logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

బీజేపీ వరంగల్ జిల్లా కార్యదర్శిగా పోనగోటి వెంకట్ రావు నియామకం బీజేపీ పార్టీ వరంగల్ జిల్లా కార్యదర్శిగా మడికొండకు చెందిన పోనగోటి వెంకట్ రావు నియమితులయ్యారు. జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా వెంకట్ రావు మాట్లాడుతూ.. గత 13 ఏళ్లుగా పార్టీ బలోపేతానికి తాను చేస్తున్న కృషిని గుర్తించి ఈ బాధ్యత అప్పగించిన రాష్ట్ర, జిల్లా నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు. పార్టీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం శ్రమిస్తానని ఆయన పేర్కొన్నారు.

3 hrs ago
user_Public Reporter Gaddam Kiran
Public Reporter Gaddam Kiran
ఖాజీపేట, హనుమకొండ, తెలంగాణ•
3 hrs ago
5eff54b0-fcfe-462b-9395-e34da401eaa3

బీజేపీ వరంగల్ జిల్లా కార్యదర్శిగా పోనగోటి వెంకట్ రావు నియామకం బీజేపీ పార్టీ వరంగల్ జిల్లా కార్యదర్శిగా మడికొండకు చెందిన పోనగోటి వెంకట్ రావు నియమితులయ్యారు. జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా వెంకట్ రావు మాట్లాడుతూ.. గత 13 ఏళ్లుగా పార్టీ బలోపేతానికి తాను చేస్తున్న కృషిని గుర్తించి ఈ బాధ్యత అప్పగించిన రాష్ట్ర, జిల్లా నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు. పార్టీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం శ్రమిస్తానని ఆయన పేర్కొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణంలో మాదిగ సమాజం ఐక్యతపై ఎంఆర్పీఎస్ నాయకులు కీలక వ్యాఖ్యలు చేశారు. మాస్ రాష్ట్ర అధ్యక్షులు జన్ను రాములు మాదిగ, ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకుడు మారుపట్ల అంజయ్య మాదిగ, రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యుడు ఈరెల్లి శ్రీనివాస్ మాదిగ మాట్లాడుతూ, రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన మాదిగలు ఒక్కతాటిపై వస్తే రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి పీఠం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
    1
    వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణంలో మాదిగ సమాజం ఐక్యతపై ఎంఆర్పీఎస్ నాయకులు కీలక వ్యాఖ్యలు చేశారు. మాస్ రాష్ట్ర అధ్యక్షులు జన్ను రాములు మాదిగ, ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకుడు మారుపట్ల అంజయ్య మాదిగ, రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యుడు ఈరెల్లి శ్రీనివాస్ మాదిగ మాట్లాడుతూ, రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన మాదిగలు ఒక్కతాటిపై వస్తే రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి పీఠం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    2 hrs ago
  • ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కార్మికులు లేవనెత్తిన అన్ని అంశాలను పరిశీలించడానికి నలుగురు అధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, తాను ప్రభుత్వంతో చర్చించి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎలాంటి బేషజాలకు వెళ్లకుండా అధికారుల కమిటీకి సమస్యలు విన్నవించాలని.. ఆ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
    1
    ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కార్మికులు లేవనెత్తిన అన్ని అంశాలను పరిశీలించడానికి నలుగురు అధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, తాను ప్రభుత్వంతో చర్చించి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎలాంటి బేషజాలకు వెళ్లకుండా అధికారుల కమిటీకి సమస్యలు విన్నవించాలని.. ఆ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
    user_వేణు విలేకరి
    వేణు విలేకరి
    హుస్నాబాద్, సిద్దిపేట, తెలంగాణ•
    5 hrs ago
  • IIT-JEE (MAIN) 2026 ఫలితాలలో అల్ఫోర్స్ విద్యార్థులు వివిధ క్యాటగిరీలలో జాతీయస్థాయి అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. ఎం.శ్రీపార్టీష్ 29 వ ర్యాంకుతో అత్యున్నత స్థానంలో నిలువగా, సి.హెచ్. లక్ష్మీహాసిని 116 వ ర్యాంకు, సి.హెచ్.పూర్ణచంద్ 138, ఎస్.వర్జినిరెడ్డి 211, ఎన్.రత్నప్రకాశ్ 239, పి.అక్షయ 250, ఎ.కీర్తన 274, యు.సిద్దీశ్వర్ 459, కె. ధనుష్ 556, కె.నచికేత్ 593, బి. లిఖిత్సాయి 737, యమ్.వశిష్ట 884, కె. ప్రజ్ఞాన్ 991, రెడ్డి శ్రీకర్ 1000 వ ర్యాంకులు సాధించి అల్ఫోర్స్ కీర్తీని మరింత ఇనుమడింపజేశారని అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మెన్ డా. వి.నరేందర్ రెడ్డి తెలిపారు. విద్యార్థులను పేరెంట్స్ తోపాటు అధ్యాపకులు అభినందించారు. 1000 లోపు 14 ర్యాంకులు, 2000 లోపు 18 ర్యాంకులు, 5000 లోపు 35 ర్యాంకులు సాధించగా, 450 మంది విద్యార్థులు IIT (Adv) పరీక్షకు అర్హత సాధించడం జరిగిందని తెలిపారు. రాబోయే IIT (Adv) పరీక్ష వ్రాయుటకు ఎంపికైన విద్యార్థులకు అత్యుత్తమ అధ్యాపక బృందంచే కోచింగ్ ఇవ్వడం జరుగుతుందని, పటిష్ట ప్రణాళికతో విద్యాభోధన, నిరంతర పర్యవేక్షణ, విద్యార్థుల పట్టుదల అహర్నిషల కృషివల్ల అల్ఫోర్స్ ఇంతటి ఘన విజయం సాధించగలిగిందని నరేందర్ రెడ్డి తెలిపారు. రాబోయే IIT (Adv) పరీక్షలో కూడ అల్ఫోర్స్ విద్యార్థులు అత్యున్నత మార్కులు సాధించి ప్రతిష్టాత్మక IIT లలో సీట్లు సాధిస్తారని విశ్వసిస్తున్నామన్నారు. ప్రతి సంవత్సరం IIT, NEET EAPCET పోటీ పరీక్షలలో అల్ఫోర్స్ విద్యార్థులు రాణిస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. IIT JEE (MAIN) - 2026 ఫలితాలలో జాతీయస్థాయి అత్యున్నత ర్యాంకులు సాధించిన అల్ఫోర్స్ విద్యార్థులను వారి తల్లిదండ్రులను అభినందించారు.
    2
    IIT-JEE (MAIN) 2026 ఫలితాలలో అల్ఫోర్స్ విద్యార్థులు వివిధ క్యాటగిరీలలో జాతీయస్థాయి అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. ఎం.శ్రీపార్టీష్ 29 వ ర్యాంకుతో అత్యున్నత స్థానంలో నిలువగా, సి.హెచ్. లక్ష్మీహాసిని 116 వ ర్యాంకు, సి.హెచ్.పూర్ణచంద్ 138, ఎస్.వర్జినిరెడ్డి 211, ఎన్.రత్నప్రకాశ్ 239, పి.అక్షయ 250, ఎ.కీర్తన 274, యు.సిద్దీశ్వర్ 459, కె. ధనుష్ 556, కె.నచికేత్ 593, బి. లిఖిత్సాయి 737, యమ్.వశిష్ట 884, కె. ప్రజ్ఞాన్ 991, రెడ్డి శ్రీకర్ 1000 వ ర్యాంకులు సాధించి అల్ఫోర్స్ కీర్తీని మరింత ఇనుమడింపజేశారని అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మెన్
