ముళ్ల పొదలతో మూసుకుపోయిన పొలాల బాట.. 100 ఎకరాల రైతుల ఆవేదన – వెంటనే రహదారి పునరుద్ధరణకు విజ్ఞప్తి వైఎస్సార్ కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలంలోని నాగిశెట్టిపల్లె పంచాయతీ పరిధిలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నందిపల్లె చెక్‌పోస్ట్ నుంచి పుట్టా సుధాకర్ యాదవ్ కాలనీ మీదుగా సుమారు 100 ఎకరాల మాగాణి పొలాలకు వెళ్లే ప్రధాన వ్యవసాయ రహదారి దట్టమైన ముళ్ల పొదలతో పూర్తిగా మూసుకుపోవడంతో పొలాలకు వెళ్లడం రైతులకు భారంగా మారింది.నందిపల్లె చెక్‌పోస్ట్ నుంచి పుట్టా సుధాకర్ యాదవ్ కాలనీ వరకు రహదారి సక్రమంగా ఉన్నప్పటికీ, అక్కడి నుంచి పొలాలకు వెళ్లే మార్గం పూర్తిగా ముళ్ల కంపలతో ఆక్రమించబడింది. దీంతో రైతులు ప్రత్యామ్నాయంగా పక్క పొలాల గట్ల మీదుగా నడుచుకుంటూ పొలాలకు చేరుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.ప్రస్తుతం సాగు పనులు ఊపందుకున్న నేపథ్యంలో విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల బస్తాలను భుజాలపై మోసుకుంటూ మైళ్ల దూరం నడవాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్రాక్టర్లు, ఇతర వ్యవసాయ వాహనాలు పొలాల్లోకి వెళ్లలేకపోవడంతో సాగు పనులు ఆలస్యం అవుతున్నాయని తెలిపారు. పంట కోత అనంతరం ధాన్యాన్ని తరలించడమూ కష్టసాధ్యంగా మారిందన్నారు.ఈ రహదారిలోని ముళ్ల పొదలను తొలగించి దారిని పునరుద్ధరిస్తే నాగిశెట్టిపల్లె పంచాయతీ పరిధిలోని దాదాపు 100 ఎకరాల ఆయకట్టు రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని రైతులు పేర్కొంటున్నారు. వ్యవసాయ సామగ్రి రవాణా సులభతరం కావడంతో పాటు పంటను నేరుగా పొలాల నుంచి ఇళ్లకు, మార్కెట్ యార్డులకు తరలించే అవకాశం ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.రైతుల సమస్యను గుర్తించి సంబంధిత అధికారులు తక్షణమే క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టి, ఉపాధి హామీ పథకం లేదా పంచాయతీ నిధుల ద్వారా ముళ్ల పొదలను తొలగించి వ్యవసాయ రహదారిని పునరుద్ధరించాలని స్థానిక రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రజాప్రతినిధులు, అధికారులు వెంటనే స్పందించాలని కోరుతున్నారు.

- ముళ్ల పొదలతో మూసుకుపోయిన పొలాల బాట.. 100 ఎకరాల రైతుల ఆవేదన – వెంటనే రహదారి పునరుద్ధరణకు విజ్ఞప్తి వైఎస్సార్ కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలంలోని నాగిశెట్టిపల్లె పంచాయతీ పరిధిలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నందిపల్లె చెక్‌పోస్ట్ నుంచి పుట్టా సుధాకర్ యాదవ్ కాలనీ మీదుగా సుమారు 100 ఎకరాల మాగాణి పొలాలకు వెళ్లే ప్రధాన వ్యవసాయ రహదారి దట్టమైన ముళ్ల పొదలతో పూర్తిగా మూసుకుపోవడంతో పొలాలకు వెళ్లడం రైతులకు భారంగా మారింది.నందిపల్లె చెక్‌పోస్ట్ నుంచి పుట్టా సుధాకర్ యాదవ్ కాలనీ వరకు రహదారి సక్రమంగా ఉన్నప్పటికీ, అక్కడి నుంచి పొలాలకు వెళ్లే మార్గం పూర్తిగా ముళ్ల కంపలతో ఆక్రమించబడింది. దీంతో రైతులు ప్రత్యామ్నాయంగా పక్క పొలాల గట్ల మీదుగా నడుచుకుంటూ పొలాలకు చేరుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.ప్రస్తుతం సాగు పనులు ఊపందుకున్న నేపథ్యంలో విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల బస్తాలను భుజాలపై మోసుకుంటూ మైళ్ల దూరం నడవాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్రాక్టర్లు, ఇతర వ్యవసాయ వాహనాలు పొలాల్లోకి వెళ్లలేకపోవడంతో సాగు పనులు ఆలస్యం అవుతున్నాయని తెలిపారు. పంట కోత అనంతరం ధాన్యాన్ని తరలించడమూ కష్టసాధ్యంగా మారిందన్నారు.ఈ రహదారిలోని ముళ్ల పొదలను తొలగించి దారిని పునరుద్ధరిస్తే నాగిశెట్టిపల్లె పంచాయతీ పరిధిలోని దాదాపు 100 ఎకరాల ఆయకట్టు రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని రైతులు పేర్కొంటున్నారు. వ్యవసాయ సామగ్రి రవాణా సులభతరం కావడంతో పాటు పంటను నేరుగా పొలాల నుంచి ఇళ్లకు, మార్కెట్ యార్డులకు తరలించే అవకాశం ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.