రైతు సమస్యలు పరిష్కరించాలంటూ సిపిఐ ఆధ్వర్యంలో ఆళ్లపల్లి సబ్ స్టేషన్ వద్ద రైతులు ధర్నా .ఆళ్లపల్లి మండలంలో త్రీఫేస్ విద్యుత్ నమ్ముకుని యధావిధిగా రైతులు కిన్నెరసాని వాగు మరియు బోర్ల కింద మొక్కజొన్న మిర్చి తదితర పంటలను సాగు చేసుకోవడం జరిగింది.ఎడాపెడ విధిస్తున్నటువంటి కరెంటు కోతలు మరియు పరిమిత గంటలు, అధిక లో వోల్టేజ్ వలన రైతులు తమ పంటచేనులను ఎండిపోతుండగా కన్నీరు పెట్టుకోవడం తప్ప చేసేదేమీ లేక బుధవారం CPi ఆధ్వర్యంలో సబ్ స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించ మండల రైతులు అనంతరం విద్యుత్ శాఖ అధికారులకు సమస్యలతో కూడిన వెనక పత్రాన్ని అందజేశారు.. ఈ సందర్భంగా జిల్లా కార్యవర్గ సభ్యులు ఎల్లయ్య మాట్లాడుతూ ఒకవైపు పెట్టుబడి నష్టపోతు ఎండిపోతున్నటువంటి పంటలు మరొకవైపు రైతులని తీవ్ర నష్టపరుస్తున్నాయి. కనుక వెంటనే విద్యుత్ శాఖ అధికారులు, ప్రభుత్వం స్పందించి వ్యవసాయానికి 24గంటల 3పేస్ విద్యుత్ ఇవ్వాలని, కోతలు లేని 3పేస్ విద్యుత్ ఇవ్వాలని, అధిక లొవోల్టెజ్ సమస్యను తక్షణమే పరిష్కరించాలని ఈ ధర్నా సందర్భంగా డిమాండ్
రైతు సమస్యలు పరిష్కరించాలంటూ సిపిఐ ఆధ్వర్యంలో ఆళ్లపల్లి సబ్ స్టేషన్ వద్ద రైతులు ధర్నా .ఆళ్లపల్లి మండలంలో త్రీఫేస్ విద్యుత్ నమ్ముకుని యధావిధిగా రైతులు కిన్నెరసాని వాగు మరియు బోర్ల కింద మొక్కజొన్న మిర్చి తదితర పంటలను సాగు చేసుకోవడం
జరిగింది.ఎడాపెడ విధిస్తున్నటువంటి కరెంటు కోతలు మరియు పరిమిత గంటలు, అధిక లో వోల్టేజ్ వలన రైతులు తమ పంటచేనులను ఎండిపోతుండగా కన్నీరు పెట్టుకోవడం తప్ప చేసేదేమీ లేక బుధవారం CPi ఆధ్వర్యంలో సబ్ స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించ
మండల రైతులు అనంతరం విద్యుత్ శాఖ అధికారులకు సమస్యలతో కూడిన వెనక పత్రాన్ని అందజేశారు.. ఈ సందర్భంగా జిల్లా కార్యవర్గ సభ్యులు ఎల్లయ్య మాట్లాడుతూ ఒకవైపు పెట్టుబడి నష్టపోతు ఎండిపోతున్నటువంటి పంటలు మరొకవైపు రైతులని తీవ్ర నష్టపరుస్తున్నాయి. కనుక
వెంటనే విద్యుత్ శాఖ అధికారులు, ప్రభుత్వం స్పందించి వ్యవసాయానికి 24గంటల 3పేస్ విద్యుత్ ఇవ్వాలని, కోతలు లేని 3పేస్ విద్యుత్ ఇవ్వాలని, అధిక లొవోల్టెజ్ సమస్యను తక్షణమే పరిష్కరించాలని ఈ ధర్నా సందర్భంగా డిమాండ్
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం... బూర్గంపాడు మండలంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పర్యటన. దోమల వాగు చెరువు క్రింద ఎండిపోతున్న 600 ఎకరాలు వరి పంటకి సీతారామ ప్రాజెక్టు నీళ్లు వదిలిన ఎమ్మెల్యే.2
- ఏడుల్ల బయ్యారం క్రాస్ రోడ్డు లో గల ఇంటి నెంబర్ 6-76/15 గల నల్లపు రమాదేవి ఇంటిని కిరాయికి తీసుకొని బేకరీనీ నడిపిస్తున్నాను నా వ్యాపారాన్ని చూసి జీర్ణించుకోలేక మా ఇంటి ఓనర్ ఏడుల్ల బయ్యారం గ్రామ పంచాయితీ సెక్రెటరీ జైపాల్ రెడ్డి ని బేకరీ వద్దకు పంపించి మీరు పంచాయతీ అనుమతి లేకుండా ఏ అర్హతతో మీరు షాపు నడుపుతున్నారు అని మీరు బేకరీ ని ఎలా నడుపుతారు నేను చూస్తా మీ అంతు చూడందే నేను మిమ్మల్ని వదిలిపెట్టను అంటూ మాట్లాడినాడు ఇంటి ఓనర్ మరియు పంచాయతీ సెక్రెటరీ నేను ఒక తక్కువ కులం దానినీ అని కులవివక్షతో దుర్భాషలాడుతూ కులం పేరుతో నన్ను దూషించి ఆడపిల్ల అని కూడా చూడకుండా దుష్ప్రదజాలతో