నెరేళ్ల ఘటనపై రాజకీయాలకు అతీతంగా బాధితులకు అండగా నిలవాలి: కల్వకుంట్ల కవిత నెరేళ్ల ఘటన తెలంగాణ సమాజం సిగ్గుతో తలదించుకునే విషాదమని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆ సమయంలో పాలించిన కుటుంబంలో తాను కూడా భాగమైనందున బాధితులకు క్షమాపణ చెబుతున్నానని పేర్కొన్నారు. ఈ ఘటనపై రాజకీయాలు చేయకుండా అన్ని పార్టీలు మానవత్వంతో స్పందించి బాధితులకు అండగా నిలవాలని కోరారు. ఇసుక కోసం ప్రాణాలు తీసే పరిస్థితి రావడం దురదృష్టకరమని, డబ్బు ముందు మానవ ప్రాణాల విలువ తగ్గిపోయిందా అని ప్రశ్నించారు. పొన్నం ప్రభాకర్, భట్టి విక్రమార్క, అడ్లూరి లక్ష్మణ్‌లను ఉద్దేశించి మానవత్వంతో స్పందించాలని కోరారు. నెరేళ్ల బాధితుల కన్నీళ్ల పునాదులపై అధికారం అనుభవిస్తున్నారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వం ఏర్పడి 30 నెలలు గడిచినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఘటనపై కనీసం స్పందించలేదని విమర్శించారు. గత ప్రభుత్వంలోనూ, ప్రస్తుత ప్రభుత్వంలోనూ ప్రశ్నించే వారిపై దాష్టీకాలు కొనసాగుతున్నాయని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
నెరేళ్ల ఘటనపై రాజకీయాలకు అతీతంగా బాధితులకు అండగా నిలవాలి: కల్వకుంట్ల కవిత నెరేళ్ల ఘటన తెలంగాణ సమాజం సిగ్గుతో తలదించుకునే విషాదమని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆ సమయంలో పాలించిన కుటుంబంలో తాను కూడా భాగమైనందున బాధితులకు క్షమాపణ చెబుతున్నానని పేర్కొన్నారు. ఈ ఘటనపై రాజకీయాలు
చేయకుండా అన్ని పార్టీలు మానవత్వంతో స్పందించి బాధితులకు అండగా నిలవాలని కోరారు. ఇసుక కోసం ప్రాణాలు తీసే పరిస్థితి రావడం దురదృష్టకరమని, డబ్బు ముందు మానవ ప్రాణాల విలువ తగ్గిపోయిందా అని ప్రశ్నించారు. పొన్నం ప్రభాకర్, భట్టి విక్రమార్క, అడ్లూరి లక్ష్మణ్‌లను ఉద్దేశించి మానవత్వంతో స్పందించాలని కోరారు. నెరేళ్ల బాధితుల కన్నీళ్ల
పునాదులపై అధికారం అనుభవిస్తున్నారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వం ఏర్పడి 30 నెలలు గడిచినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఘటనపై కనీసం స్పందించలేదని విమర్శించారు. గత ప్రభుత్వంలోనూ, ప్రస్తుత ప్రభుత్వంలోనూ ప్రశ్నించే వారిపై దాష్టీకాలు కొనసాగుతున్నాయని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
- బీరప్పగడ్డ కమ్యూనిటీ హాల్‌కు తొలి అంతస్తు.. రూ.15 లక్షలతో నిర్మాణం బీరప్పగడ్డ డివిజన్‌లోని కమ్యూనిటీ హాల్ తొలి అంతస్తు నిర్మాణ పనులను రూ.15 లక్షలతో చేపడుతున్నట్లు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్ తెలిపారు. జీహెచ్‌ఎంసీ అధికారులతో కలిసి పనులను పరిశీలించి, వెంటిలేషన్, పెద్ద తలుపులు, నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు. పనులు త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.1
