logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ములుగు జిల్లాలో రాకాసి గాలులు నేలకూలిన వందల వృక్షాలు.... ములుగు జిల్లా మంగపేట మండలం కోమటిపల్లి వెళ్లే ప్రధాన రహదారి పక్కన మంగళవారం సాయంత్రం టోర్నడో తరహా సుడిగాలులు బీభత్సం సృష్టించాయి. ఒక్కసారిగా వీచిన బలమైన గాలులకు సుమారు 3-4 కి.మీ మేర వందలాది భారీ వృక్షాలు నేలకూలినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇదే తరహాలో 2024లో మేడారం అటవీ ప్రాంతంలో వేలాది చెట్లు నేలకూలిన ఘటనను స్థానికులు గుర్తు చేస్తున్నారు.

16 hrs ago
user_Journalist Anil kumar
Journalist Anil kumar
Local News Reporter Medipally, Medchal Malkajgiri•
16 hrs ago

ములుగు జిల్లాలో రాకాసి గాలులు నేలకూలిన వందల వృక్షాలు.... ములుగు జిల్లా మంగపేట మండలం కోమటిపల్లి వెళ్లే ప్రధాన రహదారి పక్కన మంగళవారం సాయంత్రం టోర్నడో తరహా సుడిగాలులు బీభత్సం సృష్టించాయి. ఒక్కసారిగా వీచిన బలమైన గాలులకు సుమారు 3-4 కి.మీ మేర వందలాది భారీ వృక్షాలు నేలకూలినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇదే తరహాలో 2024లో మేడారం అటవీ ప్రాంతంలో వేలాది చెట్లు నేలకూలిన ఘటనను స్థానికులు గుర్తు చేస్తున్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • కాప్రా–కుషాయిగూడలో మోస్తరు వర్షం.. చల్లబడిన వాతావరణం ప్రజల్లో ఆనందం కాప్రా, కుషాయిగూడ, ఏఎస్‌రావు నగర్, నేతాజీ నగర్ ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం నుంచి ఒక మోస్తరు వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా ఆయా ప్రాంతాల్లోని రోడ్లు చిత్తడిగా మారాయి. అయితే, వర్షంతో వాతావరణం పూర్తిగా చల్లబడటంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రం వేళ కురిసిన వర్షం కారణంగా కొంతమేర రహదారులపై వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ, ఇటీవల నెలకొన్న వేడి వాతావరణం నుంచి ఉపశమనం లభించిందని స్థానికులు తెలిపారు. వర్షం మరింత కురిస్తే భూగర్భ జలాలు పెరిగి, నీటి కొరత సమస్యకు కొంత ఉపశమనం కలుగుతుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
    1
    కాప్రా–కుషాయిగూడలో మోస్తరు వర్షం.. చల్లబడిన వాతావరణం ప్రజల్లో ఆనందం


కాప్రా, కుషాయిగూడ, ఏఎస్‌రావు నగర్, నేతాజీ నగర్ ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం నుంచి ఒక మోస్తరు వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా ఆయా ప్రాంతాల్లోని రోడ్లు చిత్తడిగా మారాయి. అయితే, వర్షంతో వాతావరణం పూర్తిగా చల్లబడటంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
సాయంత్రం వేళ కురిసిన వర్షం కారణంగా కొంతమేర రహదారులపై వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ, ఇటీవల నెలకొన్న వేడి వాతావరణం నుంచి ఉపశమనం లభించిందని స్థానికులు తెలిపారు. వర్షం మరింత కురిస్తే భూగర్భ జలాలు పెరిగి, నీటి కొరత సమస్యకు కొంత ఉపశమనం కలుగుతుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
    user_Bhaskar Reddy
    Bhaskar Reddy
    Detective కాప్రా, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    16 hrs ago
  • మేడిపల్లిలో దంచి కొడుతున్న వర్షం, గ్రామస్థులకు కాస్త ఊరట.. మేడిపల్లిలో దంచి కొడుతున్న వర్షం వాతావరణ శాఖ తెలిపినట్లుగానే పట్టణంలో పలు చోట్ల వర్షం...
