పత్తికొండ అర్బన్ సీఐ పై చర్యలు తీసుకోవాలి:జర్నలిస్ట్ యూనియన్ డిమాండ్ పత్తికొండ అర్బన్ సిఐ జయన్న పై చర్యలు తీసుకోవాలని, జర్నలిస్టులపై నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (APUWJ) యూనియన్ కౌతాళం ఏమార్వో కు ఆధ్వర్యంలో ఈ వినతిపత్రాన్ని సమర్పిస్తున్నాము. పత్తికొండ విశాలాంధ్ర రిపోర్టర్ ఎం. నాగరాజు పట్ల పత్తికొండ అర్బన్ సిఐ జయన్న గారు దురుసుగా ప్రవర్తించడంతో పాటు, పోలీస్ స్టేషన్ నుంచి మెడపట్టి బయటకు గెంటివేసినట్లు మా దృష్టికి వచ్చింది. జర్నలిస్టు విధులు నిర్వహిస్తున్న సమయంలో జరిగిన ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులైన అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము.అదేవిధంగా ఈ న్యూస్ రిపోర్టర్లపై నమోదు చేసిన కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నాము. జర్నలిస్టులు ఎలాంటి ఒత్తిళ్లకు గురికాకుండా తమ విధులను స్వేచ్ఛగా నిర్వహించేలా ప్రభుత్వం, పోలీస్ ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. కావున పై అంశాలను పరిశీలించి, ఘటనపై నిష్పక్షపాతంగా సమగ్ర విచారణ జరిపించి, జర్నలిస్టులకు న్యాయం జరిగేలా సంబంధిత అధికారులపై తగిన చర్యలు తీసుకోవడంతో పాటు, జర్నలిస్టులపై నమోదు చేసిన కేసులను వెంటనే ఎత్తివేసేలా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని మనవి చేస్తున్నాము.
పత్తికొండ అర్బన్ సీఐ పై చర్యలు తీసుకోవాలి:జర్నలిస్ట్ యూనియన్ డిమాండ్ పత్తికొండ అర్బన్ సిఐ జయన్న పై చర్యలు తీసుకోవాలని, జర్నలిస్టులపై నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (APUWJ) యూనియన్ కౌతాళం ఏమార్వో కు ఆధ్వర్యంలో ఈ వినతిపత్రాన్ని సమర్పిస్తున్నాము. పత్తికొండ విశాలాంధ్ర రిపోర్టర్ ఎం. నాగరాజు పట్ల పత్తికొండ అర్బన్ సిఐ జయన్న గారు దురుసుగా ప్రవర్తించడంతో పాటు, పోలీస్ స్టేషన్ నుంచి మెడపట్టి బయటకు గెంటివేసినట్లు మా దృష్టికి వచ్చింది. జర్నలిస్టు విధులు నిర్వహిస్తున్న సమయంలో జరిగిన ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులైన అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము.అదేవిధంగా ఈ న్యూస్ రిపోర్టర్లపై నమోదు చేసిన కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నాము. జర్నలిస్టులు ఎలాంటి ఒత్తిళ్లకు గురికాకుండా తమ విధులను స్వేచ్ఛగా నిర్వహించేలా ప్రభుత్వం, పోలీస్ ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. కావున పై అంశాలను పరిశీలించి, ఘటనపై నిష్పక్షపాతంగా సమగ్ర విచారణ జరిపించి, జర్నలిస్టులకు న్యాయం జరిగేలా సంబంధిత అధికారులపై తగిన చర్యలు తీసుకోవడంతో పాటు, జర్నలిస్టులపై నమోదు చేసిన కేసులను వెంటనే ఎత్తివేసేలా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని మనవి చేస్తున్నాము.
- కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతం మండలాల ప్రజలకు సకాలంలో తాగునీరు అందించండి ఉమ్మడి కర్నూలు జిల్లా కలెక్టర్లు జెడ్పి చైర్మన్ అధ్యక్షతనలో జిల్లా పరిషత్ సమావేశం జరిగింది ఈ సమావేశానికి ఉమ్మడి కర్నూలు జిల్లా జడ్పిటిసిలు, ఎంపీటీసీలు, ఎమ్మెల్యేలు, మరియు కర్నూలు ఎంపీ పాల్గొన్నారు, ఈ సమావేశంలో ఈ ఏపీ స్టేట్ కురుబ కురుమ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప గారు మాట్లాడుతూ ముందుగా గౌరవనీయులు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో చిప్పగిరి, ఆలూరు, ఆలహర్వీ, హోలగుంద, ఆదోని1, ఆదోని2, కౌతాళం, మండలంలోని 196 గ్రామాలు ఉన్నాయి ఈ గ్రామ ప్రజలకు తాగడానికి సకాలంలో నీళ్లు అందించి ప్రజలను ఆదుకోవాలని కోరినారు, అంతేకాదు తుంగభద్ర ఎల్ఎల్సి కెనాల్ కు 227 లింక్ కింద ఆదోని మండలం బసాపురం గ్రామం దగ్గర గర్జివంక ఉంది ఆ వంకకింద దాదాపు 10 గ్రామాలు ఉన్నాయి, ఈ వంకకు ఎల్ఎల్సీ కాలువనుంచి కొంత నీరు విడిస్తే పశువులకు వన్య జీవులకు తాగడానికి నీళ్లు ఉపయోగ పడుతుంది, మరియు ప్రజలకు అనుకూల పరిస్థితి ఉంటుంది అని కలెక్టర్ మరియు జిల్లా చైర్పర్సన్ గారిని అడిగినారు, అంతేకాదు ఇలా ఎల్ఎల్సి కింద ఉన్న వంకలువు కొంత నీరు వదిలితే పశువులకు తాగడానికి నీరు మరియు మేయడానికి గడ్డి దొరుకుతుందని సూచించారు, ఈ విషయానికి కలెక్టర్ సానుకూలంగా స్పందించారు2
- ఎమ్మిగనూరు మార్కెట్ యార్డులో రూ.35 లక్షల జంబో షెడ్‌కు శంకుస్థాపన ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో రూ.35 లక్షలతో జంబో షెడ్ నిర్మాణానికి శంకుస్థాపన1
- మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి సేవలో ఉపాసన కొణిదెల..! శ్రీ రాఘవేంద్ర స్వామిని రామ్‌చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల దర్శించుకున్నారు. మధ్వ కారిడార్ వద్ద ఆలయ అధికారులు శ్రీపతి స్వామి, ఐపీ నరసింహమూర్తి, అనంత్ పురానిక్ సాంప్రదాయబద్ధంగా ఆమెకు స్వాగతం పలికారు. గ్రామదేవత మాంచాలమ్మకు కుంకుమార్చన నిర్వహించి, అనంతరం మూల బృందావనాన్ని దర్శించుకున్నారు. పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు ఫలమంత్రాక్షతలతో ఉపాసనను ఆశీర్వదించారు. మంత్రాలయంలో అపోలో 24/7 మెడికల్ షాప్ ఏర్పాటు చేయాలని పిఠాధిపతి ఆమెను కోరారు.1
- బిఆర్ఎస్ నూతన పంచాయతీలు గిరిజనులకు అభివృద్ధి తండాలను గ్రామపంచాయతీ చేసిన కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం బీఆర్ఎస్ హయాంలోనే గిరిజనుల అభివృద్ధి.తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత కేసీఆర్ దే.గిరిజన బంధువు కేసీఆర్ చిత్రపటానికి గిరిజనలతో కలిసి,పాలాభిషేకం చేసిన బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి బాసు హనుమంతు నాయుడు గురువారం గద్వాల నియోజకవర్గం కె.టీ.దొడ్డి మండలం మల్లాపురం తండా మరియు గట్టు మండలం వాయిలకుంట తండా గ్రామాలలో గిరిజనులకు జనాభా ప్రకారం *6% శాతం ఉన్న రిజర్వేశాన్ని 10% శాతానికి పెంచి, నేటికీ నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గిరిజన బంధువు కేసీఆర్ చిత్రపటానికి తండాల గిరిజన మహిళలతో కలిసి,బాసు హనుమంతు నాయుడు గారు పాలాభిషేకం చేసి, సంబురాలు జరుపుకున్నారు. అంతక ముందు.బాసు హనుమంతు నాయుడు గారిని గిరిజన మహిళలు కేసీఆర్ గారి పాటలకు నృత్యం చేస్తూ,పెద్ద ఎత్తున స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు తండాల్లో గిరిజనులు అసౌకర్యాల మధ్య జీవనం కొనసాగించారని గుర్తుచేశారు.బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక తండాల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయన్నారు.రాష్ట్రంలోని 3,146 గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చివేసి వాటికి మహర్దశ వచ్చేలా చేసిన ఘనత అప్పటి సీఎం కేసీఆరదేనన్నారు. ఎస్టీల రిజర్వేషన్లను 6నుంచి 10శాతానికి పెంచారని, గిరిజన విద్యార్థులకు 71 గురుకులాలు ఏర్పాటు చేశారని తెలిపారు.