అల్లూరి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేయనున్న ప్రధాని మోదీ ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన షెడ్యూల్ ఇలా.. ఉదయం 10:45 గంటలకు: దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో నేరుగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. 10:45 - 10:50: విమానాశ్రయంలో ప్రధానికి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు మరియు ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలుకుతారు. 10:50 - 10:55: ఎయిర్‌పోర్ట్ రన్‌వే నుంచి కారులో ప్రయాణికుల టెర్మినల్ భవనానికి చేరుకుంటారు. 10:55 - 10:58: టెర్మినల్ వద్ద 200 మంది విద్యార్థులు ప్రదర్శించే కూచిపూడి నృత్య రూపకంతో ప్రధానికి స్వాగతం పలకనున్నారు. 11:00 - 11:15: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం రికార్డు సమయంలో పూర్తి చేసుకున్న నిర్మాణాలు, అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులను ప్రధాని స్వయంగా పరిశీలిస్తారు. 11:17 - 11:25: టెర్మినల్ భవనం నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఓపెన్‌టాప్ జీప్‌లో ప్రజలకు అభివాదం చేస్తూ బహిరంగ సభా వేదిక వద్దకు చేరుకుంటారు. 11:30 - 12:55: విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేస్తూ అధికారికంగా ప్రారంభించనున్నారు. అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించి, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రధాని ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 1:05 - 1:10: కార్యక్రమం పూర్తయిన అనంతరం భోగాపురం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు. భారీ భద్రత.. సర్వం సిద్ధం! ప్రధాని మోదీ రాక సందర్భంగా భోగాపురం పరిసర ప్రాంతాల్లో మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఈ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో పాటు కేంద్ర విమానయాన శాఖ మంత్రి, పలువురు ముఖ్య నాయకులు పాల్గొననున్నారు. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ ప్రారంభంతో ఉత్తరాంధ్ర పరిశ్రమలు, పర్యాటకం, ఉపాధి రంగాల్లో సరికొత్త విప్లవం రాబోతోందని అధికార యంత్రాంగం వ్యక్తం చేస్తోంది.
అల్లూరి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేయనున్న ప్రధాని మోదీ ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన షెడ్యూల్ ఇలా.. ఉదయం 10:45 గంటలకు: దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో నేరుగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. 10:45 - 10:50: విమానాశ్రయంలో ప్రధానికి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు మరియు ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలుకుతారు. 10:50 - 10:55: ఎయిర్‌పోర్ట్ రన్‌వే నుంచి కారులో ప్రయాణికుల టెర్మినల్ భవనానికి చేరుకుంటారు. 10:55 - 10:58: టెర్మినల్ వద్ద 200 మంది విద్యార్థులు ప్రదర్శించే కూచిపూడి నృత్య రూపకంతో ప్రధానికి స్వాగతం పలకనున్నారు. 11:00 - 11:15: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం రికార్డు సమయంలో పూర్తి చేసుకున్న నిర్మాణాలు, అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులను ప్రధాని స్వయంగా పరిశీలిస్తారు. 11:17 - 11:25: టెర్మినల్ భవనం నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు
చేసిన ఓపెన్‌టాప్ జీప్‌లో ప్రజలకు అభివాదం చేస్తూ బహిరంగ సభా వేదిక వద్దకు చేరుకుంటారు. 11:30 - 12:55: విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేస్తూ అధికారికంగా ప్రారంభించనున్నారు. అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించి, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రధాని ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 1:05 - 1:10: కార్యక్రమం పూర్తయిన అనంతరం భోగాపురం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు. భారీ భద్రత.. సర్వం సిద్ధం! ప్రధాని మోదీ రాక సందర్భంగా భోగాపురం పరిసర ప్రాంతాల్లో మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఈ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో పాటు కేంద్ర విమానయాన శాఖ మంత్రి, పలువురు ముఖ్య నాయకులు పాల్గొననున్నారు. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ ప్రారంభంతో ఉత్తరాంధ్ర పరిశ్రమలు, పర్యాటకం, ఉపాధి రంగాల్లో సరికొత్త విప్లవం రాబోతోందని అధికార యంత్రాంగం వ్యక్తం చేస్తోంది.
