logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

జిన్నారం మండలం బొల్లారం డివిజన్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత బొల్లారం గ్రామ బీసీ కాలనీలో సర్వే నంబర్ 42లోని ప్రభుత్వ భూమిపై అక్రమంగా నిర్మిస్తున్న భవనాన్ని అధికారులు కూల్చివేశారు. ఈ చర్యతో సుమారు రూ.50 లక్షల విలువైన ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమణదారుల నుంచి రక్షించినట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ భూముల ఆక్రమణలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు.

6 hrs ago
user_KUMAR
KUMAR
పటాన్‌చెరు, సంగారెడ్డి, తెలంగాణ•
6 hrs ago

జిన్నారం మండలం బొల్లారం డివిజన్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత బొల్లారం గ్రామ బీసీ కాలనీలో సర్వే నంబర్ 42లోని ప్రభుత్వ భూమిపై అక్రమంగా నిర్మిస్తున్న భవనాన్ని అధికారులు కూల్చివేశారు. ఈ చర్యతో సుమారు రూ.50 లక్షల విలువైన ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమణదారుల నుంచి రక్షించినట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ భూముల ఆక్రమణలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు.

More news from తెలంగాణ and nearby areas
  • ఘనాపూర్ పెద్దమ్మ ఆలయంలో చోరీ.. తాళాలు పగులగొట్టి అమ్మవారి నగలు అపహరణ తూప్రాన్ మండలం ఘనాపూర్ గ్రామంలోని పెద్దమ్మ ఆలయంలో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. మంగళవారం రాత్రి ఆలయానికి తాళాలు వేసి వెళ్లిన అనంతరం, బుధవారం ఉదయం పూజల కోసం వచ్చిన పూజారి నర్సింలు గేటు, ప్రధాన తలుపుల తాళాలు పగులగొట్టబడినట్లు గుర్తించారు. ఆలయంలోని అమ్మవారి ముక్కుపుడక, పుస్తె మట్టెలు, సౌండ్ బాక్స్‌ను దుండగులు అపహరించినట్లు వెల్లడైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి, ఆధారాలు సేకరించారు. బాధ్యులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గ్రామంలో వరుసగా జరుగుతున్న చోరీలతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తూ, రాత్రి వేళల్లో పోలీసు గస్తీని పెంచాలని కోరుతున్నారు.
    1
    ఘనాపూర్ పెద్దమ్మ ఆలయంలో చోరీ.. తాళాలు పగులగొట్టి అమ్మవారి నగలు అపహరణ
తూప్రాన్ మండలం ఘనాపూర్ గ్రామంలోని పెద్దమ్మ ఆలయంలో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. మంగళవారం రాత్రి ఆలయానికి తాళాలు వేసి వెళ్లిన అనంతరం, బుధవారం ఉదయం పూజల కోసం వచ్చిన పూజారి నర్సింలు గేటు, ప్రధాన తలుపుల తాళాలు పగులగొట్టబడినట్లు గుర్తించారు.
ఆలయంలోని అమ్మవారి ముక్కుపుడక, పుస్తె మట్టెలు, సౌండ్ బాక్స్‌ను దుండగులు అపహరించినట్లు వెల్లడైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి, ఆధారాలు సేకరించారు. బాధ్యులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గ్రామంలో వరుసగా జరుగుతున్న చోరీలతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తూ, రాత్రి వేళల్లో పోలీసు గస్తీని పెంచాలని కోరుతున్నారు.
