బోయినపల్లి కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన సిరిసిల్ల కలెక్టర్ గరిమా అగ్రవాల్...విద్యార్థులతో కలిసి నేలపై కూర్చుని భోజనం చేసిన కలెక్టర్ రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ) ను జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కిచెన్, వంట గది, బియ్యం, పప్పులు, గుడ్లు ఇతర ఆహార పదార్థాలను పరిశీలించారు. మధ్యాహ్న భోజన సమయం కావడంతో మెనూ పరిశీలించి.. కలెక్టర్ ప్లేట్ తీసుకొని భోజనం తీసుకుని విద్యార్థులతో కలిసి కింద కూర్చొని భోజనం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా? అని ఆరా తీశారు. ఈ రోజు తింటున్న ఆహారంలో విటమిన్లు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేడ్స్ ఏమి ఉన్నాయో ప్రశ్నించారు? రోజూ ఎంత పరిమాణంలో తీసుకోవాలి.. విద్యార్థులు వార్షిక పరీక్షలకు ఎలా సిద్ధం అవుతున్నారని ప్రశ్నించారు? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని ఆరా తీశారు. అనంతరం విద్యాలయం పై అంతస్తులో నిర్మిస్తున్న గదులు, టాయిలెట్లు ఇతర పనులపై ఉపాధ్యాయుల నుంచి కలెక్టర్ వివరాలు తెలుసుకున్నారు. పదో తరగతి, ఇతర తరగతుల విద్యార్థులు ప్రతి సబ్జెక్ట్ కు సంబంధించి అన్ని పాఠాలు చదవాలి.. రాయాలి అని సూచించారు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని, లక్ష్యం నిర్దేశించూకొని ముందుకు వెళ్లాలని పిలుపు ఇచ్చారు. ఉద్యోగం లేదా వృత్తిలో స్థిరపడిన తర్వాత మిగతా విషయాలు ఆలోచించాలని దిశానిర్దేశం చేశారు.

- జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ ఉగ్ర లక్ష్మీ నరసింహ స్వామి తెప్పోత్సవం… డోలోత్సవాన్ని కనుల పండువలా నిర్వహించారు. శ్రీ ఉగ్ర లక్ష్మీ నరసింహ స్వామి ఉత్సవ మూర్తుల సేవను మంగళ వాయిద్యాలతో స్థానిక బ్రహ్మపుష్కరినిలోకి తీసుకొని వెళ్లి హంస వాహనంపై స్వామివారి ఉత్సవమూర్తులను ఆసీనులు గావించి ఐదు ప్రదక్షిణలు అనంతరం డోలోత్సవ మండపంలో స్వామివారికి డోలోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు క్యూ పద్ధతిలో డోలోత్సవ స్వామిని దర్శించుకున్నారు. బ్రహ్మ పుష్కరిణి ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.1
- Post by వేణు విలేకరి1
- ఉపాధి హామీ పనుల సమయంలో తేనెటీగల దాడి చోటుచేసుకుని ఏడుగురు కూలీలు గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామ శివారులో కాలువ నిర్మాణ పనులు జరుగుతుండగా మట్టి తవ్వే క్రమంలో ప్రమాదవశాత్తు తేనెటీగల గూడు తగిలింది. దాంతో ఒక్కసారిగా పైకి లేచిన తేనెటీగలు అక్కడ పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీలపై దాడి చేశాయి. తేనెటీగల కాటుకు గురైన ఏడుగురిని సహచరులు వెంటనే సిరిసిల్ల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స అందుతోంది. ఘటనపై అధికారులు విచారణ చేపట్టి, పనుల సమయంలో భద్రతా చర్యలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.1
- కొండ సుస్మిత పటేల్ మాట్లాడిన తీరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది మంగళవారం రోజు రాత్రి 9 గంటల ప్రాంతంలో వరంగల్ జిల్లాలోని గీసుకొండ మండలం కొమ్మల లక్ష్మీనరసింహస్వామి దేవాలయం వద్ద కొండ సుస్మిత పటేల్ మాట్లాడుతూ తన రాజకీయ జీవితం ఇక్కడి నుంచే మొదలు పెట్టబోతున్నట్లు చేసిన సంచలనం వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది బుధవారం రోజు ఉదయం 10:30 నుంచి కొండా సుస్మిత పటేల్ మాట్లాడిన మాటలు వైరల్ గా మారాయి తాను కచ్చితంగా ఎమ్మెల్యేగా గెలుస్తానని ప్రజలకు సేవ చేస్తానని అనడం కోసమెరుపు9
