logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఏడుపాయల శ్రీ వనదుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని బుధవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.

6 hrs ago
user_KUMAR
KUMAR
పటాన్‌చెరు, సంగారెడ్డి, తెలంగాణ•
6 hrs ago

ఏడుపాయల శ్రీ వనదుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని బుధవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.

More news from తెలంగాణ and nearby areas
  • వనదుర్గామాత ఆలయం ముందు నుంచి గంగమ్మ ఉరకలేస్తూ ప్రవహిస్తున్న దృశ్యాలు ఏడుపాయల వనదుర్గా ప్రాజెక్టు జలకళతో కళకళలాడుతోంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న విస్తార వర్షాలు, ఎగువ ప్రాంతాల నుంచి భారీగా చేరుతున్న వరద నీటితో మంజీరా నది పాయలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వనదుర్గామాత ఆలయం ముందు నుంచి గంగమ్మ ఉరకలేస్తూ ప్రవహిస్తున్న దృశ్యాలు భక్తులను, సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. పూర్తిస్థాయిలో నిండిన ప్రాజెక్టు ఆనకట్ట ప్రస్తుతం పొంగిపొర్లుతుండగా, పరిసర ప్రాంతాలు ప్రకృతి అందాలతో కనువిందు చేస్తున్నాయి. ప్రాజెక్టులో సమృద్ధిగా నీరు చేరడంతో సాగునీటి సమస్య తీరుతుందనే ఆశ రైతన్నల్లో నెలకొంది. ఈ సీజన్‌లో పంటలకు నీటి కొరత ఉండదన్న నమ్మకంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ప్రకృతి సోయగాలు, మరోవైపు రైతుల ముఖాల్లో కనిపిస్తున్న చిరునవ్వులు ఏడుపాయల ప్రాంతానికి కొత్త కళను తీసుకొచ్చాయి.
    1
    వనదుర్గామాత ఆలయం ముందు నుంచి గంగమ్మ ఉరకలేస్తూ ప్రవహిస్తున్న దృశ్యాలు
ఏడుపాయల వనదుర్గా ప్రాజెక్టు జలకళతో కళకళలాడుతోంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న విస్తార వర్షాలు, ఎగువ ప్రాంతాల నుంచి భారీగా చేరుతున్న వరద నీటితో మంజీరా నది పాయలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వనదుర్గామాత ఆలయం ముందు నుంచి గంగమ్మ ఉరకలేస్తూ ప్రవహిస్తున్న దృశ్యాలు భక్తులను, సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి.
పూర్తిస్థాయిలో నిండిన ప్రాజెక్టు ఆనకట్ట ప్రస్తుతం పొంగిపొర్లుతుండగా, పరిసర ప్రాంతాలు ప్రకృతి అందాలతో కనువిందు చేస్తున్నాయి. ప్రాజెక్టులో సమృద్ధిగా నీరు చేరడంతో సాగునీటి సమస్య తీరుతుందనే ఆశ రైతన్నల్లో నెలకొంది. ఈ సీజన్‌లో పంటలకు నీటి కొరత ఉండదన్న నమ్మకంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ప్రకృతి సోయగాలు, మరోవైపు రైతుల ముఖాల్లో కనిపిస్తున్న చిరునవ్వులు ఏడుపాయల ప్రాంతానికి కొత్త కళను తీసుకొచ్చాయి.
    user_Priya
    Priya
    నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
    4 hrs ago
  • బీరప్పగడ్డ కమ్యూనిటీ హాల్‌కు తొలి అంతస్తు.. రూ.15 లక్షలతో నిర్మాణం బీరప్పగడ్డ డివిజన్‌లోని కమ్యూనిటీ హాల్ తొలి అంతస్తు నిర్మాణ పనులను రూ.15 లక్షలతో చేపడుతున్నట్లు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్ తెలిపారు. జీహెచ్‌ఎంసీ అధికారులతో కలిసి పనులను పరిశీలించి, వెంటిలేషన్, పెద్ద తలుపులు, నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు. పనులు త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.
    1
    బీరప్పగడ్డ కమ్యూనిటీ హాల్‌కు తొలి అంతస్తు.. రూ.15 లక్షలతో నిర్మాణం
బీరప్పగడ్డ డివిజన్‌లోని కమ్యూనిటీ హాల్ తొలి అంతస్తు నిర్మాణ పనులను రూ.15 లక్షలతో చేపడుతున్నట్లు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్ తెలిపారు. జీహెచ్‌ఎంసీ అధికారులతో కలిసి పనులను పరిశీలించి, వెంటిలేషన్, పెద్ద తలుపులు, నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు. పనులు త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.