నాపై నా భర్త పై నా పిల్లలపై పంచాయతీ వాళ్ళని బేకరీ వద్దకి తీసుకొని వచ్చి దాడి చేసే సమయంలో బేకరీ సెటర్ని మూసివేసి షట్టర్ ముందు నిలబడి ఉండగా గుణపాలతో గొడ్డలితో దాడికి దిగినారు అదే క్రమంలో మేము అడ్డుకోగా పంచాయతీ సెక్రెటరీ నేను ఒక ప్రభుత్వ అధికారిని నాపై చేయి వేస్తారా నన్ను కొడతారా అంటూ మాపై తప్పుడు కేసు పెట్టి నా పిల్లలు చిన్న పిల్లలు అని చూడకుండా మమ్మల్ని భద్రాచలం సబ్ జైలుకి పంపినారు నేను నా భర్త 14 రోజులు రిమాండ్ లో ఉన్నాము మేము జైలు నుండి బయటకు వచ్చిన తరువాత నా బేకరీ షాప్ ని గుణపాలతో పగలగొట్టి బేకరీలో ఉన్న సామాన్లు మరియు విలువైన వస్తువులన్నీ ఇష్టానుసారంగా తీసేసినారు నా బేకరీ షాప్ లో ఉన్న సామాన్లన్నీ పోయినాయి అని పంచాయతీ సెక్రెటరీ గారిని అడగగా మీ సామాన్లు నేను ఇస్తాను నాది పూర్తి బాధ్యత అని మా పై అధికారులకు నా గురించి ఫిర్యాదు చేయవద్దు అని చెప్పి పంచాయతీ గుమస్తాతో తన దగ్గర ఉన్న పాత టీవీని పంపించినాడు పంచాయతీ సెక్రెటరీ తో మాట్లాడిన కాల్ రికార్డింగ్స్ నా దగ్గర ఉన్నాయి ఇలా ఒక ప్రభుత్వ అధికారి అయినా ఏడూళ్ల బయ్యారం పంచాయతీ సెక్రెటరీ కులవివక్షతో తక్కువ కులం దాని అని నూటికి వచ్చినట్టు మాట్లాడిందే కాకుండా మా షాప్ ని గుణపాలతో పగలగొట్టి దానిలో ఉన్న విలువైన వస్తువులని తీసుకొని మాకు అన్యాయం చేసి నా కుటుంబం మొత్తం రోడ్డుపాలు చేసినారు మాకు జీవన ఉపాధి లేకుండా చేసినారు తక్షణమే ఏడూళ్ల బయ్యారం గ్రామపంచాయతీసెక్రటరీ జైపాల్ రెడ్డి పై ప్రభుత్వం చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయగలరని ప్రార్థిస్తున్నాను4
- మహబూబాబాద్ : రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా ద్విచక్ర వాహనదారుల్లో హెల్మెట్ వినియోగంపై అవగాహన పెంచేందుకు మహబూబాబాద్ టౌన్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. బుధవారం కలెక్టరేట్ ప్రధాన గేట్ వద్ద టౌన్ సీఐ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో వాహనాలపై విస్తృత తనిఖీలు చేపట్టారు. కలెక్టరేట్‌కు ద్విచక్ర వాహనాలపై వచ్చే వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలనే నిబంధనను కఠినంగా అమలు చేశారు. హెల్మెట్ లేకుండా వచ్చిన వాహనదారులతో పాటు పోలీసు సిబ్బందిని కూడా గేటు వద్దే ఆపి లోపలికి అనుమతించలేదు.హెల్మెట్ ధరించిన తర్వాత మాత్రమే వారికి కలెక్టరేట్‌లోకి ప్రవేశం కల్పించారు. హెల్మెట్ లేకుండా వచ్చిన కొంత మంది వాహనదారులకు పోలీసులు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు.1
- జయ్యారం జెడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు సమావేశం నిర్వహించారు. విద్యార్థులు నృత్య ప్రదర్శనలతో అలరించి, తమ పాఠశాల జ్ఞాపకాలను పంచుకున్నారు. HM ఉషాశ్రీ విద్యార్థులకు హాల్టికెట్లు అందజేయగా, మాజీ HM తేజోన్నత రెడ్డి హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. కష్టపడి చదివి పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు.3