డా. వి.నరేందర్ రెడ్డి తెలిపారు. విద్యార్థులను పేరెంట్స్ తోపాటు అధ్యాపకులు అభినందించారు. 1000 లోపు 14 ర్యాంకులు, 2000 లోపు 18 ర్యాంకులు, 5000 లోపు 35 ర్యాంకులు సాధించగా, 450 మంది విద్యార్థులు IIT (Adv) పరీక్షకు అర్హత సాధించడం జరిగిందని తెలిపారు. రాబోయే IIT (Adv) పరీక్ష వ్రాయుటకు ఎంపికైన విద్యార్థులకు అత్యుత్తమ అధ్యాపక బృందంచే కోచింగ్ ఇవ్వడం జరుగుతుందని, పటిష్ట ప్రణాళికతో విద్యాభోధన, నిరంతర పర్యవేక్షణ, విద్యార్థుల పట్టుదల అహర్నిషల కృషివల్ల అల్ఫోర్స్ ఇంతటి ఘన విజయం సాధించగలిగిందని నరేందర్ రెడ్డి తెలిపారు. రాబోయే IIT (Adv) పరీక్షలో కూడ అల్ఫోర్స్ విద్యార్థులు అత్యున్నత మార్కులు సాధించి ప్రతిష్టాత్మక IIT లలో సీట్లు సాధిస్తారని విశ్వసిస్తున్నామన్నారు. ప్రతి సంవత్సరం IIT, NEET EAPCET పోటీ పరీక్షలలో అల్ఫోర్స్ విద్యార్థులు రాణిస్తున్నందుకు  ఆనందంగా ఉందన్నారు. IIT JEE (MAIN) - 2026 ఫలితాలలో జాతీయస్థాయి అత్యున్నత ర్యాంకులు సాధించిన అల్ఫోర్స్ విద్యార్థులను వారి తల్లిదండ్రులను అభినందించారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    19 min ago
  • Post by JADI RAJU
    1
    Post by JADI RAJU
    user_JADI RAJU
    JADI RAJU
    Financial Analyst ఖానాపూర్, వరంగల్, తెలంగాణ•
    9 hrs ago
  • పరిశుభ్రతపై అవగాహనతో యువత ఆరోగ్యవంతమైన సమాజానికి దోహదం చేయాలి *సానిటరీ ప్యాడ్స్ డిస్పోజబుల్ మిషన్స్ డొనేషన్* యూనివర్సిటీ, ప్రతిమ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో “హెల్త్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్ ఆన్ హైజీన్ (ఎంపవరింగ్ హైజీన్)” కార్యక్రమం కరీంనగర్‌లోని శాతవాహన యూనివర్సిటీలో అంబేద్కర్ లైబ్రరీ ఆడిటోరియంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో * ముఖ్యఅతిథిగా ప్రతిమ ఫౌండేషన్ ఫౌండర్& ప్రతిమ గ్రూప్ ఆఫ్ డైరెక్టర్ డాక్టర్ బోయినపల్లి హరిణి * హాజరై సానిటరీ ప్యాడ్స్ డిస్పోజల్ మిషన్స్ డొనేషన్ యూనివర్సిటీకి అందజేశారు. అనంతరం డాక్టర్ హరిణి మాట్లాడుతూ సమాజంలో జెండర్ సమానత్వం పీరియడ్స్ పై మాట్లాడడానికి నిశ్శబ్దం వీడండి ఆడపిలల కి సపోర్ట్ ఇవ్వండి ఎదగడానికి యువత మీ కళలు సాకారం చేసుకోండి అన్నారు * మహిళలు మరియు విద్యార్థుల్లో హైజీన్‌పై అవగాహన పెంపొందించడం అత్యంత అవసరమని అన్నారు. పరిశుభ్రతపై అవగాహనతో యువత ఆరోగ్యవంతమైన సమాజానికి దోహదం చేయాలి అని సూచించారు. నెలసరి సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తూ ఆరోగ్యం, పరిశుభ్రత,ఆత్మవిశ్వాసం పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు.