Shuru
Apke Nagar Ki App…
తేనెటీగల దాడి ఏడుగురు ఉపాధి కూలీలకు గాయాలు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించిన సహచరులు ఉపాధి హామీ పనుల సమయంలో తేనెటీగల దాడి చోటుచేసుకుని ఏడుగురు కూలీలు గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామ శివారులో కాలువ నిర్మాణ పనులు జరుగుతుండగా మట్టి తవ్వే క్రమంలో ప్రమాదవశాత్తు తేనెటీగల గూడు తగిలింది. దాంతో ఒక్కసారిగా పైకి లేచిన తేనెటీగలు అక్కడ పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీలపై దాడి చేశాయి. తేనెటీగల కాటుకు గురైన ఏడుగురిని సహచరులు వెంటనే సిరిసిల్ల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స అందుతోంది. ఘటనపై అధికారులు విచారణ చేపట్టి, పనుల సమయంలో భద్రతా చర్యలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
తేనెటీగల దాడి ఏడుగురు ఉపాధి కూలీలకు గాయాలు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించిన సహచరులు ఉపాధి హామీ పనుల సమయంలో తేనెటీగల దాడి చోటుచేసుకుని ఏడుగురు కూలీలు గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామ శివారులో కాలువ నిర్మాణ పనులు జరుగుతుండగా మట్టి తవ్వే క్రమంలో ప్రమాదవశాత్తు తేనెటీగల గూడు తగిలింది. దాంతో ఒక్కసారిగా పైకి లేచిన తేనెటీగలు అక్కడ పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీలపై దాడి చేశాయి. తేనెటీగల కాటుకు గురైన ఏడుగురిని సహచరులు వెంటనే సిరిసిల్ల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స అందుతోంది. ఘటనపై అధికారులు విచారణ చేపట్టి, పనుల సమయంలో భద్రతా చర్యలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
More news from తెలంగాణ and nearby areas
- ఉపాధి హామీ పనుల సమయంలో తేనెటీగల దాడి చోటుచేసుకుని ఏడుగురు కూలీలు గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామ శివారులో కాలువ నిర్మాణ పనులు జరుగుతుండగా మట్టి తవ్వే క్రమంలో ప్రమాదవశాత్తు తేనెటీగల గూడు తగిలింది. దాంతో ఒక్కసారిగా పైకి లేచిన తేనెటీగలు అక్కడ పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీలపై దాడి చేశాయి. తేనెటీగల కాటుకు గురైన ఏడుగురిని సహచరులు వెంటనే సిరిసిల్ల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స అందుతోంది. ఘటనపై అధికారులు విచారణ చేపట్టి, పనుల సమయంలో భద్రతా చర్యలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ) ను జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కిచెన్, వంట గది, బియ్యం, పప్పులు, గుడ్లు ఇతర ఆహార పదార్థాలను పరిశీలించారు. మధ్యాహ్న భోజన సమయం కావడంతో మెనూ పరిశీలించి.. కలెక్టర్ ప్లేట్ తీసుకొని భోజనం తీసుకుని విద్యార్థులతో కలిసి కింద కూర్చొని భోజనం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా? అని ఆరా తీశారు. ఈ రోజు తింటున్న ఆహారంలో విటమిన్లు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేడ్స్ ఏమి ఉన్నాయో ప్రశ్నించారు? రోజూ ఎంత పరిమాణంలో తీసుకోవాలి.. విద్యార్థులు వార్షిక పరీక్షలకు ఎలా సిద్ధం అవుతున్నారని ప్రశ్నించారు? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని ఆరా తీశారు. అనంతరం విద్యాలయం పై అంతస్తులో నిర్మిస్తున్న గదులు, టాయిలెట్లు ఇతర పనులపై ఉపాధ్యాయుల నుంచి కలెక్టర్ వివరాలు తెలుసుకున్నారు. పదో తరగతి, ఇతర తరగతుల విద్యార్థులు ప్రతి సబ్జెక్ట్ కు సంబంధించి అన్ని పాఠాలు చదవాలి.. రాయాలి అని సూచించారు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని, లక్ష్యం నిర్దేశించూకొని ముందుకు వెళ్లాలని పిలుపు ఇచ్చారు. ఉద్యోగం లేదా వృత్తిలో స్థిరపడిన తర్వాత మిగతా విషయాలు ఆలోచించాలని దిశానిర్దేశం చేశారు.1
- Post by వేణు విలేకరి1
- 👉 పాల్గొన్న జిల్లా అదనపు కలెక్టర్ శ్రీమతి బిఎస్ లత, మున్సిపల్ ఛైర్పర్సన్ శ్రీమతి సమిండ్ల వాణి, బ్యాంకు అధికారులు,రోటరీ ప్రతినిధులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి సిఎస్ఆర్ నిధుల సహకారంతో, శక్తి ప్రాజెక్ట్ కింద రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఈస్ట్ వారి నిర్వహణలో భాగంగా జగిత్యాల ఓల్డ్ హై స్కూల్ లో రోటరీ క్లబ్ ఆఫ్ జగిత్యాల సెంట్రల్ వారి ఆధ్వర్యంలో 824 మంది పాఠశాలల బాలికలకోసం పునర్వినియోగ శానిటరీ ప్యాడ్‌ల పంపిణీ కార్యక్రమం జరిగింది. బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ శ్రీమతి