    user_Priya
    Priya
    నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
    3 hrs ago
  • చెరువుల పరిరక్షణే లక్ష్యంగా.. శేరిలింగంపల్లిలో హైడ్రాకు భారీ మద్దతు! హైదరాబాద్‌లోని తమ్మిడికుంట చెరువు వద్ద హైడ్రా (HYDRAA) చేపడుతున్న చర్యలకు ప్రజా మద్దతు మరింత పెరుగుతోంది. చెరువులు, ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్ చేస్తున్న సాహసోపేతమైన ప్రయత్నాలకు సంఘీభావంగా శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఇన్-ఛార్జ్ జగదీశ్వర్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర మత్స్య సహకార సంఘం చైర్మన్ మేట్టు సాయికుమార్ ఆధ్వర్యంలో వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారీ వర్షం కురుస్తున్నప్పటికీ, ఏమాత్రం వెనకడుగు వేయకుండా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆక్రమణల చెర నుంచి జలవనరులను కాపాడుతూ, నగర భవిష్యత్తు కోసం హైడ్రా అడుగులు వేయడం అభినందనీయమని నాయకులు కొనియాడారు. ప్రభుత్వ భూములు, చెరువుల కబ్జాలపై హైడ్రా ముద్రించే కఠిన చర్యలు నిరంతరం కొనసాగాలని వారు ఈ సందర్భంగా ఆకాంక్షించారు.
    4
    చెరువుల పరిరక్షణే లక్ష్యంగా.. శేరిలింగంపల్లిలో హైడ్రాకు భారీ మద్దతు!
హైదరాబాద్‌లోని తమ్మిడికుంట చెరువు వద్ద హైడ్రా (HYDRAA) చేపడుతున్న చర్యలకు ప్రజా మద్దతు మరింత పెరుగుతోంది. చెరువులు, ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్ చేస్తున్న సాహసోపేతమైన ప్రయత్నాలకు సంఘీభావంగా శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఇన్-ఛార్జ్ జగదీశ్వర్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర మత్స్య సహకార సంఘం చైర్మన్ మేట్టు సాయికుమార్ ఆధ్వర్యంలో వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భారీ వర్షం కురుస్తున్నప్పటికీ, ఏమాత్రం వెనకడుగు వేయకుండా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆక్రమణల చెర నుంచి జలవనరులను కాపాడుతూ, నగర భవిష్యత్తు కోసం హైడ్రా అడుగులు వేయడం అభినందనీయమని నాయకులు కొనియాడారు. ప్రభుత్వ భూములు, చెరువుల కబ్జాలపై హైడ్రా ముద్రించే కఠిన చర్యలు నిరంతరం కొనసాగాలని వారు ఈ సందర్భంగా ఆకాంక్షించారు.
    user_GB MAHENDAR
    GB MAHENDAR
    Photographer అమీర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    4 hrs ago
  • నెరేళ్ల ఘటనపై రాజకీయాలకు అతీతంగా బాధితులకు అండగా నిలవాలి: కల్వకుంట్ల కవిత నెరేళ్ల ఘటన తెలంగాణ సమాజం సిగ్గుతో తలదించుకునే విషాదమని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆ సమయంలో పాలించిన కుటుంబంలో తాను కూడా భాగమైనందున బాధితులకు క్షమాపణ చెబుతున్నానని పేర్కొన్నారు. ఈ ఘటనపై రాజకీయాలు చేయకుండా అన్ని పార్టీలు మానవత్వంతో స్పందించి బాధితులకు అండగా నిలవాలని కోరారు. ఇసుక కోసం ప్రాణాలు తీసే పరిస్థితి రావడం దురదృష్టకరమని, డబ్బు ముందు మానవ ప్రాణాల విలువ తగ్గిపోయిందా అని ప్రశ్నించారు. పొన్నం ప్రభాకర్, భట్టి విక్రమార్క, అడ్లూరి లక్ష్మణ్‌లను ఉద్దేశించి మానవత్వంతో స్పందించాలని కోరారు. నెరేళ్ల బాధితుల కన్నీళ్ల పునాదులపై అధికారం అనుభవిస్తున్నారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వం ఏర్పడి 30 నెలలు గడిచినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఘటనపై కనీసం స్పందించలేదని విమర్శించారు. గత ప్రభుత్వంలోనూ, ప్రస్తుత ప్రభుత్వంలోనూ ప్రశ్నించే వారిపై దాష్టీకాలు కొనసాగుతున్నాయని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
    3
    నెరేళ్ల ఘటనపై రాజకీయాలకు అతీతంగా బాధితులకు అండగా నిలవాలి: కల్వకుంట్ల కవిత
నెరేళ్ల ఘటన తెలంగాణ సమాజం సిగ్గుతో తలదించుకునే విషాదమని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆ సమయంలో పాలించిన కుటుంబంలో తాను కూడా భాగమైనందున బాధితులకు క్షమాపణ చెబుతున్నానని పేర్కొన్నారు. ఈ ఘటనపై రాజకీయాలు చేయకుండా అన్ని పార్టీలు మానవత్వంతో స్పందించి బాధితులకు అండగా నిలవాలని కోరారు.