దాదాపు అన్ని గిరిజనతండాలకు తారు రోడ్ల నిర్మాణం చేశారన్నారు. గిరిజనుల సమగ్రాభివృద్ధి కోసం ఎస్టీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ను కేటాయించి, చట్టబద్ధత కల్పించిన ఘనత కూడా కెసిఆర్ దేనని అన్నారు.గిరిజన మహిళల సంక్షేమానికి గత కెసిఆర్ గారి ప్రభుత్వంలో అనేక పథకాలను అమలు చేశామని, ప్రభుత్వ పథకాలన్నింటినీ విధిగా వర్తింపజేశామని చెప్పారు.గిరిజన పంచాయతీ భవనాల నిర్మాణానికి రూ.300కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. గత కెసిఆర్ గారి హయంలో గిరిజన జీపీల్లో అభివృద్ధి పనులు జరిగాయని తెలిపారు.కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో గిరిజనులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయకుండా మోసం చేసిందన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మూడేండ్లు గడుస్తున్నా గిరిజనుల కోసం చేసిందేమీ లేదన్నారు.గిరిజనులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో రేవంత్ సర్కారు పూర్తిగా విఫలమైందని విమర్శించారు.గిరిజన విద్యార్థుల చదువు కోసం రూ.25 వేల నుంచి రూ.లక్ష వరకు ప్రోత్సాహకం అందిస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం హామీని విస్మరించిందన్నారు..గిరిజనుల హక్కులను కాపాడుతూ వారి ఆత్మగౌరవం,సంక్షేమం, అభివృద్ధి కోసం ఎల్లప్పుడు పాటుపడేది కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని స్పష్టం చేశారు.గిరిజనులు కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను ఎప్పటికప్పుడు ఎండగట్టాలన్నారు.కెసిఆర్ గారు గిరిజనతండాలను గ్రామ పంచాయతీలుగా చేసి, గిరిజనులను ప్రజా ప్రతినిధులుగా ఎదిగే అవకాశం కల్పించాలని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జి.రాఘవేంద్ర రెడ్డి,సర్పంచులు సాకి డేవిడ్, తిమ్మప్ప,మాజీ సర్పంచులు కృష్ణవేణి నరేందర్ నాయక్,లక్ష్మీకాంత్ రెడ్డి, అంగడి బసవరాజ్,పటేల్ జనార్దన్ రెడ్డి,ప్రతాప్,రంగ నాయక్,బీచుపల్లి,చక్రీధర్ రెడ్డి,వెంకటేష్ నాయుడు,బాసు గోపాల్,ఎస్.రాము నాయుడు,టీ.రవి,రాజు నాయుడు,బోయలగూడెం నాగరాజు,జాంపల్లి భరత్ సింహారెడ్డి,సోమశేఖర్ రెడ్డి,కిష్టప్ప,బాసు బొజ్జయ్య నాయుడు, వీరేష్ నాయక్, పూడూరు రఘు నాయుడు,ఒదే నాయక్,లక్ష్మారెడ్డి,రాము,పాగుంటప్ప,కరెప్ప, స్వామి,రామకృష్ణ,ఆంజనేయులు,అరవిందు,గోవిందు, రజినీబాబు,నరసింహులు నాయక్,కృష్ణ,మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు....4
- దేశానికి అన్నం పెట్టే రైతన్న లో ఓ ల్టేజీ కరెంటు మోటర్ కాలిపోతుంది అన్న భయం పంటకు నీళ్లు రాక రోడ్ ఎక్కిన రైతులు ఎర్రవల్లి మండలం జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే విజయుడు గారు మన కలెక్టర్ గారు విద్యుత్ ఎస్సీ గారు అధికారులు స్పందించి మీకు వచ్చేటట్టు చూస్తాం అని హామీ ఇచ్చారు విషయం మధ్యలోనే నీళ్లు ఆపేస్తే మీకు అన్నం రైతులు ఎలా పెడతారు ఏ స్వార్థం లేని రైతు మమ్మల్ని కష్ట పెట్ట కండి మీకు అన్నం దొరకదు మీకు అన్నం పెట్టడానికి మాకు నీళ్లు ఉండని అడుగుతున్నాం పంట ఎండిపోతుంటే మా కడుపులో మంట పుడుతుంది దానిమీద తెచ్చిన అప్పుల ఆగి పోతావా ఎవరైనా అన్నం తినకుండా మానేస్తా రా రైతుల పంట పండి య కుంటే మీకు అన్నం ఎక్కడినుంచి వస్తుంది ఏడుపుతో ఆవేదనతో రైతులు తెలియ పరుస్తున్నారు తెలుగు వీరన్న బీచు పల్లి బిసన్న ఇతర రైతులు ఉన్నారు4
