మెదక్‌లో జాతీయ ఎస్సీ-ఎస్టీ హబ్ అవగాహన, ప్రత్యేక వెండర్ డెవలప్‌మెంట్ కార్యక్రమంNSSHసురేష్ మెదక్‌లో జాతీయ ఎస్సీ-ఎస్టీ హబ్ అవగాహన, ప్రత్యేక వెండర్ డెవలప్‌మెంట్ కార్యక్రమం మెదక్‌లో గురువారం నేషనల్ ఎస్సీ-ఎస్టీ హబ్ (NSSH), హైదరాబాద్ ఆధ్వర్యంలో, దళిత్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (DICCI) సహకారంతో ఎంట్రప్రెన్యూర్ అవగాహన మరియు ప్రత్యేక వెండర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఈ కార్యక్రమం వినాయక కన్వెన్షన్ హాల్, మెదక్లో జరిగింది.అతిథుల స్వాగతం, జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ NSSHO ఎస్. సురేష్ స్వాగత ప్రసంగం చేశారు.తదుపరి డిక్కీ తెలంగాణ చాప్టర్ అధ్యక్షుడు జె. సీతారాం, డిక్కీ మహిళా విభాగం జాతీయ అధ్యక్షురాలు అరుణ దాసరి, ఎన్‌ఎస్‌ఐసీ (AP & తెలంగాణ) జోనల్ జనరల్ మేనేజర్ వి. సురేష్ బాబు పారిశ్రామిక అవకాశాలు, ప్రభుత్వ పథకాలు, ఎస్సీ–ఎస్టీ పారిశ్రామికవేత్తలకు అందుబాటులో ఉన్న సహాయ కార్యక్రమాలపై వివరించారు. పారిశ్రామిక రంగంలో ఎస్సీ–ఎస్టీ యువత ముందుకు రావాలని, ప్రభుత్వ అవకాశాలను సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి సాధించాలని పిలుపునిచ్చారు.అనంతరం సాంకేతిక సమావేశంలో ప్రభుత్వ కొనుగోలు విధానాలు, వెండర్ రిజిస్ట్రేషన్, ఆర్థిక సహాయం, వ్యాపార అభివృద్ధికి సంబంధించిన అంశాలపై నిపుణులు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలోమెదక్ జిల్లా కోఆర్డినేటర్ దుర్గాప్రసాద్ , దళిత సంఘ నాయకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
మెదక్‌లో జాతీయ ఎస్సీ-ఎస్టీ హబ్ అవగాహన, ప్రత్యేక వెండర్ డెవలప్‌మెంట్ కార్యక్రమంNSSHసురేష్ మెదక్‌లో జాతీయ ఎస్సీ-ఎస్టీ హబ్ అవగాహన, ప్రత్యేక వెండర్ డెవలప్‌మెంట్ కార్యక్రమం మెదక్‌లో గురువారం నేషనల్ ఎస్సీ-ఎస్టీ హబ్ (NSSH), హైదరాబాద్ ఆధ్వర్యంలో, దళిత్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (DICCI) సహకారంతో ఎంట్రప్రెన్యూర్ అవగాహన మరియు ప్రత్యేక వెండర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఈ కార్యక్రమం వినాయక కన్వెన్షన్ హాల్, మెదక్లో జరిగింది.అతిథుల స్వాగతం, జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ NSSHO ఎస్. సురేష్ స్వాగత ప్రసంగం చేశారు.తదుపరి డిక్కీ తెలంగాణ చాప్టర్ అధ్యక్షుడు జె. సీతారాం, డిక్కీ మహిళా విభాగం జాతీయ అధ్యక్షురాలు అరుణ దాసరి, ఎన్‌ఎస్‌ఐసీ (AP & తెలంగాణ) జోనల్ జనరల్ మేనేజర్ వి. సురేష్ బాబు పారిశ్రామిక అవకాశాలు, ప్రభుత్వ పథకాలు, ఎస్సీ–ఎస్టీ పారిశ్రామికవేత్తలకు అందుబాటులో ఉన్న సహాయ కార్యక్రమాలపై వివరించారు. పారిశ్రామిక రంగంలో ఎస్సీ–ఎస్టీ యువత ముందుకు రావాలని, ప్రభుత్వ అవకాశాలను సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి సాధించాలని పిలుపునిచ్చారు.అనంతరం సాంకేతిక సమావేశంలో ప్రభుత్వ కొనుగోలు విధానాలు, వెండర్ రిజిస్ట్రేషన్, ఆర్థిక సహాయం, వ్యాపార అభివృద్ధికి సంబంధించిన అంశాలపై నిపుణులు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలోమెదక్ జిల్లా కోఆర్డినేటర్ దుర్గాప్రసాద్ , దళిత సంఘ నాయకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