- నెల్లిమర్ల నగరం నుండి 18 బస్సులలో భోగాపురానికి ప్రజలు ఉత్సాహంగా .. నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలో ప్రజలు శనివారం ఉదయం 18 బస్సులలో బోగాపురం ఎయిర్పోర్ట్ కు ఉత్సాహంగా బయలుదేరారు. నగర కమిషనర్ కిల్లాన అప్పలరాజు ఆధ్వర్యంలో సచివాలయ సిబ్బంది సహకారంతో నగర ప్రజలను బస్సులలో ఎక్కించి తీసుకు వెళ్లడం జరుగుతుందని కమిషనర్ తెలిపారు. విజయనగరం జిల్లాకి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయo ప్రారంభోత్సవం కాబోతుండటంతోనే ప్రజలు ఆనందంగా బయలుదేరుతున్నామని అన్నారు.1
- గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకున్న థింసా నృత్యం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం దేశం లోనే అత్యధికంగా 13వేల మంది గిరిజన బాలికలతో ప్రదర్శించిన థింసా నృత్యం గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదయ్యింది. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ ప్రతినిధులు ప్రత్యక్షంగా థింసా నృత్యాన్ని తిలకించి సంతృప్తినీ వ్యక్తం చేశారు. అనంతరం వరల్డ్ రికార్డ్స్ కు సంబంధించిన సర్టిఫికెట్ ను గిరిజన సంక్షేమ శాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కి అందజేశారు. ఉత్తరాంధ్ర సంస్కృతి, సాంప్రదాయాల విశిష్టతను ప్రపంచానికి చాటిచెప్పేలా ఈ వేడుకను ఘనంగా నిర్వహించారు. 13,000 మంది పైబడి గిరిజన మహిళలు మరియు విద్యార్థినులు ఏకకాలంలో సంప్రదాయ థింసా నృత్యాన్ని ప్రదర్శించారు.1
- లక్కవరపుకోట కేజీబీవీ పాఠశాలను పరిశీలించిన ఎమ్మెల్సీ ఇందుకూరి రఘు రాజు విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాన్ని విజయనగరం స్థానిక సంస్థల శాసనమండలి సభ్యులు ఇందుకూరి రఘురాజు శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని పలు విభాగాలను తనిఖీ చేసిన ఆయన, విద్యార్థినుల విద్యా ప్రమాణాలు, వసతులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులను ఉద్దేశించి ఎమ్మెల్సీ మాట్లాడుతూ, విద్యావ్యవస్థ బలోపేతమైతేనే సుదృఢమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని ఉద్ఘాటించారు. విద్య అనేది కేవలం అక్షరాస్యతకే పరిమితం కాకూడదని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పెంపొందించేలా ఉండాలని స్పష్టం చేశారు. విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైనదని, వారిలో ప్రాక్టికల్ పరిజ్ఞానాన్ని పెంపొందించే దిశగా బోధన సాగాలని ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. పాఠశాల విద్యార్థినులలో మానసిక ఒత్తిడిని తగ్గించి, ఏకాగ్రతను పెంచేందుకు యోగా, ధ్యానం లను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. విద్యార్థులలో పరిశీలనా శక్తి, ఏకాగ్రత స్థాయిలను అంచనా వేసేందుకు ఆయన వారితో స్వయంగా కొన్ని మానసిక వికాస వ్యాయామాలు చేయించారు. అంకెలను వెనుక నుండి క్రమబద్ధంగా చెప్పడం వంటి సరళమైన పద్ధతుల ద్వారా జ్ఞాపకశక్తిని, దృష్టిని ఏ విధంగా కేంద్రీకరించవచ్చో ప్రత్యక్షంగా వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.3
- *ఇంస్టాగ్రామ్ లొ ఫేక్ ఐడి తో ఇబ్బంది పెడుతున్న యువకులు. తగరపువలసకు చెందిన సీశెట్టి రాజేశ్వరి అను ఆమె చిన్న చిన్న కూలి పనులు చేసుకుంటూ సోషల్ మీడియా ఇంస్టాగ్రామ్ లో వీడియోస్ చేస్తూ ఉంటుంది. ఈ మధ్య చేసిన ఒక వీడియో కింద ఎవరో ఒక వ్యక్తి ఫేక్ ఐడి క్రియేట్ చేసి అసభ్య కామెంట్లు పెడుతుండడంతో ఆమె మనస్థాపం చెంది ఆత్మహత్యయత్నానికి పాల్పద్దానికి ప్రయత్నించింది, ఇంతలో వాళ్ళ అక్క వద్దని చెప్పడం తో వొద్దు అనుకున్నది, అందువల్ల ఏ హాస్పిటల్ లో జాయిన్ అవ్వలేదు, పోలీస్ స్టేషన్ కి వెళ్ళ లేదు. ఈరోజు ఈ విషయం గురించి పేపర్లో వార్త రావడంతో విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనర్ గారు స్పందించి భీమిలి సీఐ దివాకర్ గారికి చెప్పగా, భీమిలి సి. ఐ దివాకర్ గారు వారి సిబ్బంది మహిళా హెడ్ కానిస్టేబుల్ తో కలిసి సదరు సీశెట్టి రాజేశ్వరి గారి దగ్గరికి వెళ్లి జరిగిన విషయం తెలుసుకుని ఎందు కైనా మంచిది అని హాస్పిటల్ కి తీసుకుని వెళ్లి, చికిత్స చేయించి భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని ధైర్యం చెప్పినారు మరియు ఫేక్ ఐడి తో బ్యాడ్ కామెంట్స్ పెడుతున్న ఆ వ్యక్తి గురించి సైబర్ క్రైమ్ పోలీసు వారికి కూడా తెలియపరచడం అయినది. భవిష్యత్తులో బీమిలి పోలీస్ లు అండగా ఉంటారు అనే నమ్మకం తో గౌరవ సీపీ గారికి కృతఙ్ఞతలు తెలియ చేయడమైనది.1