    user_FOCUS MEDIA
    FOCUS MEDIA
    Content Creator (YouTuber) కాప్రా, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    17 hrs ago
  • కాప్రా–కుషాయిగూడలో మోస్తరు వర్షం.. చల్లబడిన వాతావరణం ప్రజల్లో ఆనందం కాప్రా, కుషాయిగూడ, ఏఎస్‌రావు నగర్, నేతాజీ నగర్ ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం నుంచి ఒక మోస్తరు వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా ఆయా ప్రాంతాల్లోని రోడ్లు చిత్తడిగా మారాయి. అయితే, వర్షంతో వాతావరణం పూర్తిగా చల్లబడటంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రం వేళ కురిసిన వర్షం కారణంగా కొంతమేర రహదారులపై వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ, ఇటీవల నెలకొన్న వేడి వాతావరణం నుంచి ఉపశమనం లభించిందని స్థానికులు తెలిపారు. వర్షం మరింత కురిస్తే భూగర్భ జలాలు పెరిగి, నీటి కొరత సమస్యకు కొంత ఉపశమనం కలుగుతుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
    1
    కాప్రా–కుషాయిగూడలో మోస్తరు వర్షం.. చల్లబడిన వాతావరణం ప్రజల్లో ఆనందం


కాప్రా, కుషాయిగూడ, ఏఎస్‌రావు నగర్, నేతాజీ నగర్ ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం నుంచి ఒక మోస్తరు వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా ఆయా ప్రాంతాల్లోని రోడ్లు చిత్తడిగా మారాయి. అయితే, వర్షంతో వాతావరణం పూర్తిగా చల్లబడటంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
సాయంత్రం వేళ కురిసిన వర్షం కారణంగా కొంతమేర రహదారులపై వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ, ఇటీవల నెలకొన్న వేడి వాతావరణం నుంచి ఉపశమనం లభించిందని స్థానికులు తెలిపారు. వర్షం మరింత కురిస్తే భూగర్భ జలాలు పెరిగి, నీటి కొరత సమస్యకు కొంత ఉపశమనం కలుగుతుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
    user_Bhaskar Reddy
    Bhaskar Reddy
    Detective కాప్రా, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    19 hrs ago
  • మేడిపల్లిలో దంచి కొడుతున్న వర్షం, గ్రామస్థులకు కాస్త ఊరట.. మేడిపల్లిలో దంచి కొడుతున్న వర్షం వాతావరణ శాఖ తెలిపినట్లుగానే పట్టణంలో పలు చోట్ల వర్షం...
    1
    మేడిపల్లిలో దంచి కొడుతున్న వర్షం, గ్రామస్థులకు కాస్త ఊరట..
మేడిపల్లిలో దంచి కొడుతున్న వర్షం వాతావరణ శాఖ తెలిపినట్లుగానే పట్టణంలో పలు చోట్ల వర్షం...
    user_Journalist Anil kumar
    Journalist Anil kumar
    Local News Reporter Medipally, Medchal Malkajgiri•
    20 hrs ago
  • రాష్ట్ర విద్యాశాఖ పై కేంద్రం పెత్తనం వల్లే అవకతవకలు: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర విద్యాశాఖపై కేంద్రం పెత్తనం వల్లే పరీక్షల్లో అవకతవకలు జరుగుతున్నాయి ఇప్పటికైనా రాష్ట్ర యూనివర్సిటీల మీద, పరీక్షల మీద కేంద్రం పెత్తనం చెలాయించడం ఆపేయాలి –రేవంత్ రెడ్డి
    1
    రాష్ట్ర విద్యాశాఖ పై కేంద్రం పెత్తనం వల్లే అవకతవకలు: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
రాష్ట్ర విద్యాశాఖపై కేంద్రం పెత్తనం వల్లే పరీక్షల్లో అవకతవకలు జరుగుతున్నాయి
ఇప్పటికైనా రాష్ట్ర యూనివర్సిటీల మీద, పరీక్షల మీద కేంద్రం పెత్తనం చెలాయించడం ఆపేయాలి
–రేవంత్ రెడ్డి
    user_Sangareddy News
    Sangareddy News
    Local News Reporter Saidabad, Hyderabad•
    21 hrs ago
  • జిన్నారం మండలం బొల్లారం డివిజన్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత బొల్లారం గ్రామ బీసీ కాలనీలో సర్వే నంబర్ 42లోని ప్రభుత్వ భూమిపై అక్రమంగా నిర్మిస్తున్న భవనాన్ని అధికారులు కూల్చివేశారు. ఈ చర్యతో సుమారు రూ.50 లక్షల విలువైన ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమణదారుల నుంచి రక్షించినట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ భూముల ఆక్రమణలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు.
