వనదుర్గామాత ఆలయం ముందు నుంచి గంగమ్మ ఉరకలేస్తూ ప్రవహిస్తున్న దృశ్యాలు ఏడుపాయల వనదుర్గా ప్రాజెక్టు జలకళతో కళకళలాడుతోంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న విస్తార వర్షాలు, ఎగువ ప్రాంతాల నుంచి భారీగా చేరుతున్న వరద నీటితో మంజీరా నది పాయలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వనదుర్గామాత ఆలయం ముందు నుంచి గంగమ్మ ఉరకలేస్తూ ప్రవహిస్తున్న దృశ్యాలు భక్తులను, సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. పూర్తిస్థాయిలో నిండిన ప్రాజెక్టు ఆనకట్ట ప్రస్తుతం పొంగిపొర్లుతుండగా, పరిసర ప్రాంతాలు ప్రకృతి అందాలతో కనువిందు చేస్తున్నాయి. ప్రాజెక్టులో సమృద్ధిగా నీరు చేరడంతో సాగునీటి సమస్య తీరుతుందనే ఆశ రైతన్నల్లో నెలకొంది. ఈ సీజన్‌లో పంటలకు నీటి కొరత ఉండదన్న నమ్మకంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ప్రకృతి సోయగాలు, మరోవైపు రైతుల ముఖాల్లో కనిపిస్తున్న చిరునవ్వులు ఏడుపాయల ప్రాంతానికి కొత్త కళను తీసుకొచ్చాయి.
వనదుర్గామాత ఆలయం ముందు నుంచి గంగమ్మ ఉరకలేస్తూ ప్రవహిస్తున్న దృశ్యాలు ఏడుపాయల వనదుర్గా ప్రాజెక్టు జలకళతో కళకళలాడుతోంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న విస్తార వర్షాలు, ఎగువ ప్రాంతాల నుంచి భారీగా చేరుతున్న వరద నీటితో మంజీరా నది పాయలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వనదుర్గామాత ఆలయం ముందు నుంచి గంగమ్మ ఉరకలేస్తూ ప్రవహిస్తున్న దృశ్యాలు భక్తులను, సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. పూర్తిస్థాయిలో నిండిన ప్రాజెక్టు ఆనకట్ట ప్రస్తుతం పొంగిపొర్లుతుండగా, పరిసర ప్రాంతాలు ప్రకృతి అందాలతో కనువిందు చేస్తున్నాయి. ప్రాజెక్టులో సమృద్ధిగా నీరు చేరడంతో సాగునీటి సమస్య తీరుతుందనే ఆశ రైతన్నల్లో నెలకొంది. ఈ సీజన్‌లో పంటలకు నీటి కొరత ఉండదన్న నమ్మకంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ప్రకృతి సోయగాలు, మరోవైపు రైతుల ముఖాల్లో కనిపిస్తున్న చిరునవ్వులు ఏడుపాయల ప్రాంతానికి కొత్త కళను తీసుకొచ్చాయి.
- ఏడుపాయల శ్రీ వనదుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని బుధవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.1
- కుషాయిగూడ శివ సాయి నగర్ శివ సాయి దేవాలయంలో గురు పౌర్ణమి మహోత్సవం కుషాయిగూడ డివిజన్ పరిధిలోని శివసాయి నగర్‌లో ఉన్న శివసాయి దేవాలయంలో గురుపౌర్ణమి మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా తెల్లవారుజాము నుంచే కుటుంబ సమేతంగా వచ్చిన భక్తులు అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు అన్నప్రసాదం నిర్వహించనున్నారు. ఈ మహోత్సవంలో కాలనీలకు చెందిన కుటుంబ సభ్యులంతా పెద్ద సంఖ్యలో పాల్గొని గురుపూజ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆలయ నిర్వాహకులు ఆహ్వానించారు.1
- నెరేళ్ల ఘటనపై రాజకీయాలకు అతీతంగా బాధితులకు అండగా నిలవాలి: కల్వకుంట్ల కవిత నెరేళ్ల ఘటన తెలంగాణ సమాజం సిగ్గుతో తలదించుకునే విషాదమని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆ సమయంలో పాలించిన కుటుంబంలో తాను కూడా భాగమైనందున బాధితులకు క్షమాపణ చెబుతున్నానని పేర్కొన్నారు. ఈ ఘటనపై రాజకీయాలు చేయకుండా అన్ని పార్టీలు మానవత్వంతో స్పందించి బాధితులకు అండగా నిలవాలని కోరారు. ఇసుక కోసం ప్రాణాలు తీసే పరిస్థితి రావడం దురదృష్టకరమని, డబ్బు ముందు మానవ ప్రాణాల విలువ తగ్గిపోయిందా అని ప్రశ్నించారు. పొన్నం ప్రభాకర్, భట్టి విక్రమార్క, అడ్లూరి లక్ష్మణ్‌లను ఉద్దేశించి మానవత్వంతో స్పందించాలని కోరారు. నెరేళ్ల బాధితుల కన్నీళ్ల పునాదులపై అధికారం అనుభవిస్తున్నారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వం ఏర్పడి 30 నెలలు గడిచినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఘటనపై కనీసం స్పందించలేదని విమర్శించారు. గత ప్రభుత్వంలోనూ, ప్రస్తుత ప్రభుత్వంలోనూ ప్రశ్నించే వారిపై దాష్టీకాలు కొనసాగుతున్నాయని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.3
