Shuru
Apke Nagar Ki App…
కాప్రా–కుషాయిగూడలో మోస్తరు వర్షం.. చల్లబడిన వాతావరణం ప్రజల్లో ఆనందం కాప్రా, కుషాయిగూడ, ఏఎస్‌రావు నగర్, నేతాజీ నగర్ ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం నుంచి ఒక మోస్తరు వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా ఆయా ప్రాంతాల్లోని రోడ్లు చిత్తడిగా మారాయి. అయితే, వర్షంతో వాతావరణం పూర్తిగా చల్లబడటంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రం వేళ కురిసిన వర్షం కారణంగా కొంతమేర రహదారులపై వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ, ఇటీవల నెలకొన్న వేడి వాతావరణం నుంచి ఉపశమనం లభించిందని స్థానికులు తెలిపారు. వర్షం మరింత కురిస్తే భూగర్భ జలాలు పెరిగి, నీటి కొరత సమస్యకు కొంత ఉపశమనం కలుగుతుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Bhaskar Reddy
కాప్రా–కుషాయిగూడలో మోస్తరు వర్షం.. చల్లబడిన వాతావరణం ప్రజల్లో ఆనందం కాప్రా, కుషాయిగూడ, ఏఎస్‌రావు నగర్, నేతాజీ నగర్ ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం నుంచి ఒక మోస్తరు వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా ఆయా ప్రాంతాల్లోని రోడ్లు చిత్తడిగా మారాయి. అయితే, వర్షంతో వాతావరణం పూర్తిగా చల్లబడటంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రం వేళ కురిసిన వర్షం కారణంగా కొంతమేర రహదారులపై వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ, ఇటీవల నెలకొన్న వేడి వాతావరణం నుంచి ఉపశమనం లభించిందని స్థానికులు తెలిపారు. వర్షం మరింత కురిస్తే భూగర్భ జలాలు పెరిగి, నీటి కొరత సమస్యకు కొంత ఉపశమనం కలుగుతుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
More news from తెలంగాణ and nearby areas
- కుషాయిగూడ శివ సాయి నగర్ శివ సాయి దేవాలయంలో గురు పౌర్ణమి మహోత్సవం కుషాయిగూడ డివిజన్ పరిధిలోని శివసాయి నగర్‌లో ఉన్న శివసాయి దేవాలయంలో గురుపౌర్ణమి మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా తెల్లవారుజాము నుంచే కుటుంబ సమేతంగా వచ్చిన భక్తులు అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు అన్నప్రసాదం నిర్వహించనున్నారు. ఈ మహోత్సవంలో కాలనీలకు చెందిన కుటుంబ సభ్యులంతా పెద్ద సంఖ్యలో పాల్గొని గురుపూజ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆలయ నిర్వాహకులు ఆహ్వానించారు.1
- నెరేళ్ల ఘటనపై రాజకీయాలకు అతీతంగా బాధితులకు అండగా నిలవాలి: కల్వకుంట్ల కవిత నెరేళ్ల ఘటన తెలంగాణ సమాజం సిగ్గుతో తలదించుకునే విషాదమని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆ సమయంలో పాలించిన కుటుంబంలో తాను కూడా భాగమైనందున బాధితులకు క్షమాపణ చెబుతున్నానని పేర్కొన్నారు. ఈ ఘటనపై రాజకీయాలు చేయకుండా అన్ని పార్టీలు మానవత్వంతో స్పందించి బాధితులకు అండగా నిలవాలని కోరారు. ఇసుక కోసం ప్రాణాలు తీసే పరిస్థితి రావడం దురదృష్టకరమని, డబ్బు ముందు మానవ ప్రాణాల విలువ తగ్గిపోయిందా అని ప్రశ్నించారు. పొన్నం ప్రభాకర్, భట్టి విక్రమార్క, అడ్లూరి లక్ష్మణ్‌లను ఉద్దేశించి మానవత్వంతో స్పందించాలని కోరారు. నెరేళ్ల బాధితుల కన్నీళ్ల పునాదులపై అధికారం అనుభవిస్తున్నారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వం ఏర్పడి 30 నెలలు గడిచినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఘటనపై కనీసం స్పందించలేదని విమర్శించారు. గత ప్రభుత్వంలోనూ, ప్రస్తుత ప్రభుత్వంలోనూ ప్రశ్నించే వారిపై దాష్టీకాలు కొనసాగుతున్నాయని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.3
