వ్యవసాయ వాహనాలు పొలాల్లోకి వెళ్లలేకపోవడంతో సాగు పనులు ఆలస్యం అవుతున్నాయని తెలిపారు. పంట కోత అనంతరం ధాన్యాన్ని తరలించడమూ కష్టసాధ్యంగా మారిందన్నారు.ఈ రహదారిలోని ముళ్ల పొదలను తొలగించి దారిని పునరుద్ధరిస్తే నాగిశెట్టిపల్లె పంచాయతీ పరిధిలోని దాదాపు 100 ఎకరాల ఆయకట్టు రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని రైతులు పేర్కొంటున్నారు. వ్యవసాయ సామగ్రి రవాణా సులభతరం కావడంతో పాటు పంటను నేరుగా పొలాల నుంచి ఇళ్లకు, మార్కెట్ యార్డులకు తరలించే అవకాశం ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.రైతుల సమస్యను గుర్తించి సంబంధిత అధికారులు తక్షణమే క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టి, ఉపాధి హామీ పథకం లేదా పంచాయతీ నిధుల ద్వారా ముళ్ల పొదలను తొలగించి వ్యవసాయ రహదారిని పునరుద్ధరించాలని స్థానిక రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రజాప్రతినిధులు, అధికారులు వెంటనే స్పందించాలని కోరుతున్నారు.
    user_VEMULURIMALAKONDAIAH
    VEMULURIMALAKONDAIAH
    Hindu temple ఖాజీపేట, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • 1)కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేయాలి. 2) వేతనాల పెంపుదల కోసం ఈనెల 30వ తేదీన కలెక్టరేట్ ఎదుట నిర్వహించే ఆందోళన జయప్రదం చేయండి. సిఐటియు పట్టణ నాయకులు కె.శివకుమార్.. బద్వేలు, జూలై 29:జిల్లావ్యాప్తంగా కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేయాలని, ఈనెల 30న కలెక్టరేట్ ఎదుట నిర్వహించే ఆందోళన జయప్రదం చేయాలని, షెడ్యూల్ ఎంప్లాయిస్ కి వేతనాలు రివైజ్ చేయాలని సిఐటియు పట్టణ నాయకులు కె.శివకుమార్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మంగళవారం రోజుననాలుగు రోడ్ల సెంటర్లో గల సిఐటియు పట్టణ కార్యాలయము నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసంఘటిత, సంఘటిత కార్మికులు జిల్లా వ్యాప్తంగా రెండు నుంచి ఐదు లక్షల మంది ఉన్నారని పేర్కొన్నారు. ఆప్కాస్ లో 25 వేల మంది, మున్సిపల్, విద్యుత్, విద్య, వైద్యము స్కీం వర్కర్లు, అంగన్వాడి, ఆశ, మధ్యాహ్నం భోజనం, వివో ఏలు, పెట్రోల్ బంకులు, షాపింగ్ మాల్స్, టీచింగ్, నాన్ టీచింగ్, ఆసుపత్రులలో శానిటేషన్, నర్సులు, డిక్షన్ కంపెనీలో 2,500 మంది, షిరిడి సాయి లో దాదాపు 7వేల మంది కార్మికులు పనిచేస్తున్నారని తెలిపారు. వీరికి కలెక్టర్ నిర్ణయించిన ప్రకారం కనీస వేతనం అమలు కావడం లేదని చెప్పారు. ప్రభుత్వ శాఖల్లో ఆప్కాస్ లేకుండా ఏ శాఖ లేదని పేర్కొన్నారు. ఎక్కువ పని చేయించుకుంటూ తక్కువ వేతనాలు ఇస్తున్నారని విమర్శించారు. గ్రాడ్యుటి, పెన్షన్ లేదని తెలిపారు.పంజాబ్ తరహాలో జిల్లాలోని కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. లక్షలాదిమంది కార్మికులు, ఉద్యోగులు కనీస వేతనాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. గ్రామపంచాయతీ, త్రిబుల్ ఐటీ, వై వీ యూ, ఆర్కిటెక్, వెటర్నటి యూనివర్సిటీ, ఏపీ కార్లు, ప్రభుత్వ మెడికల్ కళాశాలలో పనిచేస్తున్న కార్మికుల పరిస్థితి ఆగమ్యగోచరంగా ఉందని తెలిపారు. ఎస్సీ, ఎస్ టి, బి సి, మైనార్టీ హాస్టల్స్, గురుకుల పాఠశాలలు, సెక్యూరిటీ,శానిటేషన్, వాచ్మెన్ ల పరిస్థితి అధ్వానంగా ఉందని చెప్పారు. ఆర్టీసీ డిపోలలో పనిచేస్తున్న శానిటేషన్, సెక్యూరిటీ, స్లీపింగ్, అటెండర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్ల కు అతి తక్కువ వేతనాలు ఇస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కె.శ్రీనివాసులు, గంపా సుబ్బరాయుడు, సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు.