నెలసరి సహజ ప్రక్రియ అని, దీనిపై భయపడాల్సిన అవసరం లేదని,ధైర్యంగా మాట్లాడాలని సూచించారు భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. డాక్టర్ సత్య ప్రభా (హెడ్ ఆఫ్ డిపార్ట్‌మెంట్, గైనకాలజీ) మాట్లాడుతూ, యౌవన దశ నుంచే శానిటరీ హైజీన్‌పై సరైన అవగాహన ఉండటం అత్యంత కీలకమని పేర్కొన్నారు. శానిటరీ ఉత్పత్తులను సక్రమంగా వినియోగించడం ద్వారా గైనకాలజీ సమస్యలను నివారించవచ్చని వివరించారు. ప్రతి మహిళ తన ఆరోగ్యాన్ని ప్రాధాన్యంగా తీసుకోవాలని సూచించారు. డాక్టర్ గీతా రెడ్డి గారు (ప్రొఫెసర్, జనరల్ సర్జరీ & డెర్మటాలజిస్ట్) మాట్లాడుతూ, పరిశుభ్రతలో నిర్లక్ష్యం వల్ల చర్మ సంబంధిత సమస్యలు, ఇన్ఫెక్షన్లు పెరిగే అవకాశముందని సూచించారు. శానిటరీ డిస్పోజల్ మిషన్‌ల వినియోగం ద్వారా పరిసరాలను శుభ్రంగా ఉంచడంతో పాటు వ్యక్తిగత ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చని ఉపయోగించిన శానిటరీ న్యాప్కిన్లను సరైన విధంగా డిస్పోజ్ చేయడం వల్ల పర్యావరణ కాలుష్యం కూడా తగ్గుతుందని అన్నారు. ఈ మిషన్ల వినియోగంపై మహిళలకు అవగాహన కల్పించడం అత్యంత అవసరమని సూచించారు. నెలసరి సమయంలో పాటించాల్సిన పరిశుభ్రత, ఆరోగ్య జాగ్రత్తలు, పోషకాహారం ప్రాముఖ్యతపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. డాక్టర్ ఉమేష్ కుమార్ వైస్ ఛాన్స్లర్ శాతవాహన యూనివర్సిటీ మాట్లాడుతూ మాట్లాడుతూ హెల్త్ పై అవగాహన చేయడం, సాంట్రీ డిస్పోజల్ మిషన్స్ డొనేషన్ చేయడం చాలా గొప్ప విషయం అందుకు ప్రతిమ ఫౌండేషన్ కి ధన్యవాదాలు రాబోయే రోజులలో హెల్త్ క్యాంప్స్ చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ యు. ఉమేశ్ కుమార్ – వైస్ ఛాన్స్లర్, శాతవాహన విశ్వవిద్యాలయం (ముఖ్య అతిథి), ప్రొఫెసర్ పి. సతీష్ కుమార్ – రిజిస్ట్రార్, శాతవాహన విశ్వవిద్యాలయం (ప్రెసిడెంట్) డాక్టర్ బోయినపల్లి హారిణి – ప్రతిమ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు & డైరెక్టర్, ప్రతిమ గ్రూప్స్, డాక్టర్ సత్య ప్రభా – హెడ్ ఆఫ్ డిపార్ట్‌మెంట్ (గైనకాలజీ), ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (కీనోట్ స్పీకర్), డాక్టర్ గీతా రెడ్డి – ప్రొఫెసర్ ఆఫ్ జనరల్ సర్జరీ (డెర్మటాలజిస్ట్), ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, డాక్టర్ నజిముద్దిన్ మున్వార్ – చీఫ్ వార్డెన్, యూనివర్సిటీ హాస్టల్స్, శాతవాహన విశ్వవిద్యాలయం, డాక్టర్ సావిత్రి శాతవాహన యూనివర్సిటీ ప్రతిమ ఫౌండేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
    3
    పరిశుభ్రతపై అవగాహనతో యువత ఆరోగ్యవంతమైన సమాజానికి దోహదం చేయాలి
*సానిటరీ ప్యాడ్స్ డిస్పోజబుల్  మిషన్స్
డొనేషన్* 
యూనివర్సిటీ, ప్రతిమ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో “హెల్త్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్ ఆన్ హైజీన్ (ఎంపవరింగ్ హైజీన్)” కార్యక్రమం కరీంనగర్‌లోని శాతవాహన యూనివర్సిటీలో అంబేద్కర్ లైబ్రరీ ఆడిటోరియంలో నిర్వహించడం జరిగింది. 
ఈ కార్యక్రమంలో *
ముఖ్యఅతిథిగా ప్రతిమ ఫౌండేషన్ ఫౌండర్& ప్రతిమ గ్రూప్ ఆఫ్ డైరెక్టర్ డాక్టర్ బోయినపల్లి హరిణి * హాజరై  సానిటరీ ప్యాడ్స్  డిస్పోజల్ మిషన్స్ డొనేషన్ యూనివర్సిటీకి అందజేశారు.
అనంతరం డాక్టర్ హరిణి మాట్లాడుతూ సమాజంలో
జెండర్ సమానత్వం  
పీరియడ్స్ పై మాట్లాడడానికి నిశ్శబ్దం వీడండి
ఆడపిలల కి సపోర్ట్ ఇవ్వండి ఎదగడానికి 
యువత మీ కళలు సాకారం చేసుకోండి
అన్నారు
* మహిళలు మరియు విద్యార్థుల్లో హైజీన్‌పై అవగాహన పెంపొందించడం అత్యంత అవసరమని అన్నారు. పరిశుభ్రతపై అవగాహనతో యువత ఆరోగ్యవంతమైన సమాజానికి దోహదం చేయాలి అని సూచించారు. నెలసరి సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తూ ఆరోగ్యం, పరిశుభ్రత,ఆత్మవిశ్వాసం పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు.నెలసరి సహజ ప్రక్రియ అని, దీనిపై భయపడాల్సిన అవసరం లేదని,ధైర్యంగా మాట్లాడాలని సూచించారు  భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. 
డాక్టర్ సత్య ప్రభా (హెడ్ ఆఫ్ డిపార్ట్‌మెంట్, గైనకాలజీ) మాట్లాడుతూ, యౌవన దశ నుంచే శానిటరీ హైజీన్‌పై సరైన అవగాహన ఉండటం అత్యంత కీలకమని పేర్కొన్నారు. శానిటరీ ఉత్పత్తులను సక్రమంగా వినియోగించడం ద్వారా గైనకాలజీ సమస్యలను నివారించవచ్చని వివరించారు. ప్రతి మహిళ తన ఆరోగ్యాన్ని ప్రాధాన్యంగా తీసుకోవాలని సూచించారు. డాక్టర్ గీతా రెడ్డి గారు (ప్రొఫెసర్, జనరల్ సర్జరీ & డెర్మటాలజిస్ట్) మాట్లాడుతూ, పరిశుభ్రతలో నిర్లక్ష్యం వల్ల చర్మ సంబంధిత సమస్యలు, ఇన్ఫెక్షన్లు పెరిగే అవకాశముందని సూచించారు.  శానిటరీ డిస్పోజల్ మిషన్‌ల వినియోగం ద్వారా పరిసరాలను శుభ్రంగా ఉంచడంతో పాటు వ్యక్తిగత ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చని ఉపయోగించిన శానిటరీ న్యాప్కిన్లను సరైన విధంగా డిస్పోజ్ చేయడం వల్ల పర్యావరణ కాలుష్యం కూడా తగ్గుతుందని అన్నారు. ఈ మిషన్ల వినియోగంపై మహిళలకు అవగాహన కల్పించడం అత్యంత అవసరమని సూచించారు. నెలసరి సమయంలో పాటించాల్సిన పరిశుభ్రత, ఆరోగ్య జాగ్రత్తలు, పోషకాహారం ప్రాముఖ్యతపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. 