బిఎస్ లత, మున్సిపల్ ఛైర్పర్సన్ శ్రీమతి సమిండ్ల వాణిశ్రీనివాస్, మండల విద్యాధికారిణి శ్రీమతి చంద్రకళ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులు మహేష్, తదితరులు మరియు రోటరీ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు చారి, రాజు, ప్రతినిధులు మంచాల కృష్ణ, సిరిసిల్ల శ్రీనివాస్, టీవీ సూర్యం, మున్సిపల్ కౌన్సిలర్ శ్రీమతి ఆరవ లక్ష్మి, పిఆర్టీయూ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆనంద్ రావు, అమర్నాథ్ రెడ్డి, తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అదనపు కలెక్టర్ శ్రీమతి బిఎస్ లత మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే బాలికల ఆరోగ్య సంరక్షణ దృష్ట్యా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన సి ఎస్ ఆర్ నిధులను సక్రమమైన రీతిలో బాలికల ఆరోగ్య సంరక్షనకోసం వెచ్చిస్తుండడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కాగా, ప్రస్తుత ఆధునిక కాలంలో వైద్యుల సలహాలు సూచనల మేరకు ఆరోగ్యంగా ఉన్నప్పుడే బాలికలు విద్యారంగంలో రాణిస్తారన్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే, వ్యక్తిగత పరిశుభ్రత ఎంతో అవసరమన్నారు. ప్రధానంగా, బాలికలు , మహిళల్లో సరైన అవగాహన లేకపోవడం వల్ల, శానిటరీ పాడ్స్ ఉపయోగించకపోవడంతో పాటుగా వ్యక్తిగత పరిశుభ్రత వైపు ఆలోచించకపోవడంతో ప్రాణాంతకమైన కాన్సర్ బారిన పడుతున్నారని అన్నారు. కనుక ప్రతి బాలిక, మహిళా తమ ఆరోగ్యంపట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు.4
- జగిత్యాల పాత్రికేయులు హోలీ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. స్థానిక ప్రెస్ క్లబ్ వద్ద పాత్రికేయులు ఒకరికొకరు రంగులు చల్లుకొని సంబరాలు జరుపుకున్నారు. అనంతరం జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో పాల్గొని ఎస్పీ అశోక్ కుమార్, డీఎస్పీ రఘు చందర్, జిల్లాలోని పోలీసు అధికారులకు రంగులు చల్లి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. మున్సిపల్ చైర్పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్ ను కలిసి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. హోలీ అందరి జీవితాల్లో రంగుల మాయం కావాలని ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. హోలీ సంబరాల్లో పాల్గొన్న పాత్రికేయులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐజేయు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చీటి శ్రీనివాసరావు,సంపూర్ణ చారి యూనియన్ బాధ్యులు హరికృష్ణ, వేణుగోపాల్, నరేష్, రాజిరెడ్డి, మనోజ్, ప్రదీప్, శ్రీధర్ రావు, దేవేందర్, లక్ష్మారెడ్డి,హరీష్, శ్రీనివాస్,శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.1
- కొండ సుస్మిత పటేల్ మాట్లాడిన తీరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది మంగళవారం రోజు రాత్రి 9 గంటల ప్రాంతంలో వరంగల్ జిల్లాలోని గీసుకొండ మండలం కొమ్మల లక్ష్మీనరసింహస్వామి దేవాలయం వద్ద కొండ సుస్మిత పటేల్ మాట్లాడుతూ తన రాజకీయ జీవితం ఇక్కడి నుంచే మొదలు పెట్టబోతున్నట్లు చేసిన సంచలనం వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది బుధవారం రోజు ఉదయం 10:30 నుంచి కొండా సుస్మిత పటేల్ మాట్లాడిన మాటలు వైరల్ గా మారాయి తాను కచ్చితంగా ఎమ్మెల్యేగా గెలుస్తానని ప్రజలకు సేవ చేస్తానని అనడం కోసమెరుపు9
- సంప్రోక్షణ అనంతరం దండేపల్లి మండలంలోని గూడెంగుట్ట శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయం మళ్లీ తెర్చుకుంది. చంద్రగ్రహణం కావడంతో మంగళవారం ఉదయం వేద పండితులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మూసివేశారు. అనంతరం బుధవారం తెల్లవారుజామున దేవాలయంలో వేద పండితులు సంప్రోక్షణ పూజలు నిర్వహించారు. ఉదయం 8 గంటల నుండి స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులకు అవకాశం కల్పించారు. పలు ప్రాంతాల నుండి భక్తులు తరలి వచ్చి స్వామివారికి పూజలు చేస్తున్నారు.1
- కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధుర నగర్ లో ఘనంగా హోలీ వేడుకలు. నిన్న చంద్రగ్రహణం సందర్భంగా హోలీ వేడుకలు ఈరోజు నిర్వహించుకున్నారు. చిన్నా, పెద్దా కలిసి రంగులు చల్లుకుంటూ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ప్రజల జీవితాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాలని, అందరికీ హోలీ శుభాకాంక్షలు తెలిపారు1