- మెదక్‌లో జాతీయ ఎస్సీ-ఎస్టీ హబ్ అవగాహన, ప్రత్యేక వెండర్ డెవలప్‌మెంట్ కార్యక్రమంNSSHసురేష్ మెదక్‌లో జాతీయ ఎస్సీ-ఎస్టీ హబ్ అవగాహన, ప్రత్యేక వెండర్ డెవలప్‌మెంట్ కార్యక్రమం మెదక్‌లో గురువారం నేషనల్ ఎస్సీ-ఎస్టీ హబ్ (NSSH), హైదరాబాద్ ఆధ్వర్యంలో, దళిత్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (DICCI) సహకారంతో ఎంట్రప్రెన్యూర్ అవగాహన మరియు ప్రత్యేక వెండర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఈ కార్యక్రమం వినాయక కన్వెన్షన్ హాల్, మెదక్లో జరిగింది.అతిథుల స్వాగతం, జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ NSSHO ఎస్. సురేష్ స్వాగత ప్రసంగం చేశారు.తదుపరి డిక్కీ తెలంగాణ చాప్టర్ అధ్యక్షుడు జె. సీతారాం, డిక్కీ మహిళా విభాగం జాతీయ అధ్యక్షురాలు అరుణ దాసరి, ఎన్‌ఎస్‌ఐసీ (AP & తెలంగాణ) జోనల్ జనరల్ మేనేజర్ వి. సురేష్ బాబు పారిశ్రామిక అవకాశాలు, ప్రభుత్వ పథకాలు, ఎస్సీ–ఎస్టీ పారిశ్రామికవేత్తలకు అందుబాటులో ఉన్న సహాయ కార్యక్రమాలపై వివరించారు. పారిశ్రామిక రంగంలో ఎస్సీ–ఎస్టీ యువత ముందుకు రావాలని, ప్రభుత్వ అవకాశాలను సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి సాధించాలని పిలుపునిచ్చారు.అనంతరం సాంకేతిక సమావేశంలో ప్రభుత్వ కొనుగోలు విధానాలు, వెండర్ రిజిస్ట్రేషన్, ఆర్థిక సహాయం, వ్యాపార అభివృద్ధికి సంబంధించిన అంశాలపై నిపుణులు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలోమెదక్ జిల్లా కోఆర్డినేటర్ దుర్గాప్రసాద్ , దళిత సంఘ నాయకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.1
- కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డిని సస్పెండ్ చేయాలని ఉన్నతాధికారులకు నివేదిక పంపిన జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ముకుంద రెడ్డి కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డిని సస్పెండ్ చేయాలని ఉన్నతాధికారులకు నివేదిక పంపిన జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ముకుంద రెడ్డి అంతర్రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో అక్రమ మద్యం, గంజాయి, ఇతర నిషేధిత మత్తు పదార్థాల అక్రమ రవాణాను అరికట్టేందుకు సలబత్‌పూర్ చెక్‌పోస్ట్‌ను ఏర్పాటు చేసి గత రెండు దశాబ్దాలుగా నిరంతర పర్యవేక్షణ చేపడుతున్నామని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ముకుంద రెడ్డి తెలిపారు. చెక్‌పోస్ట్‌లో ఇన్‌స్పెక్టర్లు, సబ్‌ఇన్‌స్పెక్టర్లు, కానిస్టేబుళ్లు 24 గంటల పాటు విధులు నిర్వహిస్తూ వాహనాల తనిఖీలు చేపడుతున్నారని పేర్కొన్నారు. నిన్న సాయంత్రం రాజస్థాన్ నుంచి వచ్చిన ఒక ట్రక్కులో ప్రయాణిస్తున్న యూట్యూబర్ చెక్‌పోస్ట్ వద్ద విధుల్లో ఉన్న సిబ్బందితో మాట్లాడిన సందర్భంగా వివాదం చోటుచేసుకుందని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో వెంటనే ప్రాథమిక విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. ప్రాథమిక విచారణలో ఘటనకు సంబంధించి విధుల్లో ఉన్న కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డిని గుర్తించినట్లు తెలిపారు. ఈ అంశంపై శాఖాపరమైన పూర్తి స్థాయి విచారణ కొనసాగుతోందని, విచారణ నివేదికను కరీంనగర్ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి (నోడల్ అధికారి)కి సమర్పించనున్నట్లు పేర్కొన్నారు. సదరు కానిస్టేబుల్‌పై క్రమశిక్షణా చర్యల్లో భాగంగా సస్పెండ్ చేయాలని సిఫారసు చేస్తూ ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్లు ముకుంద రెడ్డి తెలిపారు. ఈ ఘటనపై శాఖ ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించదని, విధి నిర్వహణలో నిబంధనలు, క్రమశిక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ బాధ్యులపై చట్టబద్ధమైన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.1
- అనాథ బాలుడి చదువుకు గురువు అండ.. భవిష్యత్ కోసం ప్రత్యేక నిధికి శ్రీకారం మెదక్ జిల్లా పాపన్నపేట మండలం గాజులగూడెం ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న రెండో తరగతి విద్యార్థి ప్రేమ్ కుమార్ చిన్న వయసులోనే తల్లిదండ్రులను ప్రమాదంలో కోల్పోయి నానమ్మ సంరక్షణలో పెరుగుతున్నాడు. ఎన్నో ఆర్థిక, కుటుంబ ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ చదువులో ప్రతిభ కనబరుస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పాపన్నపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు మంగ నర్సింలు బాలుడిని ప్రత్యేకంగా అభినందించారు. ప్రేమ్ కుమార్ చదువుకు ఎలాంటి ఆటంకం కలగకుండా అతని భవిష్యత్ విద్య కోసం ప్రత్యేక ఆర్థిక నిధి ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆ నిధికి తొలి విరాళంగా రూ.5,116 అందజేస్తానని ప్రకటించి, దాతలు ముందుకు వచ్చి బాలుడి విద్యాభారాన్ని పంచుకోవాలని పిలుపునిచ్చారు.1
- సర్ పై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పటాన్చెరు నియోజకవర్గంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమం ముగియడానికి మరో 4 రోజులే మిగిలి ఉన్నాయని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. గురువారం జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన అవగాహన సమావేశంలో మాట్లాడుతూ, జూలై 30 ఉదయం 10 గంటల వరకు 63.27% నమోదు మాత్రమే జరిగిందన్నారు. ప్రతి ఓటరు తప్పనిసరిగా SIRలో పాల్గొని వివరాలు సమర్పించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమని పేర్కొన్నారు.1
- బాన్సువాడ పట్టణంలో వీధి కుక్కల దాడులు పెరుగుతున్న నేపథ్యంలో వెంటనే నివారణ చర్యలు చేపట్టాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ కౌన్సిలర్ బాడీ శ్రీనివాస్ గురువారం ఆర్డీఓ, మున్సిపల్ అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఇటీవల కుక్కల దాడుల్లో గాయపడిన చిన్నారులు, మహిళతో కలిసి ఆయన అధికారులను కలిసి సమస్య తీవ్రతను వివరించారు. ఈ సందర్భంగా బాడీ శ్రీనివాస్ మాట్లాడుతూ, పట్టణంలోని 1వ, 2వ, 13వ, 15వ వార్డులతో పాటు పలు ప్రాంతాల్లో వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తూ ప్రజలపై తరచూ దాడులకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. గత రెండు రోజుల వ్యవధిలోనే సుమారు పది మంది చిన్నారులు, ఒక మహిళ కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడి బాన్సువాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రితో పాటు నిజామాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. పట్టణ ప్రజలు భయాందోళనల మధ్య జీవనం సాగిస్తున్నప్పటికీ మున్సిపల్ అధికారులు సమస్యను పట్టించుకోవడం లేదని విమర్శించారు. చిన్నారులు పాఠశాలలకు వెళ్లేందుకు, ప్రజలు ఉదయం, సాయంత్రం బయటకు రావడానికి భయపడే పరిస్థితి నెలకొందని అన్నారు. ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిన వీధి కుక్కలను వెంటనే పట్టుకుని సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టాలని అధికారులను డిమాండ్ చేశారు. ఇకపై ప్రజల భద్రత విషయంలో నిర్లక్ష్యాన్ని సహించబోమని హెచ్చరిస్తూ, సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో 1వ వార్డు కౌన్సిలర్ ఫెరోజ్ ఖాన్, మాజీ వార్డు సభ్యుడు షేక్ అక్బర్, మైనారిటీ సెల్ నాయకుడు ఇసాక్, నాయకులు షఫీ, గంగారాం, కాసుల బాబు, ఖాలేద్, అఫ్జల్, ఫయాజ్, కుక్కల దాడిలో గాయపడిన బాధితులు తదితరులు పాల్గొన్నారు.బాన్సువాడలో వీధి కుక్కల బెడదపై ఆందోళన.. ఆర్డీఓ, మున్సిపల్ అధికారులకు బాధితులతో కలిసి వినతి బాన్సువాడ, జూలై 30: బాన్సువాడ పట్టణంలో వీధి కుక్కల దాడులు పెరుగుతున్న నేపథ్యంలో వెంటనే నివారణ చర్యలు చేపట్టాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ కౌన్సిలర్ బాడీ శ్రీనివాస్ గురువారం ఆర్డీఓ, మున్సిపల్ అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఇటీవల కుక్కల దాడుల్లో గాయపడిన చిన్నారులు, మహిళతో కలిసి ఆయన అధికారులను కలిసి సమస్య తీవ్రతను వివరించారు. ఈ సందర్భంగా బాడీ శ్రీనివాస్ మాట్లాడుతూ, పట్టణంలోని 1వ, 2వ, 13వ, 15వ వార్డులతో పాటు పలు ప్రాంతాల్లో వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తూ ప్రజలపై తరచూ దాడులకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. గత రెండు రోజుల వ్యవధిలోనే సుమారు పది మంది చిన్నారులు, ఒక మహిళ కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడి బాన్సువాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రితో పాటు నిజామాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. పట్టణ ప్రజలు భయాందోళనల మధ్య జీవనం సాగిస్తున్నప్పటికీ మున్సిపల్ అధికారులు సమస్యను పట్టించుకోవడం లేదని విమర్శించారు. చిన్నారులు పాఠశాలలకు వెళ్లేందుకు, ప్రజలు ఉదయం, సాయంత్రం బయటకు రావడానికి భయపడే పరిస్థితి నెలకొందని అన్నారు. ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిన వీధి కుక్కలను వెంటనే పట్టుకుని సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టాలని అధికారులను డిమాండ్ చేశారు. ఇకపై ప్రజల భద్రత విషయంలో నిర్లక్ష్యాన్ని సహించబోమని హెచ్చరిస్తూ, సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో 1వ వార్డు కౌన్సిలర్ ఫెరోజ్ ఖాన్, మాజీ వార్డు సభ్యుడు షేక్ అక్బర్, మైనారిటీ సెల్ నాయకుడు ఇసాక్, నాయకులు షఫీ, గంగారాం, కాసుల బాబు, ఖాలేద్, అఫ్జల్, ఫయాజ్, కుక్కల దాడిలో గాయపడిన బాధితులు తదితరులు పాల్గొన్నారు.3
- రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి లో పౌర హక్కుల దినోత్సవం రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి తహశీల్దార్ పుష్పలత ఆధ్వర్యంలో సర్పంచ్ గండి నారాయణ అధ్యక్షతన గ్రామ పంచాయతీ కార్యాలయంలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహించారు.ముఖ్య అతిథిగా మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి హాజరయ్యారు.ఈ సందర్భంగా అంటరానితనం నిర్ములనకై ప్రజలందరు సోదరభావముతో కలిసి మెలిసి ఉండాలని అన్నారు.అంటరాని తనం గురించి అవగాహన కలిపించారు.ప్రతి ఒక్కరు పౌర హక్కులపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గండి నారాయణ, మార్కెట్ చైర్మన్ చెలుకల తిరుపతి మాట్లాడుతూ, రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.శిథిలావస్థలో ఉన్న ఇండ్లలో ఉండకూడదని సూచించారు. చెరువులు కుంటల వద్దకు ప్రజలు వెళ్లకూడదని సూచించారు.విద్యుత్ పరికరాలను తడి చేతులతో ముట్టకూడదని సూచించారు.వర్షాల కారణంగా ఏవైనా సమస్యలు ఎదురావుతే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు.ఈకార్యక్రమంలో, ఉప సర్పంచ్ మాడిశెట్టి అభిలాష్,ఆర్ఐ శ్యామ్,వార్డు మెంబర్లు గుగ్గిళ్ల వెంకటేష్,పుదరి మహిపాల్,నాయకులు గడ్డం శ్రీనివాస్,దాసరి గంగరాజం,లింగంపెళ్లి నిఖిల్,కార్యదర్శి స్వామి, జిపిఓ సంతోష్,కరోబర్ రాజేశం,పాల్గొన్నారు....1
- రాజన్న సిరిసిల్ల జిల్లావేములవాడ భీమేశ్వర స్వామి ఆలయంలో ప్రారంభమైన వరుణ యాగం రాజన్న సిరిసిల్ల జిల్లావేములవాడ భీమేశ్వర స్వామి ఆలయంలో ప్రారంభమైన వరుణ యాగం.స్వామి వారిని దర్శించుకున్న మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు డా. సంజయ్, కవ్వంపల్లి సత్యనారాయణ, మంత్రులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికిన అర్చకులు, జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్, ఎస్పీ మహేష్ బి గీతే, ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు చెల్లించుకున్న మంత్రులు వరుణ యాగంలో పాల్గొన్న మంత్రులు రాష్ట్రంలో వర్షాలు కురువాలని కోరుతూ మూడు రోజులపాటు కొనసాగనున్న వరుణ యాగం.2
- ధూప్ సింగ్ తండా బ్రిడ్జిపై వరద ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. హవేలి ఘనపూర్ మండలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు మరోసారి ధూప్ సింగ్ తండా ప్రజలను ఇబ్బందుల్లోకి నెట్టాయి. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరడంతో వాడి గ్రామపంచాయతీ పరిధిలోని ధూప్ సింగ్ తండా బ్రిడ్జిపై వరద ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో తండాకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అత్యవసర పనుల కోసం బయటకు వెళ్లాల్సిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి వర్షాకాలంలో ఇదే పరిస్థితి నెలకొంటోందని తండావాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శాశ్వత పరిష్కారంగా నూతన వంతెన నిర్మాణాన్ని వేగవంతం చేసి అందుబాటులోకి తీసుకురావాలని వారు అధికారులను కోరుతున్నారు. కొత్త బ్రిడ్జి పూర్తయితే ఈ సమస్యకు శాశ్వతంగా తెరపడుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.1