ఇసుక కోసం ప్రాణాలు తీసే పరిస్థితి రావడం దురదృష్టకరమని, డబ్బు ముందు మానవ ప్రాణాల విలువ తగ్గిపోయిందా అని ప్రశ్నించారు. పొన్నం ప్రభాకర్, భట్టి విక్రమార్క, అడ్లూరి లక్ష్మణ్‌లను ఉద్దేశించి మానవత్వంతో స్పందించాలని కోరారు. నెరేళ్ల బాధితుల కన్నీళ్ల పునాదులపై అధికారం అనుభవిస్తున్నారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ప్రభుత్వం ఏర్పడి 30 నెలలు గడిచినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఘటనపై కనీసం స్పందించలేదని విమర్శించారు. గత ప్రభుత్వంలోనూ, ప్రస్తుత ప్రభుత్వంలోనూ ప్రశ్నించే వారిపై దాష్టీకాలు కొనసాగుతున్నాయని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
    user_Jeetender
    Jeetender
    సికింద్రాబాద్, హైదరాబాద్, తెలంగాణ•
    17 hrs ago
  • కుషాయిగూడ శివ సాయి నగర్ శివ సాయి దేవాలయంలో గురు పౌర్ణమి మహోత్సవం కుషాయిగూడ డివిజన్ పరిధిలోని శివసాయి నగర్‌లో ఉన్న శివసాయి దేవాలయంలో గురుపౌర్ణమి మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా తెల్లవారుజాము నుంచే కుటుంబ సమేతంగా వచ్చిన భక్తులు అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు అన్నప్రసాదం నిర్వహించనున్నారు. ఈ మహోత్సవంలో కాలనీలకు చెందిన కుటుంబ సభ్యులంతా పెద్ద సంఖ్యలో పాల్గొని గురుపూజ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆలయ నిర్వాహకులు ఆహ్వానించారు.
    1
    కుషాయిగూడ శివ సాయి నగర్ శివ సాయి దేవాలయంలో గురు పౌర్ణమి మహోత్సవం
కుషాయిగూడ డివిజన్ పరిధిలోని శివసాయి నగర్‌లో ఉన్న శివసాయి దేవాలయంలో గురుపౌర్ణమి మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా తెల్లవారుజాము నుంచే కుటుంబ సమేతంగా వచ్చిన భక్తులు అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు అన్నప్రసాదం నిర్వహించనున్నారు. ఈ మహోత్సవంలో కాలనీలకు చెందిన కుటుంబ సభ్యులంతా పెద్ద సంఖ్యలో పాల్గొని గురుపూజ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆలయ నిర్వాహకులు ఆహ్వానించారు.
    user_Bhaskar Reddy
    Bhaskar Reddy
    Detective కాప్రా, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    4 hrs ago
  • చిలుకానగర్‌లో SIR ప్రావాస్ అభియాన్.. మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ పర్యటన బీజేపీ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు SIR మండల ప్రావాస్ అభియాన్‌లో భాగంగా మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి చిలుకానగర్ డివిజన్‌లో పర్యటించారు. పలు పోలింగ్ కేంద్రాలు, కాలనీల్లో బీఎల్‌వోలు, ఓటర్లతో మాట్లాడి SIR ప్రక్రియపై అవగాహన కల్పించారు. ఆగస్టు 3లోపు ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించాలని ఓటర్లకు సూచించారు.