    1
    మేడిపల్లిలో దంచి కొడుతున్న వర్షం, గ్రామస్థులకు కాస్త ఊరట..
మేడిపల్లిలో దంచి కొడుతున్న వర్షం వాతావరణ శాఖ తెలిపినట్లుగానే పట్టణంలో పలు చోట్ల వర్షం...
    user_Journalist Anil kumar
    Journalist Anil kumar
    Local News Reporter Medipally, Medchal Malkajgiri•
    17 hrs ago
  • ఏడుపాయల శ్రీ వనదుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని బుధవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.
    1
    ఏడుపాయల శ్రీ వనదుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి
శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని బుధవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.
    user_KUMAR
    KUMAR
    పటాన్‌చెరు, సంగారెడ్డి, తెలంగాణ•
    3 hrs ago
  • రాజాపేటలోని శ్రీరామకృష్ణ సాయి మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు రాజపేట మండలంలోని శ్రీరామకృష్ణ సాయి మందిరంలో గురు పౌర్ణమి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఆలయ శాశ్వత అధ్యక్షులు నంగునూరు చంద్రశేఖర్ గుప్తా, ఆలయ అర్చకులు చలివేదుల వెంకట రామకృష్ణ ప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో పంచామృతాభిషేకం, గురుపాదుక తీర్థ పూజ, పల్లకి సేవ, మహాదాశిర్వచనం నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
    1
    రాజాపేటలోని శ్రీరామకృష్ణ సాయి మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు
రాజపేట మండలంలోని శ్రీరామకృష్ణ సాయి మందిరంలో గురు పౌర్ణమి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఆలయ శాశ్వత అధ్యక్షులు నంగునూరు చంద్రశేఖర్ గుప్తా, ఆలయ అర్చకులు చలివేదుల వెంకట రామకృష్ణ ప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో పంచామృతాభిషేకం, గురుపాదుక తీర్థ పూజ, పల్లకి సేవ, మహాదాశిర్వచనం నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
    user_SHEKHAR
    SHEKHAR
    రాజపేట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    12 min ago
  • యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో తగ్గిన భక్తుల రద్దీ యాదగిరిగుట్టలో నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో బుధవారం భక్తుల రద్దీ తగ్గింది. స్వామివారి దర్శనానికి అరగంట సమయం మాత్రమే పడుతుంది. స్వామివారికి శాస్త్రోక్తంగా నిత్య కైంకర్యాలు కొనసాగుతున్నాయి. భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకుంటున్నారు.
    1
    యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో తగ్గిన భక్తుల రద్దీ
యాదగిరిగుట్టలో నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో బుధవారం భక్తుల రద్దీ తగ్గింది. స్వామివారి దర్శనానికి అరగంట సమయం మాత్రమే
పడుతుంది. స్వామివారికి శాస్త్రోక్తంగా నిత్య కైంకర్యాలు కొనసాగుతున్నాయి. భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకుంటున్నారు.
    user_P.srinu
    P.srinu
    యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    30 min ago
  • హైడ్రాపై తప్పుడు ప్రచారం.. డబ్బులు ఖర్చు చేస్తున్నారని సీఎం ఆరోపణ హైడ్రాపై సోషల్ మీడియాలో డబ్బులు ఇచ్చి తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. హైడ్రాపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఇంకా పూర్తిగా పరిశీలించలేదని చెప్పారు. న్యాయస్థానం ఆదేశాలను అధ్యయనం చేసిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని, భవిష్యత్తులో కూడా హైడ్రా పనులు కొనసాగుతాయని పేర్కొన్నారు.