    1
    జిన్నారం మండలం బొల్లారం డివిజన్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత
బొల్లారం గ్రామ బీసీ కాలనీలో సర్వే నంబర్ 42లోని ప్రభుత్వ భూమిపై అక్రమంగా నిర్మిస్తున్న భవనాన్ని అధికారులు కూల్చివేశారు. ఈ చర్యతో సుమారు రూ.50 లక్షల విలువైన ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమణదారుల నుంచి రక్షించినట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ భూముల ఆక్రమణలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు.
    user_KUMAR
    KUMAR
    పటాన్‌చెరు, సంగారెడ్డి, తెలంగాణ•
    6 hrs ago
  • తూప్రాన్ పట్టణంలోని శ్రీ షిరిడి సాయి సేవా ట్రస్టులో గురు పౌర్ణమి మహోత్సవాలు తూప్రాన్ పట్టణంలోని శ్రీ షిరిడి సాయి సేవా ట్రస్టులో గురు పౌర్ణమి మహోత్సవాలు ఆధ్యాత్మిక వాతావరణంలో వైభవంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున నిర్వహించిన నగర సంకీర్తనతో వేడుకలకు శ్రీకారం చుట్టగా, అనంతరం కాకడ హారతి, మహాభిషేకం, మహాగణపతి పూజలను వేదమంత్రాల నడుమ ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు ట్రస్టుకు చేరుకుని బాబా దర్శనం చేసుకుంటూ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. సాయినామ స్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగగా, భక్తులు గురువు మహిమను స్మరిస్తూ భక్తిశ్రద్ధలతో సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గురు పౌర్ణమి సందర్భంగా ట్రస్టు ప్రాంగణం ఆధ్యాత్మిక శోభతో కళకళలాడింది.
    1
    తూప్రాన్ పట్టణంలోని శ్రీ షిరిడి సాయి సేవా ట్రస్టులో గురు పౌర్ణమి మహోత్సవాలు
తూప్రాన్ పట్టణంలోని శ్రీ షిరిడి సాయి సేవా ట్రస్టులో గురు పౌర్ణమి మహోత్సవాలు ఆధ్యాత్మిక వాతావరణంలో వైభవంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున నిర్వహించిన నగర సంకీర్తనతో వేడుకలకు శ్రీకారం చుట్టగా, అనంతరం కాకడ హారతి, మహాభిషేకం, మహాగణపతి పూజలను వేదమంత్రాల నడుమ ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు ట్రస్టుకు చేరుకుని బాబా దర్శనం చేసుకుంటూ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. సాయినామ స్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగగా, భక్తులు గురువు మహిమను స్మరిస్తూ భక్తిశ్రద్ధలతో సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గురు పౌర్ణమి సందర్భంగా ట్రస్టు ప్రాంగణం ఆధ్యాత్మిక శోభతో కళకళలాడింది.
    user_Priya
    Priya
    నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
    4 hrs ago
  • భక్తి ఉండాలి.. కానీ ప్రాణాలకు ప్రమాదం కలిగించే మార్గాలను ఎంచుకోవద్దని సూచనలు! తిరువణ్ణామలై సందర్శనలో మోక్షమార్గం చేసే భక్తులను తమిళ నెటిజన్లు హేళనగా చూస్తున్నారు. ఇటీవల ఓ తెలుగు భక్తుడు మరణించడం, మరో మహిళ అందులో ఇరుక్కుపోవడంతో అవమానించేలా పోస్టులు చేస్తున్నారు. 'ఇలాంటి తెలివిలేని పని తెలుగు వాళ్లే చేస్తారు' అని వీడియోలు షేర్ చేస్తున్నారు. కాగా భక్తి ఉండాలి కానీ ప్రాణాలను రిస్క్ చేసి మోక్షమార్గంలోకి వెళ్లొద్దని పలువురు సూచిస్తున్నారు. #TeluguOne #Tiruvannamalai #TeluguDevotees #TempleNews
    1
    భక్తి ఉండాలి.. కానీ ప్రాణాలకు ప్రమాదం కలిగించే మార్గాలను ఎంచుకోవద్దని సూచనలు! 
తిరువణ్ణామలై సందర్శనలో మోక్షమార్గం చేసే భక్తులను తమిళ నెటిజన్లు హేళనగా చూస్తున్నారు. ఇటీవల ఓ తెలుగు భక్తుడు మరణించడం, మరో మహిళ అందులో ఇరుక్కుపోవడంతో అవమానించేలా పోస్టులు చేస్తున్నారు. 'ఇలాంటి తెలివిలేని పని తెలుగు వాళ్లే చేస్తారు' అని వీడియోలు షేర్ చేస్తున్నారు. కాగా భక్తి ఉండాలి కానీ ప్రాణాలను రిస్క్ చేసి మోక్షమార్గంలోకి వెళ్లొద్దని పలువురు సూచిస్తున్నారు.
#TeluguOne #Tiruvannamalai #TeluguDevotees #TempleNews
    user_GB MAHENDAR
    GB MAHENDAR
    Photographer అమీర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.