logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

సర్ పై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పటాన్చెరు నియోజకవర్గంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమం ముగియడానికి మరో 4 రోజులే మిగిలి ఉన్నాయని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. గురువారం జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన అవగాహన సమావేశంలో మాట్లాడుతూ, జూలై 30 ఉదయం 10 గంటల వరకు 63.27% నమోదు మాత్రమే జరిగిందన్నారు. ప్రతి ఓటరు తప్పనిసరిగా SIRలో పాల్గొని వివరాలు సమర్పించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమని పేర్కొన్నారు.

3 hrs ago
user_KUMAR
KUMAR
పటాన్‌చెరు, సంగారెడ్డి, తెలంగాణ•
3 hrs ago

సర్ పై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పటాన్చెరు నియోజకవర్గంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమం ముగియడానికి మరో 4 రోజులే మిగిలి ఉన్నాయని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. గురువారం జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన అవగాహన సమావేశంలో మాట్లాడుతూ, జూలై 30 ఉదయం 10 గంటల వరకు 63.27% నమోదు మాత్రమే జరిగిందన్నారు. ప్రతి ఓటరు తప్పనిసరిగా SIRలో పాల్గొని వివరాలు సమర్పించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమని పేర్కొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • ఫోన్ ఎత్తలేదని స్నేహితుల వినూత్న ప్రతీకారం.. బ్యాండు మేళాతో ఇంటిపైకి దండయాత్ర! స్నేహితులు అంటేనే అల్లరి, సరదాలు, కొట్లాటలు. అయితే, ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయలేదనే కోపంతో ఓ గ్రూప్ ఫ్రెండ్స్ చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కుమార్ భాయ్ అనే వ్యక్తి తన స్నేహితుల ఫోన్ కాల్స్ ఎత్తకపోవడంతో, వారంతా ఊరుకోకుండా వినూత్నంగా ప్రతీకారం తీర్చుకున్నారు. "కుమార్ భాయ్ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, అందుకే బ్యాండు మేళాలతో అతని ఇంటికి వెళ్తున్నాం" అంటూ వారు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. డప్పు చప్పుళ్లు, కేరింతలతో నేరుగా అతని ఇంటి వద్దకు చేరుకుని పెద్ద ఎత్తున రచ్చ చేశారు. ఈ ఊహించని షాక్ చూసి కుమార్ అవాక్కై, ఏం చేయాలో తెలియక తల పట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. మీ ఫ్రెండ్స్ లోనూ ఫోన్ ఎత్తని వాళ్లుంటే ఈ ఫన్నీ వీడియోను వారికి వెంటనే షేర్ చేయండి!
    1
    ఫోన్ ఎత్తలేదని స్నేహితుల వినూత్న ప్రతీకారం.. బ్యాండు మేళాతో ఇంటిపైకి దండయాత్ర!
స్నేహితులు అంటేనే అల్లరి, సరదాలు, కొట్లాటలు. అయితే, ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయలేదనే కోపంతో ఓ గ్రూప్ ఫ్రెండ్స్ చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కుమార్ భాయ్ అనే వ్యక్తి తన స్నేహితుల ఫోన్ కాల్స్ ఎత్తకపోవడంతో, వారంతా ఊరుకోకుండా వినూత్నంగా ప్రతీకారం తీర్చుకున్నారు.
"కుమార్ భాయ్ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, అందుకే బ్యాండు మేళాలతో అతని ఇంటికి వెళ్తున్నాం" అంటూ వారు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. డప్పు చప్పుళ్లు, కేరింతలతో నేరుగా అతని ఇంటి వద్దకు చేరుకుని పెద్ద ఎత్తున రచ్చ చేశారు. ఈ ఊహించని షాక్ చూసి కుమార్ అవాక్కై, ఏం చేయాలో తెలియక తల పట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. మీ ఫ్రెండ్స్ లోనూ ఫోన్ ఎత్తని వాళ్లుంటే ఈ ఫన్నీ వీడియోను వారికి వెంటనే షేర్ చేయండి!
    user_GB MAHENDAR
    GB MAHENDAR
    Photographer అమీర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    5 hrs ago
  • ఉప్పల్‌లో రూ.76.46 కోట్ల అభివృద్ధి పనులకు మంత్రి శ్రీధర్ బాబు శంకుస్థాపన ఉప్పల్ నియోజకవర్గంలో రూ.76.46 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఇన్‌చార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ పాల్గొన్నారు. ప్రజాపాలనలో అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొంటూ, కాలువలు, సీసీ రోడ్లు, ఫుట్‌పాత్‌లు, క్రీడా మైదానాలు తదితర పనులు చేపడుతున్నట్లు తెలిపారు.