రైతుల సమస్యను గుర్తించి సంబంధిత అధికారులు తక్షణమే క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టి, ఉపాధి హామీ పథకం లేదా పంచాయతీ నిధుల ద్వారా ముళ్ల పొదలను తొలగించి వ్యవసాయ రహదారిని పునరుద్ధరించాలని స్థానిక రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రజాప్రతినిధులు, అధికారులు వెంటనే స్పందించాలని కోరుతున్నారు.1
- 1)కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేయాలి. 2) వేతనాల పెంపుదల కోసం ఈనెల 30వ తేదీన కలెక్టరేట్ ఎదుట నిర్వహించే ఆందోళన జయప్రదం చేయండి. సిఐటియు పట్టణ నాయకులు కె.శివకుమార్.. బద్వేలు, జూలై 29:జిల్లావ్యాప్తంగా కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేయాలని, ఈనెల 30న కలెక్టరేట్ ఎదుట నిర్వహించే ఆందోళన జయప్రదం చేయాలని, షెడ్యూల్ ఎంప్లాయిస్ కి వేతనాలు రివైజ్ చేయాలని సిఐటియు పట్టణ నాయకులు కె.శివకుమార్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మంగళవారం రోజుననాలుగు రోడ్ల సెంటర్లో గల సిఐటియు పట్టణ కార్యాలయము నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసంఘటిత, సంఘటిత కార్మికులు జిల్లా వ్యాప్తంగా రెండు నుంచి ఐదు లక్షల మంది ఉన్నారని పేర్కొన్నారు. ఆప్కాస్ లో 25 వేల మంది, మున్సిపల్, విద్యుత్, విద్య, వైద్యము స్కీం వర్కర్లు, అంగన్వాడి, ఆశ, మధ్యాహ్నం భోజనం, వివో ఏలు, పెట్రోల్ బంకులు, షాపింగ్ మాల్స్, టీచింగ్, నాన్ టీచింగ్, ఆసుపత్రులలో శానిటేషన్, నర్సులు, డిక్షన్ కంపెనీలో 2,500 మంది, షిరిడి సాయి లో దాదాపు 7వేల మంది కార్మికులు పనిచేస్తున్నారని తెలిపారు. వీరికి కలెక్టర్ నిర్ణయించిన ప్రకారం కనీస వేతనం అమలు కావడం లేదని చెప్పారు. ప్రభుత్వ శాఖల్లో ఆప్కాస్ లేకుండా ఏ శాఖ లేదని పేర్కొన్నారు. ఎక్కువ పని చేయించుకుంటూ తక్కువ వేతనాలు ఇస్తున్నారని విమర్శించారు. గ్రాడ్యుటి, పెన్షన్ లేదని తెలిపారు.పంజాబ్ తరహాలో జిల్లాలోని కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. లక్షలాదిమంది కార్మికులు, ఉద్యోగులు కనీస వేతనాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. గ్రామపంచాయతీ, త్రిబుల్ ఐటీ, వై వీ యూ, ఆర్కిటెక్, వెటర్నటి యూనివర్సిటీ, ఏపీ కార్లు, ప్రభుత్వ మెడికల్ కళాశాలలో పనిచేస్తున్న కార్మికుల పరిస్థితి ఆగమ్యగోచరంగా ఉందని తెలిపారు. ఎస్సీ, ఎస్ టి, బి సి, మైనార్టీ హాస్టల్స్, గురుకుల పాఠశాలలు, సెక్యూరిటీ,శానిటేషన్, వాచ్మెన్ ల పరిస్థితి అధ్వానంగా ఉందని చెప్పారు. ఆర్టీసీ డిపోలలో పనిచేస్తున్న శానిటేషన్, సెక్యూరిటీ, స్లీపింగ్, అటెండర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్ల కు అతి తక్కువ వేతనాలు ఇస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కె.శ్రీనివాసులు, గంపా సుబ్బరాయుడు, సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు.1
- సమాజంలో అవినీతి పెరిగిపోయింది:ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరద సమాజంలో అవినీతి పెరిగిపోయిందని.. ప్రజల్లో చైతన్యం రావాలని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజల రెడ్డి పిలుపునిచ్చారు. కొంతమంది అధికారులు లంచాన్ని హక్కుగా భావిస్తున్నారు. డబ్బులు ఇవ్వందే ఏపని చేయడం లేదు. నూటికి 95 మంది లంచాలు తీసుకుంటున్నారు. ఏసీబీ అధికారులు ఎక్కడ.. ఈ లంచాలు కనబడటం లేదా.. ఏసీబీ కూడా లంచాలకు అలవాటు పడింది అంటూ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు.1
- ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి గా కేంద్రం నిధులు రాష్ట్రానికి రావడానికి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో ముఖ్యపాత్ర పోసిస్తున్న.. మన ధర్మవరం అసెంబ్లీ శాసనసభ్యులు ప్రజా నాయకుడు శ్రీ సత్యకుమార్ అన్నగారికి పోరాటపటిమను మీడియా ముఖంగా ప్రజలకు వివరించిన బీజేపి రాష్ట్ర అధికార ప్రతినిధి & బీజేపి SIR రాయలసీమ జోనల్ ఇంచార్జ్ ( జల్లి మధుసూదన్ గారు)1
- అందరికీ నమస్కారం అండీ . ఈ పోస్టర్ని గవర్నమెంట్ చేరేంతవరకు షేర్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్1
- నందికొట్కూరు పట్టణంలోని జగనన్న కాలనీ వద్ద బస్సులు నిలపాలి నందికొట్కూరులోని జగనన్న కాలనీ వద్ద ఆర్టీసీ బస్సులు నిలపాలని CPM నాయకుడు నాగేశ్వరరావు కోరారు. కాలనీవాసులు గ్రామాలకు వెళ్లేందుకు బస్ స్టాప్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రస్తుత డిపో మేనేజర్ సానుకూలంగా స్పందించి స్థలాన్ని పరిశీలించి అనుమతించడంతో బుధవారం అక్కడ ఆర్టీసీ రిక్వెస్ట్ బోర్డు ఏర్పాటు చేసినట్లు వివరించారు.1
- వెంకన్నపాళెంలో అభాసుపాలైన 'స్వచ్ఛ పథం'.. చెత్తను తరలించాల్సింది పోయి తగలబెట్టేసారు! బద్వేలు/నెల్లూరు , జులై 29: గ్రామాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు ప్రతి బుధవారం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 'స్వచ్ఛ పథం' కార్యక్రమం కోట మండలం వెంకన్నపాళెం పంచాయతీ పరిధిలో బుధవారం నాడు పూర్తిగా అభాసుపాలైంది. గ్రామ పారిశుద్ధ్యంలో బుధవారాన్ని అత్యంత కీలకమైన రోజుగా నిర్ణయించి ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా రోడ్ల వెంబడి పేరుకుపోయిన చెత్తను సమీపంలోని సంపద తయారీ కేంద్రాలకు లేదా దూర ప్రాంతాలకు తరలించాల్సి ఉంటుంది. చెత్త నుంచి సంపదను సృష్టించే క్రమంలో భాగంగా తడి చెత్త, పొడి చెత్తను వేరు చేయాల్సి ఉంది.అయితే, బుధవారం సాయంత్రం సచివాలయం కార్యాలయ పనివేళల్లోనే మూడు మండలాలకు ప్రధాన రహదారి అయిన గూడూరు-దుగరాజపట్నం మెయిన్ రోడ్డు మార్గం పక్కనే, వెంకన్నపాలెం పంచాయతీ పరిధిలోని ఒక రైస్ మిల్ సమీపంలో సుమారు 50 మీటర్ల మేర పేరుకుపోయిన చెత్తను తరలించకుండా, శుభ్రం చేయకుండా అక్కడికక్కడే తగలబెట్టేశారు. దీంతో రహదారి పొడవునా గంటల తరబడి దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఫలితంగా ఎదురుగా వచ్చే వాహనాలు కనబడక వాహనదారులు, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఈ పొగ మంచులా అలుముకోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.ఈ మంటల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు, ఇతర హానికరమైన పదార్థాలు కాలిపోవడంతో ప్రమాదకరమైన రసాయనాలు గాలిలో కలిసిపోయాయి. దీనివల్ల స్థానికులు, ప్రయాణికులు తీవ్రమైన రోగాల బారిన పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఒకవైపు మండలంలోని వివిధ గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు స్వచ్ఛ పథం కార్యక్రమంలో నిమగ్నమై గ్రామాలను శుభ్రపరుస్తుంటే, వెంకన్నపాళెంలో మాత్రం ఇలా బాధ్యతారాహిత్యంగా చెత్తను తగలబెట్టడంపై ప్రజలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ సంఘటనపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు బలంగా డిమాండ్ చేస్తున్నారు.1
- ఫైనాన్స్ వేధింపులు భరించలేక కుటుంబం ఆత్మహత్య ప్రయత్నం. ముగ్గురు పరిస్థితి సీరియస్ నందికొట్కూరు మండలంలోని మల్లెల గ్రామానికి చెందిన రామసుబ్బయ్య మాధవి అనే దంపతులు కూతురు జయ తేజ అక్షయ పిల్లలు ఫైనాన్సు అప్పులు వేధింపులు తాళా లేక పాములపాడు మండల పరిధిలో ఆత్మహత్య ప్రయత్నం చేశారు. ఈ విషయం తెలుసుకున్న పాములపాడు పోలీసులు వెంటనే చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకున్నారు. కూతురు జయతేజ తప్ప ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని బంధువులు తెలిపారు.1