Shuru
Apke Nagar Ki App…
అందరికీ నమస్కారం అండీ . ఈ పోస్టర్ని గవర్నమెంట్ చేరేంతవరకు షేర్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్
Kadiri Anjaneyulu
అందరికీ నమస్కారం అండీ . ఈ పోస్టర్ని గవర్నమెంట్ చేరేంతవరకు షేర్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- అందరికీ నమస్కారం అండీ . ఈ పోస్టర్ని గవర్నమెంట్ చేరేంతవరకు షేర్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్1
- పులివెందుల లోని సాయిబాబ ఆలయాలలో భక్తిశ్రద్ధలతో గురుపౌర్ణమి వేడుకలు పులివెందులలోని షిరిడీ సాయిబాబా ఆలయాలలో గురు పౌర్ణమి వేడుకలు భక్తిశ్రద్ధలతో జరుగుతున్నాయి.పులివెందుల పట్టణంలోని స్థానిక భగవాన్ సత్యసాయి మందిరం,పార్నపల్లి రోడ్డులోని షిరిడీ సాయిబాబా ఆలయంలోనూ.. అలాగే బ్రాహ్మణ పల్లె సమీపంలోని సాయిబాబా ఆలయాలలో బాబాను ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేపట్టారు. బుధవారం ఉదయమే సాయిబాబాకు హారతులు, పాలాభిషేకం నిర్వహించారు. ఆయా ఆలయాల వద్ద మహిళలు సామూహిక పూజలు చేశారు.1
- అన్నమయ్య జిల్లాలోని పలు దేవాలయాలలో వరుస విగ్రహాల చోరీ కేసును ఛేదించిన పుంగనూరు పోలీసులు. అన్నమయ్య జిల్లా: పుంగనూరు: అన్నమయ్య జిల్లాలోని పలు దేవాలయాలలో వరుస విగ్రహాల చోరీ కేసును ఛేదించిన పుంగనూరు పోలీసులు. పుంగునూరు టౌన్ శ్రీకృష్ణదేవరాయలు క్రాస్ వద్ద వాహనాల తనిఖీలలో పట్టుబడిన నిందితుడు. దేవాలయాలలో దొంగలించిన విగ్రహాలను విక్రయానికి తీసుకు వెళుతుండగా పట్టుకున్న పోలీసులు. నిందితుడు మదనపల్లికి చెందిన యలకపల్లి ప్రభాకర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు. పంచలోహ విగ్రహాలు, ఇత్తడి హంస జ్యోతులు, కంచు గంటలు స్వాధీనం. పుంగనూరు పరిధిలోని సోమల,చౌడేపల్లి, సదుం, నిమ్మనపల్లి ప్రాంతాలలో చోరీలకు పాల్పడిన నిందితుడు. చోరీకి ఉపయోగించిన ఆటోను సీజ్ చేసి నిందితుడిని రిమాండ్ కు తరలించినన పోలీసులు. కేసును ఛేదించిన పుంగనూరు అర్బన్ పోలీసులను జిల్లా పోలీసు అధికారులు అభినందించారు.4
- కడప జిల్లా. నందలూరు. తిరుమల తిరుపతి (టీటీడీ) దేవస్థానం ఆధ్వర్యంలో.... 🙏 తిరుమల వేద పండితులచే అంగరంగ వైభోవంగా శ్రీదేవి భూదేవి శ్రీ సోమ్యనాధ స్వామి కళ్యాణోత్సవం. అధిక సంఖ్యలో పాల్గొన్న స్వామి వారి భక్తులు. కడప జిల్లా ఏ స్పీ నచికేత్ విశ్వనాధ్ ఐపీస్, ఆదేశాలు మేరకు ఒంటిమిట్ట సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ ) పి. వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో స్వామి వారి కళ్యాణత్సవం లో భక్తులకు మరియు ట్రాఫిక్ ఎలాంటి అవంచానియాలు జరగకుండా, రెండు డ్రోన్లు తో, 150 మంది పోలీస్ బందోదొబస్తుని ఏర్పాట్లు చేసి స్వామి వారి కల్యాణన్ని విజయవంతం చేసేరు. స్వామి వారి కల్యాణనికి.... NDA కూటమి పార్టీ నాయకులు మేడా విజయశేఖర్ రెడ్డి,, సాయి లోకేష్,, తదితరులు మరియు వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. మి.... కొర్రపాటి నాగరాజ ఆచార్య, సీనియర్ క్రైమ్ జర్నలిస్ట్. కడప జిల్లా. నందలూరు. తిరుమల తిరుపతి (టీటీడీ) దేవస్థానం ఆధ్వర్యంలో.... 🙏 తిరుమల వేద పండితులచే అంగరంగ వైభోవంగా శ్రీదేవి భూదేవి శ్రీ సోమ్యనాధ స్వామి కళ్యాణోత్సవం. అధిక సంఖ్యలో పాల్గొన్న స్వామి వారి భక్తులు. కడప జిల్లా ఏ స్పీ నచికేత్ విశ్వనాధ్ ఐపీస్, ఆదేశాలు మేరకు ఒంటిమిట్ట సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ ) పి. వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో స్వామి వారి కళ్యాణత్సవం లో భక్తులకు మరియు ట్రాఫిక్ ఎలాంటి అవంచానియాలు జరగకుండా, రెండు డ్రోన్లు తో, 150 మంది పోలీస్ బందోదొబస్తుని ఏర్పాట్లు చేసి స్వామి వారి కల్యాణన్ని విజయవంతం చేసేరు. స్వామి వారి కల్యాణనికి.... NDA కూటమి పార్టీ నాయకులు మేడా విజయశేఖర్ రెడ్డి,, సాయి లోకేష్,, తదితరులు మరియు వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. మి.... కొర్రపాటి నాగరాజ ఆచార్య, సీనియర్ క్రైమ్ జర్నలిస్ట్.1
