Shuru
Apke Nagar Ki App…
ధర్మపురి లో కన్నుల పండువలా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి తెప్పోత్సవం....డోలోత్సవం. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ ఉగ్ర లక్ష్మీ నరసింహ స్వామి తెప్పోత్సవం… డోలోత్సవాన్ని కనుల పండువలా నిర్వహించారు. శ్రీ ఉగ్ర లక్ష్మీ నరసింహ స్వామి ఉత్సవ మూర్తుల సేవను మంగళ వాయిద్యాలతో స్థానిక బ్రహ్మపుష్కరినిలోకి తీసుకొని వెళ్లి హంస వాహనంపై స్వామివారి ఉత్సవమూర్తులను ఆసీనులు గావించి ఐదు ప్రదక్షిణలు అనంతరం డోలోత్సవ మండపంలో స్వామివారికి డోలోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు క్యూ పద్ధతిలో డోలోత్సవ స్వామిని దర్శించుకున్నారు. బ్రహ్మ పుష్కరిణి ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
K.V.REDDY
ధర్మపురి లో కన్నుల పండువలా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి తెప్పోత్సవం....డోలోత్సవం. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ ఉగ్ర లక్ష్మీ నరసింహ స్వామి తెప్పోత్సవం… డోలోత్సవాన్ని కనుల పండువలా నిర్వహించారు. శ్రీ ఉగ్ర లక్ష్మీ నరసింహ స్వామి ఉత్సవ మూర్తుల సేవను మంగళ వాయిద్యాలతో స్థానిక బ్రహ్మపుష్కరినిలోకి తీసుకొని వెళ్లి హంస వాహనంపై స్వామివారి ఉత్సవమూర్తులను ఆసీనులు గావించి ఐదు ప్రదక్షిణలు అనంతరం డోలోత్సవ మండపంలో స్వామివారికి డోలోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు క్యూ పద్ధతిలో డోలోత్సవ స్వామిని దర్శించుకున్నారు. బ్రహ్మ పుష్కరిణి ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
More news from తెలంగాణ and nearby areas
- కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధుర నగర్ లో ఘనంగా హోలీ వేడుకలు. నిన్న చంద్రగ్రహణం సందర్భంగా హోలీ వేడుకలు ఈరోజు నిర్వహించుకున్నారు. చిన్నా, పెద్దా కలిసి రంగులు చల్లుకుంటూ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ప్రజల జీవితాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాలని, అందరికీ హోలీ శుభాకాంక్షలు తెలిపారు1
- హైదరాబాదు నుండి కలకత్తా కు వెళ్లవలసిన ట్రైన్ లో పింకీ సహా అనే మహిళకి తీవ్ర కడుపునొప్పి తో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండడంవల్ల 108 కాల్ చేయగానే తక్షణమే బయలుదేరి బాధితురాలని ఆంబులెన్స్ లోకి తీసుకొని ఫ్రీ హాస్పిటల్ కేర్ లో భాగంగా హై ఫ్లో ఆక్సిజన్ అందిస్తూ ట్రీట్మెంట్ ఇస్తూ ఈ ఆర్ సి పి డాక్టర్ మౌనిక మేడం సూచనల మేరకు MGM హాస్పిటల్ కి షిఫ్ట్ చేయడం జరిగింది టిఎంటి చైతన్య పైలట్ కుమారస్వామి కాజీపేట అంబులెన్స్8
- ధర్మపురి : బుగ్గారం : జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) బి. రాజ గౌడ్ బుగ్గారం గ్రామంలో విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. ముందుగా గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను సందర్శించి పనుల పురోగతిని సమీక్షించారు. లబ్ధిదారులు త్వరితగతిన ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసుకోవాలని, నిర్మాణ పనులు నాణ్యతతో సాగాలని అధికారులకు ఆదేశించారు. అనంతరం పాఠశాలలో నిర్వహిస్తున్న మిడ్ డే మీల్ కార్యక్రమాన్ని తనిఖీ చేసి భోజన నాణ్యత, పరిశుభ్రత, నిల్వ విధానాలను పరిశీలించారు. విద్యార్థులకు పోషకాహారం సమయానికి అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి పిల్లల హాజరు, పోషకాహారం పంపిణీ, పరిశుభ్రతపై ఆదేశాలు జారీ చేశారు. బుగ్గారం జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడి రాబోయే పరీక్షల కోసం కృషి చేయాలని ప్రోత్సహించారు. విద్యార్థులు సమయపాలనతో చదివి మంచి ఫలితాలు సాధించాలని, తమ భవిష్యత్తు లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించుకుని ముందుకు సాగాలని సూచించారు. అనంతరం, బుగ్గారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో పన్నుల వసూళ్లు 100 శాతం పూర్తి చేయాలని స్పష్టం చేశారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య పనులు సమయానికి పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే 90 రోజుల యాక్షన్ ప్లాన్ అమలుపై విస్తృతంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, ఎంపివో, ఎంఈఓ, బుగ్గారం సర్పంచ్, ఉప సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులు, మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.1
- వరంగల్ గీసుకొండ మండలం కొమ్మాల లక్ష్మీ నరసింహ స్వామి జాతరలో రాజకీయ ప్రభలతో పాటు రికార్డింగ్ డాన్సులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన డాన్స్ గ్రూపులు జాతర ప్రాంగణంలో వేదిక ఏర్పాటు చేసి నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. పోలీసుల బందోబస్తు మధ్య జరిగిన ఈ కార్యక్రమాలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. యువతుల రికార్డింగ్ డాన్సులకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.1
- వరంగల్ జిల్లా.దుగ్గొండి మండలం గిర్నిబావి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభ బండ్లను నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు. జాతర సందర్భాన్ని పురస్కరించుకుని గులాబీ శ్రేణులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేపట్టాయి. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, నియోజకవర్గంలో పార్టీ శక్తిని మరింత బలోపేతం చేయాలని, ప్రతి గ్రామంలో కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. జాతర వేళ ప్రభ బండ్ల ద్వారా ప్రజల్లో ఉత్సాహం నింపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ వైస్ చైర్మన్, మండల పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ, నియోజకవర్గ యూత్ కన్వీనర్, జిల్లా నాయకులు, నియోజకవర్గ నాయకులు, క్లస్టర్ బాధ్యులు, మండల నాయకులు, సర్పంచులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.7
- .వరంగల్ జిల్లా గీసిగొండ మండలంలోని శ్రీ కొమ్మల లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం జాతర సందర్భంగా ప్రభ బండ్లు ఘనంగా వెళ్లాయి. పరిసర గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ప్రభ బండ్ల ఊరేగింపు భక్తిశ్రద్ధలతో సాగగా, జాతర ప్రాంతం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ) ను జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కిచెన్, వంట గది, బియ్యం, పప్పులు, గుడ్లు ఇతర ఆహార పదార్థాలను పరిశీలించారు. మధ్యాహ్న భోజన సమయం కావడంతో మెనూ పరిశీలించి.. కలెక్టర్ ప్లేట్ తీసుకొని భోజనం తీసుకుని విద్యార్థులతో కలిసి కింద కూర్చొని భోజనం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా? అని ఆరా తీశారు. ఈ రోజు తింటున్న ఆహారంలో విటమిన్లు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేడ్స్ ఏమి ఉన్నాయో ప్రశ్నించారు? రోజూ ఎంత పరిమాణంలో తీసుకోవాలి.. విద్యార్థులు వార్షిక పరీక్షలకు ఎలా సిద్ధం అవుతున్నారని ప్రశ్నించారు? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని ఆరా తీశారు. అనంతరం విద్యాలయం పై అంతస్తులో నిర్మిస్తున్న గదులు, టాయిలెట్లు ఇతర పనులపై ఉపాధ్యాయుల నుంచి కలెక్టర్ వివరాలు తెలుసుకున్నారు. పదో తరగతి, ఇతర తరగతుల విద్యార్థులు ప్రతి సబ్జెక్ట్ కు సంబంధించి అన్ని పాఠాలు చదవాలి.. రాయాలి అని సూచించారు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని, లక్ష్యం నిర్దేశించూకొని ముందుకు వెళ్లాలని పిలుపు ఇచ్చారు. ఉద్యోగం లేదా వృత్తిలో స్థిరపడిన తర్వాత మిగతా విషయాలు ఆలోచించాలని దిశానిర్దేశం చేశారు.1
- చంద్ర గ్రహణం సందర్భంగా జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామి, అనుబంధ ఆలయాలు నిన్న ఉదయం ఏడు గంటలకు అర్చకులు మూసివేశారు.ఆలయంలో స్వామి వారికి మహానువేదన మంగళ నీరాజనం భజన కార్యక్రమాలు పూర్తి చేసి ప్రత్యేక పూజలు చేసి ద్వార బంధనం చేశారు. తిరిగి ఈరోజు ఉదయం 6 గంటలకు సంప్రోక్షణ, శుద్ధి పూజల అనంతరం భక్తులకు సర్వదర్శనాలు, అర్జిత సేవలు యథావిధిగా కొనసాగించారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఉదయం నుంచి స్వామివారిని దర్శించుకుంటున్నారు2
- 👉 పాల్గొన్న జిల్లా అదనపు కలెక్టర్ శ్రీమతి బిఎస్ లత, మున్సిపల్ ఛైర్పర్సన్ శ్రీమతి సమిండ్ల వాణి, బ్యాంకు అధికారులు,రోటరీ ప్రతినిధులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి సిఎస్ఆర్ నిధుల సహకారంతో, శక్తి ప్రాజెక్ట్ కింద రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఈస్ట్ వారి నిర్వహణలో భాగంగా జగిత్యాల ఓల్డ్ హై స్కూల్ లో రోటరీ క్లబ్ ఆఫ్ జగిత్యాల సెంట్రల్ వారి ఆధ్వర్యంలో 824 మంది పాఠశాలల బాలికలకోసం పునర్వినియోగ శానిటరీ ప్యాడ్‌ల పంపిణీ కార్యక్రమం జరిగింది. బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ శ్రీమతి బిఎస్ లత, మున్సిపల్ ఛైర్పర్సన్ శ్రీమతి సమిండ్ల వాణిశ్రీనివాస్, మండల విద్యాధికారిణి శ్రీమతి చంద్రకళ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులు మహేష్, తదితరులు మరియు రోటరీ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు చారి, రాజు, ప్రతినిధులు మంచాల కృష్ణ, సిరిసిల్ల శ్రీనివాస్, టీవీ సూర్యం, మున్సిపల్ కౌన్సిలర్ శ్రీమతి ఆరవ లక్ష్మి, పిఆర్టీయూ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆనంద్ రావు, అమర్నాథ్ రెడ్డి, తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అదనపు కలెక్టర్ శ్రీమతి బిఎస్ లత మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే బాలికల ఆరోగ్య సంరక్షణ దృష్ట్యా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన సి ఎస్ ఆర్ నిధులను సక్రమమైన రీతిలో బాలికల ఆరోగ్య సంరక్షనకోసం వెచ్చిస్తుండడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కాగా, ప్రస్తుత ఆధునిక కాలంలో వైద్యుల సలహాలు సూచనల మేరకు ఆరోగ్యంగా ఉన్నప్పుడే బాలికలు విద్యారంగంలో రాణిస్తారన్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే, వ్యక్తిగత పరిశుభ్రత ఎంతో అవసరమన్నారు. ప్రధానంగా, బాలికలు , మహిళల్లో సరైన అవగాహన లేకపోవడం వల్ల, శానిటరీ పాడ్స్ ఉపయోగించకపోవడంతో పాటుగా వ్యక్తిగత పరిశుభ్రత వైపు ఆలోచించకపోవడంతో ప్రాణాంతకమైన కాన్సర్ బారిన పడుతున్నారని అన్నారు. కనుక ప్రతి బాలిక, మహిళా తమ ఆరోగ్యంపట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు.4