- చిలుకానగర్‌లో SIR ప్రావాస్ అభియాన్.. మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ పర్యటన బీజేపీ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు SIR మండల ప్రావాస్ అభియాన్‌లో భాగంగా మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి చిలుకానగర్ డివిజన్‌లో పర్యటించారు. పలు పోలింగ్ కేంద్రాలు, కాలనీల్లో బీఎల్‌వోలు, ఓటర్లతో మాట్లాడి SIR ప్రక్రియపై అవగాహన కల్పించారు. ఆగస్టు 3లోపు ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించాలని ఓటర్లకు సూచించారు.1
- నాగారంలో దంచి కొడుతున్న వర్షం నాగారం దమ్మైగూడ రోడ్లు జలమయం నాగారంలో దంచి కొడుతున్న వర్షం నాగారం దమ్మైగూడ రోడ్లు జలమయం వాహనదారుల అప్రమత్తంగా గుంతలు చూసుకొని వెళ్లాలని అదేవిధంగా పాదాచారులకు నీళ్లు మీద పడకుండా వాహనాలు నడపాలని సమన్వయం పాటిస్తూ డ్రైవింగ్ చేయాలని కోరనైనది1
- వనదుర్గామాత ఆలయం ముందు నుంచి గంగమ్మ ఉరకలేస్తూ ప్రవహిస్తున్న దృశ్యాలు ఏడుపాయల వనదుర్గా ప్రాజెక్టు జలకళతో కళకళలాడుతోంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న విస్తార వర్షాలు, ఎగువ ప్రాంతాల నుంచి భారీగా చేరుతున్న వరద నీటితో మంజీరా నది పాయలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వనదుర్గామాత ఆలయం ముందు నుంచి గంగమ్మ ఉరకలేస్తూ ప్రవహిస్తున్న దృశ్యాలు భక్తులను, సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. పూర్తిస్థాయిలో నిండిన ప్రాజెక్టు ఆనకట్ట ప్రస్తుతం పొంగిపొర్లుతుండగా, పరిసర ప్రాంతాలు ప్రకృతి అందాలతో కనువిందు చేస్తున్నాయి. ప్రాజెక్టులో సమృద్ధిగా నీరు చేరడంతో సాగునీటి సమస్య తీరుతుందనే ఆశ రైతన్నల్లో నెలకొంది. ఈ సీజన్‌లో పంటలకు నీటి కొరత ఉండదన్న నమ్మకంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ప్రకృతి సోయగాలు, మరోవైపు రైతుల ముఖాల్లో కనిపిస్తున్న చిరునవ్వులు ఏడుపాయల ప్రాంతానికి కొత్త కళను తీసుకొచ్చాయి.1
- జిన్నారం మండలం బొల్లారం డివిజన్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత బొల్లారం గ్రామ బీసీ కాలనీలో సర్వే నంబర్ 42లోని ప్రభుత్వ భూమిపై అక్రమంగా నిర్మిస్తున్న భవనాన్ని అధికారులు కూల్చివేశారు. ఈ చర్యతో సుమారు రూ.50 లక్షల విలువైన ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమణదారుల నుంచి రక్షించినట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ భూముల ఆక్రమణలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు.1
- భక్తి ఉండాలి.. కానీ ప్రాణాలకు ప్రమాదం కలిగించే మార్గాలను ఎంచుకోవద్దని సూచనలు! తిరువణ్ణామలై సందర్శనలో మోక్షమార్గం చేసే భక్తులను తమిళ నెటిజన్లు హేళనగా చూస్తున్నారు. ఇటీవల ఓ తెలుగు భక్తుడు మరణించడం, మరో మహిళ అందులో ఇరుక్కుపోవడంతో అవమానించేలా పోస్టులు చేస్తున్నారు. 'ఇలాంటి తెలివిలేని పని తెలుగు వాళ్లే చేస్తారు' అని వీడియోలు షేర్ చేస్తున్నారు. కాగా భక్తి ఉండాలి కానీ ప్రాణాలను రిస్క్ చేసి మోక్షమార్గంలోకి వెళ్లొద్దని పలువురు సూచిస్తున్నారు. #TeluguOne #Tiruvannamalai #TeluguDevotees #TempleNews1