- గురు పౌర్ణమి సందర్భంగా స్థానిక షిర్డీ సాయిబాబా దేవస్థానంలో ప్రత్యేక పూజలు అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి పట్టణంలో గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానిక శ్రీ షిర్డీ సాయిబాబా దేవస్థానంలో బుధవారం ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు వైభవంగా నిర్వహించబడ్డాయి. దేవస్థానం నందు శ్రీ బోయకొండ గంగమ్మ దేవాస్థానం మాజీ చైర్మన్, షిర్డీ సాయి బాబా ఆలయ ధర్మకర్త ఎస్ కే వెంకటరమణా రెడ్డి దంపతులు స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. తెల్లవారుజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకుని సాయిబాబా ఆశీస్సులు పొందారు.ఈ సందర్భంగా ఆలయాన్ని పూలతో అందంగా అలంకరించి, ప్రత్యేక హారతులు, భజన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేయడంతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు.గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబా ఆశీస్సులతో ప్రతి కుటుంబం సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆలయ నిర్వాహకులు ఆకాంక్షించారు.4
- అనుమానాస్పద కదలికలపై ప్రత్యేక నిఘా.. ప్రజలు వెంటనే 112కు సమాచారం ఇవ్వాలని డీఎస్పీ సూచన. అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణంలో చెడ్డీ గ్యాంగ్‌కు సంబంధించిన అనుమానాస్పద కదలికలు కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమై పట్టణంలో భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేస్తూ బీట్ పోలీసింగ్‌ను పెంచడంతో పాటు క్రైమ్ విభాగం సిబ్బందితో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసామని, రాయచోటి డీఎస్పీ ఎం.ఆర్. కృష్ణమోహన్ తెలిపారు. పీలేరు పోలీస్ స్టేషన్లో మీడియా ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా చెడ్డీ గ్యాంగ్‌కు సంబంధించిన కదలికలు ఎక్కడైనా కనిపిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్ 112కు సమాచారం అందించాలని కోరారు. ప్రజల సహకారంతోనే నేరాలను సమర్థవంతంగా అరికట్టగలమని, ఎలాంటి అనుమానాస్పద పరిస్థితులు కనిపించినా ఆలస్యం చేయకుండా పోలీసులకు సమాచారం ఇవ్వాలని డీఎస్పీ విజ్ఞప్తి చేశారు. పీలేరు పట్టణంలో భద్రతా ఏర్పాట్లను మరింత బలోపేతం చేసినట్లు పోలీసులు తెలిపారు.1
- 110 కిలోల పంచలోహ విగ్రహాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు పుంగనూరు నియోజకవర్గం లోని సోమల, చౌడేపల్లి, సదుం, నిమ్మనపల్లి మండలాల్లోని పలు ఆలయాల్లో చోరీలకు పాల్పడిన నిందితుడిని అరెస్టు చేసినట్లు పుంగనూరు పోలీస్ స్టేషన్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఐ సుబ్బరాయుడు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అతని వద్ద నుంచి ఒక ఆటోతో పాటు సుమారు 110 కిలోల పంచలోహ విగ్రహాలు, జ్యోతులు, గంటలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పోలీస్ అధికారులు పాల్గొన్నారు.1
- గండి అంజన్న ఆలయానికి రూ.36,38,630 నగదు భారీ ఆదాయం:ఆలయ డిప్యూటీ కమీషనర్ గండిక్షేత్రంలోని శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో పరకామణి నిర్వహించారు. మంగళవారం ఆలయ డిప్యూటీ కమీషనర్ విశ్వనాధ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆలయంలో 68 రోజులకు గాను స్వామివారి శాశ్వత హుండీలు లెక్కించగా.. రూ.36,38,630 నగదు, 5. 190 గ్రాముల బంగారం, 254 గ్రాముల వెండి వస్తువులు భక్తుల కానుకల ద్వారా ఆదాయం వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో ఛైర్మన్ వెంకటస్వామి పాల్గొన్నారు.1