    1
    చిలుకానగర్‌లో SIR ప్రావాస్ అభియాన్.. మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ పర్యటన
బీజేపీ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు SIR మండల ప్రావాస్ అభియాన్‌లో భాగంగా మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి చిలుకానగర్ డివిజన్‌లో పర్యటించారు. పలు పోలింగ్ కేంద్రాలు, కాలనీల్లో బీఎల్‌వోలు, ఓటర్లతో మాట్లాడి SIR ప్రక్రియపై అవగాహన కల్పించారు. ఆగస్టు 3లోపు ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించాలని ఓటర్లకు సూచించారు.
    user_FOCUS MEDIA
    FOCUS MEDIA
    Content Creator (YouTuber) కాప్రా, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    17 hrs ago
  • ములుగు జిల్లాలో రాకాసి గాలులు నేలకూలిన వందల వృక్షాలు.... ములుగు జిల్లా మంగపేట మండలం కోమటిపల్లి వెళ్లే ప్రధాన రహదారి పక్కన మంగళవారం సాయంత్రం టోర్నడో తరహా సుడిగాలులు బీభత్సం సృష్టించాయి. ఒక్కసారిగా వీచిన బలమైన గాలులకు సుమారు 3-4 కి.మీ మేర వందలాది భారీ వృక్షాలు నేలకూలినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇదే తరహాలో 2024లో మేడారం అటవీ ప్రాంతంలో వేలాది చెట్లు నేలకూలిన ఘటనను స్థానికులు గుర్తు చేస్తున్నారు.
    1
    ములుగు జిల్లాలో రాకాసి గాలులు నేలకూలిన వందల వృక్షాలు....
ములుగు జిల్లా మంగపేట మండలం కోమటిపల్లి వెళ్లే ప్రధాన రహదారి పక్కన మంగళవారం సాయంత్రం టోర్నడో తరహా సుడిగాలులు బీభత్సం సృష్టించాయి. ఒక్కసారిగా వీచిన బలమైన గాలులకు సుమారు 3-4 కి.మీ మేర వందలాది భారీ వృక్షాలు నేలకూలినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇదే తరహాలో 2024లో మేడారం అటవీ ప్రాంతంలో వేలాది చెట్లు నేలకూలిన ఘటనను స్థానికులు గుర్తు చేస్తున్నారు.
    user_Journalist Anil kumar
    Journalist Anil kumar
    Local News Reporter Medipally, Medchal Malkajgiri•
    19 hrs ago
  • ఏడుపాయల శ్రీ వనదుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని బుధవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.
    1
    ఏడుపాయల శ్రీ వనదుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి
శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని బుధవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.
    user_KUMAR
    KUMAR
    పటాన్‌చెరు, సంగారెడ్డి, తెలంగాణ•
    6 hrs ago
  • 10 కిలోల గంజాయినికి స్వాధీనం చేసుకున్న కొల్లేరు పోలీసులు ఒడిశా రాష్ట్రానికి చెందిన జయదేవ్ బిశ్వాస్ (23), ప్రశంజిత్ రాయ్ (22) అనే ఇద్దరు యువకులు 10 కిలోల గంజాయిని హైదరాబాద్‌కు తరలించి కొల్లూరు లేబర్ క్యాంపులో విక్రయించేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. నమ్మదగిన సమాచారం మేరకు వారిని అదుపులోకి తీసుకుని గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ అనంతరం నిందితులను అరెస్టు చేసిన ఎస్‌ఐపీ రాంబాబు శుక్రవారం రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు.
    1
    10 కిలోల గంజాయినికి స్వాధీనం చేసుకున్న కొల్లేరు పోలీసులు
ఒడిశా రాష్ట్రానికి చెందిన జయదేవ్ బిశ్వాస్ (23), ప్రశంజిత్ రాయ్ (22) అనే ఇద్దరు యువకులు 10 కిలోల గంజాయిని హైదరాబాద్‌కు తరలించి కొల్లూరు లేబర్ క్యాంపులో విక్రయించేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. నమ్మదగిన సమాచారం మేరకు వారిని అదుపులోకి తీసుకుని గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ అనంతరం నిందితులను అరెస్టు చేసిన ఎస్‌ఐపీ రాంబాబు శుక్రవారం రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు.
    user_KUMAR
    KUMAR
    పటాన్‌చెరు, సంగారెడ్డి, తెలంగాణ•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.