    1
    ఉప్పల్‌లో రూ.76.46 కోట్ల అభివృద్ధి పనులకు మంత్రి శ్రీధర్ బాబు శంకుస్థాపన
ఉప్పల్ నియోజకవర్గంలో రూ.76.46 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఇన్‌చార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ పాల్గొన్నారు. ప్రజాపాలనలో అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొంటూ, కాలువలు, సీసీ రోడ్లు, ఫుట్‌పాత్‌లు, క్రీడా మైదానాలు తదితర పనులు చేపడుతున్నట్లు తెలిపారు.
    user_FOCUS MEDIA
    FOCUS MEDIA
    Content Creator (YouTuber) కాప్రా, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    3 hrs ago
  • భారీ వర్షాలు.. కరెంట్ పోల్స్ను టచ్ చేయకండి!..... వర్షాకాలంలో కరెంట్ తీగలు, విద్యుత్ స్తంభాలు ప్రమాదకరంగా మారుతాయి. రాజస్థాన్లోని టోంక్ జిల్లాలో నీటితో నిండిన వీధిలో విద్యుత్ లీకై ఒక యువకుడు మృతి చెందడం కలకలం రేపింది. ఇలాంటి సమయంలో వర్షపు నీటిలో నడిచేటప్పుడు పవర్ పోల్కు దూరంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోడ్లపై వేలాడుతున్న వైర్లు లేదా కరెంట్ లీకేజీలను గమనిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని వారు సూచిస్తున్నారు.
    1
    భారీ వర్షాలు.. కరెంట్ పోల్స్ను టచ్ చేయకండి!.....
వర్షాకాలంలో కరెంట్ తీగలు, విద్యుత్ స్తంభాలు ప్రమాదకరంగా మారుతాయి. రాజస్థాన్లోని టోంక్ జిల్లాలో నీటితో నిండిన వీధిలో విద్యుత్ లీకై ఒక యువకుడు మృతి చెందడం కలకలం రేపింది. ఇలాంటి సమయంలో వర్షపు నీటిలో నడిచేటప్పుడు పవర్ పోల్కు దూరంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోడ్లపై వేలాడుతున్న వైర్లు లేదా కరెంట్ లీకేజీలను గమనిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని వారు సూచిస్తున్నారు.
    user_MOHAMMED SALEEM꧁•𝐌𝐒𝐏@6078
    MOHAMMED SALEEM꧁•𝐌𝐒𝐏@6078
    Department of Social Services కీసర, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    8 hrs ago
  • మెదక్‌లో జాతీయ ఎస్సీ-ఎస్టీ హబ్ అవగాహన, ప్రత్యేక వెండర్ డెవలప్‌మెంట్ కార్యక్రమంNSSHసురేష్ మెదక్‌లో జాతీయ ఎస్సీ-ఎస్టీ హబ్ అవగాహన, ప్రత్యేక వెండర్ డెవలప్‌మెంట్ కార్యక్రమం మెదక్‌లో గురువారం నేషనల్ ఎస్సీ-ఎస్టీ హబ్ (NSSH), హైదరాబాద్ ఆధ్వర్యంలో, దళిత్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (DICCI) సహకారంతో ఎంట్రప్రెన్యూర్ అవగాహన మరియు ప్రత్యేక వెండర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఈ కార్యక్రమం వినాయక కన్వెన్షన్ హాల్, మెదక్లో జరిగింది.అతిథుల స్వాగతం, జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ NSSHO ఎస్. సురేష్ స్వాగత ప్రసంగం చేశారు.తదుపరి డిక్కీ తెలంగాణ చాప్టర్ అధ్యక్షుడు జె. సీతారాం, డిక్కీ మహిళా విభాగం జాతీయ అధ్యక్షురాలు అరుణ దాసరి, ఎన్‌ఎస్‌ఐసీ (AP & తెలంగాణ) జోనల్ జనరల్ మేనేజర్ వి. సురేష్ బాబు పారిశ్రామిక అవకాశాలు, ప్రభుత్వ పథకాలు, ఎస్సీ–ఎస్టీ పారిశ్రామికవేత్తలకు అందుబాటులో ఉన్న సహాయ కార్యక్రమాలపై వివరించారు. పారిశ్రామిక రంగంలో ఎస్సీ–ఎస్టీ యువత ముందుకు రావాలని, ప్రభుత్వ అవకాశాలను సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి సాధించాలని పిలుపునిచ్చారు.అనంతరం సాంకేతిక సమావేశంలో ప్రభుత్వ కొనుగోలు విధానాలు, వెండర్ రిజిస్ట్రేషన్, ఆర్థిక సహాయం, వ్యాపార అభివృద్ధికి సంబంధించిన అంశాలపై నిపుణులు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలోమెదక్ జిల్లా కోఆర్డినేటర్ దుర్గాప్రసాద్ , దళిత సంఘ నాయకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