- దేశాయిపేటలోని జిల్లా పరిషత్ పాఠశాలల విద్యార్థులకు ఓ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పరీక్షలకు అవసరమైన సామాగ్రిని అందజేశారు. పదో తరగతి పరీక్షలను దృష్టిలో పెట్టుకొని విద్యార్థులకు పెన్నులు, పెన్సిళ్లు, స్కేలు, ఇతర అవసరమైన వస్తువులతో కూడిన పరీక్ష కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ సినీ నటుడు మరియు సేవా కార్యక్రమాలకు ప్రసిద్ధి చెందిన Sonu Sood వీడియో కాల్ ద్వారా విద్యార్థులతో మాట్లాడి వారికి ప్రోత్సాహం అందించారు. చదువుపై దృష్టి పెట్టాలని, కష్టపడి చదివితే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని ఆయన సూచించారు.1
- గంగారం మండలం: మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పెద్ద ఎల్లాపురం గ్రామంలో ఓ రైతుకు చెందిన చేనులో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టిన ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో రైతు గుండా గాని రాజుకు చెందిన మొక్కజొన్న పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. గ్రామానికి సమీపంలోని పొలంలో ఉన్న మొక్కజొన్న కంకులు అకస్మాత్తుగా మంటలు చెలరేగి కాలిపోవడంతో స్థానికులు గమనించారు. అనంతరం గ్రామస్థులు వెంటనే స్పందించి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ అప్పటికే పంటలో కొంత భాగం పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటన వల్ల రైతు గుండా గాని రాజుకు ఆర్థికంగా నష్టం వాటిల్లినట్లు తెలిసింది. చేనులో గుర్తు తెలియని వ్యక్తులు కావాలనే నిప్పు పెట్టి ఉండవచ్చని గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులు స్పందించి ఘటనపై దర్యాప్తు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. అలాగే నష్టపోయిన రైతుకు ప్రభుత్వం నుంచి తగిన పరిహారం అందించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.1
- మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పెద్ద ఎల్లాపురం గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు గుండాగాని రాజు అనే రైతుకు చెందిన మొక్కజొన్న చేనులో నిప్పు పెట్టారు. ఈ ఘటన బుధవారం చోటుచేసుకున్నది. బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం, మొక్కజొన్న కంకి పూర్తిగా కాలిపోగా, సుమారు రూ.2 లక్షల వరకు ఆర్థిక నష్టం నమోదైనట్టు ఆయన తెలిపారు. పోలీసులు ఘటన పై విచారణ చేపట్టారు.1
- త్వరలో జరగనున్న పదవ తరగతి చివరి పరీక్షల నేపథ్యంలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ దమ్మపేట మండలంలోని పలు పాఠశాలలను సందర్శించారు ఈ సందర్భంగా పార్కలగండి గిరిజన బాలుర ఆశ్రమపాఠశాల పెద్దగొల్లగూడెం గిరిజన బాలికల ఆశ్రమపాఠశాల మల్కారం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలను పరిశీలించారు పరీక్షలు సమీపిస్తున్నందున విద్యార్థులు భయపడకుండా ధైర్యంగా చదువుకోవాలని సూచించారు ప్రతిరోజూ చదివిన పాఠాలను పునర్విమర్శ చేసుకుంటూ సమయపాలనతో చదివితే మంచి ఫలితాలు సాధించవచ్చని తెలిపారు లక్ష్యంతో చదివి పాఠశాలకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులను ప్రోత్సహించారు ఉపాధ్యాయులతో మాట్లాడిన నేపథ్యంలో పదవతరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నూరు శాతం ఉత్తీర్ణత సాధించేలా ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు వెనుకంజలో ఉన్న విద్యార్థులను గుర్తించి ప్రత్యేకంగా ప్రణాళిక ద్వారా వారిని చైతన్యవంతంగా తీర్చిదిద్దాలని తెలిపారు4