- రాజాం:రాజాం లో ప్రభుత్వ కార్యాలయలో విద్యుత్ దీపాలంకరణ.. భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా రాజాం ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్ దీపాలంకరణలతో కళకళలాడుతున్నాయి. ప్రధాన రహదారి పై ఉన్న పురపాలక సంఘం, సబ్ రిజిస్టర్ కార్యాలయాలు కాంతుల విసిరితున్నాయి. దీపాలు చూసిన ప్రయాణికులు నిత్యం ఇలానే ఉంటే బాగుంటుదని అభిప్రాయపడుతున్నారు.1
- సిమెంట్ కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలి - భారత కమ్యూనిస్టు పార్టీ గత ప్రభుత్వ హయాంలో జగనన్న లేఅవుట్ లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వటంతో అనేకమంది పేదలు డబ్బులు లేక కట్టుకోలేకపోయారు. కొంతమంది పునాదులు వేసి సగంలో ఆపేశారు.కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత హౌసింగ్ స్కీమును పెంపుదల చేసి లబ్ధిదారులుతో గృహ నిర్మాణం చేపట్టుటకు చర్యలు చేపట్టినప్పటికీ వాస్తవ లబ్ధిదారులకు తెలియకుండా పాలకొండలో ఉన్న హౌసింగ్ ఏఈ గారు 56 మందికి మనిషి ఒక్కటికి 10 సిమెంట్ బస్తాలు ఇచ్చినట్లు రికార్డ్ చేసి పక్కదారి పట్టించడంతో సమస్య అధికారుల మధ్య జరిగిన అంతర్గత చర్చల్లో మీడియా ద్వారా బయటికి వచ్చింది. కొంతమంది లబ్ధిదారులు జరిగిన మోసాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ(సిపిఐ) పాలకొండ నియోజకవర్గం కార్యదర్శి బుడితి అప్పలనాయుడు దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించి కోరాడ వీధిలో ఉన్న సచివాలయం వద్ద హౌసింగ్ ఈఈ గారి సమక్షంలో జరుగుతున్న విచారణ వద్దకు చేరుకొని మోసపోయిన లబ్ధిదారుల నుండి వివరాలను అప్పలనాయుడు అడిగి సేకరించ్చారు.విచారణ చేస్తున్న సంబంధిత ఈ ఈ గారి వద్ద ప్రస్తావించగా ఇప్పటికీ 15 మంది వరకు విచారణ చేశామని పూర్తి విచారణ జరిపి పై అధికారుల దృష్టికి తీసుకువస్తానని హామీ ఇచ్చారు.దీనిపైఅప్పలనాయుడు మాట్లాడుతూ సమగ్ర విచారణ జరిపి సంభిందిత హౌసింగ్ ఉద్యోగపై చర్యలు చేపట్టాలని అప్పలనాయుడు డిమాండ్ చేశారు లబ్ధిదారులకు న్యాయం చేయాలని ఆయన కోరారు.1
- మన భోగాపురంలో ఎయిర్ పోర్ట్ ఈరోజు స్టార్ట్ అవుతుంది..... మన భోగాపురంలో ఎయిర్ పోర్ట్ ఈరోజు ఓపెన్ అవుతుంది దానికోసం చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ అందరూ కూడా వస్తున్నారు. అక్కడి స్థలం ఇచ్చిన వాళ్ళకి ఫ్రీగా విమానం ఎక్కించి విహారయాత్ర చేపిస్తున్నారు అక్కడున్న జనాలందరూ చాలా హ్యాపీగా ఉంటారు ఎప్పుడు ఎక్కడ వాళ్ళు ఒక్కసారి ఎత్తితే ఎంత సంతోష ఇస్తారు1
- *బస్సు ఢీకొని జింక మృతి.. రక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్* మధురవాడ: మధురవాడ జూ పార్క్ సమీపంలోని జాతీయ రహదారిపై శుక్రవారం విషాద ఘటన చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు ఢీకొనడంతో ఓ జింక తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల సమాచారం మేరకు, కంబాలకొండ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో తగిన రక్షణ కంచెలు లేకపోవడం, అడవుల విస్తీర్ణం తగ్గడం, నీటి కొరత వంటి కారణాలతో వన్యప్రాణులు తరచూ ఆహారం, నీటి కోసం జాతీయ రహదారిపైకి వస్తున్నాయని తెలిపారు. దీంతో తరచూ రోడ్డు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నాయని పేర్కొన్నారు. ప్రతి నెలా రెండు నుంచి మూడు జింకలు ఇలాంటి ప్రమాదాల్లో మృతి చెందుతున్నప్పటికీ అటవీ శాఖ, జూ పార్క్ అధికారులు తగిన నివారణ చర్యలు చేపట్టడం లేదని జంతు ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేశారు. వన్యప్రాణుల సంరక్షణ కోసం రహదారి వెంట రక్షణ కంచెలు ఏర్పాటు చేయడం, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం, అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని వారు ప్రభుత్వాన్ని, సంబంధిత అధికారులను కోరారు.1