    1
    హైడ్రాపై తప్పుడు ప్రచారం.. డబ్బులు ఖర్చు చేస్తున్నారని సీఎం ఆరోపణ
హైడ్రాపై సోషల్ మీడియాలో డబ్బులు ఇచ్చి తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. హైడ్రాపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఇంకా పూర్తిగా పరిశీలించలేదని చెప్పారు. న్యాయస్థానం ఆదేశాలను అధ్యయనం చేసిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని, భవిష్యత్తులో కూడా హైడ్రా పనులు కొనసాగుతాయని పేర్కొన్నారు.
    user_FOCUS MEDIA
    FOCUS MEDIA
    Content Creator (YouTuber) కాప్రా, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    15 hrs ago
  • జిన్నారం మండలం బొల్లారం డివిజన్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత బొల్లారం గ్రామ బీసీ కాలనీలో సర్వే నంబర్ 42లోని ప్రభుత్వ భూమిపై అక్రమంగా నిర్మిస్తున్న భవనాన్ని అధికారులు కూల్చివేశారు. ఈ చర్యతో సుమారు రూ.50 లక్షల విలువైన ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమణదారుల నుంచి రక్షించినట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ భూముల ఆక్రమణలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు.
    1
    జిన్నారం మండలం బొల్లారం డివిజన్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత
బొల్లారం గ్రామ బీసీ కాలనీలో సర్వే నంబర్ 42లోని ప్రభుత్వ భూమిపై అక్రమంగా నిర్మిస్తున్న భవనాన్ని అధికారులు కూల్చివేశారు. ఈ చర్యతో సుమారు రూ.50 లక్షల విలువైన ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమణదారుల నుంచి రక్షించినట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ భూముల ఆక్రమణలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు.
    user_KUMAR
    KUMAR
    పటాన్‌చెరు, సంగారెడ్డి, తెలంగాణ•
    3 hrs ago
  • భక్తి ఉండాలి.. కానీ ప్రాణాలకు ప్రమాదం కలిగించే మార్గాలను ఎంచుకోవద్దని సూచనలు! తిరువణ్ణామలై సందర్శనలో మోక్షమార్గం చేసే భక్తులను తమిళ నెటిజన్లు హేళనగా చూస్తున్నారు. ఇటీవల ఓ తెలుగు భక్తుడు మరణించడం, మరో మహిళ అందులో ఇరుక్కుపోవడంతో అవమానించేలా పోస్టులు చేస్తున్నారు. 'ఇలాంటి తెలివిలేని పని తెలుగు వాళ్లే చేస్తారు' అని వీడియోలు షేర్ చేస్తున్నారు. కాగా భక్తి ఉండాలి కానీ ప్రాణాలను రిస్క్ చేసి మోక్షమార్గంలోకి వెళ్లొద్దని పలువురు సూచిస్తున్నారు. #TeluguOne #Tiruvannamalai #TeluguDevotees #TempleNews
    1
    భక్తి ఉండాలి.. కానీ ప్రాణాలకు ప్రమాదం కలిగించే మార్గాలను ఎంచుకోవద్దని సూచనలు! 
తిరువణ్ణామలై సందర్శనలో మోక్షమార్గం చేసే భక్తులను తమిళ నెటిజన్లు హేళనగా చూస్తున్నారు. ఇటీవల ఓ తెలుగు భక్తుడు మరణించడం, మరో మహిళ అందులో ఇరుక్కుపోవడంతో అవమానించేలా పోస్టులు చేస్తున్నారు. 'ఇలాంటి తెలివిలేని పని తెలుగు వాళ్లే చేస్తారు' అని వీడియోలు షేర్ చేస్తున్నారు. కాగా భక్తి ఉండాలి కానీ ప్రాణాలను రిస్క్ చేసి మోక్షమార్గంలోకి వెళ్లొద్దని పలువురు సూచిస్తున్నారు.
#TeluguOne #Tiruvannamalai #TeluguDevotees #TempleNews
    user_GB MAHENDAR
    GB MAHENDAR
    Photographer అమీర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.