logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

అక్రమ ఎయిర్‌టెల్ టవర్ నిర్మాణం నిలిపివేయాలని ఎమ్మెల్యేకు వినతి మల్కాజిగిరి డివిజన్ సర్దార్‌పటేల్ నగర్‌లో అనుమతులు లేకుండా ఎయిర్‌టెల్ టవర్ నిర్మిస్తున్నారని కాలనీవాసులు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ ఆధ్వర్యంలో సమస్యను వివరించారు. ఇప్పటికే మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేశారని, అక్రమ నిర్మాణంపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.

4 hrs ago
user_FOCUS MEDIA
FOCUS MEDIA
Content Creator (YouTuber) కాప్రా, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
4 hrs ago

అక్రమ ఎయిర్‌టెల్ టవర్ నిర్మాణం నిలిపివేయాలని ఎమ్మెల్యేకు వినతి మల్కాజిగిరి డివిజన్ సర్దార్‌పటేల్ నగర్‌లో అనుమతులు లేకుండా ఎయిర్‌టెల్ టవర్ నిర్మిస్తున్నారని కాలనీవాసులు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ ఆధ్వర్యంలో సమస్యను వివరించారు. ఇప్పటికే మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేశారని, అక్రమ నిర్మాణంపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.

More news from తెలంగాణ and nearby areas
  • ఉప్పల్‌లో రూ.76.46 కోట్ల అభివృద్ధి పనులకు మంత్రి శ్రీధర్ బాబు శంకుస్థాపన ఉప్పల్ నియోజకవర్గంలో రూ.76.46 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఇన్‌చార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ పాల్గొన్నారు. ప్రజాపాలనలో అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొంటూ, కాలువలు, సీసీ రోడ్లు, ఫుట్‌పాత్‌లు, క్రీడా మైదానాలు తదితర పనులు చేపడుతున్నట్లు తెలిపారు.
    1
    ఉప్పల్‌లో రూ.76.46 కోట్ల అభివృద్ధి పనులకు మంత్రి శ్రీధర్ బాబు శంకుస్థాపన
ఉప్పల్ నియోజకవర్గంలో రూ.76.46 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఇన్‌చార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ పాల్గొన్నారు. ప్రజాపాలనలో అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొంటూ, కాలువలు, సీసీ రోడ్లు, ఫుట్‌పాత్‌లు, క్రీడా మైదానాలు తదితర పనులు చేపడుతున్నట్లు తెలిపారు.
    user_FOCUS MEDIA
    FOCUS MEDIA
    Content Creator (YouTuber) కాప్రా, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    3 hrs ago
  • భారీ వర్షాలు.. కరెంట్ పోల్స్ను టచ్ చేయకండి!..... వర్షాకాలంలో కరెంట్ తీగలు, విద్యుత్ స్తంభాలు ప్రమాదకరంగా మారుతాయి. రాజస్థాన్లోని టోంక్ జిల్లాలో నీటితో నిండిన వీధిలో విద్యుత్ లీకై ఒక యువకుడు మృతి చెందడం కలకలం రేపింది. ఇలాంటి సమయంలో వర్షపు నీటిలో నడిచేటప్పుడు పవర్ పోల్కు దూరంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోడ్లపై వేలాడుతున్న వైర్లు లేదా కరెంట్ లీకేజీలను గమనిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని వారు సూచిస్తున్నారు.
    1
    భారీ వర్షాలు.. కరెంట్ పోల్స్ను టచ్ చేయకండి!.....
వర్షాకాలంలో కరెంట్ తీగలు, విద్యుత్ స్తంభాలు ప్రమాదకరంగా మారుతాయి. రాజస్థాన్లోని టోంక్ జిల్లాలో నీటితో నిండిన వీధిలో విద్యుత్ లీకై ఒక యువకుడు మృతి చెందడం కలకలం రేపింది. ఇలాంటి సమయంలో వర్షపు నీటిలో నడిచేటప్పుడు పవర్ పోల్కు దూరంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోడ్లపై వేలాడుతున్న వైర్లు లేదా కరెంట్ లీకేజీలను గమనిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని వారు సూచిస్తున్నారు.