- ధర్మపురి : బుగ్గారం : జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) బి. రాజ గౌడ్ బుగ్గారం గ్రామంలో విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. ముందుగా గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను సందర్శించి పనుల పురోగతిని సమీక్షించారు. లబ్ధిదారులు త్వరితగతిన ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసుకోవాలని, నిర్మాణ పనులు నాణ్యతతో సాగాలని అధికారులకు ఆదేశించారు. అనంతరం పాఠశాలలో నిర్వహిస్తున్న మిడ్ డే మీల్ కార్యక్రమాన్ని తనిఖీ చేసి భోజన నాణ్యత, పరిశుభ్రత, నిల్వ విధానాలను పరిశీలించారు. విద్యార్థులకు పోషకాహారం సమయానికి అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి పిల్లల హాజరు, పోషకాహారం పంపిణీ, పరిశుభ్రతపై ఆదేశాలు జారీ చేశారు. బుగ్గారం జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడి రాబోయే పరీక్షల కోసం కృషి చేయాలని ప్రోత్సహించారు. విద్యార్థులు సమయపాలనతో చదివి మంచి ఫలితాలు సాధించాలని, తమ భవిష్యత్తు లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించుకుని ముందుకు సాగాలని సూచించారు. అనంతరం, బుగ్గారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో పన్నుల వసూళ్లు 100 శాతం పూర్తి చేయాలని స్పష్టం చేశారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య పనులు సమయానికి పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే 90 రోజుల యాక్షన్ ప్లాన్ అమలుపై విస్తృతంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, ఎంపివో, ఎంఈఓ, బుగ్గారం సర్పంచ్, ఉప సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులు, మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.1
- మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం మహామూద్‌పట్నం గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ను జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థులకు అందించాల్సిన మెనూను పాటించకపోవడం, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన విషయంపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. KGBV స్పెషల్ ఆఫీసర్‌పై తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. విద్యార్థుల సంక్షేమంపై రాజీ ఉండదని స్పష్టం చేసిన కలెక్టర్, పాఠశాలల నిర్వహణలో ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలని సూచించారు.1
- *నల్లగొండ జిల్లా ఆమనగల్లు శ్రీపార్వతీ రామలింగేశ్వర స్వామి ఉత్సవాల్లో విషాదం* భక్తులు అగ్నిగుండం దాటుతుండగా ఒక్కసారిగా తోపులాట ఒకరినొకరు నెట్టుకోవడంతో నిప్పుల గుండంలో పడిపోయిన భక్తులు ప్రమాదంలో పదకొండు మంది భక్తులకు తీవ్ర గాయాలు నిప్పుల్లో పడ్డవారిని బయటకు లాగిన భక్తులు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ఓ ప్రైవేట్ లాడ్జిలో యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి కలకలం సృష్టిస్తుంది. మృతుడు వీర్నపల్లి మండలం అడవిపదిర గ్రామానికి చెందిన భూక్య మోహన్ గా గుర్తించారు. పది నిముషాలు మాట్లాడుకుని వెళ్తామని యువతి యువకుడు ఇద్దరు లాడ్జికి వచ్చి రూమ్ తీసుకున్నారని లాడ్జి నిర్వాహకులు తెలిపారు. ఆపిల్ కోసుకుంటామని చాక్ సైతం అడిగి తీసుకెళ్ళారని పది నిముషాల తర్వాత ఓ ముసలాయన వచ్చి మా బిడ్డ ఉందని రూమ్ వద్దకు వెళ్ళాడని తెలిపారు. ఆ తర్వాత అమ్మాయి ముసలాయన వెళ్ళిపోగ యువకుడు బయటకు రాకపోయేసరికి విగతజీవిగా పడి ఉన్నాడని లాడ్జి నిర్వాహకురాలు తెలిపారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్లూస్ టీమ్ తో విచారణ చేపట్టారు. యువకుడితో వచ్చిన అమ్మాయి, ఆమె కోసం వచ్చిన వృద్దుడు హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు. విచారణ చేపడుతున్నామని పట్టణ సీఐ వీరప్రసాద్ తెలిపారు.1