Shuru
Apke Nagar Ki App…
ఎనుమాముల మార్కెట్లో మిర్చి వ్యాపారి పరార్ — రైతులకు రూ.2.60 కోట్ల చెల్లింపులు నిలిచిపోవడం వరంగల్: వరంగల్ నగరంలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మరో మిర్చి వ్యాపారి రైతులను మోసం చేసి పరారైన ఘటన వెలుగులోకి వచ్చింది. శ్రీవిద్య చిల్లీస్ ట్రేడర్స్ అధినేత అయిలయ్య అలియాస్ అరుణ్ 62 మంది రైతుల వద్ద నుంచి రూ.2.60 కోట్ల విలువైన మిర్చి కొనుగోలు చేసి డబ్బులు చెల్లించకుండా పరారైనట్లు ఆరోపణలు ఉన్నాయి.దీంతో రైతులకు చెల్లింపులు నిలిచిపోయాయి. బాధితులు చాంబర్ ఆఫ్ కామర్స్‌ను ఆశ్రయించగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
M D Azizuddin
ఎనుమాముల మార్కెట్లో మిర్చి వ్యాపారి పరార్ — రైతులకు రూ.2.60 కోట్ల చెల్లింపులు నిలిచిపోవడం వరంగల్: వరంగల్ నగరంలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మరో మిర్చి వ్యాపారి రైతులను మోసం చేసి పరారైన ఘటన వెలుగులోకి వచ్చింది. శ్రీవిద్య చిల్లీస్ ట్రేడర్స్ అధినేత అయిలయ్య అలియాస్ అరుణ్ 62 మంది రైతుల వద్ద నుంచి రూ.2.60 కోట్ల విలువైన మిర్చి కొనుగోలు చేసి డబ్బులు చెల్లించకుండా పరారైనట్లు ఆరోపణలు ఉన్నాయి.దీంతో రైతులకు చెల్లింపులు నిలిచిపోయాయి. బాధితులు చాంబర్ ఆఫ్ కామర్స్‌ను ఆశ్రయించగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
More news from తెలంగాణ and nearby areas
- పోలీసుల అదుపులో కరీంనగర్ జ్యువెలరీ షాప్ దొంగలు.. బెంగాల్ లో కొంత గోల్డ్ రికవరీ.. త్వరలో అరెస్టు చూపే అవకాశం రాజకీయంగా దుమారం రేపిన కరీంనగర్ లో పిఎంజే జ్యువెలరీ షాప్ లో భారీ చోరీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. అంతరాష్ట్ర బీహార్ కు చెందిన ముఠాలోని ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురు కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. ముఠా సభ్యులు ఇద్దరితో పాటు గోల్డ్ కొనుగోలు చేసిన పశ్చిమ బెంగాల్ కు చెందిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని కొంత బంగారాన్ని రికవరీ చేశారు. పరారీలో ఉన్న ముగ్గురి కోసం మూడు రాష్ట్రాల్లో పోలీసుల వేట కొనసాగుతుంది. పోలీసులకు చిక్కకుండా పగడ్బందీ వ్యూహంతో పారిపోయిన దొంగలు, పలుచోట్ల సిసి కెమెరాకు చిక్కడం ధర్మపురిలో బైక్, బుగ్గారం శివారులో మొబైల్ ఫోన్ పడేసి పోవడంతో పోలీసులకు కీలక ఆధారం లభించినట్లైంది. ప్రధాన నిందితుడు రెండురోజుల కిందట పోలీసులకు చిక్కినట్లు సమాచారం. అతడిచ్చిన సమాచారంతో మరో నిందితుడు చిక్కగా పీఎంజేలో దోచుకున్న బంగారు ఆభరణాలలో కొంత పశ్చిమబెంగాల్ లో విక్రయించినట్లు నిర్థారించి రికవరీ చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ముగ్గురి కోసం మూడు రాష్ట్రాల్లో కరీంనగర్ తో పాటు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు 16 బృందాలుగా విడిపోయి గాలింపు కొనసాగిస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో జ్యువెల్లరీ షాప్ చోరీ నిందితుల అరెస్టు చూపించే అవకాశం ఉంది.1