- కాప్రా–కుషాయిగూడలో మోస్తరు వర్షం.. చల్లబడిన వాతావరణం ప్రజల్లో ఆనందం కాప్రా, కుషాయిగూడ, ఏఎస్‌రావు నగర్, నేతాజీ నగర్ ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం నుంచి ఒక మోస్తరు వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా ఆయా ప్రాంతాల్లోని రోడ్లు చిత్తడిగా మారాయి. అయితే, వర్షంతో వాతావరణం పూర్తిగా చల్లబడటంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రం వేళ కురిసిన వర్షం కారణంగా కొంతమేర రహదారులపై వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ, ఇటీవల నెలకొన్న వేడి వాతావరణం నుంచి ఉపశమనం లభించిందని స్థానికులు తెలిపారు. వర్షం మరింత కురిస్తే భూగర్భ జలాలు పెరిగి, నీటి కొరత సమస్యకు కొంత ఉపశమనం కలుగుతుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.1
- నాగారంలో దంచి కొడుతున్న వర్షం నాగారం దమ్మైగూడ రోడ్లు జలమయం నాగారంలో దంచి కొడుతున్న వర్షం నాగారం దమ్మైగూడ రోడ్లు జలమయం వాహనదారుల అప్రమత్తంగా గుంతలు చూసుకొని వెళ్లాలని అదేవిధంగా పాదాచారులకు నీళ్లు మీద పడకుండా వాహనాలు నడపాలని సమన్వయం పాటిస్తూ డ్రైవింగ్ చేయాలని కోరనైనది1
- మేడిపల్లిలో దంచి కొడుతున్న వర్షం, గ్రామస్థులకు కాస్త ఊరట.. మేడిపల్లిలో దంచి కొడుతున్న వర్షం వాతావరణ శాఖ తెలిపినట్లుగానే పట్టణంలో పలు చోట్ల వర్షం...1
- ఘనాపూర్ పెద్దమ్మ ఆలయంలో చోరీ.. తాళాలు పగులగొట్టి అమ్మవారి నగలు అపహరణ తూప్రాన్ మండలం ఘనాపూర్ గ్రామంలోని పెద్దమ్మ ఆలయంలో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. మంగళవారం రాత్రి ఆలయానికి తాళాలు వేసి వెళ్లిన అనంతరం, బుధవారం ఉదయం పూజల కోసం వచ్చిన పూజారి నర్సింలు గేటు, ప్రధాన తలుపుల తాళాలు పగులగొట్టబడినట్లు గుర్తించారు. ఆలయంలోని అమ్మవారి ముక్కుపుడక, పుస్తె మట్టెలు, సౌండ్ బాక్స్‌ను దుండగులు అపహరించినట్లు వెల్లడైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి, ఆధారాలు సేకరించారు. బాధ్యులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గ్రామంలో వరుసగా జరుగుతున్న చోరీలతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తూ, రాత్రి వేళల్లో పోలీసు గస్తీని పెంచాలని కోరుతున్నారు.1
- హైడ్రాపై తప్పుడు ప్రచారం.. డబ్బులు ఖర్చు చేస్తున్నారని సీఎం ఆరోపణ హైడ్రాపై సోషల్ మీడియాలో డబ్బులు ఇచ్చి తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. హైడ్రాపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఇంకా పూర్తిగా పరిశీలించలేదని చెప్పారు. న్యాయస్థానం ఆదేశాలను అధ్యయనం చేసిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని, భవిష్యత్తులో కూడా హైడ్రా పనులు కొనసాగుతాయని పేర్కొన్నారు.1
- ఏడుపాయల శ్రీ వనదుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని బుధవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.1
- 10 కిలోల గంజాయినికి స్వాధీనం చేసుకున్న కొల్లేరు పోలీసులు ఒడిశా రాష్ట్రానికి చెందిన జయదేవ్ బిశ్వాస్ (23), ప్రశంజిత్ రాయ్ (22) అనే ఇద్దరు యువకులు 10 కిలోల గంజాయిని హైదరాబాద్‌కు తరలించి కొల్లూరు లేబర్ క్యాంపులో విక్రయించేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. నమ్మదగిన సమాచారం మేరకు వారిని అదుపులోకి తీసుకుని గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ అనంతరం నిందితులను అరెస్టు చేసిన ఎస్‌ఐపీ రాంబాబు శుక్రవారం రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు.1