    1
    1)కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేయాలి.
2) వేతనాల పెంపుదల  కోసం  ఈనెల 30వ తేదీన 
 కలెక్టరేట్ ఎదుట నిర్వహించే ఆందోళన జయప్రదం చేయండి. 
 సిఐటియు పట్టణ నాయకులు కె.శివకుమార్..  
బద్వేలు, జూలై 29:జిల్లావ్యాప్తంగా  కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేయాలని, ఈనెల 30న కలెక్టరేట్ ఎదుట నిర్వహించే ఆందోళన జయప్రదం చేయాలని, షెడ్యూల్ ఎంప్లాయిస్ కి వేతనాలు రివైజ్ చేయాలని సిఐటియు పట్టణ నాయకులు కె.శివకుమార్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
మంగళవారం రోజుననాలుగు రోడ్ల సెంటర్లో గల సిఐటియు పట్టణ కార్యాలయము నందు  విలేకరుల సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  అసంఘటిత, సంఘటిత కార్మికులు జిల్లా వ్యాప్తంగా రెండు నుంచి ఐదు లక్షల మంది ఉన్నారని పేర్కొన్నారు. ఆప్కాస్ లో 25 వేల మంది, మున్సిపల్, విద్యుత్, విద్య, వైద్యము స్కీం వర్కర్లు, అంగన్వాడి, ఆశ, మధ్యాహ్నం భోజనం, వివో ఏలు, పెట్రోల్ బంకులు, షాపింగ్ మాల్స్, టీచింగ్, నాన్ టీచింగ్, ఆసుపత్రులలో శానిటేషన్, నర్సులు, డిక్షన్ కంపెనీలో 2,500 మంది, షిరిడి సాయి లో దాదాపు 7వేల మంది కార్మికులు పనిచేస్తున్నారని తెలిపారు. వీరికి కలెక్టర్ నిర్ణయించిన ప్రకారం కనీస వేతనం అమలు కావడం లేదని చెప్పారు. ప్రభుత్వ శాఖల్లో ఆప్కాస్ లేకుండా ఏ శాఖ లేదని పేర్కొన్నారు. ఎక్కువ పని చేయించుకుంటూ తక్కువ వేతనాలు ఇస్తున్నారని విమర్శించారు. గ్రాడ్యుటి, పెన్షన్ లేదని తెలిపారు.పంజాబ్ తరహాలో జిల్లాలోని కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. లక్షలాదిమంది కార్మికులు, ఉద్యోగులు కనీస వేతనాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. గ్రామపంచాయతీ, త్రిబుల్ ఐటీ, వై వీ యూ, ఆర్కిటెక్, వెటర్నటి యూనివర్సిటీ, ఏపీ కార్లు, ప్రభుత్వ మెడికల్ కళాశాలలో పనిచేస్తున్న కార్మికుల పరిస్థితి ఆగమ్యగోచరంగా ఉందని తెలిపారు. ఎస్సీ, ఎస్ టి, బి సి, మైనార్టీ హాస్టల్స్, గురుకుల పాఠశాలలు, సెక్యూరిటీ,శానిటేషన్, వాచ్మెన్ ల పరిస్థితి అధ్వానంగా ఉందని చెప్పారు. ఆర్టీసీ డిపోలలో పనిచేస్తున్న శానిటేషన్, సెక్యూరిటీ, స్లీపింగ్, అటెండర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్ల కు అతి తక్కువ వేతనాలు ఇస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కె.శ్రీనివాసులు, గంపా సుబ్బరాయుడు, సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • గండికోట నుంచి మైలవరానికి 5,000 క్యూసెక్కుల నీటి విడుదల జమ్మలమడుగు నియోజకవర్గం గండికోట జలాశయం నుంచి మైలవరం రిజర్వాయర్లోకి బుధవారం సాయంత్రం నీటిని విడుదల చేసినట్లు ఈ ఈ ఉమామహేశ్వర్లు తెలిపారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఒక గేటు ఎత్తి 5,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ప్రస్తుతం గండికోట జలాశయంలో 17.70 టీఎంసీల నీరు నిల్వ ఉందని ఈఈ వివరించారు.
    1
    గండికోట నుంచి మైలవరానికి 5,000 క్యూసెక్కుల నీటి విడుదల
జమ్మలమడుగు నియోజకవర్గం గండికోట జలాశయం నుంచి మైలవరం రిజర్వాయర్లోకి బుధవారం సాయంత్రం నీటిని విడుదల చేసినట్లు ఈ ఈ ఉమామహేశ్వర్లు తెలిపారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఒక గేటు ఎత్తి 5,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ప్రస్తుతం గండికోట జలాశయంలో 17.70 టీఎంసీల నీరు నిల్వ ఉందని
ఈఈ వివరించారు.
    user_LAKKU SIVA SANKAR reddy
    LAKKU SIVA SANKAR reddy
    Court reporter పులివెందుల, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.