- నల్గొండ జిల్లాలోని కొత్తపల్లి గ్రామం మీదుగా వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న కనిపించని స్పీడ్ బ్రేకర్లు వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. రాత్రి వేళల్లో ఇవి అస్సలు కనిపించక అనేక ప్రమాదాలకు కారణమవుతున్నాయి. అధికారులు వెంటనే మార్కింగ్ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.1
- కరీంనగర్‌లో తెలంగాణ ప్రజానాట్య మండలి కళాకారుల శిక్షణ శిబిరం ముగిసింది. మే 25, 26 తేదీలలో హైదరాబాద్‌లో జరిగే రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె నర్సింహ పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని కళాకారులకు ఉపాధి అవకాశాలు, గుర్తింపు కార్డులు, పెన్షన్లు ఇవ్వాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు.2
- నల్గొండ జిల్లా తిప్పర్తిలో ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ కస్టమర్లను మోసం చేస్తుందని ఆరోపిస్తూ వినియోగదారులు ఆందోళన చేపట్టారు. గత రెండు నెలలుగా గ్యాస్ బుక్ చేసుకున్న వారికి సరఫరా చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీపీఎం నేతలు తెలిపారు. బుక్ చేసుకున్న ప్రతి ఒక్కరికీ వెంటనే సిలిండర్ అందించాలని డిమాండ్ చేశారు.1
- ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో బస్తాల కొరతతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 22 లక్షల బస్తాలకు బదులుగా కేవలం 5 లక్షలు మాత్రమే అందడంతో కాంట్రాక్టర్ల నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ అన్నదాతలు ఆందోళనకు దిగారు.1
- టీవీకే అధినేత విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఆయన హాజరు జాతీయ స్థాయిలో ఈ కార్యక్రమానికి ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది.1
- ఎనుమాముల మార్కెట్లో మిర్చి వ్యాపారి పరార్ — రైతులకు రూ.2.60 కోట్ల చెల్లింపులు నిలిచిపోవడం వరంగల్: వరంగల్ నగరంలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మరో మిర్చి వ్యాపారి రైతులను మోసం చేసి పరారైన ఘటన వెలుగులోకి వచ్చింది. శ్రీవిద్య చిల్లీస్ ట్రేడర్స్ అధినేత అయిలయ్య అలియాస్ అరుణ్ 62 మంది రైతుల వద్ద నుంచి రూ.2.60 కోట్ల విలువైన మిర్చి కొనుగోలు చేసి డబ్బులు చెల్లించకుండా పరారైనట్లు ఆరోపణలు ఉన్నాయి.దీంతో రైతులకు చెల్లింపులు నిలిచిపోయాయి. బాధితులు చాంబర్ ఆఫ్ కామర్స్‌ను ఆశ్రయించగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.1
- తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో పది రోజుల క్రితం అదృశ్యమైన యువకుడు జూల వంశీ మృతదేహం ఎక్లాస్ పూర్ వద్ద లభ్యమైంది. దీనిని హత్యగా అనుమానిస్తూ పోలీసుల నిర్లక్ష్యంపై కుటుంబ సభ్యులు, బంధువులు రోడ్డుపై ఆందోళనకు దిగారు. పోలీసులు ముగ్గురు నిందితులను గుర్తించి, కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు.1
- తెలంగాణలోని పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన సభ 'జై శ్రీరాం' నినాదాలతో హోరెత్తింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రసంగం కాంగ్రెస్, బీఆర్ఎస్ గుండెల్లో రాళ్లు పడేలా చేసిందని అనడంతో కార్యకర్తలు ఉత్సాహంగా స్పందించారు. తాను ధర్మం కోసం పనిచేసే మోదీ సైనికుడిని అని చెప్పి వారిని మరింత ఆకట్టుకున్నారు.1