డాక్టర్ ఉమేష్ కుమార్ 
వైస్ ఛాన్స్లర్ శాతవాహన యూనివర్సిటీ మాట్లాడుతూ మాట్లాడుతూ హెల్త్ పై అవగాహన చేయడం, సాంట్రీ డిస్పోజల్ మిషన్స్ డొనేషన్ చేయడం చాలా గొప్ప విషయం అందుకు 
ప్రతిమ ఫౌండేషన్ కి ధన్యవాదాలు రాబోయే రోజులలో హెల్త్ క్యాంప్స్ చేయాలని కోరారు
ఈ కార్యక్రమంలో 
ప్రొఫెసర్ యు. ఉమేశ్ కుమార్ –  వైస్ ఛాన్స్లర్, శాతవాహన విశ్వవిద్యాలయం (ముఖ్య అతిథి), ప్రొఫెసర్ పి. సతీష్ కుమార్ – రిజిస్ట్రార్, శాతవాహన విశ్వవిద్యాలయం (ప్రెసిడెంట్)
డాక్టర్ బోయినపల్లి హారిణి – ప్రతిమ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు & డైరెక్టర్, ప్రతిమ గ్రూప్స్, డాక్టర్ సత్య ప్రభా – హెడ్ ఆఫ్ డిపార్ట్‌మెంట్ (గైనకాలజీ), ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (కీనోట్ స్పీకర్), డాక్టర్ గీతా రెడ్డి – ప్రొఫెసర్ ఆఫ్ జనరల్ సర్జరీ (డెర్మటాలజిస్ట్), ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, 
డాక్టర్ నజిముద్దిన్ మున్వార్ – చీఫ్ వార్డెన్, యూనివర్సిటీ హాస్టల్స్, శాతవాహన విశ్వవిద్యాలయం,
డాక్టర్ సావిత్రి  శాతవాహన యూనివర్సిటీ 
ప్రతిమ ఫౌండేషన్ సిబ్బంది  తదితరులు పాల్గొన్నారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    2 hrs ago
  • మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల గోపాల్ నగర్ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్యూవల్ డే కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ చక్రపాణి ముఖ్య అతిథులుగా హాజరు హాజరయ్యారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి మాట్లాడుతూ గోపాల్ నగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆధ్వర్యంలో విద్యార్థుల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతూ సంస్కృత కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజల్లో ప్రభుత్వ పాఠశాల పట్ల ఆదరణను పెంచేలా ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు పాఠశాల ప్రధానోపాధ్యాయులకు మరియు ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో వివిధ పోటీ పరీక్షల ద్వారా ఉత్తమ ప్రతిభగలవారీగా ప్రభుత్వం చే ఎంపిక చేయబడిన ఉపాధ్యాయులు విద్యా భోధన చేస్తారు కాబట్టి ఉపాధ్యాయులు కచ్చితంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను నేటి పోటీ ప్రపంచంలో ప్రవేట్ పాఠశాలల విద్యార్థులకంటే మెరుగైన విషయ పరిజ్ఞానాన్ని అందించి విద్యార్థులను ఉపాధ్యాయులు జ్ఞానవంతులుగా తీర్చిదిద్దాలని అన్నారు.నేడు ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ద్వారా కూడా విద్యను అందిస్తున్నారు కాబట్టి ప్రజలు ప్రభుత్వ పాఠశాలను తక్కువ భావనతో చూడకుండ ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ లు తీసుకోవాలని అన్నారు.. అనంతరం విద్యార్థుల ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను సంతోషంగా తిలకించారు.ఈ కార్యక్రమంలో గౌరవ అతిథులుగా కౌన్సిలర్ సభ్యులు ఎర్ర వెంకటరాజం కోఆప్షన్ సభ్యులు నంది శంకర్, ఎంఈవో దూసరగుపతి, విద్యాశాఖ క్లస్టర్ ఇంచార్జ్ హెచ్ఎం మోతిలాల్, నెహ్రూ నగర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు గీతా మాధురి, బోప్ప దేవయ్య , ఓజ్జాల అగ్గి రాములు మొదలగువారు పాల్గొన్నారు.