- చిలుకానగర్‌లో SIR ప్రావాస్ అభియాన్.. మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ పర్యటన బీజేపీ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు SIR మండల ప్రావాస్ అభియాన్‌లో భాగంగా మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి చిలుకానగర్ డివిజన్‌లో పర్యటించారు. పలు పోలింగ్ కేంద్రాలు, కాలనీల్లో బీఎల్‌వోలు, ఓటర్లతో మాట్లాడి SIR ప్రక్రియపై అవగాహన కల్పించారు. ఆగస్టు 3లోపు ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించాలని ఓటర్లకు సూచించారు.1
- ములుగు జిల్లాలో రాకాసి గాలులు నేలకూలిన వందల వృక్షాలు.... ములుగు జిల్లా మంగపేట మండలం కోమటిపల్లి వెళ్లే ప్రధాన రహదారి పక్కన మంగళవారం సాయంత్రం టోర్నడో తరహా సుడిగాలులు బీభత్సం సృష్టించాయి. ఒక్కసారిగా వీచిన బలమైన గాలులకు సుమారు 3-4 కి.మీ మేర వందలాది భారీ వృక్షాలు నేలకూలినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇదే తరహాలో 2024లో మేడారం అటవీ ప్రాంతంలో వేలాది చెట్లు నేలకూలిన ఘటనను స్థానికులు గుర్తు చేస్తున్నారు.1
- JAI BC ✊ SELF-RESPECT - POWER - Share 🔥 JAI TEENMAAR MALLANNA TRP Flag Unveiling Ceremony by Teenmar Mallanna in Mahabubnagar || Telangana Rajyadhikara Party1
- చెరువుల పరిరక్షణే లక్ష్యంగా.. శేరిలింగంపల్లిలో హైడ్రాకు భారీ మద్దతు! హైదరాబాద్‌లోని తమ్మిడికుంట చెరువు వద్ద హైడ్రా (HYDRAA) చేపడుతున్న చర్యలకు ప్రజా మద్దతు మరింత పెరుగుతోంది. చెరువులు, ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్ చేస్తున్న సాహసోపేతమైన ప్రయత్నాలకు సంఘీభావంగా శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఇన్-ఛార్జ్ జగదీశ్వర్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర మత్స్య సహకార సంఘం చైర్మన్ మేట్టు సాయికుమార్ ఆధ్వర్యంలో వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారీ వర్షం కురుస్తున్నప్పటికీ, ఏమాత్రం వెనకడుగు వేయకుండా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆక్రమణల చెర నుంచి జలవనరులను కాపాడుతూ, నగర భవిష్యత్తు కోసం హైడ్రా అడుగులు వేయడం అభినందనీయమని నాయకులు కొనియాడారు. ప్రభుత్వ భూములు, చెరువుల కబ్జాలపై హైడ్రా ముద్రించే కఠిన చర్యలు నిరంతరం కొనసాగాలని వారు ఈ సందర్భంగా ఆకాంక్షించారు.4
- రాష్ట్ర విద్యాశాఖ పై కేంద్రం పెత్తనం వల్లే అవకతవకలు: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర విద్యాశాఖపై కేంద్రం పెత్తనం వల్లే పరీక్షల్లో అవకతవకలు జరుగుతున్నాయి ఇప్పటికైనా రాష్ట్ర యూనివర్సిటీల మీద, పరీక్షల మీద కేంద్రం పెత్తనం చెలాయించడం ఆపేయాలి –రేవంత్ రెడ్డి1
- బీరప్పగడ్డ కమ్యూనిటీ హాల్‌కు తొలి అంతస్తు.. రూ.15 లక్షలతో నిర్మాణం బీరప్పగడ్డ డివిజన్‌లోని కమ్యూనిటీ హాల్ తొలి అంతస్తు నిర్మాణ పనులను రూ.15 లక్షలతో చేపడుతున్నట్లు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్ తెలిపారు. జీహెచ్‌ఎంసీ అధికారులతో కలిసి పనులను పరిశీలించి, వెంటిలేషన్, పెద్ద తలుపులు, నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు. పనులు త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.1