    1
    మెదక్‌లో జాతీయ ఎస్సీ-ఎస్టీ హబ్ అవగాహన, ప్రత్యేక వెండర్ డెవలప్‌మెంట్ కార్యక్రమంNSSHసురేష్ 
మెదక్‌లో జాతీయ ఎస్సీ-ఎస్టీ హబ్ అవగాహన, ప్రత్యేక వెండర్ డెవలప్‌మెంట్ కార్యక్రమం
మెదక్‌లో గురువారం నేషనల్ ఎస్సీ-ఎస్టీ హబ్ (NSSH), హైదరాబాద్ ఆధ్వర్యంలో, దళిత్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (DICCI) సహకారంతో ఎంట్రప్రెన్యూర్ అవగాహన మరియు ప్రత్యేక వెండర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఈ కార్యక్రమం వినాయక కన్వెన్షన్ హాల్, మెదక్లో జరిగింది.అతిథుల స్వాగతం, జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ NSSHO ఎస్. సురేష్ స్వాగత ప్రసంగం చేశారు.తదుపరి డిక్కీ తెలంగాణ చాప్టర్ అధ్యక్షుడు  జె. సీతారాం, డిక్కీ మహిళా విభాగం జాతీయ అధ్యక్షురాలు అరుణ దాసరి, ఎన్‌ఎస్‌ఐసీ (AP & తెలంగాణ) జోనల్ జనరల్ మేనేజర్ వి. సురేష్ బాబు పారిశ్రామిక అవకాశాలు, ప్రభుత్వ పథకాలు, ఎస్సీ–ఎస్టీ పారిశ్రామికవేత్తలకు అందుబాటులో ఉన్న సహాయ కార్యక్రమాలపై వివరించారు.
పారిశ్రామిక రంగంలో ఎస్సీ–ఎస్టీ యువత ముందుకు రావాలని, ప్రభుత్వ అవకాశాలను సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి సాధించాలని పిలుపునిచ్చారు.అనంతరం సాంకేతిక సమావేశంలో ప్రభుత్వ కొనుగోలు విధానాలు, వెండర్ రిజిస్ట్రేషన్, ఆర్థిక సహాయం, వ్యాపార అభివృద్ధికి సంబంధించిన అంశాలపై నిపుణులు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలోమెదక్ జిల్లా కోఆర్డినేటర్ దుర్గాప్రసాద్ , దళిత సంఘ నాయకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    Medak, Telangana•
    23 min ago
  • ఓవర్‌హెడ్ వైర్ షార్ట్ సర్క్యూట్: రైలు ప్రయాణికుల్లో భయాందోళన! BREAKING NEWS: రైల్వే ఓవర్‌హెడ్ విద్యుత్ లైన్‌లో జరిగిన షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రయాణికుల్లో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. ఇలాంటి ఘటనల్లో మొత్తం రైలుకు విద్యుత్ ప్రవహించి భారీ ప్రాణనష్టం జరిగే ప్రమాదం ఉందా అనే తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ప్రమాదాలను నివారించడానికి ఇప్పటికే పటిష్టమైన భద్రతా వ్యవస్థలు ఉన్నప్పటికీ, ప్రయాణికుల పూర్తి రక్షణ కోసం రైల్వే శాఖ అత్యవసరంగా మరిన్ని అదనపు భద్రతా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. #IndianRailways #TrainSafety #OverheadWire #ShortCircuit #RailNews
    1
    ఓవర్‌హెడ్ వైర్ షార్ట్ సర్క్యూట్: రైలు ప్రయాణికుల్లో భయాందోళన!
BREAKING NEWS: రైల్వే ఓవర్‌హెడ్ విద్యుత్ లైన్‌లో జరిగిన షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రయాణికుల్లో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి.