    1
    మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల గోపాల్ నగర్ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్యూవల్ డే కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ చక్రపాణి  ముఖ్య అతిథులుగా హాజరు హాజరయ్యారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి మాట్లాడుతూ గోపాల్ నగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆధ్వర్యంలో విద్యార్థుల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతూ సంస్కృత కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజల్లో ప్రభుత్వ పాఠశాల పట్ల ఆదరణను పెంచేలా ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు పాఠశాల ప్రధానోపాధ్యాయులకు మరియు ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని అన్నారు. 
ప్రభుత్వ పాఠశాలలో వివిధ పోటీ పరీక్షల ద్వారా ఉత్తమ ప్రతిభగలవారీగా ప్రభుత్వం చే ఎంపిక  చేయబడిన ఉపాధ్యాయులు విద్యా భోధన చేస్తారు కాబట్టి ఉపాధ్యాయులు కచ్చితంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను నేటి పోటీ ప్రపంచంలో ప్రవేట్ పాఠశాలల విద్యార్థులకంటే మెరుగైన  విషయ పరిజ్ఞానాన్ని  అందించి విద్యార్థులను ఉపాధ్యాయులు జ్ఞానవంతులుగా తీర్చిదిద్దాలని అన్నారు.నేడు ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ద్వారా కూడా విద్యను అందిస్తున్నారు కాబట్టి ప్రజలు ప్రభుత్వ పాఠశాలను తక్కువ భావనతో చూడకుండ ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ లు తీసుకోవాలని అన్నారు..
అనంతరం విద్యార్థుల ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను సంతోషంగా తిలకించారు.ఈ కార్యక్రమంలో గౌరవ అతిథులుగా కౌన్సిలర్ సభ్యులు ఎర్ర వెంకటరాజం కోఆప్షన్ సభ్యులు నంది శంకర్, ఎంఈవో దూసరగుపతి, విద్యాశాఖ క్లస్టర్ ఇంచార్జ్ హెచ్ఎం మోతిలాల్, నెహ్రూ నగర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు గీతా మాధురి, బోప్ప దేవయ్య , ఓజ్జాల అగ్గి రాములు మొదలగువారు పాల్గొన్నారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    35 min ago
  • Post by Merugu Rajitha
    1
    Post by Merugu Rajitha
    user_Merugu Rajitha
    Merugu Rajitha
    Actor కటారం, జయశంకర్ భూపాలపల్లి, తెలంగాణ•
    14 hrs ago
  • ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. రామచంద్రపురం పంచాయతీ అంకన్నగూడెం సమీప గోదావరి మడుగులో చేపల వేటకు వెళ్లిన కుర్సం నాగేశ్వరరావు (45) ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందినట్లు సమాచారం. సోమవారం సాయంత్రం ఈ ఘటన జరగగా, రాత్రి వరకు గాలించినా మృతదేహం లభించలేదు. మంగళవారం పడవలు, ఈతగాళ్ల సహాయంతో మృతదేహాన్ని వెలికితీశారు.
    1
    ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. రామచంద్రపురం పంచాయతీ అంకన్నగూడెం సమీప గోదావరి మడుగులో చేపల వేటకు వెళ్లిన కుర్సం నాగేశ్వరరావు (45) ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందినట్లు సమాచారం. సోమవారం సాయంత్రం ఈ ఘటన జరగగా, రాత్రి వరకు గాలించినా మృతదేహం లభించలేదు. మంగళవారం పడవలు, ఈతగాళ్ల సహాయంతో మృతదేహాన్ని వెలికితీశారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.