    user_MOHAMMED SALEEM꧁•𝐌𝐒𝐏@6078
    MOHAMMED SALEEM꧁•𝐌𝐒𝐏@6078
    Department of Social Services కీసర, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    8 hrs ago
  • *శ్రీ చైతన్య సెంట్ పీటర్ పాఠశాలలో ఘనంగా ఆషాఢ ఉత్సవాలు* *బోనాలు, పోతరాజుల విన్యాసాలతో అలరించిన విద్యార్థులు* గజ్వేల్ జగదేవ్‌పూర్, ప్రజా తెలంగాణ న్యూస్ : సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండల కేంద్రంలోని శ్రీ చైతన్య సెంట్ పీటర్ పాఠశాలలో ఆషాఢ మాస ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను పాఠశాల యాజమాన్యం విద్యార్థుల భాగస్వామ్యంతో సంప్రదాయబద్ధంగా నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఈ సందర్భంగా విద్యార్థినులు అమ్మవారి వేషధారణలో బోనాలు ఎత్తుకొని భక్తిశ్రద్ధలతో ఊరేగింపుగా పాల్గొనగా, విద్యార్థులు పోతరాజుల వేషధారణలో విన్యాసాలు చేస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. అమ్మవారి భక్తి గీతాలకు అనుగుణంగా విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, పోతరాజుల విన్యాసాలు ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. పాఠశాల ప్రాంగణం సంప్రదాయ అలంకరణలతో పండుగ వాతావరణాన్ని తలపించింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ కొత్త నర్సింహ్మారెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులకు పుస్తక విద్యతో పాటు భారతీయ సంస్కృతి, తెలంగాణ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలపై అవగాహన కల్పించడం కూడా విద్యాసంస్థల బాధ్యతేనని అన్నారు. అందుకే ప్రతి పండుగను పాఠశాలలో సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తూ విద్యార్థుల్లో సాంస్కృతిక విలువలను పెంపొందించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.నేటి తరం పిల్లలు తమ సంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకొని వాటిని గౌరవించేలా ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ప్రదర్శించిన నృత్యాలు, బోనాల శోభాయాత్ర, పోతరాజుల విన్యాసాలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని అన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఉపాధ్యాయులను, విద్యార్థులను ప్రిన్సిపాల్ కొత్త నర్సింహ్మారెడ్డి అభినందించారు. పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది సమన్వయంతో నిర్వహించిన ఈ ఆషాఢ ఉత్సవాలు విద్యార్థుల్లో తెలంగాణ సాంస్కృతిక వారసత్వంపై మరింత అవగాహన పెంచాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొని ఆషాఢ ఉత్సవాలను ఉత్సాహంగా జరుపుకున్నారు.
    2
    *శ్రీ చైతన్య సెంట్ పీటర్ పాఠశాలలో ఘనంగా ఆషాఢ ఉత్సవాలు*
 *బోనాలు, పోతరాజుల విన్యాసాలతో అలరించిన విద్యార్థులు*
గజ్వేల్ జగదేవ్‌పూర్, ప్రజా తెలంగాణ న్యూస్  : సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండల కేంద్రంలోని శ్రీ చైతన్య సెంట్ పీటర్ పాఠశాలలో ఆషాఢ మాస ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను పాఠశాల యాజమాన్యం విద్యార్థుల భాగస్వామ్యంతో సంప్రదాయబద్ధంగా నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఈ సందర్భంగా విద్యార్థినులు అమ్మవారి వేషధారణలో బోనాలు ఎత్తుకొని భక్తిశ్రద్ధలతో ఊరేగింపుగా పాల్గొనగా, విద్యార్థులు పోతరాజుల వేషధారణలో విన్యాసాలు చేస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. అమ్మవారి భక్తి గీతాలకు అనుగుణంగా విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, పోతరాజుల విన్యాసాలు ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. పాఠశాల ప్రాంగణం సంప్రదాయ అలంకరణలతో పండుగ వాతావరణాన్ని తలపించింది.
ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ కొత్త నర్సింహ్మారెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులకు పుస్తక విద్యతో పాటు భారతీయ సంస్కృతి, తెలంగాణ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలపై అవగాహన కల్పించడం కూడా విద్యాసంస్థల బాధ్యతేనని అన్నారు. అందుకే ప్రతి పండుగను పాఠశాలలో సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తూ విద్యార్థుల్లో సాంస్కృతిక విలువలను పెంపొందించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.నేటి తరం పిల్లలు తమ సంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకొని వాటిని గౌరవించేలా ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ప్రదర్శించిన నృత్యాలు, బోనాల శోభాయాత్ర, పోతరాజుల విన్యాసాలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని అన్నారు.
కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఉపాధ్యాయులను, విద్యార్థులను ప్రిన్సిపాల్ కొత్త నర్సింహ్మారెడ్డి అభినందించారు. పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది సమన్వయంతో నిర్వహించిన ఈ ఆషాఢ ఉత్సవాలు విద్యార్థుల్లో తెలంగాణ సాంస్కృతిక వారసత్వంపై మరింత అవగాహన పెంచాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొని ఆషాఢ ఉత్సవాలను ఉత్సాహంగా జరుపుకున్నారు.
    user_Gousuddin Md
    Gousuddin Md
    అంబర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    20 hrs ago
  • సర్ పై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పటాన్చెరు నియోజకవర్గంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమం ముగియడానికి మరో 4 రోజులే మిగిలి ఉన్నాయని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. గురువారం జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన అవగాహన సమావేశంలో మాట్లాడుతూ, జూలై 30 ఉదయం 10 గంటల వరకు 63.27% నమోదు మాత్రమే జరిగిందన్నారు. ప్రతి ఓటరు తప్పనిసరిగా SIRలో పాల్గొని వివరాలు సమర్పించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమని పేర్కొన్నారు.