- తెలంగాణ రక్షణ సేన టీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పాంచజన్య సంకల్ప సభ నారాయణపేట: నియోజకవర్గంలో గవినర్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పాల్గొని పాంచజన్య సంకల్ప సభ పోస్టర్లను విడుదల చేసిన కొడంగల్ పాంచజన్య సంకల్ప సభ ఇంచార్జి గొంగళ్ల రంజిత్ కుమార్ ఈ సందర్భంగా గొంగళ్ల రంజిత్ కుమార్ మాట్లాడుతూ, తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో సెప్టెంబర్ 20న ఆదివారం కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి మండల కేంద్రంలో కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా పాల్గొనే పాంచజన్య సంకల్ప సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్య, వైద్యం, ఉపాధి, వ్యవసాయం, సామాజిక న్యాయం అనే ఐదు ప్రధాన అంశాలను ఎజెండాగా తీసుకొని ప్రజల కోసం భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలను ప్రజలకు వివరించడమే పాంచజన్య సంకల్ప సభ ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు. ఈ సభను విజయవంతం చేసేందుకు నారాయణపేట నియోజకవర్గం నుంచి ప్రజలు, రైతులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత పెద్ద ఎత్తున తరలివచ్చి సభను విజయవంతం చేయాలని గొంగళ్ల రంజిత్ కుమార్ విజ్ఞప్తి చేశారు.1
- వినాయకుడి సన్నిధిలో ప్రత్యేక పూజలు.. ప్రధాని మోదీకి శుభాకాంక్షలు వినాయకుడి సన్నిధిలో ప్రత్యేక పూజలు.. ప్రధాని మోదీకి శుభాకాంక్షలు ఆలూరు నియోజకవర్గం: ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా ఆలూరు నియోజకవర్గానికి చెందిన బీజేపీ నాయకురాలు గుమ్మనూరు కమలమ్మ, వడ్డే శ్రావణి ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వినాయకుడి సన్నిధిలో దీపం వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, దేశ ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం కలగాలని ఆకాంక్షిస్తూ దేవుడిని ప్రార్థించారు. అనంతరం గుమ్మనూరు కమలమ్మ, వడ్డే శ్రావణితో పాటు కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దేశ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ఆయన చేస్తున్న సేవలు మరింత కొనసాగాలని వారు ఆకాంక్షించారు. ప్రధాని మోదీ జన్మదినం సెప్టెంబర్ 17న జరుపుకుంటారు. 2026 జన్మదినం సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రజల నుంచి అందుతున్న ప్రేమ, ఆశీర్వాదాలకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళలు భక్తిశ్రద్ధలతో పాల్గొని, వినాయకుడి ఆశీస్సులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఉండాలని కోరుకున్నారు.3
- జీజీహెచ్ పెండింగ్ పనులు పూర్తి చేయాలి.. బుట్టా రేణుక కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో నిలిచిపోయిన నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేసి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్త, మాజీ ఎంపీ బుట్టా రేణుక డిమాండ్ చేశారు. గురువారం జీజీహెచ్‌ను సందర్శించిన ఆమె వివిధ వార్డులు, నిర్మాణ పనులను పరిశీలించారు.నాడు–నేడు కింద చేపట్టిన పనుల్లో దాదాపు 75 శాతం పూర్తయ్యాయని, మిగిలిన 25 శాతం పనులను అవసరమైన నిధులు కేటాయించి త్వరితగతిన పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. గత వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన అభివృద్ధి పనులను కొనసాగించకుండా నిలిపివేయడం వల్ల ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని విమర్శించారు.పలు వార్డుల్లో ఒకే బెడ్‌పై ముగ్గురు రోగులకు చికిత్స అందిస్తున్న పరిస్థితి దారుణమన్నారు. నిర్మాణ పనులు పూర్తికాకపోవడంతో ఆపరేషన్ థియేటర్ల కొరత ఏర్పడి రోగులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కర్నూలుతో పాటు రాయలసీమ, కర్ణాటక, తెలంగాణ ప్రాంతాల ప్రజలకు సేవలందించే కీలక ఆసుపత్రి అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.పెండింగ్ పనులకు నిధులు కేటాయించి త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు పూర్తిస్థాయి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని బుట్టా రేణుక డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.3