ఇలాంటి ఘటనల్లో మొత్తం రైలుకు విద్యుత్ ప్రవహించి భారీ ప్రాణనష్టం జరిగే ప్రమాదం ఉందా అనే తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ప్రమాదాలను నివారించడానికి ఇప్పటికే పటిష్టమైన భద్రతా వ్యవస్థలు ఉన్నప్పటికీ, ప్రయాణికుల పూర్తి రక్షణ కోసం రైల్వే శాఖ అత్యవసరంగా మరిన్ని అదనపు భద్రతా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
#IndianRailways #TrainSafety #OverheadWire #ShortCircuit #RailNews
    user_GB MAHENDAR
    GB MAHENDAR
    Photographer అమీర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    5 hrs ago
  • సీజనల్ వ్యాధులపై వెంకటాయపల్లిలో ప్రత్యేక దృష్టి.. దోమల నివారణకు ఆయిల్ బాల్స్ తూప్రాన్ మండలం వెంకటాయపల్లి గ్రామంలో వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గ్రామపంచాయతీ ముందస్తు చర్యలు చేపట్టింది. గ్రామంలోని నిల్వ నీటి ప్రాంతాలను గుర్తించి దోమల లార్వా నిర్మూలన కోసం ఆయిల్ బాల్స్ వేశారు. సర్పంచ్ బట్టికాడి హరీష్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామ పరిశుభ్రతపై ప్రత్యేక అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులను నివారించాలంటే ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచాలని సూచించారు. ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని, జ్వరం లేదా ఇతర అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు. గ్రామంలో ఆరోగ్యకరమైన వాతావరణం కోసం ఇలాంటి నివారణ చర్యలు నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు.
    1
    సీజనల్ వ్యాధులపై వెంకటాయపల్లిలో ప్రత్యేక దృష్టి.. దోమల నివారణకు ఆయిల్ బాల్స్
తూప్రాన్ మండలం వెంకటాయపల్లి గ్రామంలో వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గ్రామపంచాయతీ ముందస్తు చర్యలు చేపట్టింది. గ్రామంలోని నిల్వ నీటి ప్రాంతాలను గుర్తించి దోమల లార్వా నిర్మూలన కోసం ఆయిల్ బాల్స్ వేశారు. సర్పంచ్ బట్టికాడి హరీష్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామ పరిశుభ్రతపై ప్రత్యేక అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులను నివారించాలంటే ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచాలని సూచించారు. ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని, జ్వరం లేదా ఇతర అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు. గ్రామంలో ఆరోగ్యకరమైన వాతావరణం కోసం ఇలాంటి నివారణ చర్యలు నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు.
    user_Priya
    Priya
    నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
    5 hrs ago
  • SIR వేగవంతం చేయాలి.. బీఎల్‌వోలకు ఎమ్మెల్యే శ్రీగణేష్ సూచన అక్రమ ఎయిర్‌టెల్ టవర్ నిర్మాణం నిలిపివేయాలని ఎమ్మెల్యేకు వినతి
    1
    SIR వేగవంతం చేయాలి.. బీఎల్‌వోలకు ఎమ్మెల్యే శ్రీగణేష్ సూచన
అక్రమ ఎయిర్‌టెల్ టవర్ నిర్మాణం నిలిపివేయాలని ఎమ్మెల్యేకు వినతి
    user_FOCUS MEDIA
    FOCUS MEDIA
    Content Creator (YouTuber) కాప్రా, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    4 hrs ago
  • ధూప్ సింగ్ తండా బ్రిడ్జిపై వరద ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. హవేలి ఘనపూర్ మండలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు మరోసారి ధూప్ సింగ్ తండా ప్రజలను ఇబ్బందుల్లోకి నెట్టాయి. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరడంతో వాడి గ్రామపంచాయతీ పరిధిలోని ధూప్ సింగ్ తండా బ్రిడ్జిపై వరద ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో తండాకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అత్యవసర పనుల కోసం బయటకు వెళ్లాల్సిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి వర్షాకాలంలో ఇదే పరిస్థితి నెలకొంటోందని తండావాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శాశ్వత పరిష్కారంగా నూతన వంతెన నిర్మాణాన్ని వేగవంతం చేసి అందుబాటులోకి తీసుకురావాలని వారు అధికారులను కోరుతున్నారు. కొత్త బ్రిడ్జి పూర్తయితే ఈ సమస్యకు శాశ్వతంగా తెరపడుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
    1
    ధూప్ సింగ్ తండా బ్రిడ్జిపై వరద ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.
హవేలి ఘనపూర్ మండలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు మరోసారి ధూప్ సింగ్ తండా ప్రజలను ఇబ్బందుల్లోకి నెట్టాయి. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరడంతో వాడి గ్రామపంచాయతీ పరిధిలోని ధూప్ సింగ్ తండా బ్రిడ్జిపై వరద ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో తండాకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అత్యవసర పనుల కోసం బయటకు వెళ్లాల్సిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి వర్షాకాలంలో ఇదే పరిస్థితి నెలకొంటోందని తండావాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శాశ్వత పరిష్కారంగా నూతన వంతెన నిర్మాణాన్ని వేగవంతం చేసి అందుబాటులోకి తీసుకురావాలని వారు అధికారులను కోరుతున్నారు. కొత్త బ్రిడ్జి పూర్తయితే ఈ సమస్యకు శాశ్వతంగా తెరపడుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
    user_Priya
    Priya
    నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.