    1
    సర్ పై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి 
పటాన్చెరు నియోజకవర్గంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమం ముగియడానికి మరో 4 రోజులే మిగిలి ఉన్నాయని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. గురువారం జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన అవగాహన సమావేశంలో మాట్లాడుతూ, జూలై 30 ఉదయం 10 గంటల వరకు 63.27% నమోదు మాత్రమే జరిగిందన్నారు. ప్రతి ఓటరు తప్పనిసరిగా SIRలో పాల్గొని వివరాలు సమర్పించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమని పేర్కొన్నారు.
    user_KUMAR
    KUMAR
    పటాన్‌చెరు, సంగారెడ్డి, తెలంగాణ•
    2 hrs ago
  • SIR వేగవంతం చేయాలి.. బీఎల్‌వోలకు ఎమ్మెల్యే శ్రీగణేష్ సూచన అక్రమ ఎయిర్‌టెల్ టవర్ నిర్మాణం నిలిపివేయాలని ఎమ్మెల్యేకు వినతి
    1
    SIR వేగవంతం చేయాలి.. బీఎల్‌వోలకు ఎమ్మెల్యే శ్రీగణేష్ సూచన
అక్రమ ఎయిర్‌టెల్ టవర్ నిర్మాణం నిలిపివేయాలని ఎమ్మెల్యేకు వినతి
    user_FOCUS MEDIA
    FOCUS MEDIA
    Content Creator (YouTuber) కాప్రా, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    4 hrs ago
  • మదీనా కాలనీలో వీధి కుక్కల భయం.. చిన్నారిపై దాడితో ప్రజల్లో ఆందోళన మదీనా కాలనీలో వీధి కుక్కల సమస్య మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నిన్న మూడేళ్ల చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేసిన ఘటన స్థానికులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఈ ఘటనతో పిల్లలను బయటకు పంపాలన్నా తల్లిదండ్రులు భయపడే పరిస్థితి నెలకొంది. కాలనీలో వీధి కుక్కలు గుంపులుగా తిరుగుతుండటంతో ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రజలు బయటకు రావడానికే జంకుతున్నారు. స్థానికుల కథనం ప్రకారం, గతంలో కూడా వీధి కుక్కల బెడదపై పలుమార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ శాశ్వత పరిష్కారం కనిపించలేదని వాపోతున్నారు. కుక్కలను పట్టుకుని తరలించడం, వాటి జనాభా నియంత్రణకు చర్యలు చేపట్టడం, ప్రమాదకర ప్రాంతాల్లో ప్రత్యేక పర్యవేక్షణ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. "మరో ప్రమాదం జరిగే వరకు అధికారులు ఎదురుచూడకూడదు. చిన్నారులు, వృద్ధులు, మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకుని వెంటనే చర్యలు తీసుకోవాలి. ప్రాణం అమూల్యం.. ప్రజల భద్రతే ప్రభుత్వాల తొలి బాధ్యత" అని కాలనీవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులు స్పందించి, వీధి కుక్కల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
    1
    మదీనా కాలనీలో వీధి కుక్కల భయం.. చిన్నారిపై దాడితో ప్రజల్లో ఆందోళన
మదీనా కాలనీలో వీధి కుక్కల సమస్య మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నిన్న మూడేళ్ల చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేసిన ఘటన స్థానికులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఈ ఘటనతో పిల్లలను బయటకు పంపాలన్నా తల్లిదండ్రులు భయపడే పరిస్థితి నెలకొంది. కాలనీలో వీధి కుక్కలు గుంపులుగా తిరుగుతుండటంతో ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రజలు బయటకు రావడానికే జంకుతున్నారు.
స్థానికుల కథనం ప్రకారం, గతంలో కూడా వీధి కుక్కల బెడదపై పలుమార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ శాశ్వత పరిష్కారం కనిపించలేదని వాపోతున్నారు. కుక్కలను పట్టుకుని తరలించడం, వాటి జనాభా నియంత్రణకు చర్యలు చేపట్టడం, ప్రమాదకర ప్రాంతాల్లో ప్రత్యేక పర్యవేక్షణ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
"మరో ప్రమాదం జరిగే వరకు అధికారులు ఎదురుచూడకూడదు. చిన్నారులు, వృద్ధులు, మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకుని వెంటనే చర్యలు తీసుకోవాలి. ప్రాణం అమూల్యం.. ప్రజల భద్రతే ప్రభుత్వాల తొలి బాధ్యత" అని కాలనీవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులు స్పందించి, వీధి కుక్కల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
    user_Jeetender
    Jeetender
    సికింద్రాబాద్, హైదరాబాద్, తెలంగాణ•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.